గూడేలకు చెరగని గురుతు`బీడీ శర్మ
స్వతంత్య్ర దేశంలో ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక పరిపాలన కావాలని జీవితకాలం శ్రమించిన మహనీయుడు డా.బి.డి.శర్మ.తను బ్రహ్మణ కులంలో పుట్టినా అడవిలో తినటానికి తిండిలేక, కట్టుకోవడానికి బట్ట కరువై కేవలం అడవిపై, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే ఆదిమ తెగల పక్షాన నిలిచి ఆకలితో అలమటించే వాడికి ఆహారం దరిచేర్చి జీవించే హక్కును కల్పించడానికి కృషి చేస్తూ మానవత్వం చాటిన ఆదివాసీల ఆత్మీయ బంధువు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో 1929లో పుట్టిన బి.డి.శర్మ కష్టపడి చదివి ఐ.ఎ.ఎస్‌గా వివిధశాఖలలో పనిచేసిన ఆయనఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గా రిటైర్ అయ్యారు. 1996లో షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణచట్టం (ఫెసా)రావటానికి, దాని నియమాలు రూపొందించిందీ శర్మనే. దిలీప్ సింగ్ భూరియా కమిటికి అసలు ఆదివాసీ ప్రాంతాలలో పెసాఅంటే ‘మావనాటే మావ సర్కార్’అంటే ‘మావూళ్లో మా రాజ్యం’,‘మా గూడెంలో మాపరిపాలన’ అంటే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలతో సహజీవనం చేసిన అనుభవంతో దీనిని గ్రహించారు. కనుకనే ఆదివాసీల జీవన విధానానికి, మైదాన ప్రాంతాల జీవన విధానానికి వ్యత్యా సం ఉంది. ఏజెన్సీ గూడేలలో ప్రత్యేక జీవన విధానం, ఆచార వ్యవహారాలు..సంస్కృతి సాంప్రదాయాలను విడిచి వారు బ్రతకలేరు. ఆదివాసీలకు నీరు,అడవి,భూమి(జల్ జంగల్-జమీన్)వారి నివాస ప్రాంతంపై స్వయం నిర్ణయం హక్కు కావాలని పరిత పించి దిలీప్ సింగ్ భూరియా కమిటికి తాను స్వయంగా రిపోర్టు తయారు చేసి, ఆదివాసి స్వయం పాలన హక్కుకై పార్ల మెంటులో ప్రయివేట్ బిల్లు పెట్టించి పాస్ చేయించటంలో బి.డి.శర్మ కృషి కీలకం. 1953 మొదటి బ్యాచ్‌లో ఐ.ఏ.ఎస్‌గా బి.డి. శర్మకు అనేక అవకాశాలు వచ్చినా తన ఉన్నతిని వెతుక్కోలేదు. సమాజ ఉన్నతికై కలగన్నారు. 1958లో బస్తర్ కలెక్టర్‌గా వెళ్ళిన శర్మకు నాటి బస్తర్ అనుభవం ఆదివాసీలను చేరదీ సింది. నాడు బస్తర్ నేడు7జిల్లాలుగా అంటే సూక్ష్మబీజాపూర్,సుక్మా,దంతెవాడ,ఉత్తర,దక్షిణ బస్తర్, బైలాడిల్లా,కాంకీర్లుగా విడిపోయింది. అంత పెద్ద ఆదివాసీ జిల్లాకు తొలిసారి కలెక్టర్ గా వెళ్ళిన శర్మకు ఆదివాసీల ఆటవిక జీవనం, కడుదారిద్య్రం స్వాగతం పలికింది. బస్తర్ పూర్తిగా ఆదిమతెగలు గలకొండ ప్రాంతం. ఆకలితో అలమటించే ఆదిమ తెగలకు ఆహారం, కట్టుకోవటానికి బట్టలు,గూడేలకు విద్యుత్ వెలుగులు లేక విషజ్వరాలతో మృత్యువు బారినపడుతున్నారు. బడిలోకి చేరే ఆదివాసీకి కనీస వైద్యం,రోడ్డు సౌకర్యం,మంచినీరు అందించి వారి అభివృద్ధికి తోడ్పాలని ఒక కలెక్టర్ గా కలలుగన్నాడు.