గిరిజనం..ఒడుదొడుకుల జీవనం

కొండకోనల్లో ప్రకృతి ఒడిలో జీవనం సాగించే గిరిజనుల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. జీవవైవిధ్య పరిరక్షణలో వారు కీలకంగా నిలుస్తారు. ప్రపంచీకరణ, పర్యావరణ మార్పుల వల్ల ఆదివాసుల జీవితాలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. మౌలిక వసతులు కరవై తీవ్ర వెనకబాటులో వారు కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో యాభై కోట్ల మంది దాకా ఆదివాసులు ఉన్నారు. ప్రపంచ జనాభాలో వారు కేవలం అయిదు శాతం లోపే. కానీ, ఏడు వేల దాకా భాషలు వారు మాట్లాడతారు. అయిదు వేల విభిన్న సంస్కృతులను ఆచరిస్తున్నారు. వారి జీవన విధానం పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, కాలుష్యం తదితరాలు ఆదివాసుల జీవితాలను పోనుపోను సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ప్రపంచీకరణ ప్రభావం వారి సంస్కృతిని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో ఆదివాసుల
సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఏటా అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అనాదిగా ఆదివాసులు తమ హక్కులకు దూరమై సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివాసీ యువత తమ అస్తిత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, తమ పూర్వీకుల భూములపై హక్కులను గుర్తించాలని డిమాండు చేస్తోంది.ఇన్నాళ్లూ తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతూ తమ ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం నినదిస్తోంది. ఈ క్రమంలో స్వీయ నిర్ణయాధికారం కోసం మార్పు ప్రతినిధులుగా ఆదివాసీ యువత అనే నినాదంతో ఈ ఏడాది ఐరాస పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
హక్కులకు దూరం
భూగోళంపై దాదాపు 20శాతం భూభాగంలో ఆదివాసులు నివసిస్తున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా 80శాతం జీవవైవిధ్యం, 40శాతం రక్షిత అటవీ ప్రాంతాలు, పర్యావరణం, సహజ వనరుల పరంగా కీలక ప్రదేశాలు వారు నివసించే చోటే ఉన్నాయి. పుడమి, జీవ వైవిధ్య పరిరక్షణలో ఆదివాసుల పాత్ర కీలకమైంది.
ఆదివాసుల హక్కులకు రక్షణ కావాలి
ఆదివాసుల జీవన విధానం పర్యావరణం,అడవులు,అక్కడ ఉండే సహజ వనరులు మొదలైన వాటితో ముడిపడి ఉంది.కానీ నవీన సమాజం వారి హక్కుల నుండి దూరం చేసే సంక్షోభం నుంచి వీరిని రక్షించాల్సిన అనివార్యత ఎంతైనా ఉంది.కానీ ఆదిమజనుల హక్కులు,వాటి రక్షణే ధ్యేయంగా,ఆదివాసీల హక్కుల రక్షణకు,వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఐక్యరాజ్య సమితి స్థానిక ప్రజలపై కొనసాగుతున్న హింస,దుర్వినియోగం మీద 2006 జూన్ 29న ప్రపంచ మానవ హక్కుల కౌన్సిల్ ఆదివాసీ హక్కుల రక్షణకై ఒక తీర్మాణం జరగాలని సూచించింది.అప్పుడు మానవ హక్కుల కౌన్సిల్,యూఎన్‌ఓలు కలసి ఆదివాసీల హక్కుల రక్షణకు తీర్మానించాయి.ఈ తీర్మాణం ప్రకారం జనరల్ అసెంబ్లీ 2007 సదస్సులో ప్రతి ఏటా సెప్టెంబర్ 13తేదీన ప్రపంచ ఆదివాసీ హక్కుల దినంగా జరుపుకోవాలని ప్రకటించింది.దీనిని వర్కింగ్ గ్రూప్ సమావేశంలో చర్చించి ఆదివాసుల హక్కులు,భాషలు,సంస్కృతి, సాంప్రదాయాలు,ఆదివాసీలు వివక్ష నుండి స్వతంత్రత పొంది శాశ్వతంగా స్వేచ్ఛ పొందడానికి అమలు చేయాల్సిన ముఖ్య అంశాలను వెల్లడిరచింది. ప్రపంచంలోని ఆదివాసీలను విశ్వమానవులుగా గుర్తించనప్పుడు,వారికున్న ప్రత్యేక హక్కులను రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ఈ హక్కుల దినోత్సవం గుర్తించింది.
