గమ్యం తెలియని బాలల ప్రయాణం
బంగారు భవిష్యత్తుకు పునాదిపడేది బాల్య దశ. ఇలాంటి కీలకదశలో బాలలు చదువు,ఆటలకు దూరమై శ్రామికులుగా మారడాన్ని బాలకార్మికులంటారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ఒకటి. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతిబిడ్డ జన్మహక్కు. అయితే కుటుంబాల సామాజిక,ఆర్థికపరిస్థితులు కారణంగా అత్యధికబాలలు వ్యవసాయ రంగం లో…మిగతావారు ఇళ్లలో,హౌటళ్లలో,కర్మాగారాల్లో,దుకాణాల్లో పనిచేస్తున్నారు. వీరంతా కూడా అధిక పనిగంటలు తక్కువ వేతనంతో శ్రమదోపిడీకి గురవడంతోపాటు అక్రమ రవాణా, వేశ్యావత్తి, డ్రగ్ మాఫియాకి బలవుతు న్నారు. ఫలితంగా వారి భవిష్యత్ అంధకారంగా మారింది. ..`
కరోనాతో బాలకార్మికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చాటు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవ స్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకురా వడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం ‘’బాల కార్మిక వ్యవస్థ ముగింపునకు ఇప్పుడే చర్యలు’’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈదినోత్సవం ప్రధానంగా ఐరాస 2021 సంవ త్సరాన్ని ‘’అంతర్జాతీయ బాల కార్మిక నిర్మూలన సంవత్సరం’’గా ప్రకటించిన నేపథ్యంలో తీసుకో వాల్సిన చర్యలపై దృష్టి సారించనుంది. గతేడాది బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశంలో ప్రపంచదేశాలు సార్వ త్రిక ఆమోదం తెలిపాయి. కరోనా విసిరిన సవాళ్ళ అనంతరం ఇది మొదటి ప్రపంచ దినం. ఇప్పటికే 2025 నాటికి బాలకార్మిక వ్యవస్థకు ముగింపు పలకాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో (లక్ష్యం8.7) నిర్దేశించుకోవడం జరిగింది. ఈ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ బాల కార్మికుల లెక్కిం పునకు సంబంధించిన నూతన అంచనాలు, పోకడ లను విడుదల చేయనుంది. ఇందులో అందరిని భాగస్వామ్యం చేయడానికి వారంపాటు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా గత ఏప్రిల్ మాసంలో అయాప్రాంతాలు, దేశాలు, సంస్థ వాటాదారులు, వ్యక్తులు ఆన్లైన్లో నిక్షిప్తం చేసిన ‘’2021కార్యాచరణ ప్రతిజ్ఞల’’ పురోగతిని ప్రదర్శిం చడం జరుగుతుంది.ఈఏడాది పొడవునా తీసు కున్న చర్యలు, తదుపరి 2022లో బాల కార్మికులపై సౌత్ ఆఫ్రికాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి మైలురాయిగా నిలువనున్నాయి.
