కోవిడ్ వల్ల అనాథలైన పిల్లలు అర కోటి
కోవిడ్ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది చిన్నారులు అనాథలైనట్లు లాన్సెంట్ చైల్డ్ అండ్ అడోలసెంట్ హెల్త్‌లో ప్రచురించిన కొత్త మోడలింగ్ అధ్యయనం చెబుతోంది. 20 దేశాల చిన్నారులపై చేసిన ఈ అధ్యయనంలో జర్మనీ నుంచి 2,400 మంది ఉంటే భారత్ నుంచి 19 లక్షల మంది చిన్నారులు ఉన్నట్లు తేలింది. అత్యంత ప్రమాదకర పరిస్థితి దక్షిణాఫ్రికా పెరూలో కనిపించింది. అక్కడ ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో 8 లేక ఏడుగురు అనాథలుగా మిగిలిపోయారు. 0-4 సంవత్సరాల మధ్య వయసు వారు ఐదు లక్షల మంది, 5-9 సంవత్సరాల మధ్య వాళ్లు 7.4 లక్షల మంది కోవిడ్ కారణంగా అనాథలుగా మారిపోయారు. 10-17 సంవత్సరాల పిల్లల్లో 21 లక్షల మంది ఈ మహమ్మారి వల్ల ఒంటరివారయ్యారు.
ప్రతి ముగ్గురులో ఇద్దరు కోవిడ్ వల్ల తల్లి లేక తండ్రిని కోల్పోయారు. సంతానోత్పత్తి, అదనపు మరణాలను పరిగణనలోకి తీసుకుని చేసిన ఈ సర్వే అధ్యయనం ప్రకారం… 52 లక్షల మంది చిన్నారులు 2020 మార్చి 1 నుంచి 2021 అక్టోబరు 31 మధ్యకాలంలో కోవిడ్ ప్రభావంగా సంరక్షకులను కోల్పోయి అనాథ లుగా మిగిలారు. మొదటి 14 నెలల కాలంలో జరిగిన మరణాలతో పోలిస్తే 2021 మే 1 నుంచి అక్టోబరు 31 మధ్య ఆరు నెలల్లో సంరక్షకుల మరణాల సంఖ్య రెట్టింపైందని సర్వేలో తేలింది. యు.ఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూనివర్శిటీ ఆఫ్ కేప్‌టౌన్, వరల్డ్ హెల్త్ ఆర్గనై జేషన్, ఇతర పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. కోవిడ్ వల్ల జరిగిన మరణాల్లో పురుషుల సంఖ్య అధికంగా ఉందని గణాం కాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కలనుబట్టి తండ్రులను కోల్పోయిన చిన్నారుల సంఖ్య అధికంగా ఉంది. మన దేశంలో ఈ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కోల్పోయిన పిల్లల సంఖ్య 19.17 లక్షలని తేలింది. 10-17 మధ్య వయసు పిల్లల్లో 49 శాతం మంది తండ్రులను కోల్పోయారు. 15 శాతం మంది తల్లులను కోల్పోయారు. వాస్తవానికి 2021 జులైన సంరక్షకులను కోల్పోయిన చిన్నారుల వివరాలతో మొదటి సర్వే విడుదలైంది. దానిప్రకారం 15 లక్షల మంది చిన్నారులు 2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్ మధ్యకాలంలో అనాథలైనట్లు వెల్లడైంది. అయితే న్యూ మోడలింగ్ చేసిన అధ్యయనంలో ఆ సంఖ్యను పున:పరిశీలించి (కోవిడ్ ప్రభావిత మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుని) 27 లక్షలుగా తేల్చారు (మొదటి సర్వేలో 2021 జులైలో 15,62,000 ఉంటే తాజా సర్వేలో 27,37,300). తాజా ప్రపంచ నివేదికతో కోవిడ్, కోవిడ్ కారక మరణాలు మరోసారి పెరిగే అవకాశముందని అధ్యయన కర్తలు వెల్లడిస్తున్నారు. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఆఫ్రికా దేశాల్లో కోవిడ్ మరణాల నివేదికలు కచ్చితంగా ఉన్నాయని భావించింది. కాని వాస్తవ అంచనాలు ప్రస్తుతం నివేదించిన సంఖ్యకు మించి 10 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ గణాంకాలే కోవిడ్ ప్రభావంగా సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను కూడా తక్కువ సంఖ్యలో అంచనా వేశాయి.
