కలుపు మొక్కలు
బాల్యం నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యా వరణం, దురాచారాలు మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, ఆచార వ్యవహా రాలు మొదలైన అనేక అంశములను తెలి యజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థుల కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బాల వినోదం. ప్రదర్శన యోగ్యమైన చేతి బొమ్మలాటలు, లఘునాటికలు,నాటికలు ఏక పాత్రాభి నయం మొదలగు ప్రక్రియల ద్వారా ధారా వాహికగా అందిస్తున్నాం. ఈశీర్షిక మీ అందరి మనసులు ఆనందంతోపాటు, విజ్ఞా నం, వినోదం కలిగిస్తుందని భావింస్తున్నాం. చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యా యులుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగా చార్యులు అందిస్తున్నారు. ఈనెల సంచికలో ‘కలుపు మొక్కల కథ’ ప్రత్యేకమైన కొత్త శీర్షిక.
కోదండపాణి గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వారం వారం కాకపోయినా నెలకొకసారైనా వాళ్ల పుస్తకాల బీరువాలు పరిశుభం చేసుకుని పుస్తకాలను ఓ క్రమపద్ధతి లో అమర్చుకుంటారు. ఓఆదివారం తెలుగు ఉపాధ్యాయుడు బుడంకాయ్ బీరువా పని పడదామని ఉత్సాహంగా తలుపు తెరవగానే ఉన్న ఎలుక సపరివార సంతాన సమేతంగా దూకి పారిపోయింది. అదృష్టం బాగుండి తెలుగు టీచరు బుడంకాయ్ మీదకు దూకలా. బుడంకాయ
అసలు పేరు సంతానం. నిక్ నేం బుడంకాయ్. బొద్దెంకను చూస్తేనే భయపడే ఆయనకి ఎలుకల సమూహాన్ని చూడగానే ఒళ్లంతా ముచ్చెమటలు పట్టాయి.నిశ్చేష్టుడైఎలుకల వైపు వాటితోకల వైపు తదేకంగా కళ్లార్పకుండా చూస్తున్న ఆయన చెవులకు ‘బుడంకాయ గారు’ అన్న కేక వినబడేసరికి ఉలిక్కిపడి గంతేసి చెయ్యెత్తి నిల్చున్న ఆ ఆకారం చూచి ఈ భంగిమలో మీరు ఉవేదాంతం సత్యనారాయణశర్మ గారి భామాకలాపంలో వున్న ‘సత్యభామలా వున్నారండి’ అన్నారు ఆ స్కూలు డాన్సు
మాస్టారు పెంచలయ్య –
పుస్తకాల బీరువా శుభ్రం చేస్తున్నారా?అన్న పెంచెలయ్య మాటలకు లేదు అభ్యంగన స్నానం చేయిద్దామని ఆలోచిస్తున్నాఅన్నాడు నిదానంగా.
ఏంటినిజంగా నీళ్లు పోసికడుగుతారా? అన్నాడు అమాయకంగా..మీరు ప్రతిసారి పిల్లలచేత చేయించే వినాయక స్తోత్రరో వున్న మూషిక వాహనానికి – దానమ్మ కడుపు మాడ నా కబ్బో ర్డులో సంతాన సమేతంగా ఉన్నదికాక మల మూత్ర విసర్జనలతో, పుణ్యాహ వాచనం చేసిందండీ! మరి నన్నేం చేయమంటారు? అని ఓ పశ్న్ర సంధించాడు బుడంకాయ గారు.
నేను మీకు చెప్పేంతటివాడినా? అడిగారు కాబట్టి – నిమ్మకాయ చెక్కతో శుభంగ్రా రుద్ది, యాంటీడాండ్ర షాంపుతో కడిగి, ఎందుకైనా మంచిది కరోనా శానటైజర్ కూడా స్ప్రేచేయండి అన్నారు నృత్యాచార్యుడు పెంచెలయ్య.
