కుదుపేసిన గులాబ్ తుఫాన్
గులాబ్ తుఫాను గజగజా వణికిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోను ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు భయపడేలా చేసింది. లోతట్టు కాలనీలను ముంచేసింది. అక్కడి ప్రజలకు నిలువ నీడ లేకుండా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. చాలాచోట్ల గల్లంతైన వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ వ్యాప్తంగా 1.64 లక్షల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది.
ఆంధ్రప్రదేశ్‌ను గులాబ్ తుఫాను వణి కించింది. ఆనాటి1990తుఫాన్‌ను తలపిం చింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. జోరుమని వీచే గాలులు.. హోరుమని జోరు వాన..ఇళ్ల నుంచి జనంబయకు రావాలంటనే భయపెట్టింది. కళింగపట్నానికి సమీపంలో తీరం దాటిన ‘గులాబ్’ తుపాను రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఒడిశాతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్‌కు ఎక్కువ నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా దాకా కుండపోతగా కురిసిన వర్షాలకు ఆర్గురు బలయ్యారు. అపార ఆస్తినష్టం సంభవించింది. 1.6 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా. తుపానుధాటికి ఉత్తరాంధ్రలో విద్యుత్, కమ్యూ నికేషన్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-85 కి.మీ వేగం తో వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, మొబైల్ సిగల్ టవర్లు పడిపోయాయి. చెట్లు కూలి పోయాయి. జలమయమైన పలుగ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరెంటు లేక, ఫోన్లు పనిచేయక, సురక్షితమైన మంచినీరు దొరక్క ప్రజలు పడిన అవస్థలు వర్ణనా తీతం. నాగావళి,వంశధార,వేదావతి నదులు పొంగుతుండడంతో వరదలు పొటెత్తే ప్రమాద ముంది.గులాబ్ ధాటికి ఒడిశాను అనుకుని ఉన్న ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంలో వజ్రపు కొత్తూరు, సంత బొమ్మాళి బాగా దెబ్బతి న్నాయి. కోవిడ్-19మహమ్మారి నుంచి ఇప్పు డిప్పుడే తేరుకుంటున్న ప్రజలను ఇది కోలుకోలేని దెబ్బతీసింది. లక్షకు పైగా ఎకరాల్లో వరి, వేల ఎకరాల్లో మొక్కజొన్న నీట మునిగింది. వేరు శనగ, మిరప, ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటి ల్లింది. విద్యుత్ వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు ఈ తుపాను దెబ్బకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. పారిశుధ్యం,నీటి సరఫరా వ్యవస్థస్తంభించి పోయిం ది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. గులాబ్ విపత్తు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోనే లేదు, మరో తుపాను పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యధిక జనాభా, అంతంతమాత్రమే మౌలిక సదుపాయాలు కలిగిన మన దేశంలో చిన్న విపత్తు కూడా పెద్ద నష్టం కలిగించే అవకాశముంది. దీనికి తోడు తుపానుల స్వభావంలోనూ పెనుమార్పులు చోటుచేసుకుం టున్నాయి.
