గిరిజన నేస్తం
తూర్పు అడవుల్లో ఇప్పపువ్వు సీజన్ నడుస్తున్నది. ఏటా మార్చి నుంచి మే చివరి దాకా సేకరణలో గిరిజనం నిమగ్నమవుతుంది. ఈ సారి గతానికి మించి సందడి నెలకొన్నది. తునికాకుతో పాటు ఉపాధినిచ్చే ఇప్పపూల కోసం మంటుటెండను సైతం లెక్కచేయ కుండా చిన్నాపెద్దా తరలుతు న్నారు. తెల్లవారుజామునే తట్టా బుట్టా, అంబలి బుర్రతో బయలుదేరి, సాయంత్రం కల్లా ఊళ్లకు చేరుతున్నారు.-జి.ఎన్.వి.సతీష్
గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయవనరు. దీనిని గిరిజనులు పవిత్రం గా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్ర దాయ, వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు. సారాయి కాచడమే కాకుండా ఇప్పపూలతో ఇప్పజామ్, కేక్, లడ్డు, హల్వా, నూనె తదితర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలం ముందు ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల విప్ప చెట్లు ఆకురాలుస్తాయి. ఆ సమయం లోనే కస్తూరి వాసన కలిగిన పూలు పుష్పించడం మొదలవుతుంది. పూలు సాధారణగా ఉదయం సమయంలోరాలుతాయి. 30 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100 నుండి 150 కిలోల ఇప్ప పూలు లభిస్తాయి. ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు. బాగా ఎండిన తరువాత లావుపాటి కర్రతో పూలలోని పొట్టు పోయేంత వరకు కొట్టి, గాలి దూరని విధంగా వెదురు బుట్టలలో నింపి నిల్వచేస్తారు. వీటిని తమ అవస రాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారాయి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది. ఢల్లీికి చెందిన డాక్టర్ ఎస్‌ఎన్.నాయక్ భారత శాస్త్రీయ, సాంతికేక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్, చాక్లెట్, జామ్, కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. 1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడం వల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి, వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరానికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు.
ఇప్పపూలతో ఇప్పజామ్‌గిరిజనులకు ఇప్పపూల సేకరణే ఆధారం
నవతెలంగాణ-ములుగు
గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయ వనరు. దీనిని గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ, వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు. సారాయి కాచడమే కాకుండా ఇప్పపూలతో ఇప్పజామ్, కేక్, లడ్డు, హల్వా, నూనె తదితర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలం ముందు ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల విప్ప చెట్లు ఆకురాలుస్తాయి. ఆ సమయంలోనే కస్తూరి వాసన కలిగిన పూలు పుష్పించడం మొదలవుతుంది. పూలు సాధారణగా ఉదయం సమయంలో రాలుతాయి. 30 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100 నుండి 150 కిలోల ఇప్ప పూలు లభిస్తాయి. ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు. బాగా ఎండిన తరువాత లావుపాటి కర్రతో పూలలోని పొట్టు పోయేంత వరకు కొట్టి, గాలి దూరని విధంగా వెదురు బుట్టలలో నింపి నిల్వ చేస్తారు. వీటిని తమ అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారాయి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది. ఢల్లీికి చెందిన డాక్టర్ ఎస్‌ఎన్.నాయక్ భారత శాస్త్రీయ, సాంతికేక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్, చాక్లెట్, జామ్, కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. 1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడం వల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి, వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరానికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు.
ఇప్పపూలతో ఇప్పజామ్
గిరిజనులు చెట్ల కింద పడిన పూలను ఏరి ఆరుబయట నేలపై ఆరబెడుతారు. భద్రాచలం పుణ్య కేత్రాన్ని సందర్శించిన భక్తులకు ఇప్పపూలను సీతమ్మ ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ. ఇప్ప పూల పొట్టు తొలగించి శుభ్రమైన నీటితో మూడు సార్లు కడికి కుక్కర్లో వేసి ఉడక బెట్టాలి. ఉడక బెట్టిన పూలను కొద్దిసేపు చల్లబడే వరకు ఉంచి మిక్సీలో వేసి ఫేస్ట్‌లా రుబ్బాలి. అదేవిధంగా బొప్పాయి. జామ, అరటి, యాపిల్ పండ్ల గుజ్జును కూడా తయారు చేసుకోవాలి. మొత్తం అన్నీ రకాల పండ్లు, ఇప్ప పూల గుజ్జును తూకం వేసి తూనికానికి సగం పంచదార కలిపి సన్నని సెగపై కింద అడుగు అంటకుండా మెదుపుతూ సుమారు 2 గంటల పాటు కాయాలి. కొంచెం తీసి నీళ్లలో వేసినప్పుడు ఆ కొంచెం నీళ్లలో కలవకుండా నేరుగా కిందికి దిగిపపోయినప్పుడు జామ్ తయారు అయినట్లుగా గుర్తించాలి.
