గిరిజన నేస్తం
‘పుష్పవిలాపం’లో ఓబాల తనను చెట్టు నుంచి వేరు చేస్తున్నందుకు పూబాల విలపిస్తుంది, విషాదగీతం ఆలపిస్తుంది. కానీ, చిరుగాలి సవ్వడికి చెట్టుమీది నుంచి రాలే ప్రతి ఇప్పపువ్వూ ఆనందంగా గోండుల వెదురుబుట్టలోకి వెళ్లిపోతుంది. ఆహారమై ఆకలి తీర్చబోతున్నందుకూ, పలారమై పిల్లల నోళ్లు తీపిచేయబోతు న్నందుకూ, ఔషధ గుణాలతో అమ్మల చనుబాలను వృద్ధి చేస్తున్నందుకూ .. ఆ సంతోషానికి అనేక కారణాలు. తెల్లవారుజాము సమయంలో తాడ్వాయి అడవులకు వెళితే%ౌౌ% ఆ పుష్ప విలాసాన్ని కళ్లారా చూడవచ్చు. ఇది పువ్వులు రాలే కాలం. గోండుల మొహాలు పువ్వుల్లా వికసించే కాలం. ఉదయంపూట నడుస్తుంటే, పాదాలకు మెత్తని పూలు తాకుతుంటాయి. తలపైకెత్తి చూస్తే దట్టంగా ఇప్పపూల చెట్లు%ౌౌ% గొడుగులా అల్లుకొని! రాలిన పూలకు అంటిన మట్టిని సుతారంగా తుడిచి, జాగ్రత్తగా వెదురు బుట్టల్లోకి వేస్తుంటారు పిల్లలూ పెద్దలూ. అదో అందమైన దృశ్యం!
ఆ పూవు అటవీ ప్రాంత ప్రజల బతుకుదెరువు. ఇప్పచెట్లకు ఓజీవనచక్రం ఉంటుంది.ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకూ ఆకురాలే కాలం. ఆసమయంలోనే ఘాటైన పరిమళంతో పూలు వికసిస్తుంటాయి. మార్చి నుంచి మూడు నెలల వరకూ పూలు రాలే కాలం.ఒక్కో చెట్టు నుంచీ సుమారు వంద కిలోల పూలు రాలతాయి. ప్రతి పువ్వునూ జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటారు గిరిజనులు.ఎందుకంటే,వాళ్ల బతుకంతా ఇప్పతోనే ముడిపడి ఉంటుంది.ఇప్పపూల సేకరణ కోసం తెల్లవారుజామునే అడవులకు బయల్దేరతారు గోండులు.పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి కోసం చూసినట్టు, రాలిపడే ఇప్పపూల కోసం ఎదురు చూస్తుంటారు.అలా, ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోల వరకూ సేకరిస్తారు. సాయం త్రం బుట్టనిండా పూలతో తృప్తిగా ఇళ్లకు చేరుకుంటాం. వాటిని ఎండబెట్టి పుప్పొడి రేణువులు పోయేదాకా కర్రమొద్దులతో బాదుతారు. ఆ తర్వాత,చేటలతో చెరుగుతారు. గుమ్ముల్లో దాచు కుంటారు. ముందుజాగ్రత్తగా, వాటిలో కొన్ని వేపాకులు చల్లుతారు.దానివల్ల పువ్వు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఒకనాటి పువ్వు ఇప్పుడు ఆహార పదార్థం.
పువ్వుకే మనసు ఉంటే..
అందంగా పుట్టినందుకు కాదు,ఆహారమై కడుపు నింపుతున్నందుకే ఎక్కువ సంతో షిస్తుందేమో ఇప్పపువ్వు. ఏ కూర లూ లేనపుడు,నాన బెట్టిన బియ్యానికి ఇప్ప పువ్వు కలిపి అన్నం వండుకుంటారు. నాలుకకు కాస్త తీపి తగిలితే బావుండునని అనిపించినప్పుడు బెల్లం కలిపి ఉండలుగా చేసుకొంటారు. ‘ఇవి మా జీవితం. మా ఆత్మ’ అంటూ ఆరబెట్టిన ఇప్పపూలను దోసిళ్లతో చూపుతుంది మోట్లగూడానికి చెందిన అలుగుమెల్లి రజిత.