కరోనాతో పెరిగిన బాలకార్మికులు…
అనేక రూపాల్లో కొనసాగుతున్న బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. కుటుంబ ఆర్థిక పరిస్థితికి,బాలల జీవనానికి అవినాభావ సంబంధం ఉంది. దీంతో వారు చదువుకోవాల్సిన వయసులో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు నిరక్షరా స్యత,ఉపాధి నిమిత్తం కుటుంబ వలసలు,జనాభా పెరుగుదల,ప్రపంచీకరణ తదితరకారణాలు కూడా బాలకార్మిక వ్యవస్థకు ఆజ్యం పోస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరన్నర కాలంగా కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో కుటుంబ ఆదా యం పడిపోయి, సామాజిక జీవనం దెబ్బతిన్నది. దీని ప్రభావంపిల్లలపై పడిరది. దీంతో వారు విద్య,వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరమ య్యారు. బడులు మూతపడడం, ఆన్లైన్ చదువు లతో మెజారిటిపిల్లలు విద్యను పొందలేక పోయా రు. ఫలితంగా బాల్య వివాహాలు,బాలకార్మిక వ్యవస్థలాంటి దుర్లక్షణాలు పెరిగాయని అనేక అధ్య యనాలు చాటుతున్నాయి. గతేడాది ‘’కోవిడ్-19, బాలకార్మిక వ్యవస్థ’’ పై అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్ అధ్యయనం బాలకార్మిక వ్యవస్థ పై గత ఇరవై సంవత్సరాల కాలంలో సాధించిన పురోగతి వెనక్కి నెట్టబడిరదని తెలిపింది. ఈ సంక్షో భం కన్నా ముందుతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర పేదరికంలోకి జారుకున్న వారి సంఖ్య 4నుంచి 6 కోట్లు పెరిగిందని,ఒక శాతం పేదరికం పెరి గితే 0.7శాతం బాలకార్మికులు పెరుగుతారని పేర్కొన్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15.2కోట్ల మంది బాల కార్మికులు ఉండగా…అందులో 7.2 పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో నిమగమయ్యారు. అధికంగా బాలకార్మికులున్నా భారతదేశంలో కరోనా అనంతరం వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండే షన్ సర్వే పేర్కొన్నది. పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందని, కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యేప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు…
దేశ సంపద అయిన బాలలు బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవు తుంది. సంఘ విద్రోహ కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి బాలలకు తగిన విద్యా భ్యాసం,శిక్షణ అందించి విలువైన మానవ వనరులు గా తీర్చిదిద్దాలి. కార్మికులుగా పనిచేస్తున్న బాలల పూర్తివివరాలు సేకరించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా భాగస్వామ్యం కా వాలి. బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాలి. బడిబయట ఉన్న విద్యార్థులపై సమగ్ర సర్వే నిర్వహించి పాఠశాలలో నమోదు చేయాలి. వ్యవ సాయ సంస్కరణలు,ఉపాధికల్పన పథకాలు, సాం కతిక నైపుణ్యాలు పెంపొందించటం,అవ్యవస్థీ కత రంగాలను ప్రోత్సహించటం, సహకారసంఘాల ఏర్పాటు,సాంఘిక భద్రతా పథకాల రూపకల్ప న వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూ లనకు దోహదపడతాయి. ప్రభుత్వాలు వీటిపై ప్రత్యే కంగా దృష్టిసారించాలి. అందుకు దీర్ఘకాల కషి, బహుముఖ వ్యూహం అవసరం. భారతదేశంలో కరోనా మహమ్మారితో చాలా మంది బాలలు అనాధలయ్యారు. వీరి సంరక్షణకై క్షేత్రస్థాయి చర్యలు చేపట్టాలి. విద్యఅంతరాలను తొలగించడానికి డిజి టల్ సాధనాలు అందించాలి. నేటి కోవిడ్ విపత్కర పరిస్థితులో బాలల హక్కులు సంక్షోభాన్ని ఎదుర్కో వడానికి ప్రపంచదేశాలు సమన్వయం కోసం యూనిసెఫ్ ఎజెండా రూపొందించింది. ఇందులో బాలల ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారం అందివ్వాలని, తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. పిల్లల విద్యను కొనసాగిస్తూ,వారి సంరక్షణ కోసం కుటుం బాలకు సామాజిక మద్దతు ఇవ్వాలి. బాలలను హింస,దోపిడి,దుర్వినియోగం నుంచి రక్షించాలి. అంతర్యుద్ధాలు,హింస సంఘటనలతో వలస వచ్చిన,శరణార్థులుపిల్లలను రక్షించాలి. ఈ చర్యలు బాల కార్మిక వ్యవస్థకు చమరగీతం పాడి, వారి వికాసానికి దోహద పడతాయి.– డాక్టర్ పెంట కృష్ణ