విరిసిన ఇప్పపువ్వే బతుకుదెరువు
ఏటా వేసవిలో ఇప్పచెట్లు పూత, కాతలతో కళకళలాడుతుంటాయి. ఈ కాలన్నే గిరిజనులు ఇప్పసీజన్‌గా చెప్పుకుంటారు. ఈసారి ఇప్పపువ్వు సీజన్ ఆలస్యంగా ప్రారంభం కాగా, తూరుపు ప్రాంతంలో అడవిబిడ్డలు సేకరణలో తలమునకల య్యారు. వేకువజామునే బయలుదేరి, ఉదయం పదిగంటల్లోగా సేకరించి, ఇళ్లకు చేరుకుంటున్నారు. పలువురు తమ సొంత భూముల్లో ఉన్న చెట్లనుంచి సేకరించుకుంటుండగా, భూములు లేని గిరిజనులు అటవీప్రాంతంలో చెట్ల నుంచి ఏరుకుంటున్నారు.
వరా ్షకాలంలో అంబలి, ఇప్పపువ్వు అన్నం
గిరిజనులు సేకరించిన ఇప్పపూలను ఎండబెట్టి దానిలో పుప్పొడి రేణువులు పొయ్యేదాకా కర్రమొద్దులతో బాదుతారు. అనంతరం చెరిగి గుమ్ముల్లో దాచుకుంటారు. మొదట దాని అడుగున ఆకులు వేసి తొక్కుతారు. మధ్యమధ్య ఎండబెట్టిన వేపాకులు చల్లుతారు. దీంతో ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చిక్కుడు గింజలు, అల్చందలు కలిపి ఉడికించి అంబలి కాస్తారు. ఇప్పపువ్వు కలిపి అన్నం వండుతారు. మరికొందరు గిరిజనులు ఇప్ప ఉండలను ఆల్పాహారంగా తీసుకుంటారు. ఇప్పపూలను పెంకుల్లో వేయించే సమయాన దంచిన వెల్లుల్లి, మిర్చి, అల్లం కలుపుతారు. అన్నీ కలిపి మోదుగాకుల్లో ఉండలుగా చు డుతారు. వాటిని నేతితో, ఇప్పనూనెతో కలిపి తింటారు. పలువురు ఇప్పపువ్వుతో సారా తయారు చేసి సేవిస్తారు. ఇప్పబద్దల నుంచి నూనె తీసి పంటలకు, దీపం చమురుగా వాడుతారు. అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లే మేకలు, గొర్రెలు, పశువులు సైతం ఇప్పపువ్వు తింటాయి.
మందుల తయారీలో..
ఇప్పపూలను మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. పూల నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం తదితర వ్యాధుల నివారణకు వాడుతారు. మాలిష్‌కు కూడా వినియోగిస్తారు. ఇప్పబద్దలను సబ్బులు, ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. ఇప్పపూలతో పళ్లు తోముకుంటే దంతవ్యాధులు, దగ్గు దరిచేరవని గిరిజనులు చెబుతున్నారు. ఇప్పపువ్వుతో తయారైన సారా తాగితే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు. పలు ఆయుర్వేద మందుల తయారీలోనూ వాడతారు.
వైద్యశాస్త్రంలో ప్రాధాన్యం
వైద్యశాస్త్రంలోనూ ఇప్పచెట్టుకు ఎంతో ప్రాధాన్యముంది. ఆయుర్వేదంలో ఇప్పచెట్టును మధూక వ ృక్షమని వ్యవహరిస్తారు. దీ న్ని శాస్త్రీయ నామం గ్లీజేరియా గ్లాబ్రా కాగా, మేడికేటెడ్ ఆయుర్వేదిక్‌లో దీన్ని వాడుతారు. అటవీ ప్రాంతంలోని గిరిజనులు టేకు చెట్లను సైతం నరికి వంట చెరుకుగా, కట్టెలుగా, దుంగలుగా, నాగళ్లుగా వాడుతారు కానీ, ఇప్పచెట్టును నరికే ప్రసక్తే ఉండదు. ఓఅంచనా ప్రకారం ప్రతి గిరిజనుడి భూమిలో పది నుంచి పదిహేను అంతకుమించిన సంఖ్యలో కూడా ఇప్పచెట్లుంటాయి.
