కులగణ నేటి సామాజిక అవసరం
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కులగణాంకాలపై ఎన్నడూ లేనంతగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. మన సమాజంలో కులం అన్న దాన్ని పైకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ఒక అతి కీలకమైన, విస్మరించలేని వాస్తవం.సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయంగా మనకు సంబంధించిన అన్ని విషయాల్లో అసమాన వ్యవస్థలను, అహేతుకమైన హెచ్చుతగ్గులను, నిర్హేతుకమైన ఆధిపత్య-ఆధారిత భావజాలాలను కులం పెంచి పోషించింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కులాల హోదా, స్థానం, స్థితిగతులు, గౌరవ ప్రతిపత్తులలో పెద్ద మార్పు రాకపోగా, వ్యవస్థల భాగస్వామ్యంలో వారి యథాతథ స్థితి కొనసాగింది. ఉద్యోగిత, ఆదాయం, ఇంకా అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో రాజ్యాంగంలో ఉద్దేశించిన విధంగా ఎలాంటి మార్పులు రాలేదు. గత అనుభవాలను పరిశీలిస్తే దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని నిష్పక్షపాతంగా అర్థం చేసుకుని అవసరమైన మార్పును, అభివృద్ధిని సాధించే విధానాల రూపకల్పన, వాటి అమలులో మౌలికంగానే ఎక్కడో లోపమున్నట్లు వెల్లడవుతోంది. అనేక ప్రణాళికలు, లక్షల కోట్ల బడ్జెట్లతో కూడిన లెక్కలేనన్ని పథకాలు, కార్యక్రమాల అమలు కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. పంపిణీలో సమన్యాయం పాటించడం అనేదే జరగలేదు.వారసత్వ రాజకీయాలు, కుటుంబపాలన, అవినీతి, నయా భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థల పునఃప్రతిష్ఠ కొనసాగి, అన్ని రంగాల్లో అసమానతలు, పెచ్చు పెరిగాయి. కులవ్యవస్థ ప్రభావం నిరంతరంగా కొనసాగడం వల్లనే పై స్థితి స్థిరీకరించబడిరది. దీనికి అనేక కారణాలున్నప్పటికీ అయితే దేశ ప్రజలకు సంబంధించిన శాస్త్రీయమైన గణాంకాలు అందుబాటులో లేకపోవడమే ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిపే జనాభా గణాంకాల ఆధారంగా ప్రాధాన్యతలను బట్టి, అవసరాలను బట్టి ప్రభుత్వాలు అభివృద్ధి విధానాన్ని రూపొందిస్తాయి. స్వాతంత్య్రానికి ముందు 1871 నుంచి 1931వరకు 16సార్లు జరిగిన జనాభా లెక్కల్లో కుల ప్రస్తావన ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల 1941 సెన్సెస్ ప్రక్రియలో అంతరాయం కల్గింది.వివరాలు సేకరించినా నివేదికలు రూపొందించలేదు. కానీ స్వాతం త్య్రానంతరం జనాభావివరాలు సేకరణలో కుల అంశాన్ని పక్కకు పెట్టారు.దేశ ప్రజల కుల సంబంధిత సమాచారం లేకపోవడంతో సామాజిక వివక్ష,అసమానతలు,ఆర్థిక అంతరాలను తగ్గించటానికి తోడ్పడే విధానాల రూపకల్పన శాస్త్రీయంగా జరుగలేదు.ప్రభుత్వ సంక్షేమ విధానాలు,సామాజిక న్యాయం,ప్రధానంగా విద్య, ఉద్యోగాలు,అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించడం వంటి అన్ని అంశాలలో అప్పటివరకు అందుబాటులో ఉన్న అరకొర గణాంకాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది.1931 సెన్సెస్ తర్వాత గడ చిన 90సంవత్సరాల కాలంలో సమాజంలో వచ్చిన అనేక మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి తదను గుణంగా విధానాలు రూపొందించే క్రమాన్నే ప్రతిపాదించలేదు.ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం అర్థవంతంగా జరుగలేదు.ఈ నేపథ్యంలో మౌలికమైన కులగణాంకాల సమాచారం లేకుండా వివిధ తరగతులకు చెందిన సామాజిక, ఆర్థిక,అంశాలకు సంబంధించిన సమస్యలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలవల్ల సాధించిన పురోగతి, తద నుగుణంగా జరిగిన మార్పులు తెలుసుకోవడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. అసలు విధాన నిర్ణయ మే ఎలా సాధ్యమన్న మౌలిక ప్రశ్న కూడా ఉంది. అదే క్రమంలో ఓబీసీ,బీసీ కమిషన్లు వివిధ కులాల స్థితిగతులను తులనాత్మకంగా ఎలా అర్థం చేసుకోగలు గుతాయి.వెనుకబడ్డ కులాలను గుర్తించి వారి జాబితా లను ఎలా రూపొందిస్తారు. కులాల చేర్పులు మార్పు లు ఎలా సాధ్యం. క్రీమీలేయర్ విషయంలో ప్రతిపాద నలు ఎలా రూపొందిస్తారు.రిజర్వేషన్ కోటాలను ఎలా నిర్థారిస్తారు.కులం వివక్షకు,అసమానతలకు మూల కారణమైన విద్య,ఆరోగ్యం,ఉద్యోగం మొదలైనవి అందుబాటులో లేకపోవడంవల్ల ఉత్పన్నమవుతున్న అడ్డంకులను తొలగించడం ఎలా వీలవుతుంది? ఇందుకు సంబంధించిన సామాజిక మార్పుల విష యంలో విధానరూపకల్పన ఎలాసాధ్యం? అదే విధం గా గణాంకాలు, సమాచారం లేకుండానే పది శాతం ఈడబ్ల్యుయస్ రిజర్వేషన్లను ఎలా నిర్ధారించగలిగారు? పక్షపాత రహితమైన,నాణ్యమైన గణాంకాలు సెన్సెస్ ద్వారానే సాధ్యమని,ఆ సమాచారమే చట్టబద్ధమని కోర్టులు భావిస్తున్న తరుణంలో కులగణాంకాలు నిర్వ హించకపోవడం ఎంతవరకు సహేతుకం.అది తర్కా నికి ఎలా నిలుస్తుంది అన్న అనేక ప్రశ్నలు ఉత్పన్న మవుతాయి. వాస్తవానికి సమాజానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం కోసం 2011 జనా భా లెక్కల్లో కులగణాంకాలను సేకరిస్తామని, అనేక చర్చల తర్వాత అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ 2010లోనే పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దానికి సంబం ధించిన ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే సెన్సెస్ సంస్థ ద్వారా కాకుండా 2011లో సామాజిక, ఆర్థిక కుల గణాంకాలపేరుతో ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా గణాంకాలు సేకరించినా,అందులో అనేక తప్పులు దొర్లాయని నాటి పాలకులు చెప్పారు.2014లో నరేం ద్రమోదీ అధికారంలోకి వచ్చాక గణాంకాల సేకర ణలో జరిగిన తప్పులు సవరిస్తామని మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోలేక పోయారు. ఓబీసీ సమాచార అవసరాన్ని యూపీఏ, అదేవిధంగా ఎన్‌డిఏ అధికారి కంగా గుర్తించినప్పటికీ,గణాంకాలను వాస్తవంలోకి తీసుకురావడానికి తగినచర్యలు చేపట్ట లేకపోయా యి. గత జూలైలో ప్రస్తుత హోం సహాయమంత్రి నిత్యానంద రాయ్ 2021సెన్సెస్‌లో కులాధార గణాం కాల సేకరణ ఉండదని పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆతర్వాత మోదీ సర్కారు సుప్రీంకోర్టుకు కూడ, ఇది సాధ్యంకాదని చెప్పింది.ఇలా కుల గణాంకాల సేకరణ విషయంలో యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు రెండూ మాట మార్చాయి. ద్వంద్వ ప్రమాణాలు పాటించాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే కుల గణాంకాల విష యంలో ఒక అనిశ్చిత స్థితి నెలకొల్పాయి. ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం వారికి అందజే యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రధానమంత్రి గుర్త్తించకపోవడం ఎంతవరకు సమంజసం? దేశంలో 50 శాతం పైగా ఉన్న ఓబీసీల అభివృద్ధి కాంక్షిస్తున్నా మని చెప్పే ప్రభుత్వాలు కుల గణాంకాలు చేపట్టడానికి అనుకూలంగా ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు, ఎన్.డి.ఎ లోని కొన్ని పార్టీలు, అదే విధంగా ఎన్‌డిఎను బయట నుండి సమర్థించే మరికొన్ని పార్టీలు,మహారాష్ట్ర, బీహార్,ఒడిషా,మధ్య ప్రదేశ్,చత్తీస్‌ఘడ్ ముఖ్యమం త్రులు,అదే విధంగా సి.పి.ఐ,సిపియం,ఎన్‌సిపి, ఎస్‌పి, బహుజనసమాజ్‌పార్టీ,డియంకె,తెలుగుదేశంతో సహా అనేక జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు, కుల గణాంకాలు కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అనుకూలంగా నిర్ణయం తీసుకునే ధోరణి లో ఒక కమిటీ వేసి పరిశీలిస్తుంది.అనేక మంది బిజెపి ఎంపీలు కులగణాంకాలు జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈవిషయంలో అందరి అంగీకారం కూడగట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్వాతం త్య్రం వచ్చిన దగ్గరనుండి కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో వేసిన అన్నిఓబిసి /బిసి కమీషన్లు, ప్రణాళికా సంఘం, పార్లమెంటరీ కమిటీలు కుల గణాంకాలు చేపట్టాలని సూచించాయి. దేశవాప్తంగా ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంఘాలు,కులసంఘాలు పెద్ద ఎత్తున ఈ 2021సెన్సెస్‌లో కులగణాంకాలు చేర్చాలని చెప్తున్నా యి. మరో ప్రధానమైన అంశం, సుప్రీంకోర్టు, అనేక హైకోర్టులు కూడా వివిధ కేసుల్లో తీర్పులనిస్తూ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో, కొత్త కులాలను గుర్తించబడిన జాబితాలో చేర్చే విషయంలో, నియామ కాల్లో, ప్రమోషన్లలో ఇంకా అనేక సందర్భాలలో కుల గణాంకాల ఆవశ్యకతను చెబుతూనే ఉన్నాయి. ఈ గణాంకాలను ఎవరు వ్యతిరేకిస్తున్నారో పరిశీలిస్తే అసలు విషయం గ్రహించవచ్చు.1990లలో ఓబీసీ లకు రిజర్వేషన్లు నిర్దేశిస్తూ ప్రకటన చేసినపుడు ఎవరు వ్యతిరేకించారో వారే మళ్ళీ ఇప్పుడు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నారు.అయితే దీనిని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో అందరి అనుమానాలను నివృత్తిచేస్తూ నిర్ణయం తీసుకునే బాధ్యత ఇప్పుడు ప్రధామంత్రి నరేంద్రమోదీపైఉంది. ఓబీసీల జీవన ప్రమాణాలను,సామాజిక హోదాను పెంపొందించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నెలకొల్పాలి. ఇందుకు ఆ సామాజిక వర్గాల అభివృద్ధికి దోహదపడే సమాచారాన్ని సేకరిం చాలి. ఏఏ సామాజికవర్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వారికి ఏవిషయంలో సహాయం అవసరమో గుర్తించి, ప్రస్తుతం ఉన్న స్థితిని మార్చాలి. ఇది తమ విధ్యుక్తధర్మ మని ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి. కులగణాం కాల సేకరణను కేవలం రాజకీయ దృష్టితో కాకుండా సామాజిక కోణంలో పరిశీలిస్తే వాటి అవసరం గురించి అందరికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సమగ్ర కుటుంబ సర్వే : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది.75ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరి స్తున్నారు.