గీతం న్యాయ అవగాహన సదస్సు
భారతీయ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులు,బాధ్యతలు పౌరులకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బాప్రగడ రవి తెలిపారు. భారత ప్రభుత్వన్యాయ మంత్రిత్వ శాఖ,న్యాయ విభాగం,గీతం స్కూల్ ఆఫ్ లా మరియు భోపాల్లోని న్యాయగంగ ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న న్యాయ అవగాహన సదస్సు మార్చి 9న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. నీ సదస్సును రవి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన న్యాయ విద్యార్థులను ఉద్దేశించిప్రాధిమికంగా పౌరుల తెలుసుకోవలసిన న్యాయ పరమైన అంశాలు, పౌరుల బాధ్యతలు అనే అంశంపై సమత స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు రవి రెబ్బాప్రగడ ప్రసంగించారు.స్వేచ్ఛా,స్వాతంత్య్రపు హక్కు,మతస్వాతంత్య్ర హక్కు లాంటి సంప్రదాయ హక్కులతోపాటు ఆధునిక హక్కులైన సమానత్వపు హక్కు,పీడనాన్ని నిరోధించే హక్కు,విద్యా,సాంస్కృతిక హక్కులు సైతం ప్రాధమిక హక్కుల్లో అంతర్భాగాలుగా కొనసాగుతున్నాయి అని అన్నారు. ప్రజల ప్రాధమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించకూడదని తెలియజేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయకూడదో ప్రాధమిక హక్కులుపేర్కొంటున్నాయని గుర్తిచేశారు. తర్వాత సమత సుప్రీం కోర్టు సాధన,ఆదివాసీల వనరులు పరిరక్షణ కోసం సమత చేసిన కృషి,ఐదోవ షెడ్యూల్లో గిరిజనుల వనరులు,భూమి హక్కుల పరిరక్షణకు జడ్జెమెంట్ ఏవిధంగా కాపాడు తుందనే అంశాలను విద్యార్థులకు వివరించారు. తర్వాత న్యాయ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నివృత్తి చేశారు. మధ్యాహ్నాం జరిగిన సదస్సులో సిబిఐ విశ్రాంతి ఐపిఎస్ అధికారి వి.వి.లక్ష్మి నారాయణ సైబర్ నేరాలు వాటిని నియంత్రించే చట్టాలు అనే అంశంపై ప్రసంగించారు. గీతం స్కూల్ ఆఫ్ లా డైరక్టర్ ప్రొఫెసర్ అనితారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సంర్భంగా న్యాయ అవగాహన పై వివిధ నినాధాలు, సచిత్ర అంశాలతో ఎగ్సిబిషన్తో పాటు న్యాయ అంశాలపై క్విజ్ పోటీ నిర్వహించారు. సమకాలీన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విద్యార్ధులు ప్రదర్శించిన వీధినాటిక ప్రజలను చైతన్య పరిచేదిగా ఉంది. న్యాయ వృత్తిలో పాటించాల్సిన మెలకవులపై విద్యార్ధులకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందించడంతో పాటు, వాదోపవాదాలపై న్యాయస్థానంలో వృత్తి నైపుణ్యాన్ని పెంచటానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని గీతం స్కూల్ ఆఫ్ లా డైరక్టర్ ప్రొఫెసరన బి.అనితారావు తెలిపారు. కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ లా అధ్యాపకులు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. – ` సైమన్ గునపర్తి