భూతాపం ప్రభావాన్ని తొలుత ఎదుర్కొంటోంది ఆదివాసులే. పర్యావరణ మార్పుల వల్ల వరదలు, తుపానులు ఆదివాసుల భూములు, ఆవాసాలను దెబ్బతీస్తున్నాయి. కరవులు, ఎడారీకరణ వల్లఅడవులు క్షీణిస్తున్నాయి. కార్చిచ్చులు పచ్చదనాన్ని హరిస్తున్నాయి. ఆదివాసుల ప్రాంతాల్లో ఆయా అభివద్ధి ప్రాజెక్టులతో పాటు మైనింగ్ కార్యకలాపాలూ పెద్దయెత్తున సాగుతున్నాయి. దానివల్ల తరాలుగా జీవనం సాగిస్తున్న మాతృభూమికి వారు దూరం కావాల్సి వస్తోంది. ఇండియాలో 10.47 కోట్ల ఆదివాసీ జనాభా ఉంటుందని అంచనా. భారత్లో 90శాతం ఆదివాసులు అటవీ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. సాగు, వేట, అటవీ ఉత్పత్తులు వారి జీవనాధారం. ఇండియాలో 705 ఆదివాసీ సమూహాలను అధికారికంగా షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించారు. దేశీయంగా గిరిజన గ్రామాలను రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల పెద్దసంఖ్యలో ఆదివాసులు ఉన్న వందల గ్రామాలను అయిదో షెడ్యూల్లో చేర్చకపోవడం వల్ల అసలైన గిరిజనులకు రాజ్యాంగ పరమైన హక్కులు దక్కడంలేదు. నిరక్షరాస్యత, పేదరికం, మౌలిక వసతుల కొరతతో సతమతం అవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఒకటో తరగతిలో నమోదైన పిల్లల్లో 40శాతమే పదో తరగతి దాకావస్తున్నట్లు ఆదివాసుల అభివృద్ధి నివేదిక నిరుడు వెల్లడిర చింది. దేశీయంగా 46శాతం ఆదివాసులు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని గతంలోనే పలు అధ్యయనాలు తెలియజెప్పాయి. సరైన వైద్య వసతుల లేమి కారణంగా ఆదివాసీ ప్రాంతాల్లో నవజాత శిశువుల మరణాలు జాతీయ సగటుతో పోలిస్తే 63శాతం అధికంగా ఉన్నట్లు అధికారిక నివేదికలే తేటతెల్లం చేస్తున్నాయి.
సంక్షేమ చర్యలు
అత్యంత వెనకబడిన ఆదివాసీ తెగలవారు (పీవీటీజీలు) దేశీయంగా 26 లక్షలకు పైగా ఉన్నారు. వీరు కనీస వసతులకు నోచుకోక అత్యంత దుర్భరంగా జీవనం సాగిస్తున్నారు. ఆదివాసుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పలు చట్టాలు చేస్తున్నా, పథకాలు ప్రారంభిస్తున్నా క్షేత్రస్థాయిలో సరైన ఫలితాలు ఉండటం లేదు. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన అటవీ పరిరక్షణ సవరణ బిల్లు తమ హక్కులకు తూట్లు పొడుస్తుందని గిరిజనులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని చోట్ల ఓట్ల కోసం పార్టీలు మైదాన ప్రాంతాల్లో జీవించేవారు, ఇతర వర్గాలను షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చాలని చూస్తున్నాయి. దీనివల్ల మణిపుర్ వంటి చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఆదివాసుల జీవితాల్లో నిజమైన అభివృద్ధి నెలకొంటేనే దేశం ప్రగతి పథంలో పయనిస్తున్నట్లు. పాలకులు ఈ విషయాన్ని గుర్తించి వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు నడుం కట్టాలి. అప్పుడే దేశీయంగా ఆదివాసుల బతుకు చిత్రం మారడానికి మార్గం సుగమమవుతుంది.`ఎం.వేణు
46 రకాల హక్కులను కల్పించి..
ఈ కమిటీ గుర్తించిన ముఖ్యమైన అంశాలు రాజకీయ,సామాజిక, ఆర్థిక సాధికారత,సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, వేదాంత శాస్త్రం, వారసత్వ భూమి హక్కులు, స్థానిక వనరులు, అలాగే అన్ని రకాల వివక్షలు మొదలైన వారి హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని, వాటినిగౌరవిస్తూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందనిసమావేశంలో తీర్మానించిన అంశాలను వెల్లడిరచిన అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ను అనుసరిస్తూఅంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఈ డిక్లరేషన్లో మొత్తం 46ప్రకరణలు పొందు పరిచారు.ఈ 46 ప్రకరణలలోఆదివాసీలు ప్రపంచ మానవ హక్కుల చట్టం ప్రకారం, ఆదివా సీలు స్వేచ్చగా మానవహక్కులు,ప్రాథమిక హక్కులు పొందాలి. ఇందులో ఎలాంటి వివక్ష చూపించొద్దని, అలాగే ఆదివాసీలు సంకల్పంతో వారి ఇష్ట ప్రకారం రాజకీయ,ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చెందొచ్చు. వీరు స్వయం ప్రతిపత్తి, స్వయంపాలనను స్థానిక అంశాలతో నిర్వహించుకోవచ్చువనరులను సైతం ఇష్టరీతిలో వినియోగించుకోవచ్చు. వారి చట్టాలను బలోపేతం చేసుకోవచ్చు. ఆదివాసీ 2 దేశంలో నివసిస్తున్నప్పటికీ ఆదేశ పౌరసత్వం పొందే హక్కు కల్పించారు. వారి హక్కులపై, సంస్కృతిపై, సంప్రదాయాలపై, భూములపై దోపిడీ జరగకుండా బాధ్యతాయుతమైన యంత్రాంగాన్ని ఆయా రాష్ట్రాలే కల్పించాలి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మన ఆదివాసీ సమాజాలకు ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం గురించి తెలిసినంతగా ఆదివాసీ హక్కుల దినం గురించి తెలియక పోవడానికి కారణం నేటి ప్రభుత్వాల అలసత్వం. ఐక్యరాజ్య సమితి సూచన మేరకు దేశమంతటా ఆదివాసీల హక్కులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. వీటి గురించి వివరించేందుకు ఆధార్ సొసైటీ, ఏ ఈ డబ్ల్యూ సి ఏ,ఆదివాసీ సమన్వయ మంచ్ సంయుక్తంగా భద్రాచలంలో జాతీయ సదస్సు నిర్వహిస్తుంది.-జి.ఎన్.వి.సతీష్