ఈసర్వే డేటాఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు కాను న్నాయి. గుర్తించిన కుటుంబాల నుంచి ఎన్యుమరేటర్లు పూర్తి వివరాలు సేకరిస్తారు.ప్రధాన ప్రశ్నలు 56,ఉపప్రశ్నలు 19కలిపి మొత్తం 75ప్రశ్నలతో కుటుం బానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు.కుటుంబసభ్యుల పేర్లతోపాటు అందరి మొబైల్ నంబరు సేకరిస్తారు.కులంతో పాటు ఆకులాన్ని ఇతర పేర్లతో పిలిస్తే వాటిని కూడా రాసుకుంటారు. కుటుంబ సభ్యులవారీగా విద్య,చదివిన మాధ్యమం,ఉద్యోగం,ఉపాధి,వ్యాపారం, వార్షికా దాయం తెలుసు కుంటున్నారు.కుటుంబానికి ఉన్న భూములు,ఇళ్లు, ఇతర స్థిర,చరాస్తుల వివరాలు సేకరిస్తారు. ఇప్పటి వరకు విద్య,ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్ ప్రయో జనాలు.
గత ఐదేళ్లుగా పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది, తీసుకున్న రుణాలు, వాటిని దేని కోసం ఉపయోగించారన్న అంశాలు సైతం అడుగుతారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతిని ధులుగా,లేదా నామినేటెట్ పదవులు,ఎన్జీవోల్లో సభ్యత్వం వంటి అంశాలు నమోదు చేయనున్నారు. విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారా అనే అంశాలపై కూడా అధ్యయనం జరగనుంది. సొంత ఇళ్లా అద్దెకు ఉంటున్నారా ఇంట్లోఫ్రిజ్,కారు, ద్విచ క్రవాహనం,కంప్యూటర్,స్మార్ట్ ఫోన్ వంటివి ఉన్నాయా అనే వివరాలు అడిగి ఫారంలో నింపుతారు.
ఈ సమాచారాన్ని ఏవిధంగా ఉపయోగిస్తారంటే? : ప్రజల నుంచి సేకరించిన వివరాలను గో ప్యంగా ఉంచాలని ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.భవిష్యత్తులో బీసీ,ఎస్సీ,ఎస్టీ,ఇతర వెనక బడిన వర్గాలకు సంక్షేమపథకాలు,రాజకీయ,విద్య, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళి కలను తయారు చేసేలా ఈ డేటాను వినియోగించు కోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీరిజర్వేషన్లు ఎంతఉండాలోఈడేటా ఆధారంగానే ఖరారు చేయనున్నారు.ఈసర్వేలో సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,కుల,రాజకీయ సమా చారం సేకరించనున్నారు. ఈ క్రమంలో సర్వే చేసే ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఏ పత్రాలు దగ్గర పెట్టుకోవాలి? ఏం సమాధానం చెప్పాలి అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.
సర్వే నిర్వహణ ఇలా : సర్వేలో మొత్తం 75ప్రశ్నలు ఉంటాయి.వీటి నుంచి సమాచారంసేకరిస్తారు. ఇందులో 56ప్రధాన ప్రశ్నలు ఉండగా,మరో 19అను బంధ ప్రశ్నలు ఉంటాయి.మొత్తం రెండు పార్టులు అంటేపార్టు-1,పార్టు-2గాఉండి ఎనిమిదిపేజీల్లో సమాచారం పూరించనున్నారు. పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉండాయి. అంటే సాధా రణ,విద్య,ఉద్యోగ,ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయో జనాలు, వలసలు, రాజకీయ సమా చారం అడగను న్నారు.అలాగే పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు.ఇందులో మొత్తం17ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా,మిగిలినవి అనుబంధ ప్రశ్నలు.
