రాష్ట్రంలో గిరిజన,దళిత వర్గాలపట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యవైఖరి అవంబిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులే దీనికి తార్కాణం. వారిపై జరుగుతున్న దాడు అమానుషమని మేథావు ఆవేదను వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో ప్రభు త్వాలు మారుతున్నా వారి తరాతలు మారడం లేదు. కదా రోజురోజుకు ఆవర్గాల ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. దీంతోవారంతా సామాజికంగా, ఆర్ధికంగా అణచి వేతకు గురవుతున్నారు.
అధికంగా పేదలు, వ్యవసాయ కార్మికులుగా, వలస కార్మికలుగా జీవిస్తున్నారు. రాష్ట్రంలో దళితవాడు సుమారు 20వేల వరకు ఉన్నాయి. ఇవి ఊరు చివరఅభివృద్థికి ఆమడదూరంలో ఉంటాయి. ఇదినేటి దళితుస్థితి. దళితును సమా జంలో ఉన్నత స్థాయికి తేవాని రాజ్యాంగంలో కీలకమైన ఆర్టికల్స్‌ను రాసుకున్నాం. కానీ వాటి అమలు సక్రమంగా జరగకపోవడంవల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు దళితల బతుకులు సాగుతున్నాయి. ఆర్టికల్16(4)రిజర్వేషన్లు, ఉద్యోగ కల్పన, ఆర్టికల్ 17అంటరానితనం నిర్మూన, ఆర్టికల్ 46 ప్రత్యేక శ్రద్ధతో విద్య, ఆర్థిక సౌకర్యా క్పల్పన, సామాజిక న్యాయం దోపిడీకి గురికాకుండా రక్షణ,ఆర్టికల్341,342దళితల అభివృద్థిని గవర్నర్ల సహాయంతో చేయడం,ఆర్టికల్ 335 సామర్థ్యం నిర్వహాణ, నియమకాలు, ఆర్టికల్ 338 దళితల అభివృద్థికి ప్రత్యేక అధికారాలు, నియామకం, జాతీయ కమిషన్, సహాకార కార్పొరేషన్ ఏర్పాటు... రాజ్యాంగంలో ఇన్ని హాక్కు ఉన్నప్పటికి అమలలో తీవ్రమైన వైఫ్యం జరిగిందనేది స్పష్టంగా కనపడుతుంది. నేటి బీజేపీ పాలకల రాజ్యాంగాన్ని సమీక్షించాలి,మార్చాలి,ఆర్టికల్16(4)నురద్దు చేయాలి,రాజ్యాంగ స్థానంలో మనువాద ఏజెండాను అమలు చేయాలని తీవ్రప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, 370 ఆర్టికల్ రద్దు, దళితల,మైనార్టీలు,మహిళపై దాడు,దౌర్జన్యాల హత్యు అత్యాచారాలు జరుగుతున్నాయి. క్రైమ్ ఇన్ ఇండియా 2019 నివేదిక ప్రకారం దేశంలో దళితలపై నేరాల్లో మొత్తం 7.3 శాతం పెరుగుదల ఉంది. 45935 నేరాలు, దారుణకేసు నమోదు చేయబడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో 11,829 కేసు. ఇది దేశమొత్తం కేసుల్లో 25.8 శాతం,రాజస్థాన్ 6794కేసు14.8శాతం, బీహార్ 14.2శాతం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుపై లైంగిక వేదింపు అత్యాచారాలు హత్యలకు కిడ్నాప్ లు ఎక్కువగా నమోదయ్యాయి.. అంబేద్కర్‌పై బీజేపీ, ఆర్ఎస్ ఎస్‌కు ఎంత ప్రేమ ఉందో ఈనేరానుబట్టి అర్థమవుతుంది. రాష్ట్రంలో 2014లో 1104 సంఘటను జరిగితే 2019లో నవంబర్18నాటికి1904 సంఘటను జరిగాయి. కిరాతకమైన హత్యలు జరిగాయి. కుల దురంకార హత్యలు 49జరిగాయి. అత్యాచారాలు దౌర్జన్యాలు లైంగిక వేదింపులకు తోడు వీడీసీ పేరుతో ఉత్తర తెంగాణ 4జిల్లా పరిధిలో 200గ్రామాల్లో దాడలు జరిగాయి. అంబేద్కర్ విగ్రహా ధ్వంసం, అనేక గ్రామాల్లో గ్రామ బహిష్కరణలు జరిగాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిస్లిలో దళితులకు ఏమాత్రం రక్షణలేదు. రాష్ట్ర మొత్తం ఇదే