కవి కోకిల గుర్రం జాషువా సాహిత్య విశ్లేషణ

‘‘వినుకొండన్‌ జనియించితిన్‌ సుకవితావేశంబు చిన్నప్పుడే నను పెండ్లాడె, మదీయ కావ్యములు నానారాష్ట్ర సత్కారముల్‌ గొని కూర్చెన్‌, సుయశస్సు, కల్గుదురు నాకున్‌ భక్తులై నేనెఱుంగనివా రాంధ్రధ రాతలాన బహు సంఖ్యల్‌, సాహితీ బాంధవుల్‌ ! ’’
‘నేను’ అనే కవితాఖండికలో జాషువాగారి జీవి తాంశాలు మొత్తం వారు ఒకే పద్యంలో ఎంతో అద్భుతంగా వివరించారు. కవితా విశారద, కవి కోకిల,కవిదిగ్గజ,నవయుగకవి చక్రవర్తి మధుర శ్రీనాథ,విశ్వకవి సామ్రాట్‌,కళాప్రపూర్ణ, పద్మ భూషణ్‌ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత గుర్రం జాషువా 1895 సెప్టెంబరు`28 సంవత్సరం గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. 1971జులై 24పరమ పదించిన జాషువా…. అణు వణువున మన కణనిర్మితమైన చాతుర్వర్ణ వ్యవస్థలో పశువు కన్నాహీనంగా, ఘోరాతిఘోరంగా, అడుగ డుగునా అవమానాలతో అవహేళనలతో, తినడానికి తిండిలేక,ఉండటానికి కొంప లేక ఊరికి దూరంగా, బ్రతుకు భారంగా దిష్టితీసి పారేసిన వస్తువుల్లా, అస్తవ్యస్త జీవుల్లా,చెల్లా చెదు రుగా, చిల్లర పైసల్లాపడి సనానతన సవర్ణ హిందూ సంప్రదాయ నిరంకుశ కర్కష రక్కసి విషపు కోరల నుండి తప్పించు కోలేక బిక్కు బిక్కు మంటూదిక్కులు చూస్తున్న అస్ప ృశ్య దళిత జాతి నుండి అశాజ్యోతిలా అరుదెంచిన సంస్కరణ యశోర వికిరణం గుర్రం జాషువా ఆయన సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం…. – (డా॥ఆర్‌.కుసుమ కుమారి)
‘‘ కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు కృతిని జెందునాడు మృత్యుడు గాడు పెరుగు దొటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవిగా దలంత్రు.’’
పిరదౌసితోపాటు,షానామా కావ్యా న్ని అందుకున్న సుల్తాను కూడా నేటికి జీవిస్తూనే ఉన్నాడు.సమాజమే పాఠశాలగా,వివక్షతే ఉగ్గు పాలుగా ఆరగించి అంటరానితనం వెంటాడి నాఒంటరిగానే పోరాటంచేసి,అవమానాలుగా భావించి,ఛీత్కారాలనుశిరోభూషణాలుగా స్వీక రించి దళిత జాతికి ప్రతినిధిగా నిలిచి పూ జారి లేని వేళ తన సందేశాన్ని వినిపించ మని గబ్బి లాన్ని పంపిన ఆధునిక దళిత కవితా, వైతాళి కుడు,పంచమస్వరంలో గానమాలపించిన కవి కోకిల,ఖండకావ్య ప్రక్రియలో అగ్రగణ్యుడు,సీనపద్యరచనలు, మధు ర శ్రీనాథుడు,విమల మనస్కుడు వినుకొండ, మగధీరుడు గుర్రం జాషువా. వీరి రచనల్లో ఎన్నో సామాజికాంశాలు, మహిళా భ్యుదయ ధోరణులు, ప్రజాసమస్యలు,రుగ్మతలు, మూఢ నమ్మకాలు ఇలా ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉంటాయి.
‘ఫిరదౌసి’ కావ్యంలో ‘‘రాజు మరణించె నొక తార రాలిపోయే కవియు మరణించె నొక తార గగనమెక్కెరాజు జీవించె రాతి విగ్రహములందు సుకవి జీవించె ప్రజల నాల్కలయందు’’ రాజాధిరాజుల కన్నా కవి గొప్పవాడని, శాస్వితుడని చెప్పడం కవికుల పక్షం వహిం చడమే జాషువా కవిత్వంలో ఇలాంటి విలక్షణాంశాలు కోకొల్లలు. తన పూర్వ కవులతో పోల్చినా సమకాలీన కవిత్వంతో తులనాత్మీకరించినా జాషువా కవిత్వానికి ప్రత్యేకస్థానం ఉంది.