ధరణి ఖాతా, ఎకరాల వివరాలు చెప్పాల్సిందే : భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, భూముల వివరాలు మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్? కు చెప్పాల్సి ఉంటుంది.సాగు విస్తీర్ణం వివరాలు అన గా నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి.
రిజర్వేషన్ ఫలాలు పొందేవారు : విద్యా,ఉద్యోగ పరంగా రిజర్వేషన్ విధానంతో ప్రయోజనం పొంది నా,గడిచిన ఐదేళ్లలో ప్రభు త్వం నుంచి లబ్ధిపొందిన పథకాలు,ఆ వివరాలు నమోదు చేసుకోవాలి.ఎస్సీ, ఎస్టీ,బీసీ,ఈడబ్ల్ల్యూఎస్ ధ్రువపత్రాలు పొందారా? అనేవి పొందుపర్చుతారు.
రాజకీయ నేపథ్యం : ప్రజాప్రతినిధిగా సభ్యత్వం కింద ప్రస్తుతం,పూర్వం ఏపదవిలో ఉన్నారనేది తెలుసుకుం టారు. పదవీ కాలం,నామినేటెడ్ వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రశ్నావళి ప్రజాప్రతినిధులుగా పని చేసిన వారికి వర్తిస్తుంది.
ఈ పత్రాలు దగ్గర ఉంచుకొండి : ఆధార్ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పు డు సులువుగా వివరాలు అందించవచ్చు. ఒక కుటుం బంలో ఎవరైనా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళితే వారి వివరాలు చెప్పాలి. వలసలు వెళ్లడానికి కారణం కూడా ఆరా తీస్తారు. సర్వే సంద ర్భంగా ప్రతి కుటుం బం ఈ విషయాలను గుర్తుంచు కోవాలి. ఎందుకంటే సర్వే సందర్భంలో ఫొటోలు,పత్రాలు వంటివి తీసు కోరు.అలాగే కుటుం బీకులు అందరూ ఉండాల్సిన పని లేదు. కుటుంబ యజమాని ఉండి ఆయా వివరాలను నమోదు చేయి స్తే సరిపోతుంది.వారు ఇచ్చిన సమాచారాన్ని గోప్యం గా ఉంచుతారు.
విద్యా వివరాల నమోదులో : పాఠశాలలో చేరిన నాటికి వయసు ఎంతో చెప్పాలి. విద్యార్హతను చెప్పాలి. ఏమాధ్యమంలో చది వారని తెలియజేయాలి.ఒకవేళ బడి మానేస్తే ఆ వివరాలు కూడా నమోదు చేయాలి.
ఉద్యోగ, ఉపాధి వివరాలు : ఈ విషయానికి వచ్చిన ప్పుడు ప్రస్తుతం చేసే పని,ఉద్యోగం,వృత్తి,ఉపాధి సమాచారం ఇవ్వాలి.వార్షికాదాయం,ఒకవేళ వ్యాపా రులైతే వార్షిక టర్నోవర్ తెలియజేయాలి. సాంప్రదా య కులవృత్తులయితే ఆ వృత్తి కొనసాగిస్తున్నారా? లేదా? అని రాయాలి. కుల వృత్తితో కలిగిన వ్యాధి (ఉంటేనే) చెప్పాలి. ఆదాయ పన్ను చెల్లింపుదారులా? అవునా,కాదా చెప్పాలి. బ్యాంకు ఖాతా ఉందా,లేదా తెలియజేయాలి.సర్వే వివరాల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయనుందని కలెక్టర్ రాజర్షిషా వెల్లడిరచారు. ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిఅధికారులను ఆదేశించారు. ఇంటిం టి సర్వే కోసం చేస్తున్న ముందస్తు సన్నాహా లను అధికారులతో కలిసి పరిశీలించారు. – (ప్రొ.కె.మురళి మనోహర్)