గిరిజన ఆకాంక్షల మేరకు అల్లూరి జిల్లా అభివృద్ధి
గిరిజనుల ఆకాంక్షల మేరకు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా మని అల్లూరి సీతారామారాజు జిల్లా కలెక్టర్‌ఎ. ఎస్.దినేష్ కుమార్ పేర్కొన్నారు.అక్టోబర్ 23న కలెక్టరేట్ మిని సమావేశ మందిరంలో జిల్లా వ్యా ప్తంగా ఉన్న పలుగిరిజనసంఘాల నేతలతో సమా వేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్య, ఉద్యోగ అవకాశాలు, వైద్య సేవలు,రహదారుల అభివృద్ది,స్వయంఉపాధి పథకాలు,నైపుణ్యాభివృద్ధిని సమర్దవంతంగా అమ లు చేయడానికి గిరిజన సంఘాల నేతల తగు సలహాలు సూచనలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రా 2047కింద చేపట్టిన అబి óవృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. పాఠ శాల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపించాలమని తెలియ జేసారు.పాఠశాల భవనాలు లేని చోట తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేయడానికి ఒకడిజైన్ చేయాలని అన్నారు. ప్రభు త్వ భూములు,క్వార్టర్లను ఆక్రమిస్తే తనదృష్టికి తీసుకునివస్తే తగిన చర్యలు చేపడతామని చెప్పా రు.గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమిస్తే సమాచారం అందించాలని అన్నారు. మూడు, నాలుగేల్లో ప్రతి గ్రామానికి కనీస రహదారి సదు పాయం కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి నేతలు రామారావు దొర,మొట్టడం రాజాబాబు,కొర్ర బల రాం,డా.రామకృష్ణ,ఎస్.వరలక్ష్మి తదితరులు మాట్లాడుతూ ఆశ్రమపాఠశాలల్లో మెనూ సక్ర మంగా అమలు చేయడం లేదని అన్నారు. డిప్యూటీ వార్డెన్ల పోస్టులు నిర్వహణకు ఉపాధ్యాయులు పైరవీలు చేస్తుంటారని చెప్పారు.ఆశ్రమ పాఠ శాలలో చదువుకుంటున్న 4,5తరగతి విద్యా ర్ధులపై ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎంపిపి పాఠశాలల ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని అన్నారు. కొయ్యూరు ప్రాంతంలో జీడి తోటలు అధికంగా ఉన్నాయని జీడిపిక్కల పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగు పడతా యని సూచించారు. జాఫ్రా,రబ్బరు పరిశ్రమలు, అటవీ ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మారేడు మిల్లి నుండి రాజమండ్రికి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.గిరిజన యువతకు శిక్షణ అందించి స్వయం ఉపాధి పథకాలు నెలకొల్ప డానికి తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. గంజాయి సాగు,రవాణా,వినియోగంపై కఠిన చర్య లు తీసుకోవాలని సూచించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యపరీక్షలు,రక్త పరీక్షలు సక్ర మంగా నిర్వహించడం లేదని చెప్పారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.నకిలీ కులదృవీ కరణ పత్రా లుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ కార్య కలాపాలు సక్రమంగా జరగపోవడం వలన రక్తకొరత ఏర్పడుతుందని చెప్పారు. జిల్లాలో ముఖ్యంగా చింతూరు డివిజన్లో వరద సహాయ చర్యలు చేపట్టి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ సేవలును అందరూ ప్రశంసించారు. ఈ సమావేశంలో 22 మండలాల నుండి గిరిజన సంఘాల ప్రతినిధులు కె.ఆనం దరావు,గోపాల్,ఎస్.అశోక్,డా.పి.రాకుమార్, కె.సన్యాసిరెడ్డి,గిరిజన విద్యార్ధి సంఘం ప్రతిని దులు కిరసాని కిషోర్, ఎం.బాబూజీ తది తరులు పాల్గొన్నారు.