భూగోళం వేడెక్కడం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం భయంకర తుపా నుల రూపంలో వ్యక్తమవుతుందని వాతావరణ మార్పుల సదస్సు (ఐపిసిసి) చేసిన హెచ్చరిక సరైన దేనని తాజా తుపాను నిరూపించింది. 2020లో బెంగాల్‌ను కుదిపేసిన ‘అంఫని’, అంతకుముందు గుజరాత్‌ను కకావికలం చేసిన ‘తౌకే’్టలతో పోల్చితే గులాబ్ తీవ్రత తక్కువే కావచ్చు. కానీ,ఈ ఉష్ణ మండల తుపాను లక్షణాలు చాలా ప్రమాదక రమైనవి. తేమ, అధిక పీడనాశక్తి కలిగి వుండడం వల్ల ఇవి ఒక్కసారిగా కుంభవృష్టిని కురిపిస్తాయి. గత 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో కురిసిన కుంభవృష్టి ఇందుకొక ఉదాహరణ. 2019లో ఎనిమిది ప్రమాదకర తుపానులు సంభవిస్తే 2020లో అయిదు ప్రమాదకర తుపానులు చోటుచేసుకున్నాయి. వీటి నుంచి పాఠాలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. విపత్తు సంభవించిన తరువాత అరకొర పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇటువంటి విపత్తుల సమయంలో ఉదారంగా సాయం అందించాల్సిన కేంద్రం ఇది తన బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరి స్తోంది. గతంలో హుదూద్ తుపాను సందర్భంగా వెయ్యి కోట్ల సాయం ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఆచరణలో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గులాబ్ తుపాను గురించి ప్రధాని ఆరా తీశారే తప్ప బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణా లను మాఫీ చేయడానికి వెంటనే సిద్ధపడే మోడీ ప్రభుత్వం ప్రజలను ఆదుకునే విషయంలో కనీస మానవత్వ స్పందననైనా కనపరచకపోవడం దుర్మార్గం. తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, శిబిరాల నుంచి ఇళ్లకువచ్చినవారికి వెయ్యి రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ఏమూలకూ చాలదు. తుపా నులు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఆర్థికంగా, సంస్థాగతంగా గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. అలాగే బీమా వ్యవస్థను పటిష్ట పరచడం,పాలనాపరమైన సన్న ద్ధత పెంచుకో వడం,ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం గావించ డం వంటివి చేపట్టాలి. తక్షణం గులాబ్ నష్టాలను సమగ్రంగా అంచనా వేసి బాధితులకు ప్రభుత్వం తగు పరిహారం చెల్లించాలి.
కుదిపేసిన గులాబ్ :తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆ తర్వాత అర్ధరాత్రి నుంచే విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మరుచటి రోజు తెల్లవారుజాము నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణాజిల్లాల్లోనూ పలుచోట్ల కుంభ వృష్టి కురిసింది. ఈతుఫాను కారణంగా 277 మండ లాల్లోనూ వానలు పడ్డాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98మండలాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గంటకు 79 కిలోమీటర్ల నుంచి100కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపో కలకు,విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. విజయనగరం,విశాఖపట్నం జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. రోడ్లు, వంతె నల మీదుగా నీరు పారడంతో వందలాది గ్రామా లకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లతోపాటు విద్యుత్తు సబ్స్టేషన్లు, పోలీస్స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వా సుపత్రుల్లోకి వరద నీరుచేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో విశాఖపట్నంలో వాహనాలు నీట మునిగాయి. భారీవర్షాలకు విశాఖ పట్నంలో వేల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. సుమారు 10వేల మంది ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మన్యంలో గెడ్డలు పొంగిపొర్లాయి. జిల్లాలో147విద్యుత్తు సబ్స్టేషన్లపై తుపాను ప్రభావం చూపడంతో వందల గ్రామాలు అంధ కారంలో చిక్కుకున్నాయి. రైవాడ, కోనాం మినహా మిగతా అన్ని డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీరు కిందకు విడుదల చేస్తున్నారు. ఈదురుగాలులకు గార, శ్రీకా కుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్య లో వృక్షాలు నేలకొరిగాయి. చాలాచెట్లు విద్యుత్తు తీగల పై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూ లాయి. గిరిజనగ్రామాలు జలది గ్బంధంలో ఉన్నాయి. సాలూరు మండలం మామి డిపల్లి ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా నీట మునిగి మం దులు,పరికరాలుఅన్నీ తడిచి పోయాయి. ఈదురు గాలులకు గార, శ్రీకాకుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్యలోవృక్షాలు నేలకొరిగాయి. చాలా చెట్లు విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. విజయనగరం జిల్లా నెల్లి మర్ల,గజపతినగరం,పూసపాటిరేగ ప్రాంతాల్లో గరిష్ఠంగా 23.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. వందలాది వృక్షాలు నేలకూలాయి.
