గిరిజన విద్యార్థుల్లో సమగ్ర వికాసం
అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజ్, అరకు లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, యండపల్లి వాలసాలో జూనియర్ కాలేజ్, మరియు పాదేరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వంటి వివిధ సంస్థలలో యువ క్లబ్‌లు ఉన్నాయి.ఈ యువ క్లబ్‌లతో మా పరస్పర చర్యల సమయంలో,విద్యార్థులు కొన్ని అత్యంత ముఖ్యమైన సమస్యలను మాకు తెలియజేశారు. గత రెండు సంవత్సరాలలో,మేము పాఠశాల మరియు కాలేజ్ విద్యార్థుల కోసం ఉద్యోగా భివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాము, వారి సంబం ధిత గ్రామాల నెలకొన్న సమస్యలపై విద్యార్థులు దృష్టిసారించి తెలియజేశారు. వారి సమస్య లను యూత్ క్లబ్స్ తరుపున అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌కి,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ సమత ప్రతినిధులు అందజేయడం జరిగింది.
విద్యార్థి దశ ఓమధురానుభూతి.అయితే తీవ్ర ఒత్తిడితో కూడిన నేటి చదువుల వల్ల విద్యా ర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పుస్తకాల బరువు,హోంవర్కులు,పరీక్షలు, మార్కులు, ర్యాంకులు వంటి వాటి హోరుతో తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారు. ఆటపాటలు కరువై ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతుం డటంతో మధురస్మృతులకు లోనై తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు.విషయ పరిజ్ఞానం,ఆలోచ నాశక్తి,సృజనాత్మకత,ప్రశ్నించేతత్వం అంతంత మాత్రంగానే ఉంటోంది.ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంపొందించటమే లక్ష్యంగా సమత రెండేళ్ల నుంచి అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు,అనంతగిరి, అరకు ఏపీ గిరిజన సంక్షేమ ఆశ్రమ జూని యర్ కళాశాల బాలబాలికలతో యూత్ క్లబ్‌లు ఏర్పాటు చేసింది.స్థానికంగా నివాసముంటున్న వారి గ్రామాల్లో పలు సామాజిక సమస్యలను గుర్తించడం,వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం,జీవిత నైపుణ్యాలు తెలుసుకోవడం వంటి అంశాలపై తద్వారా విద్యార్ధినీ, విద్యార్థులు తమ నైపుణ్యాలతో గ్రామాల్లో ఉన్న పలు రకాల సమస్యలను తెలుసుకుని ఇటీవల జిల్లా కలెక్టర్,ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి విన్నవించేలా కృషి చేస్తోంది.సామాజిక సేవే లక్ష్యంతో విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గిరిజన యూత్ క్లబ్‌లు సత్ఫ్‌లితాలు ఇస్తున్నాయి.కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన,వక్తత్వ పోటీలు నిర్వహిస్తుండటం ద్వారా విద్యార్థుల్లో ప్రపంచ,సామాజిక,శాస్త్ర, సాంకేతిక విషయా లపై అవగాహన,ఆసక్తి పెంపొందిం చటానికి కృషి చేస్తున్నారు.పోటీల్లో విజయం సాధించిన విజేతలకు చక్కట విలువైన బహుమతులు అందజేస్తున్నారు.స్నేహపూర్వకంగా సహాయ సహకారాలతో ముందుకు సాగుతోంది. కళా శాల విద్యార్థుల్లో సమగ్ర మనో వికాసానికి తమవంతుగా కృషి చేస్తున్నారు. ప్రాథమిక విద్య సమయంలోనే నైతిక విలువలు,జీవన నైపుణ్యాలు,సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని యూత్ క్లబ్ విద్యార్థులకు అలవర్చుతున్నారు.మాధ్యమిక, ఉన్నత విద్యను అభ్యసించే వారికి విమర్శనాత్మక దృష్టి, సృజనాత్మకత,భావ ప్రకటనా సామర్థ్యం, పరస్పర సహకారం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయటానికి కృషిచేస్తున్నారు. సామాజిక సమానత్వం,న్యాయం,ప్రపంచ సంఫీుభావం పెంపొందించటం,ప్రజాస్వామ్య విలువల పరి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి సమస్య గురించి హేతుబద్ధంగా ఆలోచించటం,పరిస్థితులను అవగాహన చేసుకోవటం,ఊహించటం,పోల్చటం, క్షేత్ర స్థాయి జ్ఞానాన్ని పెంపొందించటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.చదువుకునే రోజుల్లో ఉన్నత ప్రమాణాలకు పునాదులు వేసేందుకు యూత్ క్లబ్‌లు నిర్విరామంగా కషిచేస్తున్నాయి. వాటితోపాటుగా ఆరోగ్య సూత్రాలు,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికిగాను వారి శారీరక, మానసిక,విజ్ఞాన శక్తులను పెంపొందించే విధంగా సూచనలు,సలహాలిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలపై అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. సదస్సులు, సమావేశాలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది.ఆటల్లో ప్రోత్సాహం, వ్యాయామం వంటివి నేర్పిం చటం, అవగాహనా శక్తి పెంపొందించే విధంగా మోటివేషనల్ తరగతులను వివిధ విషయాలపై నిర్వహిస్తున్నారు. మేథోశక్తిని పెంపొందించటానికి పుస్తకపఠనం,ఆన్‌లైన్ పోగ్రాములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాగా,ఒత్తిడి లేని విద్యను అభ్యసించటంపైనా, కెరీర్ గైడెన్స్‌పైనా మార్గదర్శకత్వం వహిస్తూ ఉన్నత చదువులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.ఆతర్వాత కూడా వారి ఆరోగ్య రక్షణకు,మానసిక వికాసానికి తగిన సూచనలు,సలహాలను అందిస్తున్నారు.
-గునపర్తి సైమన్