కాఫీ రైతులకు గిట్టుబాటు ధర అందించండి
అరకు కాఫీకి గిట్టుబాటు ధర అందించా లని జిల్లా కలెక్టర్‌ఎ.ఎస్.దినేష్‌కుమార్ సూచిం చారు. బుధవారం ఆయన కార్యాలయంలో ఐటిసి కంపెనీ అధికారులు,కాఫీ అధికారులతో కాఫీ విక్ర యాలపై సమావేశం నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు కాఫీని గిరి జన రైతులు ఆర్గానిక్ విధానంలో సాగు చేస్తు న్నారని కాఫీ రైతులకు మంచి ధర చెల్లించాలని స్పష్టం చేసారు. చింతపల్లి మాక్స్ సంస్థ సేకరిస్తున్న కాఫీని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామ మన్నారు. కాఫీ సేకరణలో తగిన నాణ్యతలు పాటించాలని సూచించారు. కాఫీ రైతుకు జియో ట్యాగింగ్ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు.కాఫీ నాణ్యతలపై లైజాన్ వర్కర్లకు అవగా హన కల్పించాలని చెప్పారు.చింతపల్లి మాక్స్ సంస్థ ఈ ఏడాది 600టన్నుల పార్చిమెంట్ కాఫీని ఉత్పత్తి చేస్తోందన్నారు గిరిజన కాఫీని బహిరంగ వేలంలో విక్రయిస్తామన్నారు.గత రెండు సంవ త్సరాలను అరకు కాఫీ ఫైన్ కప్ అవార్డును పొందు తోందన్నారు.ఐటిసి అధికారులు వాసు దేవ మూర్తి, కిరీట్ పాండే మాట్లాడుతూ మాక్స్ కాఫీ వేలంలో పాల్గొంటామని చెప్పారు. కాఫీ విక్రయాలు, వేలం సమయంలో సమాచారం అందించాలని కోరారు.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసికట్టుగా నడుద్దాం – రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి అందరం కలిసి కట్టుగా నడుద్దా మని, సమష్టి కృషి చేద్దామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.ప్రజా సమస్య ల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుద్దామని పేర్కొ న్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఛైర్ పర్శన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి లో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. డయేరియా లాంటి మహమ్మారి దాడి చేయకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,ఓవర్ హెడ్ ట్యాంకులను తరచూ శుభ్రం చేయాలని, క్లోరినేషన్ ప్రక్రియను నిరంతరం చేపట్టాలని చెప్పారు.మురుగు కాలువలకు ఆను కొని తాగునీటి పైపు లైన్లు ఏర్పాటు చేయరాదని, జలజీవన్ మిషన్ లో భాగంగా చేపట్టిన పనులను నిర్ణీత కాలంలో వందశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని,శివారు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదని పలువురు సభ్యులు ప్రస్తావించగా స్పందించిన హోం మంత్రి రోడ్ల అభివృద్ధికి సభ్యుల సలహాలు, సూచనలతో సమగ్ర ప్రణాళిక రూపొందిద్దామని పేర్కొన్నారు.ఇప్పటికే దీనిపై కేంద్ర హోం మంత్రి తో చర్చించామని కేంద్ర,రాష్ట్ర నిధుల సహా యం తో గిరిజన ప్రాంతాల్లో రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇక నుంచి డోలీమోత కష్టాలు ఉండ వని హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మైదాన ప్రాంతాల్లో కూడా రోడ్ల మరమ్మతులకు తక్షణ చర్యలు చేపడతామని,తదుపరి శాశ్వత చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా తెలి పారు.ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని రోడ్ల మరమ్మ తులకు రూ.20కోట్లతో పనులు చేసేందుకు చర్య లు తీసుకున్నట్లు ఆమెగుర్తు చేశారు. రోడ్లకు ఇరు వైపులా తుప్పలను తక్షణమే తొలగించాలని ర.భ. శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే వర్షా కాలం కావున కాలువగట్ల పటిష్టతకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉందని సంబంధిత అధికా రులను ఉద్దేశించి పేర్కొన్నారు.జడ్పీ ఛైర్ పర్శన్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ముం దుగా సీఈవోపి.నారాయణమూర్తి అజెండా అం శాలను చదివి వినిపించారు.సభ్యులు పలు అంశా లపై ప్రశ్నలు వేశారు. మధ్యాహ్న భోజనం పథకా న్ని బాగా అమలు చేయాలని,ప్రయివేటు పాఠశా లల్లో తనిఖీలు చేపట్టాలని, పిల్లల భద్రతకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ సకాలం లో విత్తనాలు, ఎరువులు అందించాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాల కు ఏజెన్సీ ప్రాంతంలో భారీగాపంట నష్టం జరి గిందని, పారదర్శకంగా అంచనాలు వేసి పరిహా రం అందించాలని విజ్ఞప్తి చేశారు.రోడ్లకు మరమ్మ తులు చేపట్టాలని విన్నవించారు. ఉపాధి హామీ, కల్వర్టుల నిర్మాణం, తాగు నీటి సౌకర్యం,జలజీవన్ మిషన్ పనులు తదితర అంశాలపై సభ్యలు మాట్లా డారు.