కొనుగోలుకు ముఖం చాటేస్తున్న జీసీసీ
గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కేంద్రాలు నామమాత్రంగానే మిగిలాయి. గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉండగా ఎక్కడా కనిపించడం లేదు. కిలో ఇప్పుపువ్వుకు రూ.15 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించగా తూర్పున జీసీసీ కొనుగోలు చేయక పోవడంతో గిరిజనులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకే అమ్మి నష్టపోతున్నారు.
ఇప్పపువ్వు..గ్రామీణులకు కల్పతరువు
గిరిజనులు అడవులను నమ్ముకుని జీవించడానికి ప్రధాన కారణం అడవిలో లభించే ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్మడం ద్వారా ఉపాధి పొందు తున్నారు. కొందరు తడకలు అల్లితే మరికొందరు పండ్లు సేకరిస్తున్నారు. మరికొందరు తునికాకు,వంటి వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో ఇప్పపువ్వు సేకరణ కూడా వారికి అధిక ఉపాధి కల్పిస్తోంది. గిరిజనులకు కాలానికనుగుణంగా ఉపాధినిచ్చే వృక్షాల్లో ఇప్పచెట్లు ప్రధానమైనవి. వేసవిలో వీటి ద్వారా గిరిజనులు ఉపాధి పొందడానికి అనేక అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇప్పపువ్వు లభిస్తుండడంతో గిరిజనులు అడవుల్లోకి వెళ్లి తెల్లవారు జామునే ఇప్పపువ్వు సేకరించే పనిలో పడ్డారు. గిరిజనులు సూర్యోదయానికి ముందే అడవికి చేరుకుని ఇప్పపువ్వును సేకరిస్తున్నారు. తెల్లవారుజామున కిందపడిన ఇప్పపువ్వును మధ్యాహ్నంలోగా సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడుతున్నారు.
మూడు మాసాలు ఉపాధికి ఊతం..
ఖరీఫ్, రబీ పనులు ముగిసే సమయానికి ఇప్పచెట్లు విరగపూస్తాయి. వీటి పూత గాలికి నేలరాలుతుంటుంది. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రిపండ్లు సేకరించి తీసుకొస్తుంటారు. వీటిని విక్రయించి మూడు మాసాలపాటు అంటే మార్చి, ఏప్రిల్, మేనెలల్లో వీరు ఉపాధి పొందుతారు. ఇప్పపువ్వుల నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. అలాగే ఇప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడంతో దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఔషధంగా పనిచే స్తోంది. ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్పపువ్వుతో తయారుచేసిన సారాయి సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని పల్లె ప్రజలు విశ్వసిస్తారు. ఇన్నిరకాల ప్రయోజనాలున్న ఇప్పచెట్లు రోజురోజుకు స్మగర్ల చేతుల్లో నేలరాలుతున్న టేకు చెట్లతో పాటు ఇప్పచెట్లు నరికేస్తున్నారు. దీంతో క్రమంగా ఉపాధికి దూరమవుతున్నారు.
ఇప్పపువ్వులో ఎన్నెన్నో పోషకాలు..
అడవిలో లభించే ఇప్పపువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నెన్నో పోషక విలువలు ఉన్నట్లు శాస్త్రీయంగా రూడీ అయింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లోని ఆయా మండలాల్లోని అడవుల్లో లభించే ఇప్పపువ్వుల పండ్లలో పోషక విలువల నివధికల ఆధారంగా భారతశాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వశాఖ సహయంతో 1999లో నిర్వహించిన పరిశోధనల్లో ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదార తయారుచేసి దీంతో జాము, కేకులు, చాక్లెట్లు తయారుచేసే విధానాన్ని కనిపెట్టారు. ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి మద్యమధ్యలో ఎండినవేప ఆకు పిచికారి చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. చిక్కుడు గింజలు, అలిచందలు కలిపి ఉడికించి అంబలి చేస్తారు. ఇప్పగింజల నుంచి తీసిన నూనెను దీపంగా వాడుతారు. గిరిజనులు కొంత మంది ఇప్పపువ్వును ఆహారంగానూ తీసు కుంటారు. ఇప్పపువ్వులో లభించే పోషకాలు పరిశీలిస్తే క్యాల్షియం 139.00, పాస్పర్ 137.00, ఫైబర్ 109.00, కార్బోహైడ్రేడ్స్ 68.00 మాయిశ్చర్ 11.66, ప్రోటీన్‌లు 6.67 శాతం ఉంటాయి.