తూర్పుగోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు,కాజులూరు,కడియం,రామచంద్రా పురం, అమలాపురం,పి.గన్నవరం,కాకినాడ, రాజమహేం ద్రవరం,మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10 సెం.మీ నుంచి 16 సెం.మీ వానలు పడ్డాయి. రంపచోడవరం- గోకవరం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీవృక్షం నేలకూలడంతో రాక పోకలు స్తంభించాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్ నీటిలో నిలిచి పోయింది. స్థానికులు వాగు దాటించారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు, కాజులూరు, కడియం,రామచంద్రాపురం,అమలాపురం, పి.గన్న వరం,కాకినాడ,రాజమహేంద్రవరం,మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10సెం.మీ నుంచి 16 సెం.మీవానలుపడ్డాయి. రంపచోడవరం- గోకవ రం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలు స్తంభిం చాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృ తంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్ నీటిలో నిలిచిపోయింది. స్థానికులు వాగు దాటించారు. భారీ వర్షాల ధాటికి విజయ నగరం జిల్లా బొండపల్లి మండలం గదబపేటలో చెట్టుకూలి ఒకరు,తమటాడలో గోడ కూలి మరొ కరు చనిపోయారు. గుర్ల మండలం కోట గండ్రేడు లో ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృత్యు వాతపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి అప్పల నరసయ్య కాలనీలో ఏళ్ల భావన అనే మహిళ మరుగుదొడ్డిలో ఉండగా మరో ఇంటి గోడ కూలి మరుగుదొడ్డిపై పడటంతో ఆమె అక్కడికక్కడే మర ణించింది. సుజాతనగర్లో వర్షంతో విద్యుదాఘా తానికి గురై నక్కా కుశ్వంత్ కుమార్ అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. తుఫాను కారణంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. భారీ వర్షాలతో చెరువులను తలపిస్తోంది. మోకాళ్ల లోతు నీరులోనే ప్రయాణి కులు ఇబ్బంది పడుతూ ఎయిర్ పోర్టులోకి చేరుకోవాల్సి వచ్చింది. విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 750 కి.మీ. మేర ఆర్అండ్బీ రహదారులు, 50 కల్వర్టు లు దెబ్బతిన్నాయి. బొర్రా- చిమిడిపల్లి మార్గంలోని కేకేలైన్‌లో రైలు పట్టాలపైకి బురద కొట్టుకొచ్చింది. కొత్తవలసలో రైలు పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఎల్కోట సమీపంలో కొత్తవలస-కిరండోల్ మార్గంలో ఒక లైన్ దెబ్బతింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1.57 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 6,465 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. చాలా మండలల్లో పైర్లు బాగా పండాయి..
ఈ ఏడాది మంచి పంట వస్తుందని ఆశించిన సమయంలో గులాబ్ కన్నీరే మిగి ల్చింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజ లకు ఆపన్న హస్తం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుం టామని రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరోసారి నిరూపించింది. ఉత్తరాంధ్ర,ఉభయగో దావరి జిల్లాల్లో సహాయ,పునరావాస కార్యక్రమాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేలకొరి గిన వృక్షాలు తొలగించడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు చేర్చడంలో శక్తివంచన లేకుండా పనిచేశారు. ఉత్తరాంధ్రలో గులాబ్ తుపాన్ బీభత్సం, ఐదుగురు మృతి,ఇద్దరు గల్లంతు
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు
గులాబ్ తుపాను వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల రూపాయల పరిహా రాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆయన అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులను ఆదుకు నేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడ్డ బాధితులకు రూ. 1000, సహాయ శిబిరాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే బాధితులకూ రూ.1000 తక్షణమే ఇవ్వాలని చెప్పారు. బాధితుల పట్ల మాన వతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్ చేయాలని నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకో వాలని ఆదేశించారు.