పరిస్థితి ఉంది. దళితులకు కల్పించబడ్డ హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం 1989ను ప్రభుత్వాలు అమలు చేయలేదు. ప్రభుత్వాలు చట్టాన్ని నీరుగార్చడమే కాకుండా దళితలపై పెరుగుతున్న దాడులకు దోహదం చేస్తూ నేరస్థులకు అండగా నిబడుతున్నవి. ఆర్ఎస్ఎస్ నాయకు బహిరంగ ప్రజా వేదిక నుంచి రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించా ని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని పునఃపరిశీ లించాని కోరుతున్నారు. గ్రామాల్లో హౌదా, గౌరవం భూపరిమాణాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇందులో దళితు పరిస్థితి చూస్తే తెంగాణలో18క్ష కుటుంబాలు ఉండ గా7.12క్ష కుటుంబాకు13.12క్ష ఎకరాల భూమి మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం సాగు భూమి1.65కోట్లఎకరాలు ఉంది. ఇందులో దళితల భూముఎన్ని? రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటిం చినట్టు 3క్ష భూమి లేని కుటుంబాకుగాను, 3ఎకరా భూమి కొనుగోలు పథకం కింద గత 7ఏండ్లలో 6,662 కుటుంబాకు 16544.13 ఎకరాను మాత్రమే కొనుగోుచేసి పంపిణీ చేసారు. ఇందులో 511మందికి 1122.02 ఎక రాకు నేటికి రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రతి ఏటా10వే కోట్లు కేటాయించి ఐదేండ్లలో 50వే కోట్లుఖర్చుచేసి భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి భూమి ఇస్తామని ప్రకటించి మాట మార్చిన కేసీఆర్ దళితవ్యతిరేకిగా ని బడ్డారు. పైగా గత ప్రభుత్వాు దళితుకు అసైన్డ్ చేసిన భూమును అభివృద్ధి పేరుతో ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్నది. ఈభూముల్లో గ్రామ పార్కులను,డంపింగ్ యార్డు,రైతువేదికలకు ,స్మశాన బిల్డిం గ్స్,ఇండిస్టీపార్కు నిర్మిస్తున్నారు. ఇది ధనవంతలకు, భూస్వాముకలకు రియలేస్టేట్, పరిశ్రమ అధిపతలకు భూములను ధారదత్తం చేసే భూస్వామ్య,దొర ప్రభుత్వమని తేలిపోయింది. 2014-15ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు ఏడేండ్లలో దళితు ప్రత్యేక అభివృద్ధికి 85913 కోట్లు కేటాయించి 57100 కోట్లు మంజూరు చేసి 47685 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దళితు సంక్షేమం, అభివృద్ధి, రక్షణ నినాదాలు బాగా వినబడుతున్నప్పటికీ 50 శాతంలోపే ఖర్చుచేసి దళితు అభివృద్ధిని సాది స్తామంటే ఏలాసాధ్యం. స్వయం ఉపాధి పథకాకు గత ఐదేండ్లుగా5క్షకుపైగా ధరఖాస్తు పెట్టుకున్నారు.లక్ష20వే మందికి మంజూరు చేసి లక్ష మందికి సబ్సిడీ విడుద చేశారు. 13వంద కోట్లు కేటాయించి 1160కోట్లు ఖర్చు చేశారు. 2019 నుంచి 21వరకు రెంళ్ళకు యాక్షన్ ఫ్లాన్ విడుద చేయలేదు. నిరుద్యోగు ప్రతి సంవత్సరం సుమారు 2క్ష వరకు దరఖాస్తు పెట్టు కుంటున్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంది. సరిపడని బడ్జెట్ కేటాయించారు. లోన్ కోసం విషమ షరతు విధిస్తున్నారు. తిరిగి తిరిగి విసిగి వేసారి లోన్స్‌కు దూరంగా ఉండే దుస్థితి వస్తున్నది. ఏలాంటి షరతు లేకుండా ప్రతి ఏడాది1500కోట్లు కేటాయించి ఖర్చు చేస్తే దళిత నిరుద్యోగుకు న్యాయం జరుగుతుంది. అక్షరాస్య