తాజా సర్వే అక్టోబరు 2021 నాటి అంచనాలను బట్టే ఉంది. ఆ తరువాత కూడా మనదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కోవిడ్ విజృంభించింది. కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒక అంచనా ప్రకారం జనవరి 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా అనాథలైన పిల్లల సంఖ్య 67 లక్షలకు చేరుకుందని భావిస్తున్నారు.ఈ అధ్యయనంలో తేలిన మరో బాధాకరమైన విషయమేమంటే హెచ్ఐవి/ఎయిడ్స్ బారినపడి సంరక్షకులు, తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలు పదేళ్లలో 50 లక్షల మంది ఉంటే కోవిడ్ ప్రభావంగా కేవలం రెండేళ్లలోనే అంతమంది పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఖ్యలు ఒమిక్రాన్ విజృంభించక ముందు నాటివి.
అనాథలైన ఈ పిల్లల సంరక్షణను జాతీయ కోవిడ్ ప్రతిస్పందన ప్రణాళికలో చేర్చాలి. ముఖ్యంగా వ్యాక్సిన్ వేయడం, నియంత్రణ, చికిత్సలపై దృష్టి పెట్టాలి. సంరక్షకుల మరణాలను నివారించాలి. బాధిత పిల్లలకు మద్దతుగా ఆయా కుటుంబాలను సిద్ధపరచాలి. పేదరికం, ప్రతికూలత, హింస వంటి ప్రమాదాల బారిన పడకుండా పిల్లలను రక్షించాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు దిక్కుతోచకుండా మిగిలిపోయారు. అనాధలై, సహారా కోల్పోయిన చిన్నారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.కరోనా మహమ్మారి (జశీతీశీఅa ూaఅసవఎఱష) కారణంగా అనాధలైన పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా పిల్లల చదువుకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. 2020-21లో కోవిడ్ కారణంగా 6 వేల 8 వందలమంది చిన్నారులు తల్లి లేదా తండ్రిని లేదా ఇద్దరినీ కోల్పోయారు. అనాధలైన చిన్నారులు ఎక్కైతే చదువుతున్నారో అక్కడే కొనసాగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల చదువుకు ఇబ్బంది కలిగితే ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం కింద అక్కడే చదువు చెప్పించనుంది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన 6 వేల8 వందల మంది చిన్నారుల్లో 4 వేల 333మంది పిల్లల పూర్తి వివరాల్ని అధికారులు సేకరించారు. వీరిలో 1659 మంది ప్రభుత్వ పాఠశా లల్లోనూ,2 వేల150 మంది ప్రైవేటు విద్యా సంస్ధల్లోనూ చదువుతున్నారు. మరో 524 మంది శిశువులున్నారు. మరోవైపు ఈ నెల 16 నుంచి స్కూల్స్ ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారుల(ూతీజూష్ట్రaఅ జష్ట్రఱశ్రీసతీవఅ)వివరాల్ని ఆయా విద్యాసంస్థలు ప్రభుత్వ ఛైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాల్సి ఉం టుంది. పిల్లలు ఏ పాఠశాలల్లో చదువుతుంటే అక్కడే కొనసాగించాలి. ఫీజు చెల్లించలేదనే కారణంతో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్ధుల్ని తొలగించకూడదు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లల చదువును నిరాటంకంగా కొనసాగించేలా చూడాలి. జగనన్న విద్యాకానుక కింద మూడు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, షూ, సాక్స్, బెల్ట్, డిక్షనరీల్ని మొదటి ప్రాధాన్యతగా అందించాలి. ఇదే విషయమై ఇప్పటికే పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేలా చూడాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు (Aజూ Gశీఙవతీఅఎవఅ్) మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ బాలల హక్కుల సంరక్ష కమీషన్ కూడా ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసింది.
