కొత్త జిల్లాల ఏర్పాటు సుపరిపాలనకు దారితీస్తుందా?
రాజ్యాంగంలో పొందుపరిచిన వారిహక్కులను ప్రభుత్వాలే కాలరాస్తున్నాయి. అన్నిరంగాల్లో అన్ని రకాలుగా ఆదివాసీలు ఏడుశతాబ్దాలుగా అస్తిత్వం,ఆత్మగౌరవం,స్వయంప్రతిపత్తి కోసం మనుగడ కోసం నిరంతరంవారుపోరాటంచేస్తున్నారు. ఈనాటికి వారికి న్యాయం దొరకడం లేదు. ప్రజలముంగిటికిపాలన అనేమాట1984లో మొదట వినిపించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సరిగ్గా ఈనినాదంతోనే ఒక శతాబ్దానికిపైగా చరిత్రఉన్న విశాల తాలూకాలను విడదీసి మండళ్లను ఏర్పాటు చేశారు. తాలూకాల నుంచి మండలాలు విభజనలో నేపథ్యంలో ఉమ్మిడి ఏపీలో సుమారు 800 గిరిజన గ్రామాలకు చాలా అన్యా యానికి గురయ్యఆరు. దాంట్లో తూర్పుగోదావరి జిల్లా సబ్‌ప్లాన్ ఏరియా పెదమల్లాపురానికి ఆనుకొని ఉన్న 56 గిరిజన గ్రామాల గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులకు దూరమయ్యారు. అలాగే విశాఖజిల్లా కొయ్యూరు తాలూక పరిదిలో ఉండే సరుగుడు, కేవీశరభవరం,చమ్మచింత తదితర నాలుగు పంచాయితీలను మైదానప్రాంతమైన నాతవరం మండలంలో విలీనం చేయడంవల్ల ఆప్రాంతగిరిజనులంతా అభివృద్ధికి నోచుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,1984లో షెడ్యూల్డ్ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న 800కుపైగా గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలనే ప్రతిపాదన చేసినా దాన్ని రాష్ట్రప్రభుత్వం సక్రమంగా అమలు పర్చలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజవర్గ పునర్విభజనలో భాగంగా అరకు లోక్‌సభనియోజకవర్గం అన్యాయానికి గురైంది. 25లోక్‌సభ నియోజక వర్గంలో 7అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దానిస్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడిరది. ఈనియోజకవర్గం 4జిల్లాలలో విస్తరించి ఉంది.విశాఖపట్నం,విజయనగరం,శ్రీకాకుళంజిల్లాలలోని భాగాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈలోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇదిచాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది. పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్త రించి ఉన్న ఈనియోజకవర్గం ఆచివరి నుండి ఈచివరికి 250కిలోమీటర్ల పైగానే దూరం ఉంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకుగాను 6 సెగ్మెంట్లు ఎస్టీలకీ ఇంకా 1సెగ్మెంట్ ఎస్సీలకీ రిజర్వ్ చేయబడ్డాయి.
2014`2015మధ్య రాష్ట్ర విభజనలో రాష్ట్ర విభజన జరిగింది. ఈసమయంలో కూడా ఆదివాసీలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ,సాంస్కృతి,సాంప్రదాయాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మరోకసారి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చిత్రపటం మారిపోతోంది. అంతే కాకుండా ఇటీవల నగరీకరణలో భాగంగా విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజయన్ డవలప్మెంట్ అధార్టీ(వీఎంఆర్డీఏ) సరుగుడు ఏరియా గిరిజన పంచాయితీలను విలీనం చేసి ఆ ప్రాంత గిరిజనులకు చారిత్రీక అన్యాయానికి గురిచేశారు.అదే విధంగా విజయనగరం జిల్లా గిరిజనాభివృద్ధికి చేరువలో ఉన్న పార్వతీపురం ఐటిడీఏను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇది కూడా తీరని అన్యాయమే అవుతుంది. ప్రభుత్వ అనాలోచిత విధానాలు కారణంగా గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, సంస్కృతి సంప్రాదాయలు కనుమరుగయ్యే అవకాశం అధికంగా కన్పిస్తోంది. షెడ్యూల్ ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతం మధ్యలో నుంచి రాజమండ్రి నుంచి విజయనగరం వరకు 516వ జాతీయ రహదారిని406కిలోమీటర్ల పొడవునా నిర్మాణపనులు వేగంగా జరుగు తున్నాయి. దీనివల్ల గిరిజనుల భూములు,వారి జీవన విధానం దెబ్బతింటోంది. ఆదివాసుల కల్చరల్ దెబ్బతింటోంది.
ప్రస్తుతం ఏపీలో ఉన్న పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ ఆమోదించిన అనంతరం దీని పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను చెరిపేసి చిన్నజిల్లాలను సృష్టిస్తున్నారు. ఇది సుపరిపాలనకు దారితీ స్తుందా? లేక పాలనా వ్యవస్థని ఇంకా బలహీనంచేసి పాలనా యంత్రాంగాన్ని ఇంకా శక్తివంతులను చేస్తుందా అనేది ప్రశ్న. పాలన వికేంద్రీకరణ నిజం కావాలంటే అధికారాల వికేంద్రీకరణ జరిగితీరాలి. స్థానిక గిరిసజనుల మనోభవాలు పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగావారి సాంస్కృతి,సాంప్రదాయాలు,కట్టుబాట్లు దెబ్బతినకుండా గిరిజనులకు ప్రయోజకరకంగా ఉండేలా విభజన వ్యవహారాన్ని కొనసాగించాల్సిన అవశ్యకత ఉంది.!– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్