అబూజ్ మాడ్ (కనిపించని కొండలు)లను సైతం కాలినడకన పగలనక రేయనక తిరిగారు. ఆదివాసీ జీవ నాన్ని చక్కదిద్దాలని అభివృద్ధి నమూనాలు తయారు చేసి, కలలుగన్న శర్మకు అభివృద్ధి స్థానంలో విధ్వంసం అనే ప్రగతి నమూనా రావడంతో కలలన్నీ నిర్వీర్యమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టటంతో పాటు ఆకలెక్టర్ కే అధి కారికంగా ఉక్కు పరిశ్రమ చేపట్టాలని సూచిం చింది. కలగన్నది అభివృద్ధి నమూనా ఉక్కు పరిశ్రమతో విధ్వంస నమూనాగా మారింది. ఇనుప ఖనిజం త్రవ్వకం మొదలయితే ఆదిమ తెగలు తమ అస్థిత్వాన్ని కోల్పోతారని దీని నుంచి వచ్చే విషతుల్యం వలన అనేక మంది ఆదివాసీలు రోగాల బారినపడి మృత్యువాత పడతారని,దీంతో అమాయకులైన వారి మను గడ ఇక ప్రశ్నార్ధకమేనని గ్రహించారు.ప్రభుత్వ ఏజెంట్‌గా ప్రభుత్వం తరపునే నిలబడి ఉక్కు త్రవ్వకాలు చేపట్టాలి. కానీ ఒకకలెక్టర్‌గా తన అధికారాన్ని రాజ్యాంగబద్ధ నిబంధనలతో ఇది మానవహక్కులు, నిబంధనలకు వ్యతిరేకం అని, జీవించే హక్కుకు భంగకరమని అని,ఉక్కు పరి శ్రమ అనుమతులు రద్దు చేపించాడు.రాజ్యం తననేం చేస్తుందోనని ఆలోచించకుండా అన్నిం టికీ సిద్ధపడి రాజ్యాంగబద్ధంగా మానవత్వాన్ని చాటుకున్నారు. తదుపరి బి.డి.శర్మకు జరిగిన అవమానానికి ఆదివాసీలు ఏం చేసినా తీర్చు కోలేనిది.ఉక్కు పరిశ్రమ అనుమతులు రద్దు చేశాడనే నెపంతో బి.డి.శర్మను బస్తర్ వీధుల్లో బిజెపి పార్టీ నాయకులు అధికారికంగా..అదీ అర్ధ నగ్నంగా చెప్పులు మెడలో వేసి ఊరేగిం చారు.ఒక కలెక్టర్‌గా తనఅధికారాలను కూడా స్వేచ్ఛగా, రాజ్యాంగబద్ధంగా ఉపయో గించుకునే హక్కు లేదని సామ్రాజ్యవాదులు కాళ్ళ కింద భారతరాజ్యాంగాన్ని తాకట్టు పెట్టే సార్వభౌమ, సార్వత్రిక, లౌకిక, గణతంత్ర అనే మాటలు విలువలు లేకుండా చేసిన,అదీ స్వయాన ప్రభు త్వమే అధి కారికంగా చేసిన దుర్మార్గపు సంఘ టన.అంత అవమానం జరిగినా బి.డి.శర్మ కృంగ లేదు. కృశించలేదు. ముఖంపై చిరు నవ్వుతో నేడు సామ్రాజ్యవాదులు వీరి కబం దహస్తాల క్రింద కుళ్ళుపట్టే రాజకీయ పెద్దలు పతనం అయి ప్రజల చేత,ప్రజల కొరకు పాలిం చబడే వ్యవస్థ ముందు భవిష్యత్ సమాజ రక్షణ కు చైతన్యంగా నా ఊరేగింపు నిలుస్తుందని, నేటి సమాజంలో ఆదివాసీల రక్షణకు ఇంత నిస్వార్థంగా త్యాగాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు! వాస్తవంగా బి.డి.శర్మ అబూజ్ మడ్ లో మావోయిస్టుల కంటే ముందు కాలు పెట్టాడు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా. కానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలే అతని ఆశయానికి అడ్డు అయినవి. ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న బి.డి.శర్మ ఒక అంశాన్ని మాత్రం నిస్సం కోచంగా మాట్లాడాడు. భారత స్వాతంత్య్య్ర సంగ్రామంలో మనదేశం స్వాతంత్య్ర దేశం 1947)గా ఏర్పడిరది. భారత ప్రజల మను గడను సుస్థిరం చేసుకుంది. కానీ అప్పటి నుండి ఆదివాసిల మనుగడ ఈ దేశంలో ప్రశ్నార్థకంగా మారిందని,ఆదివాసీలు భవిష్యత్తులో విధ్వంసకర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పిన మాటలు నేటికీ నిజమవుతున్నవి. దేశ విభజన నేపథ్యంలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న నాగా, మిజోరంలలో వున్న సంతాల్, గోండు ప్రాంతాలను బర్మా, బంగ్లాదేశ్, నేపాల్, ఖాట్మండ్లుగా, విభజించారు.