ఇప్ప గారెలు,జంతికలు
ఇప్పపువ్వు అనగానే సారా తయారు చేస్తారనేదే ఇప్పటి వరకూ ఉన్న ప్రచారం.అంతకుమించి, ఎన్నో వంటలు వండుకుంటారు గోండు మహిళలు.జొన్నపిండి ఉడక బెట్టి,అందులో ఇప్పపూలు కలిపి అంబలి చేస్తారు.వేయించి బజ్జీలు వేస్తారు.చిక్కుడు గింజలు,అలసందలు కలిపి ఉడికిస్తే ఆ అంబలి అమృతమే! ఇప్ప కుడుములు (ఇడ్లీల్లాంటివి),జొన్న-ఇప్పరొట్టె, గోంగూర-ఇప్పపూల కూర,జొన్న-ఇప్ప సత్తుపిండి ఇప్ప పడితే ఎండు గడ్డికైనా ఎక్కడలేని రుచి వస్తుంది.ఇప్పతో అరిసెలు, గారెలు, జంతికలు, మురుకులు కూడా చేసు కుంటారు.ఎర్ర జొన్న పిండి,బెల్లంతో చేసిన రెండు లడ్డూలు తింటే చాలు,రోజంతా భోజనమే అవసరం లేదు.‘చక్కెర పాకానికి ఇప్పపూవు కలిపి జామ్, కేక్ తయారు చేస్తాం’ అని చెప్పింది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన భాగుబాయి. వైవిధ్యమైన ఇప్ప వంటకాల తయారీలో ఆమె సిద్ధహస్తురాలు. ఉట్నూరులో ఆదివాసీ ఆహార కేంద్రం నిర్వహిస్తున్నదామె. అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే,రోజువారీ ఆహారంలో ఇప్పపూవు ఉండేలా చూసుకుంటారు గిరిజ నులు. వారి నివాసాలు కూడా ఇప్పచెట్లకు దగ్గరలోనే ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5లక్షల ఇప్ప చెట్లు ఉన్నట్లు అంచనా.ఐదు లక్షల చెట్లంటే,ఐదు లక్షల జీవితాలే.ఇప్పసారాను నైవేద్యంగా కూడా పెడతారు.ఇప్ప అంటే గోండు దేవతలకు మహా ఇష్టమని అంటారు.మంచిచేసే పువ్వును ఏ దేవుడు మాత్రం ఇష్టపడడు!
శానిటైజర్‌గా ఇప్పసారా!
‘ఆపిల్, మామిడి, ఎండు ద్రాక్షలతో పోలిస్తే ఇప్ప పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. శరీరానికి కావలసిన ..క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు,బి-కాంప్లెక్స్, విటమిన్-సి ఇందులో అధికం. ఇవన్నీ వ్యాధినిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. ఇప్ప పూలను దగ్గు, శ్వాసకోశ సమస్యల నివా రణకు వాడతారు. ఇప్ప కాయలను పొడిచేసి పాలలో కలుపుకొని తాగుతారు బాలింతలు. దీనివల్ల చనుబాలు వృద్ధి అవుతాయని అం టారు.‘ఇప్పసారా తయారీపై నిషేధం ఉంది. శుభకార్యాలప్పుడు అయిదు లీటర్ల వరకు తయారు చేసుకోవడానికి మాత్రం అనుమతి ఉంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో శానిటైజర్లు మారుమూల గిరిజన ప్రాంతాల్లో దొరకవు. కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ నిరోధానికి ఇప్పసారాను శానిటైజర్‌గా వాడుతున్నారు’ అంటారు.
ప్రారంభమైన ఇప్పపువ్వు సేకరణ!..
ఏజెన్సీ అడవుల్లో ఇప్పపువ్వు సీజన్ నడుస్తుంది. ప్రతి ఏడాది మార్చి నుంచి మే చివరి దాకా ఇప్పపువ్వు సేకరణలో గిరిజనం నిమగ్నమవు తుంటారు. వేసవి కాలంలో ఉపాధినిచ్చే ఇప్పపూల కోసం మంటుటెండను సైతం లెక్కచేయకుండా చిన్నాపెద్దా తరలుతున్నారు. తెల్లవారుజామునే తట్టా బుట్టా,అంబలి బుర్రతో బయలుదేరి, సాయంత్రం కల్లా ఊళ్లకు చేరు కుంటారు.గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయవనరు మాత్రమే కాదు.ఇప్ప పువ్వును గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ,వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు.సాధారణగా ఉదయం సమయంలో రాలుతుంటాయని,30సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100నుండి 150 కిలోల ఇప్పపూలు లభిస్తుంటాయని పలువురు గిరిజనులు న్యూస్18కు తెలియ జేశారు ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు.బాగాఎండిన తరువాత వీటిని తమ అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారా యి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది.కానీ భద్రాచలం ఏజెన్సీ అడుగులలో లభించే ఈ పప్పుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రసాదం భక్తులకు విక్రయిస్తారని గిరిజనులు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా గతంలో పలువురు శాస్త్ర వేత్తలు జరిపిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్,చాక్లెట్,జామ్,కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు.1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడంవల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి,వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరా నికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు. ఇప్పపూలతో ఇప్పజామ్‌గిరిజనులకు ఇప్పపూల సేకరణే ఆధారం.