‘‘ బంగారు నాణెముల్‌ బస్తాల కెత్తించి మదపుట్టెన్గుల మీద పదిల పఱిచి లేత పచ్చలు నేఱి గోతాలతో కుట్టించి లోట్టి పిట్టల మీద దిట్టపరచి…’’
గజనిమహ్మద్‌ మనదేశం మీద దండెత్తి వచ్చి ఏ విధంగా సంపదను దోచుకున్నాడో ఈ కవి త్వం తెలియజేస్తుంది, ఇంకోక చోట మత తత్వం గురించి ‘‘ పామునకు పాలు, చీమకు పంచదార మేపు కొనుచున్న కర్మభూమి జనించు ప్రాక్తంబైన ధర్మదేవతకు గూడి నులికిపడు జబ్బుగలదు వీడున్నచోట!’’ అంటాడు. జాషువా ఈపద్యంలో మూఢభక్తికి నిశితంగా విమర్శిస్తారు. విష సర్పాన్ని కండ చీమను దైవంగా భావించి కొలిచే వాళ్ళు ఎంత విచిత్రమైన వాళ్లు కదా అంటాడు. మనిషి స్వభావాన్ని గురించి చెప్తూ ‘ముసాఫిర్‌ కథ’లో ….. ‘‘మంచి వాడొక్క తెగకు దుర్మార్గుడగును దుష్టుడొక వర్గమున మహాశిష్టుడగును ఒక్కడౌనన్న కాదను నొక్కరుండు బుఱ్ఱ లన్నియు నొకమారు వెఱివగును’’! అంటే ఒక వర్గానికి మంచి వాడైనవాడు వేరొక వర్గానికి దుర్మార్గుడవుతాడు. ఒక వర్గంలోని దుష్టుడు మరొక వర్గానికి మిక్కిలి మంచి వాడవుతాడు.ఒకడు ఔనంటే మరొకడు కాదంటాడు. బుద్ధులన్నీ ఒక్కసారిగా పిచ్చివైపోతాయి. ‘‘హృదయములేని లోకము సుమీయిది మాపుల ( బశ్చిమంబుగా నుదయము తూర్పుగా నడుచుచుండు సనాతన దర్మధేవుల్‌ పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞలా )( బెదవి గదల్ప ) జారలర రవింద భవ ప్రముఖమృతాంథసుల్‌ ’’
ధర్మానికి కీడు కల్గినపుడు బ్రహ్మాది దేవతలు వచ్చి ధర్మసంస్థాపన చేస్తారని మన పురణాలు పలుకుతుంటే దళితులపట్ల జరిగే అధర్మానికి, అన్యాయానికి దేవతలెవరూ పెదవి విప్పలేదని మన పురణాలని ప్రశ్నిస్తున్నాడు కవి.
‘‘ స్త్రీ కంటెంబురుషుండు శ్రేష్ఠుడనుచున్‌ సిద్ధాంతముల్‌ చేసి తాకుల్‌ కంఠములెత్తి స్త్రీ జగతి కన్యాయంబు గావించెనో యేకాలంబున పుట్టినింటయిన లేవ నాటి స్వతంత్య్రముల్‌ వే స్త్రీకిన్‌ మారు సమాన గౌరవ విబూతిన్‌ గాంతకుం గూర్చుమా’’ ఈ పద్యంలో జాషువా మహిళాభ్యుదయాన్ని కాంక్షిస్తూ సమాన స్వేచ్ఛ కావలంటారు. యుగ యుగాలుగా అణచివేతకు గురౌతున్న స్త్రీ పై పురుష అహంకారం తగదని అటువంటి సిద్ధాం తాలు మంటగలిసిపోతాయని చెప్పారు.జాషువా గారి కవిత్వంలో వాస్తవికాంశాలను సరళమైన శైలిలో సుభోధకంగా సందేశాన్ని అందించడమే కాకుండా వాస్తవానికి దగ్గరగాను ఆలోచించే విధంగాను కనిపిస్తాయి.‘గబ్బిలం’లో….. ‘‘వాని రెక్కల కష్టంబులేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి భుక్తి లేదు’’ అంటూ అస్పృశ్యతను సమాజానికి బహిర్గతం చేస్తారు జాషువా. అస్పృశ్యుడై పేదరికాన్ని అనుభవించిన జాషువా ఆకలి మంటలతో అల్లాడిపోతూ, బుక్కెడు బువ్వకోసం తాను అనుభవిస్తున్న సమస్త కష్టాలు మరిచిపోయే అల్పసంతోషి అంటాడు. మరోచోట ‘‘ధర్మమునకు బిరికితనం మెన్నడును లేదు సత్యవాక్యమునకు చావులేదు వెరపనేల నీకు విశ్వనాథుని మ్రోల సృష్టికర్త తాను సృష్టినీవు ’’ జాషువా నిరసనలు తెలుసుకోవాలంటే ఒక ‘గబ్బిలం’ కావ్యంచాలు.