స్టీల్ ప్లాంటుపై ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్పందిస్తాం ః ఎంపీ శ్రీభరత్
సమావేశంలో భాగంగా స్టీల్ ప్లాంటు విషయంలో స్థానిక ఎంపీ పార్లమెంటులో ప్రస్తావించాలని, న్యా యం చేయాలని ఓసభ్యుడు విన్నవించగా విశాఖ పట్టణం ఎంపీ శ్రీభరత్ సానుకూలంగా స్పందిం చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్రం నుంచి సానుకూల పరిణా మాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ నాలుగు నెలల కాలంలో రూ.500కోట్లు ఒక సారి,రూ.1200కోట్లు ఒకసారి మొత్తం రూ.1, 700 కోట్ల నిధులు వేర్వేరు అవసరాల దృష్ట్యా విడుదలయ్యాయని పేర్కొన్నారు. నిధుల విడుదల ను బట్టే స్టీల్ ప్లాంటు విషయంలో కూటమి ప్రభు త్వం దృక్పథం అర్థమవుతుందని ఎంపీ వ్యాఖ్యా నించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే స్థానికంగా స్పందిస్తామని ఎంపీ స్పష్టం చేశారు. కాఫీ,మిరియాలు,జీడితోటలు,ఇతర పండ్ల తోట లకు గ్రామీణ ఉపాధిహామీపథకాన్ని అనుసం ధానం చేసే విధంగా పార్లమెంటులో ప్రస్తావిం చాలని జడ్పీ ఛైర్ పర్శన్ ఎంపీని కోరగా తప్పకుం డా ప్రస్తావిస్తామని ఎంపీ భరత్ పేర్కొన్నారు.
పాఠశాలల్లో, వసతి గృహాల్లో ఆహారం నాణ్యతను పెంచాలి ః ఎంపీ తనూజ రాణి
ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో అందించే ఆహారం నాణ్యతను మరింత పెంచాలని అరుకు ఎంపీ తనూజ రాణి పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలన్నారు. పిల్ల లకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచిం చారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా..పిల్లలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శిథిల భవనా లకు మరమ్మతులు చేయాలని, కొత్తవాటిని నిర్మిం చాలని, గ్రామాల్లో జలజీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని సూచించారు.స్థానిక సమస్యలను పార్ల మెంటులో ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
మార్కెట్ కమిటీ ఆదాయాన్ని ప్రజా అవసరాలకు వెచ్చించాలి ః పెందుర్తి ఎమ్మెల్యే
స్థానికంగా ఉండే మార్కెటింగ్ కమిటీల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక ప్రజా అవసరాల మేరకు వెచ్చించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు అభిప్రాయపడ్డారు. ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయాలపై అధికారులు దృష్టి సారించాలని, సభ్యులకు,ప్రజలకు సహకారం అందించాలని సూచించారు. అలాగే సమావేశానికి వచ్చే సభ్యులు స్థానిక పరిస్థితులపై ముందుగానే అవగాహన కల్పించుకోవాలని,ఏయే అంశాలపై ప్రశ్నలు అడ గాలో సిద్ధమై రావాలని అప్పుడే ఆశించిన ఫలితా లు వస్తాయని పేర్కొన్నారు. అన్ని రకాల శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలు, అంశాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు తోడుగా నిలవాలన్నారు.
షట్రపల్లిలో మోడల్ కాలనీ నిర్మిస్తాం ః ఏఎస్సార్ జిల్లా కలెక్టర్
ఇటీవల కురిసిన వర్షాలకు జీకే వీధి మండలం లోని షట్రపల్లిలో భారీ నష్టం జరిగిం దని, అక్కడి ప్రజలు ఇళ్లు కూడా కోల్పాయరని స్థానిక జడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించగా అల్లూరి సీతారాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సానుకూలంగా స్పందిం చారు. ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించానని, అక్కడి పరిస్థితులను పరిశీలించానని చెప్పారు. షట్రపల్లి గ్రామంలోని 37కుటుంబాలను అనుకూ లమైన ప్రాంతానికి తరలించి వారికి కోసం పీఎం ఆవాస్ యోజన పథకం కింద మోడల్ కాలనీని నిర్మిస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో విశాఖపట్టణం,అరుకు ఎంపీలు శ్రీభరత్, తనూజ రాణి,ఎమ్మెల్సీ దువ్వా రపు రామారావు,పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, దినేష్ కుమార్,విజయ కృష్ణన్,ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు,ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-జిఎన్‌వి సతీష్