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న వారి పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం పవ్రేశ పెట్టింది. మహమ్మారి వల్ల అనాథలైన పిల్లల్ని ఆదుకోవడం కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది. వారి భవిష్యత్ అంతా అగమ్యగో చరంగా మారింది. ఈ సమ యంలో కేంద్ర ప్రభుత్వం మహమ్మారి వల్ల అనాథలైన పిల్లల్ని ఆదుకోవడం కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. మే 29, 2021న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను లాంచ్ చేశారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ స్కీమ్‌ను మహిళల,శిశు అభివృద్ధి మంత్రి త్వ శాఖ నిర్వహిస్తోంది.ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా వారి సంక్షేమానికి పాటుపడటం, విద్యాబోధన ద్వారా సాధికారత కల్పించడం,23 సంవత్సరాలు వచ్చే నాటికి ఆర్థికంగా స్వావలంబన వచ్చేలా వారిని తీర్చిదిద్దడం తద్వారా వారికి సంక్షేమానికి పాటుపడటం. ఈ పిల్లలకు18ఏళ్ల వయసు నుంచి నెలసరి స్టయిఫండ్‌ను అందించడంతో పాటు 23 ఏళ్ల వయసు వచ్చే సరికి దాదాపు రూ.10 లక్షల మొత్తాన్ని అందించడం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ కింద అర్హులైన వారు ఎవరు..?కరోనా కారణంగా తల్లిదం డ్రులను ఇద్దరిని కోల్పోవడం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా చట్టబద్ధమైన సంరక్షకు లను, దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు. ఈ పథకం కింద ప్రయోజనం పొందా లంటే.. తల్లిదండ్రులు మరణించే నాటికి పిల్లల వయసు 18ఏళ్లు పూర్తి కాకుండాఉండాలి. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేర్ సెంట్రల్స్ నడుస్తున్నాయి. ఆయా రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
లభించే ప్రయోజనాలు..
ౌ 18 ఏళ్లు నిండినప్పటి నుంచి నెలసరి స్టయిఫండ్, 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షల ఫండ్
ౌ కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య
ౌ ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్, పీఎం కేర్స్ నుంచి రుణాలకు వడ్డీ చెల్లింపు
ౌ ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ప్రీమియాన్ని కూడా పీఎం కేర్స్ ద్వారానే చెల్లింపు
ౌ ఉచిత భోజన, వసతి ప్రయోజనాలు
ౌ ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం, పాఠశాల విద్యకు ముందస్తు సాయం, వ్యాధి నిరోధక కార్యక్రమాలకు, ఆరోగ్య రక్షణకు, ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అంగన్వాడీల ద్వారా సపోర్టు
ౌ పదేళ్ల లోపు పిల్లలకు సమీపంలోని పాఠశాలలో ప్రవేశం, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల, కేంద్రీయ విద్యాయాలు, ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశానికి వీలు కల్పించడం
ౌ సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందివ్వడం
ౌ ప్రైవేట్ పాఠశాలలో చేరే పిల్లలకు విద్యా హక్కు చట్టంలోని 12(1)(సీ) సెక్షన్ కింద వారికి బోధనా రుసం చెల్లింపుల నుంచి మినహాయింపులు కల్పించడం
ౌ 11 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు తమ కుటుంబీకుల సంరక్షణలో జీవిస్తే.. వారికి ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల, కేంద్రీయ విద్యాయాలు, ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశం కల్పిం చేందుకు జిల్లా మెజిస్ట్రేట్ చర్యలు తీసుకుంటారు.
ౌ ఉన్నత విద్య కోసం దేశంలోని ప్రొఫెషనల్ కోర్సులు లేదా ఇతర ఉన్నత విద్యా కోర్సులను అందించేందుకు అవసరమైన విద్యా రుణం సాయం అందిస్తుంది ప్రభుత్వం – (ఫీచర్స్ అండ్ పాలిటిక్స్, సౌజన్యంతో…) – జి.ఎన్.వి.సతీష్