క్షీణిస్తున్న వలస కార్మికుల హక్కులు

అత్యధిక మంది వలస కార్మికులు వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణ రంగాలలో కనిపిస్తారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 10 శాతం వలస కార్మికుల శ్రమ నుండే వస్తోంది. అయితే,వలస కార్మికులు ఎంత మంది వున్నారు?వారు ఏ రంగంలో పని చేస్తున్నారు? ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నారు? తెలుసు కునే వ్యవస్థ లేదు. పర్మినెంట్‌ వర్కర్ల కంటే ఏడు రెట్లు అధికంగా వలస కార్మికులు వున్నట్లు జాతీయ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దుర్బలమైన, ప్రమాదకరమైన, ఎటువంటి భద్రత లేని పరిస్థితులు ఈ రంగంలో నెలకొన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 45 కోట్ల 60 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో 41 శాతం మంది తమంతట తాముగా వలస కార్మికులుగా మారలేదు. తమ ప్రాంతాలలో నెలకొన్న నిరుద్యోగం వలస వెళ్ళాల్సిన పరిస్థితికి నెట్టింది. వీరి జనాభా లెక్కలు సరిగా వుండవు. వాటి మీద ఆధార పడలేం. ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ 2013లో దేశంలో అంతర్గతంగా తిరిగే వలస కార్మికులు కోటిన్నర నుండి 10 కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఏరకంగా చూసినా భారతదేశంలో వలస కార్మికులు అసంఘటిత రంగంలో అత్యధికంగా ఉన్నట్లు తేలుతుంది. అందుకని వీరి పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా పేదరికం,దుర్బలత,అభద్రత, ఉద్యోగంలో పెట్టుకునే పద్ధతికి…ఈ కార్మి కుల సామాజిక స్థాయికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోవాలి.ఈ కార ణంగా వీరు ప్రమాదకరమైన,అతి తక్కువ వేతనాలున్న పనులను చేయాల్సి వస్తోంది. కుల,లింగ వివక్షలను ఎదుర్కొం టున్నారు. కీలక రంగాలైన వ్యవసాయం,పరిశ్రమలు, నిర్మాణ రంగాల కార్యకలా పాలు వీరు లేనిదే నడవవు. కానీ వీరి కనీసభద్రత, న్యాయమైన వేతనాలను పట్టించుకునే దిక్కులేదు. వలస కార్మికులకు వర్తించే ప్రస్తుత చట్టాలు లేబర్‌ కోడ్లలో భాగం కాను న్నాయి. లేబర్‌ కోడ్‌లు అమలులోకి వచ్చే లోపు ‘అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల (పని మరియు సర్వీసు కండిషన్ల క్రమబద్ధీకరణ) చట్టం-1996, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం-2008 అమలులో వుంటాయి.కోవిడ్‌ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న విషాదకర పరిస్థితులను, ఆరోగ్య-సామాజిక భద్రతా వైఫల్యాలను గమనించిన అత్యున్నత న్యాయస్థానం తనంత తానుగా వీరితరపున కేసు తీసుకొని అనేక నిర్ధారణలకు వచ్చింది. అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌కు ‘ఈ-శ్రమ’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. 2021 డిసెంబర్‌ ఆఖరు లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు/వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ‘ఈ-శ్రమ’ రిజిస్ట్రేషన్‌కు కార్మికుల నుండి స్పందన చాలా పరిమితంగా వుంది. అందులో వారికి ఎలాంటి ప్రయెజనం కనపడకపోవడం అందుకు కారణం. పైగా ‘ఈ-శ్రమ’ నెట్‌ సౌకర్యంతో కూడుకున్నది కావడంతో కార్మికులు దీనిలో తమంత తాముగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. ఇప్పటికే నిర్మాణ (సెస్సు-సంక్షేమ పథకాలు), వ్యవసాయ రంగాలలో (రైతు బంధు పథకం) పరిమితమైన ఇతర పథకాలు ఉన్నాయి. 