మధ్య భారతం లోని గోండులను ఒరిస్సా, చత్తీస్‌గఢ్,మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలుగా విభజించారు. విభజించిన అనంతరం నర్మద,సర్దార్ సరోవర్, గోదావరి పోల వరం, హీరాకుడ్,కంతనపల్లి లాంటి భారీ ప్రాజెక్టులను కట్టి అభివృద్ధి పేరిట ఆది వాసీలను జలసమాధి చేస్తున్నారు. పోస్కో, టాటా,మిట్టల్, జిందాల్లకు బాక్సైట్ ఎక్కు లాటరైట్, గ్రానైట్ లాంటివి కట్టబెట్టి తెగల జీవనాన్ని విధ్వంసం చేస్తున్నారు. టైగర్ జోన్ల పేరిట అడవుల నుండి గెంటేస్తున్నారు.అడవిలో స్వేచ్చగా జీవించే ఆదివాసీలను మావోయిస్టుల పేరిట ఇబ్బంది పెడుతున్నారు.1956 సైనిక అధికారాలు చట్టం లాంటివి అమలు చేసి ఈశాన్య భారతంలో పౌరులని చంపి వేర్పాటువాదులుగా ముద్ర వేస్తున్నారు. ఆదివాసి మహిళలపై పాశవిక అత్యాచారం, హత్యలను సైన్యం జరిపి ప్రజాస్వామ్య రక్షణ కోసమని ప్రకటిస్తున్నారు. ఇటువంటి దురాగతాలను బి.డి.శర్మ ముందుగానే గ్రహించి తన జీవితాన్ని ఆదివాసీల కోసం ధారపోశారు. మావో యిస్టులు బస్తర్ కలెక్టర్ వినీల్ కృష్ణను కిడ్నాప్ చేసి 18రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు,అనాటి ప్రభుత్వం తరపున మధ్యవర్తిగా.. పోలవరం లాంటి ప్రాజెక్టు అయిన ఆగకపోతుందా అనే ఆశతో మావోయిస్టులతో మాట్లాడి ఒప్పించి,కలెక్టరును విడిపించటానికి దండకారణ్యానికి బయల్దే రాడు.కానీ,ప్రభుత్వం తన నీతిలేని బుద్ధిని నిరూపించుకుంది. కలెక్టర్ విడుదలయ్యాక ఏకంగా పార్లమెంట్ బిల్లు పెట్టి 5వ షెడ్యూల్, 1/70,ఎల్.టి.ఆర్ లాంటి చట్టా లకు విరుద్ధం గా పోలవరంని కట్టే ప్రక్రియను చట్టబద్దంగా పూర్తి చేసుకుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ లాంటి దుర్మార్గాలను సైతం ఆపటానికి బి.డి.శర్మ చేసిన కృషి ఎనలేనిది.భారత దేశంలో బి.డి.శర్మ అనేక ఆదివాసీ ప్రాం తాలు పర్యటించి 76పుస్తకాలు రాశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలతో బి.డి.శర్మ అనుబంధం మరువలేనిది.1996 ఆగస్టు 6న ఆదివాసి స్వయంపాలన,ఎ,బి,సి,డి వర్గీకరణ కోసం ఏర్పడ్డ ‘తుడుందెబ్బ’గూడూరులో మొదటి బహిరంగసభ ఏర్పాటు చేస్తే ప్రొ.బియ్యాల జనార్ధనరావు పిలుపు మేరకు బి.డి.శర్మ ఉద్యమ దిశా నిర్దేశాన్ని ప్రకటించారు.నిత్యం ఆదివాసీల సంక్షేమం కోసం పరితపించిన బి.డి.శర్మగారు 2015 డిసెంబర్ 8న కాల గమనం చెందారు.20ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ చైతన్యంలో దేశ వ్యాప్తంగా విద్యా, సామా జికంగా చైతన్యమై ఆదివాసీ అభివృద్ధి సమూ నాను సుస్థిరం చేసుకున్న రోజు,ఆదివాసి స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను రక్షించుకున్న రోజు బి.డి.శర్మకు ఘనమైన నివాళి అవుతుంది.వ్యాసకర్త : – గుమ్మడి లక్ష్మీ నారాయణ,ఆదివాసీ రచయితల వేదిక, వ్యవస్థాపక కార్యదర్శి, సెల్ : 9491318409