గిరిజన యువతకు సమత కెరీర్ గైడెన్స్
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆపై చదువులకు ఏ కోర్సును ఎంపిక చేసు కోవాలన్న అంశంపై తర్జనభర్జన పడుతుంటారు. పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకునే కోర్సులపైనే విద్యార్థుల కెరీర్ ఆధారపడి ఉంటుంది. గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థు లకు కోర్సుల ఎంపికపై గైడెన్స్ ఇచ్చేవారు ఉండరు.ఈనేపథ్యంలో వారి ఉజ్వల భవిష్యత్తు మెరుగు పరిచేందుకు కెరీర్‌పై గైడెన్స్ ఇచ్చే బాధ్యతలను సమత తీసుకుంది.విద్యార్థుల మేథస్సు, ఆసక్తి, అభిరుచిల ఆధారంగా పైచదువులకు సంబంధించిన కోర్సుల ఎంపికలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యా యులు సహకరించనున్నారు. అల్లూరి సీతారామారాజు జిల్లాలో ఐదు కాలేజీలు,ఐదు జిల్లా పరిషత్ హైస్కూల్లో కెరీర్ గైడెన్స్‌పై విద్యార్ధినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.పాడేరులో ఏపీ ట్రైబల్ వెల్ఫేర జూనియర్ కాలేజీ,రెసిడెన్సీయల్ బాలికల పాఠశాల,ప్రభుత్వ జూనియర్ కాలేజీ,బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాల, అరకువ్యాలీలో ఏపీ గిరిజన రెసిడెన్సీ యల్ జూనియర్ కాలేజీ,ప్రభుత్వ జూనియర్ కాలేజీ,ఏపీ రెసిడెన్సీయల్ బాలుర హైస్కూల్(రవ్వలగుడ), ఏపీ రెసిడెన్సియల్ బాలికల వసతి గృహం(కొత్త భల్లుగుడ), అనంతరగిరి మండలంలో బొర్రా గిరిజన ఆశ్రమ పాఠశాల,అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ,టోకూరు ఏపీ ట్రైబల్ బాలికల వెల్ఫేర్ రెసిడెన్సీయల్ స్కూల్ మొత్తం ఐదు జూనియర్ కాలేజీలు,ఐదు జిల్లా పరిషత్ పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్‌పై రిసోర్సు పర్సన్లు నరేష్, హరివెంకట రమణ,సమత డెరైక్టెర్ సుశాంత్ ప్రాణిగ్రహి, కె.సతీస్‌కుమార్‌లు కలసి విద్యార్ధినీ విద్యార్థులకు తగు సూచనలిచ్చారు. టెన్త్,ఇంటర్ తర్వాత విద్యార్థులకు ఆర్ధిక, మానసిక,విద్యాపరమైన ప్రోత్సాహం చాలా అవసరం.కానీ గిరిజన గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఈ రకమైన ప్రోత్సహం సరిగ్గా అందడం లేదు.ఈ కారణంగా ప్రతభి ఉన్నా సరే అనుకున్న లక్ష్యాల్ని ఉన్నతమైన స్థానాన్ని విద్యార్థులు చేరుకోలేకపోతున్నారు.విద్యార్థులు వెనకబడిపోకుండా ఉండేందుకు మేమున్నాం.. అంటూ చేయందించి భరోసా కల్పించే ప్రయత్నం సమత చేస్తోంది.ఇది విద్యార్థులు, యువతను ఉన్నత చదువులు చదివించటంతో పాటు కెరీర్ గైడెన్స్ కల్పించి ప్రయోజకుల్ని చేస్తోంది.నైపుణ్యం పెంచుకోవడం,మంచి కళాశాలలు,విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకునే విధానాలు,ప్రాంగణ నియామకాలపై వక్తలు అవగాహన కల్పిస్తున్నారు. మరి,ఈ సంస్థ అందించిన ప్రొత్సాహాన్ని..ప్రతిభ గల నిరుపేద గిరిజన విద్యార్థులు ఎలా సద్విని యోగం చేసుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..!గిరిజన విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా కానీ,పేదరికంవల్ల పదో తరగతితోనో,ఇంటర్‌తోనో చాలా మంది విద్యార్థులు చదువును ఆపేస్తున్నారు. అలా ఆగిపోకూడదనే లక్ష్యంగా సమత మోటివేషన్ ప్రోగ్రామ్(కెరీర్‌పై అవగాహన)కార్యక్రమాన్ని వినూత్నమైన రీతిలో చేపడుతుంది. పాడెరు, అరకు,అనంతరగిరి మండలాల్లోని ఎంపిక చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాలలు,గిరిజన సంక్షేమ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు, వసతి గృహాల్లోను మోటివేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.ఇప్పటి వరకు అనేక మంది యువతను తీర్చిదిద్ది స్వంత కాళ్లపై నిలబడేలా చేయూతనిస్తోంది. మారుమూల గ్రామాల్లో చదువుకోవాలనే కోరిక ఉండి కూడా ఆర్ధిక స్థోమత లేక చాలా మంది ఇబ్బందులు పడు తుంటారు. ముఖ్యంగా పదోతరగతి విద్యార్థు లు,వారంతా చదువుల్లో ప్రతిభ చూపిన ఆర్ధిక పరిస్థితుల కారణంగా పై చదువులను అభ్య సించలేక పోతున్నారు.ఈనేపథ్యంలో టెన్త్, ఇంటర్ పూర్తియిన తర్వాత వీటి అర్హతను బట్టీ ఏవిధమైన ఉద్యోగాలు పొందవచ్చు? పై చదువులకు వెళ్లాంటే ఏమి చేయాలి?అనే వ్యక్తిత్వ వికాసవంతమైన సలహాలు,సూచనలు ఇస్తూ ప్రొత్సహిస్తోంది. బాగా చదవగల సామార్ధ్యం ఉండి వారికి ఎవైనా సమస్యలు ఉన్నాయని తెలిస్తే వారికి మానసికంగా సహాయం చేస్తున్నారు.ఉన్నత చదువుల్లో ఏ కోర్సులు చదవాలి,ఏ కోర్సులు చదివితే బాగుంటుంది అనే అంశాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్,కెరియర్ గైడెన్స్ లాంటి అంశాల్లో సహాయం చేస్తున్నారు.
సాంకేతికతతో ఉజ్వల భవిష్యత్తు
విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ..అవసరాలకు అనుగు ణంగా నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉజ్వల భవితను సొంతం చేసుకోవచ్చు.
తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి
తల్లిదండ్రులు గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి.జీవితంలో గొప్ప వ్యక్తులు సైతం మొదట్లో ఓటములు,ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నవారే.భయాలు,అపోహాలు వీడి ఆత్మవిశ్వాసం,ఏకాగ్రతతో మంచి ర్యాంకులు సాధించాఇ. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి.- సైమన్