140 రకాల వృత్తులలో కార్మికులు పనిచేస్తున్నట్లుగా గుర్తించామని మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ తాము ఏ రకమైన సామాజిక భద్రతను ప్రవేశపెట్టేదీ ఇంత వరకు నిర్ణయించలేదు. ‘ఈ-శ్రమ’ లో రిజిస్ట్రేషన్‌కు ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ ఉన్న వారు అర్హులు కారు. సంఘటిత రంగంలో పని చేసే లక్షలాది మంది కాంట్రాక్టు వర్కర్లు, చిన్న మధ్యతరహా సంస్థల్లో పని చేసే కార్మికులకు ఈ రెండూ ఇప్పటికే ఉంటాయి. కాబట్టి వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. వలస కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ‘వలస కార్మికుల చట్టం-1979’ రద్దును ప్రకటించింది. దీనికి బదులుగా వచ్చేటటువంటి కోడ్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల కష్టాలను పెంచుతుంది. 1979 చట్టం యజమానులకు, కాంట్రాక్టర్లకు, సబ్‌ కాంట్రాక్టర్లకు నిర్ద్ఱేశిత ఆదేశాలు ఇచ్చింది. కాంట్రాక్టు కార్మికులను పెట్టుకోవాలంటే ముందుగా వీరు రిజిస్టరై ఉండాలి. ప్రతి వలస కార్మికుని సమాచారాన్ని, వారికి చెల్లించే వేతనాల వివరాల నమోదును స్పష్టీకరించింది. ఇవన్నీ ఇప్పుడు కోడ్‌లో లేవు. ఇటీవల అగ్ని ప్రమాదాలలో కార్మికులు చనిపోయినప్పుడు వారి గుర్తింపుకు వ్యక్తిగత రికార్డులు లేకపో వటం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. వారు పలానా వారు అని గుర్తించటానికి వంశీకుల డిఎన్‌ఎ లను పరీక్షించాల్సి వచ్చింది. యజమానులు తమ దగ్గర ఉన్న వలస కార్మికుల నియామకం,నమోదు,రవాణా, నివా సం,కనీస వేతనం, కాలనుగుణ వేతనాలు తదితర సమాచారాన్ని తప్పకుండా నిర్వహిం చాలని 1979 చట్టం నిర్దేశించింది.వేతనాల చెల్లింపు, ఆరోగ్య సౌకర్యాల కల్పన, పని ప్రదే శంలో రక్షణ కల్పించే డ్రస్సులు, మంచినీటి సౌకర్యం, క్యాంటిన్‌, మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల ఏర్పాటు, ప్రయాణ ఖర్చులను గ్యారంటీ చెయ్యటానికి-అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా లైసెన్సింగ్‌ అధికారి తీసుకుంటారు. కాంట్రాక్టర్లుగానీ, ముఖ్య యజమాని గానీ వేతనాలు చెల్లించక పోతే ఈ నిధి నుండి చెల్లిస్తారు.ఈ హామీలను లేబర్‌ కోడ్‌లో ఉపసంహరించారు.1979 చట్టంలో ఇంకొక ముఖ్యమైన నిబంధన ప్రకారం వలస కార్మికులు పారిశ్రామిక వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని…తాము పనిచేసే ప్రాంతాలు, స్వస్థలాలు రెంటిలోనూ వినియో గించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా వలస కార్మికులకు వర్తించే ఇటువంటి 4చట్టా లను కూడా కోడ్‌ ఒక్క కలం పోటుతో స్వాహా చేసింది. వీధి వ్యాపారులతో సహా అందరికీ సామాజిక భద్రత కల్పించబడు తుందని కేంద్ర కార్మిక మంత్రి ప్రకటిం చారు. ఇంత వరకు దానికి సంబంధించిన ఎటువంటి పథకం తయారు కాలేదు. కానీ వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ పరిమితి 5 నెలల నుండి 10నెలల వరకు పొడిగించారు. రిజిస్ట్రేషన్‌ వలన వలస కార్మికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పెద్ద సంఖ్యలో వలస కార్మికుల హక్కులు నిరాకరించ బడ్డాయి. అంతకు ముందున్న అనేక సౌకర్యా లను వలస కార్మికులు కోల్పోతారు.