ఈ కావ్యం ఎంతో హేతువాద ధోరణితో రాయబడిరది. అంటరాని తనాన్ని, సమాజంలో మొత్తం కుళ్ళుని ఎండ గట్టాడు,కర్మ సిద్ధాంతం పేరుతో పేదల నోరు కట్టేసి వారు అనుభవిస్తున్న స్వార్ధపరుల గురించి పరమేశ్వరుని దగ్గర నిరసన వ్యక్తం చేసే విధం గా గబ్బిలాన్ని ప్రోత్సహించాడు. ‘పశ్చాత్తాపము’ అనే ఖండ కావ్యంలో…. ‘‘ పడుచు బిల్లల ముసలికి ముడి బెట్టితి, పసుపు కుంకుములకు నెవ్వలిjైు గడియించిన నా పాపము వడుపున నిపుడా యనాథ పుత్యక్షమగున్‌’’ చిన్న పిల్లలను ముసలి వారికి ఇచ్చి పెళ్ళి చేస్తూ, భర్త చనిపోగానే ఆమె విధవరాలని దూషిస్తారు. ఆమె పసుపు కుంకుములకు దూరంగా వెలి వేయబడుతుంది. ఆమె అనాథగా మారుతుంది. ఈ మూఢత్వం నుండి సమాజం బయటకు రావాలని జాషువా కోరారు.‘ సూర్యోదయం’ అనే ఖండికలో…. ‘‘కాకి పిల్పుల గీతి కారవ మాలించి సమయంపు నిదుర మంచంబు డిగ్గి మల యాచలము మీది యలతి వాయువులచే నిఖిలి లోకంబును నిద్రలేపి’’ ఈ పద్యంలో కాకుల పాటలతో సమయం నిదుర మంచం నుండి దిగిందనీ,కొండలు మీద నుండి వచ్చే పిల్లగాలులు సమస్త లోకాన్ని నిద్ర లేపాయనీ నెలరాజు పడమటి కొండలపైకి నెట్ట బడ్డాడని ప్రకృతి సౌందర్యాన్ని గురించి వర్ణించాడు. జాషువా‘ లేఖిని’లో … ‘‘ సకల దేశ మహిత సౌభాగ్య సంపత్తి మనకు గిట్ట దనుచు మధ్య పరచి కులమతాలు దొడ్డ గుండాలు ద్రవ్వించు స్వార్ధ పరులు దాడి నరిగట్టి దేశంబు పరువు నిలుపు కొమ్ముబీ భరతపుత్ర! ’’
జాషువా కోరిన జాతి సమైక్యతలో జీవనరాగం కనిపిస్తుంది. ప్రపంచం సర్వ సుభిక్షం కావా లన్నది ఆయనమతం ఎల్లసోదరులు ఏకోదరులై నిరంతర ఆనంద జీవనం గడపాలన్నది ఆయన కోరిక. ‘చదువు’ ఖండికలో.. ‘‘గుళ్ళు గోపురాలు కోసరంబై నీవు ధారవో యుచున్న ధనము జూచి కటికి పేదవాని కడుపులో నర్తించు కత్తులెన్నో లెక్క గట్టగలవె!’’
డబ్బున్నవారు గుడికి,గోపురాలకు పెట్టే ఖర్చులో కొంతైనా కడుపులో ఆకలితో బాధపడుతున్న వారిని గూర్చి ఆలోచన చేయవలసిందిగా సూచిస్తున్న ఈ పద్యం చిరస్మరణీయం. ఈవిధం గా జాషువాగారి కవిత్వంలోవాస్తవికాంశాలను సరళమైన శైలిలో సుబోధకంగా సందేశా న్ని అందించడమే కాకుండా వాస్తవానికి దగ్గర గాను, ఆలోచించే విధంగాను కనిపిస్తాయి. జాషువా కొన్ని సందర్భాల్లో నాస్తికుడుగా కొన్ని సందర్భాల్లో ఆస్తికుడుగా కనిపిస్తాడు. అన్నింటికీ మించి జాషువా మానవ తావాదిగా కన్పిస్తాడు. ఆయన రచనల్లో ఎక్కువగా సమాజంలోని అసమానతలు, రుగ్మతలు, నిరసన,ఆవేదన కనిపి స్తాయి. తెలుగు సాహిత్య లోకంలో జాషువా వంటి కవి మరొ కరు లేరు.దీనికి కారణం ఆయన హేతువాద రచనలే నిదర్శనం,కాబట్టే ప్రస్తుత సమాజంలో ఇటువంటి ఎందరో కవులకు జాషువా ఆదర్శమయ్యాడు.-వ్యాసకర్త : తెలుగు విభాగాధిపతి,
డా॥వి.యస్‌.కృష్ణా ప్రభుత్వ డిగ్రీÊ పి.జి.
కళాశాల(ఎ),విశాఖపట్నం.
సెల్‌ : 9963625639.