తలో దళితు 50శాతం కూడా లేరు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. వైద్యంపూర్తిగా కార్పొ రేట్ శక్తు చేతుల్లోకి వెళ్ళింది. ప్రజారోగ్యోం దెబ్బతినడం వ్ల ఆర్థికంగాలేని దళితుల్లో చిన్న చిన్న జబ్బుకే మరణాలు సంభవిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలి. జీఓ 342 ప్రకా రంగా 101 యూనిట్ల విద్యుత్‌ను ఫ్రీగా దళితుకు ఇస్తున్నారు. ఇది200యూనిట్లకు పెంచాలి. జిఓ1235 ఆధారంగా రెండు ఎకరా భూమిని ప్రతి గ్రామంలోస్మశాన స్థలాకు ఇవ్వాలి. ప్రభుత్వ రంగం వేగంగా తగ్గిపోతున్నది. ప్రయి వేట్ రంగం లో రిజర్వేషన్లు లేవు. బ్యాక్‌లాక్ పోస్టు భర్తీ చేయడం లేదు. దళిత ప్రజు సాంఘిక సంక్షేమ పథకాపై ఆధారపడి జీవిస్తు న్నారు. ఉపాధిహామీ చట్టం, ప్రజాపంపిణీ,ఆహారభద్రత,ఆసరా ఫించన్స్, ఇవి కొంత మేరకు దళిత సమాజానికి ఉపయోగ పడు తున్నాయి. ఈతరుణంలో నయా ఉదారవాద ఆర్థిక విధానా అమువ్ల సాంఘిక సంక్షేమ పథకా క్ష్యం నిరంతరం తగ్గించబడుతున్నది. నిత్యవసర సరుకు ధరు నిత్యం పెరుగు తున్నాయి. అర్థాకలితో జీవి స్తున్నారు. దళితవాడల్లో రక్షిత తాగునీరు, రోడ్లు ఉండవు. గృహవసతి లేనివారు 30శాతం ఉన్నారు. గృహ నిర్మాణ పథకం, డబల్ బెడ్రూం పథకాు ఇండ్ల సమస్యను పరిష్కరించలేదు. కులాంతర వివాహాు, కళ్యాణక్ష్మీ పథకాకు నిధును పెంచాల్సిన అవసరం ఉంది. దళితు సమగ్రాభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాు నిర్లక్ష్యం చేస్తున్నాయి.
దళితు, ఆదివాసీ కష్టాు` దళిత్ శోషన్ ముక్తి మంచ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రామచంద్ర
ఈఏడాది అసెంబ్లీ ఎన్నికు జరగ బోయే పశ్చిమ బెంగాల్లో దళితు, ఆదివాసీ పరిస్థితి దయనీయంగా మారింది. శ్రామిక వర్గంలో భాగంగా ఉన్నవారు దశాబ్దాుగా తమ హక్కుకు నోచుకోలేకపోతున్నారు. సామాజికంగా, ఆర్థికం గానూ వారు అణచివేతకు గురవుతున్నారు. అయితే, రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), విపక్ష బీజేపీు దళితు,ఆదివాసీను మోసగిస్తు న్నాయి. వారిని కేవం ఓటు బ్యాంకుగానే చూస్తు న్నాయి కానీ వారిహక్కు విషయంలో మౌనం వహిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో ఈవర్గా హక్కు,సామాజిక,ఆర్థికన్యాయం కోసం వామపక్షం మాత్రమే దశాబ్దా పాటు పోరాడిరదని దళిత శోషన్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) ప్రధాన కార్య దర్శి, మాజీఎంపీ డాక్టర్ రామచంద్ర డోమ్ గుర్తు చేశారు.
బెంగాల్లో దాదాపు 30శాతం ఎస్సీ, ఎస్టీలే..!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గా మద్దతు కోసం బీజేపీ,టీఎంసీు చేస్తున్న కుటి యత్నాు అనేక సందర్భాల్లో బయటపడ్డాయని చెప్పారు. ‘విభజన’ రాజకీయాతో ఈ వర్గాను మరింతగా బహీనపరిచే కుట్రను కేంద్ర, రాష్ట్రంలోని అధికార పార్టీు చేస్తున్నాయని వివరిం చారు. పశ్చిమ బెంగాల్‌లోఎస్సీ,ఎస్టీ జనాభా గణనీ యంగా ఉన్నది.2011 జనాభా లెక్క ప్రకారం.. ఎస్సీు 1.8కోట్ల మందికి పైగా (23.5శాతం మంది),ఎస్టీు దాదాపు 53 క్ష మంది (5.8 శాతంమంది) ఉన్నారు. అంటే జనాభాలో దాదాపు 30శాతం ఈ రెండు వర్గాకు చెందినవారే.