కార్మికుల చట్టాలు ఇవీ…

 1. పనిగంటలు ఎనిమిదికి తగ్గింపు
 2. లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం
 3. వేతన చెల్లింపు చట్టం
 4. కనీస వేతనాల చట్టం
 5. ఉద్యోగుల వేతన సవరణ చట్టం
 6. భారత కర్మాగారాల చట్టం
 7. భారత కార్మిక సంఘ చట్టం
 8. కార్మికుల పరిహార చట్టం
 9. కార్మికుల రక్షణ చట్టం
 10. ప్రసూతి ప్రయోజనాల చట్టం
 11. కార్మిక రాజ్య బీమా(ఈఎస్‌ఐ) చట్టం
 12. మహిళలు,బాల కార్మికుల రక్షణ చట్టం
 13. బొగ్గు గనుల కార్మికుల భవిష్య నిధి, బోనస్‌ చట్టం
 14. మహిళా కార్మికుల సంక్షేమ నిధి
 15. బొగ్గు గనుల్లో భూగర్భ పనుల్లో మహిళల నియామకంపై నిషేధం పునరుద్ధరణ
 16. వేతనంతో కూడిన సెలవులు
 17. సామాజిక భద్రత
  పనిగంటలు ఎందుకు తగ్గించారంటే…
  పనిగంటలను 12 నుంచి ఎనిమిదికి తగ్గించాలని 1942 నవంబరు 27న దిల్లీలో తన అధ్యక్షతన నిర్వహించిన నాలుగో భారత కార్మిక సదస్సులో అంబేడ్కర్‌ తొలిసారిగా ప్రతిపాదించారు.1945 నవంబరు 27,28 తేదీల్లో జరిగిన ఏడో సదస్సు కర్మారాగాల్లో వారానికి 48 గంటల పని విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సదస్సు లో కేంద్ర, ప్రావిన్షియల్‌ ప్రభుత్వాలు, యాజ మాన్య సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధిక పనిగంటలతో కార్మికుడికి తగినంత వ్యక్తిగత సమయం లేకుండా చేయడం సరికాదని కార్మిక శాఖ తన మెమోరాండంలో చెప్పింది. వ్యక్తిగత ఎదుగుదలకు, శారీరక సామర్థ్యం పెంపునకు కార్మికులకు వ్యక్తిగత సమయం అవసరమని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కార్మికులు తీవ్రమైన పని ఒత్తిడికి లోనయ్యారని, వారికి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉందని, పనిగంటల తగ్గింపునకు ఇది సరైన సమయమని ఆ సందర్భంగా వివరించింది. తక్కువ పనిగం టలతో ఉపాధి పెరుగుతుందని కూడా చెప్పింది. పనిగంటల తగ్గింపునకు అను గుణంగా వేతనాల తగ్గింపునకు, డీఏ తగ్గింపు నకు(ధరలు పడిపోతే తప్ప) వీల్లేదని మెమో రాండం స్పష్టం చేసింది. పనిగంటలు, సామాజిక భద్రత ఇప్పుడెలా ఉన్నాయి? పనిగంటలు, కార్మికుల సంక్షేమం ఇప్పుడెలా ఉన్నాయనేదానిపై ‘ఫోరమ్‌ ఆఫ్‌ ఐటీ ప్రొఫెష నల్స్‌(ఫర్‌ఐటీ)’ అధ్యక్షుడు కిరణ్‌ చంద్రను సంప్రదించగా- నేటి తరం పరిశ్రమలతో ‘ఎని మిది గంటల పని, ఎనిమిది గంటల నిద్ర, ఎనిమిది గంటల సామాజిక జీవనం’ అనే విధానం గందరగోళంలో పడిపోయిందని విచారం వ్యక్తంచేశారు. ఇప్పడు ఉద్యోగుల్లో అత్యధికులకు పని ప్రదేశానికి వెళ్లి వచ్చేందుకే కనీసం నాలుగు గంటలు పడుతోందని, ఇలా పనిగంటలు 12కు పెరిగాయని చెప్పారు.
  ‘వెట్టిచాకిరీగా మారింది’
  గృహవసతి,ఆరోగ్యం, విద్య విషయాల్లో సామాజిక భద్రత కొరవడటంతో ఉద్యోగమనేది వెట్టిచాకిరీగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.ఐటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఆధ్వర్యంలో రెండేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలితాలిస్తోందని, పరిస్థితిలో మార్పు వస్తోందని కిరణ్‌ ఆశా భావం వ్యక్తంచేశారు. నేటి తరం కార్మిక వర్గం సంఘటితమవుతోందని, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తోందని తెలిపారు.
  కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయుడు అంబేడ్కరే
  విధాన స్థాయిలోనే కాకుండా రాజకీయ స్థాయిలోనూ అంబేడ్కర్‌ కార్మిక సంక్షేమానికి కృషి చేశారు. కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయ నాయకుడు ఆయనే.1936 ఆగస్టులో అంబేడ్కర్‌ ‘ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ(ఐఎల్‌పీ)’ని స్థాపించారు. తమది కార్మి కుల పార్టీ అని ఐఎల్‌పీ ప్రకటించుకొంది. కార్మిక వర్గాల సంక్షేమమే పరమావధిగా కలిగిన కార్మిక సంస్థగా ఐఎల్‌పీ 1937లో వెలువరించిన విధానపత్రంలో తనను తాను అభివర్ణించుకొంది. 1937లో జరిగిన ప్రావిన్సి యల్‌ ఎన్నికల్లో ఐఎల్‌పీ 17స్థానాల్లో పోటీచేసి,14 చోట్ల విజయం సాధించింది. పోటీచేసిన 13 రిజర్వుడు స్థానాల్లో 11చోట్ల, పోటీచేసిన నాలుగు జనరల్‌ సీట్లలో మూడు చోట్ల గెలిచింది.
  కోణార్క్‌ ఎక్స్‌ ప్రెస్‌
  ‘‘బతుకు తెరువు కోసం తమిళనాడు, కేరళ, కర్ణాటక,ఒడిశా,గుజరాత్‌,మహారాష్ట్ర వంటి చోట్లకు వెళ్తాం.నేనే కాదు,మా ఊళ్లో చాలా మందిమి వెళతాం.ఇంకే చేయాలి? ఇక్కడ చేపల పట్టే వసతుల్లేవు. ఇక్కడుంటే బతకలేం. మేం వలస వెళ్లాల్సిందే’’ అని శ్రీకాకుళం జిల్లా వాసి చెప్పారు. మత్స్యకారులే కాదు,చాలా కులాల వారు ఇలా వలస వెళ్తుంటారు. 2021-22 ప్రభుత్వ లెక్కల ప్రకారం వ్యవసాయం, పరిశ్రమలు, రెండిరటిలోనూ శ్రీకాకుళం, విజయనగరం బాగా వెనుకబడి ఉన్నాయి. ఈ రెండు జిల్లాలనూ ఆర్థికంగా వెనుకబడ్డ జిల్లాలుగా నీతి ఆయోగ్‌ గుర్తిం చింది.కానీ,ఈ జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులు కేంద్ర రాష్ట్ర రాజకీయాల మధ్య ఇరుక్కుపోయాయి. బతుకుదెరువు కోసం మన దేశ, విదేశాలకు వెళ్లిపోతున్న శ్రీకాకుళం జిల్లా లోని లొడ్డపుట్టి గ్రామస్తులను కలవడానికి వెళ్లాము. తమ గ్రామస్తులు ప్రపంచంలోని ప్రతిదేశంలోనూ ఉన్నారని చెప్పారు. విదేశాలకు వలసవెళ్లి అక్కడ పనులు చేస్తున్న కొంత మందితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడిర చారు. ఇక్కడి వారు భవన నిర్మాణంలో నైపు ణ్యం కలిగిన వాళ్ళు. మన దేశంలో కన్నా ఇతరదేశాలలో తమ పనికి ఆదాయం మెరుగ్గా ఉండటంతో వీరంతా తమ కుటుంబానికి దూరంగా విదేశాలకు వెళ్లి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.33 ఏళ్ల శేఖర్‌ సింగ పూర్‌,దుబాయ్‌,అజర్‌ బైజాన్‌,రష్యా దేశాల్లో వెల్డర్‌గా పనిచేసి తిరిగొచ్చి సొంతూరిలో ఇల్లు కట్టుకున్నారు. (అమితవ్‌ గుహ)- వ్యాసకర్త : ఆలిండియా సిఐటియు సెక్రటరీ