దివ్య ఔషదాల కల్పవల్లి..
కొండకోనల్లో జీవించే గిరిజనులకు ప్రకృతి వనరులే జీవనాధారంగా ఉంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించే వివిధ రకాల పండ్లు, పంటలు గిరిజనులకు ఆహార సంపదతో పాటు ఆదాయ వనరులుగా ఉపయోగపడుతుంటాయి. ప్రస్తుతం జీడీ, చింతపండు,కరక్కాయ వంటి సహజసిద్ద పంట లతోపాటు ఇప్పపూలు సేకరణద్వారా గిరిజ నులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
వేసవిలో ఇప్పపూలు సేకరణలో గిరిజనులు బిజీగా గడుపుతుంటారు.గిరిజనులు చింత పండు,జీడి పిక్కలు సేకరణతో పాటు మరోవైపు ఇప్పపూలు సేకరణలో బిజీగా కనిపి స్తుంటారు. ఏగ్రామం చూసిన విప్పపూల సువాసన వెదజల్లుతోంది.ఇప్పపూలులో దివ్యౌషధం గుణాలు కలిగి ఉన్నాయి. ఇప్పపూలు విని యోగించేవారు విశేషమైన ఆరోగ్య లాభాలు పొందుతారు.ముఖ్యంగా కీళ్ల నొప్పులు,ఒళ్ళు పట్లు, వాతాలకు దివ్యౌషధం ఇప్పపూలు. దగ్గు,శ్వాసకోస వ్యాధులకు కూడా వాడు తుంటారు.ఇప్ప కాయలను పొడిచేసి పాలలో కలుపుకుని గిరిజన మహిళలు తాగుతారు.దీని వలన బాలింతలు చనుబాలు వృద్ధి అవుతాయని అంటుంటారు. విప్ప పువ్వు తో ఆయుర్వేదిక్ మందులు, నూనె లడ్డు, హల్వా, కేకులు తయారు చేస్తుంటారు. అందుకే విప్ప పువ్వుకు మార్కెట్ లో మంచి డిమాండ్.అడవుల్లో సేకరించిన విప్ప పువ్వును బాగా ఎండ బెడతారు. అనంతరం ఆ పువ్వు నుంచి గింజ లను వేరు చేసి,మళ్లీ ఎండబెడతారు. అనం తరం వాటిని గానుగ ఆడిరచి నూనె తీస్తారు. ఈ నూనెను వంటలలో ఉపయోగిస్తుంటారు. అలాగే, ఔషధాలకూ ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో విప్ప నూనె కిలో ధర 50రూపాయల వరకు పలుకుతుంది. గిరిజను లు ఈ నూనెను విక్రయిస్తూ, ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. గతంలో గిరిజన సహకార సంస్థ ద్వారా విప్ప పువ్వు,విప్ప నూనెను ప్రభుత్వమే కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.దీంతో మార్కెటింగ్ కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పపూలు,గింజల నుంచి తీసే నూనెలో ఔషధపోషక గుణాలు కూడా ఉన్నా యని జాతీయ పౌషకాహార సంస్థ అధ్యయనంలో తేలిందని ట్రైఫెడ్ చెబుతుంది. బాలింతలకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు శారీరక బలహీ నత నివారించే గుణాలు వీటిలో ఉన్నాయని పేర్కొంటోంది.30 ఏళ్ల వయస్సున్న ఇప్ప చెట్టు సగటున 150 కిలోల పూలను ఉత్పత్తి చేస్తుంది.మట్టి అంటకుండా ఈపూలను సేకరించి నిల్వ చేస్తారు.అనంతరం వీటి నుంచి పంచదార పాకం చేసి దాంతో బిస్కెట్,చాక్లెట్, జామ్,కేక్‌లను తయారు చేస్తారు.కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఢల్లీికి చెందిన డాక్టర్ ఎస్.ఎన్.నాయక్ ఈ ప్రక్రియపై పేటెంట్ కోసం కూడా దరఖాస్తు చేశారు-
ఎ.పోశాద్రి