కులాధారిత వేధింపు అధికం
అయితే, రాష్ట్రంలో కులాధారిత వేధిం పు ఎక్కువయ్యాయని డోమ్ వ్లెడిరచారు. ఇందుకు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో మెగులోకి వచ్చిన రెండు సందర్భాను ఆయన వివరించారు. ‘’ కోల్‌కతాలోని రవీంద్ర భారతీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎస్టీ వర్గానికి చెందిన సర స్వతి కెర్కెట్టా2019లోనియమితుయ్యారు. అయితే,ఆవర్గానికి చెందినవ్యక్తిగా ఇదిఆమె సాధిం చన గొప్ప ఘనత. కానీ, సాక్షాత్తూ ఆమె విద్యార్థులే ఆమెను ఒకగంటపాటు నిబెట్టారు. ఇంకో ఘట నలో.. జాదవ్‌పూర్ యూనివర్సిటీ హిస్టరీ అసోసి యేట్ ప్రొఫెసర్‌గా ఆదివాసీ మరూనా ముర్ము నియమితుయ్యారు. అయితే,ఈమెను కూడా విద్యా ర్థు ఒక విషయంలో దూషించారు’’ అని ఆయన గుర్తు చేశారు.
అగ్రవర్ణాకే ప్రయోజనం
అధికార పార్టీ విభజన రాజకీయా కు ఆకర్షితు వుతున్న ఈ శ్రామిక వర్గా ప్రజు పోరాడటం ద్వారానే తమ హక్కును పొందు తారని డోమ్ చెప్పారు. తాగునీరు, భూమి హక్కు, వనయి, విద్య, సాంస్కృతిక, అభివృద్ధికి సంబం ధించిన అనేక విషయాల్లో దళితు, ఆదివాసీ హక్కుకు పోరాటాలే దారిని చూపిస్తాయని వివరించారు. రాష్ట్రంలో టీఎంసీ దాదాపు 10 ఏండ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ.. అటవీ హక్కుచట్టం ప్రకారం ఆదివాసుకు పట్టా ఇవ్వ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అగ్రవర్గా ప్రజు మాత్రమే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారనీ, ఈ అసమానత దళిత, ఆదివా సీను ఉద్యమాు చేసేలే పురిగ్పొుతుందని తెలిపారు.
‘తీవ్రస్థాయికి ఆహార సంక్షోభం’
బెంగాల్లో ఈ రెండు వర్గా ప్రజ పరిస్థితి ఆహార సంక్షోభంతో తీవ్ర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘’2018లో లోధ, షబర్ వర్గానికి చెందిన10మంది ఆకలి కారణంగా చని పోయారు. ఆహార సంక్షోభం శ్రామిక వర్గా ప్రజ ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ గణాం కాను ఎన్ఎస్ఎస్ఓ డేటా కూడా ప్రతిబిం బిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రజు మళ్లీ ఎర్ర జెండా కిందకు వస్తున్నారు’’ అని ఆయన తెలిపారు.
‘లెఫ్ట్ ఉద్యమానికి దళిత, ఆదివాసీ మద్దతు’
అయితే,బెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్ని స్తున్నదనీ,ఇందుకు మత,కురాజకీయాకు తెరలేపి ప్రజల్లోవిభజను తీసుకొస్తున్నదని చెప్పారు. దీంతో,ముఖ్యంగాదళితు,ఆదివాసీు విడి పోతు న్నారని ఆవేదనవ్యక్తంచేశారు. రాజ్యాంగం కల్పిం చిన రిజర్వేషన్లను సైతం ప్రశ్నించేలా బీజేపీ చర్యు న్నాయన్నారు. గుండాయిజం, బెదిరించే ధోరణితో టీఎంసీ చర్యు రాష్ట్రంలో భయభ్రాంతు గురి చేస్తున్నాయని డోమ్ వివరించారు. రాష్ట్రంలో మహిళపై లైంగికదాడు, హత్యు, ఆది వాసీ, దళిత యువకును తప్పుడు సాకుతో అరెస్టు చేయడం వంటివి కొనసాగుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రంలో వామపక్ష ప్రభు త్వం దూరం అయినప్పటి నుంచి ఈసమస్యు అధికమ య్యాయని చెప్పారు. హక్కు పోరాటాల్లో భాగంగా దళితు, ఆదివాసీ నుంచి వామపక్ష ఉద్యమానికి విస్తృతమైన మద్దతు భిస్తుందని డాక్టర్ డోమ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
-ఆర్. వెంకట రాములు
Related