పంట నష్ట పరిహారాన్ని కూడా సాధ్య మైనంత త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవా లన్నారు. శ్రీకాకుళం నుంచి సిఎస్ ఆదిత్య నాధ్ దాస్ తుపాను అనంతర పరిస్థితులను సిఎంకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని మిగిలిన చోట్ల అంత తీవ్రత లేదని చెప్పారు. అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయని వాటిని తొలగిం చామని అన్నారు. విశాఖ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో సహయ కార్యక్రమాలు ముమ్మరం చేశామని లోతట్టు ప్రాంతాల్లోని వారిని శిబిరాలకు తరలించామని చెప్పారు. ఈ సమీక్షలో విజయనగరం నుంచి మంత్రి బొత్స,శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్ పాల్గొని తుపాను పరిస్థితులను సిఎంకు వివరించారు.
ధూళి తుఫాన్ :
వాతావరణ మార్పుల నేపథ్యంలో కొత్తగా రూపొందించుకుంటున్నారు. ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని నిలిచే రీతిలో సదుపాయాల కల్పన ఉండాలనే స్పృహ పెరిగింది. కానీ మన దేశంలోని నగరాలు మాత్రం వాతావరణ మార్పు వల్ల కలిగే బీభత్సాలకు తట్టుకుని నిలిచే విధంగా లేవు. ఇటీవల ఉత్తరాదిని తుఫాను అల్లల్లాడిరచిన సందర్భంగా ఈ విషయం మరింత స్పష్టమైంది. మన విధాన కర్తలు దృష్టి సారించవలసిన మరో ముఖ్యమైన అంశం వ్యవసాయ రంగం. ప్రకృతి బీభత్సం వల్ల పంట చేను దెబ్బ తినడాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. వాతావరణ మార్పు వల్ల రుతువులు గతి తప్పుతున్నాయి. మన దేశాన్ని వాతావరణ మార్పు వల్ల కలిగే ప్రకృతి బీభత్సాలు వెంటాడుతున్నాయనేది తాజా వైపరీత్యాలను బట్టి వీటిని తట్టుకొనే విధంగా మనం సిద్ధపడి లేమని కూడా స్పష్టమైంది. ఈ నెల మొదటి వారంలోనే ధూళి తుఫాను ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో బీభత్సాన్ని సృష్టించింది. దీని నుంచి దేశం తేరు కోక ముందే మళ్ళా గులాబ్ తుఫాన్ అకాల వర్షం కకావికలు చేసింది. పిడుగులతో కూడిన రాళ్ళ వాన, పెనుగాలలు కలిసి అనేకమంది ప్రాణాలు బలిగొన్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యం మూలంగా వివిధ రాష్ట్రాలలో భారీగా ప్రాణనష్టం జరిగింది.
ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రాళ్ళవాన, పిడు గులు పడి 50మందికి పైగా మరణించారు. ఎనభై మందికిపైగా గాయపడ్డారు. చెట్లు విరిగిపడ్డాయి, ఇండ్లు కూలిపోయాయి. ఢల్లీిలోనైతే ధూళి తుఫా నుకు,భారీవర్షం తోడైంది. రాకపోకలు నిలిచి పోయాయి. ఇద్దరు మరణించారు. డ్బ్భై విమానా లను దారి మళ్ళించవలసివచ్చింది. పశ్చిమ బెంగా ల్లో పన్నెండు మంది మరణించారు. ధూళి తుఫాను మూలంగా ఉత్తర, పశ్చిమ భారతమంతా ఉక్కిరిబిక్కిరయింది.ఉత్తరప్రదేశ్,రాజస్థాన్,ఉత్త రాఖండ్,మధ్యప్రదేశ్,పంజాబ్,హర్యానా రాష్ట్రా లలో వంద మందికిపైగా మరణించారు. వంద లాది మంది గాయపడ్డారు. పెనుగాలులు సృష్టిం చిన విలయానికి ఇళ్లు కూలిపోయాయి, చెట్లు పెకిలించుకుపోయాయి, పంటలు దెబ్బతిన్నాయి. రవాణా, విద్యుత్ వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనయి.
-జిఎన్‌వి సతీష్