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగనూనా? నా తలచుండ్రుకే మీరు చెప్పినదేదీ చెయ్యలేదు.చూస్తున్నారుగా! ఎడారిలో ఖర్జూరం మొక్కల్లా నడినెత్తిన నాలుగు వెంట్రుకలు అని దీర్ఘాలోచనలో పడ్డ ఆయనగారితో చమత్కారంగా గుండైతే ఏంటండీ? ఎంత గుండంగ్రా వుందోమీ తల అన్న పెంచెలయ్య మాటలకు యిద్దరూ హాయిగా
నవ్వుకున్నారు. ఎలుక దాని సంతానం కలసిపరీక్ష ఆన్సర్ పేపర్లన్నీ కొరికేశాయి పెంచెలయ్య్నా.. అని కాంభోజీ రాగం లాంటి అరుపుకు పక్కనేవున్న సంగీతం సార్ దేవలోకం ఉదేశభాషలందు తెలుగు తియ్యందనం ఎక్కువ అని మీరే
అంటారుగా! అందుకే తెలుగు పేపర్లన్నీ కొరికాయ్ అన్నాడు కాలర్ ఎగరేస్తూ . దేవలోకం చేసిన ఎద్దేవకు ఏం చెప్పాలో అర్థంకాని బుడంకాయ్ కొరికి తిన్నందుకు కాదు, అన్నిటి మీద మలమూత్రవిసర్జన చేసి కంపు చేశాయ్ నా అలమార అన్నాడు సావధానంగా! ఈసారివిస్తుపోయారు సంగీతం దేవలోకం, డాన్సు పెంచెలయ్య. ప్రక్కనేవున్న హిందీటీచర్ విద్వత్ ఇదంతా వింటు వుండబట్టలేక పిల్లలు వ్రాసిన స్పెల్లింగ్ మిస్టేక్స్ పేపర్లు తిన్న తరువాత వాటికి అతి మూత్రవ్యాధి విరోచనాలు పట్టుకు నుంటాయ్ మిస్టర్ బుడంకాయ్ అన్నాడు నవ్వుతు. ఆయనగారి సహేతుక వివరణకు ముగ్గురూ నవ్వుకున్నారు.
ముక్కుకు గుడ్డకట్టుకొని, నోటికిప్లాస్టర్ వేసుకుని, చేతివేళ్లకు గ్లౌజ్ తొడుక్కుని తలకు కండువ చుట్టుకొని చేసేదిటీచరు ఉద్యోగం. ఎన్ని జాగ్రత్తలు? ఇవన్నీ జాగ్రత్తలు అంటేపొరపాటే. బుడంకాయ్ గారికిలేని జబ్బు లేదనటం
సముచితంగా వుంటుంది. ఎలర్జీ,తుమ్మలు, గజ్జి,దురదలు,బి.పి,ఎక్కువ తింటేడయాబిటిక్, రెండు మెట్లు ఎక్కితే ఆయాసం, ఎక్కువసేపు కూచుంటే శరీర భాగాలన్నీ తిమ్మిరెక్కుతాయ్! ఒకటా రెండా? అన్ని వ్యాధుల సమాహారమే బుడంకాయ్ ఆల్ డిసీజెస్ యిన్ వన్ బాడీ! మొత్తం మీద రాక్ శుభం చేసి ఎలుకలు కొరికిన పరీక్ష పేపర్లు ఆ రూములోనేడస్ట్ బిన్ లో వేశాడు. వేసివెయ్యకుండానే డస్ట్ బిన్ ఈ పేపర్లు వేసేందుకు నేను తప్పితే ఇంకేం దొరకలేదా? అని అడిగినట్లనిపించింది బుడం కాయ్కి. ఇక్కడ కాకపోతేఎక్కడ వేస్తాను? పైగా పరీక్ష పేపర్లు. వీటన్నిటినీ తగలబెడదామా అంటేకాగితం సాక్షాత్ సరస్వతీదేవికి ప్రతి రూపం. ఆం ఏం కాదులే అని అవి తగల పెడితేఅగ్నిదేవుడికిఏం కోపం వస్తుందో? బుడంకాయ గారు ప్రకృతి ప్రేమికుడు కూడాను. ఈ మధ్యనేపక్షుల వీక్షణ గ్రూపులో కూడా చేరాడు. ప్రతి ఆదివారం ఉదయం చెట్లవెంబడి, పుట్టల వెంబడిపడితిరుగుతు పక్షులను గమనిస్తున్నాడు.
ఈ ఎలుకలు కొరికిన చెత్తవదిలించుకోవటం ఎలా? తల వేడెక్కింది బుడంకాయ్ కి.
తలపాగా తీసిగోక్కుంటే అపురూపంగా పెంచుకున్న నాలుగు వెంట్రుకల్లో ఓ వెంట్రుక కాస్తా ఊడిపడిరది. ఆ గోకుడుకి గుండు మీద గాయం రక్తం కారటం మొదలుపెట్టింది. ఏం చెయ్యాలి? డాక్టరు దగ్గరకు వెళితే 56 రకాల పరీక్షలు చేయించమని అంటాడు. దిద్దిపారేసిన పేపర్లు 156 దాకా వున్నాయి కాని జేబులో 6 రూపాయలు కూడా లేవు. పైగా నెలాఖరు.
పోనీ అప్పు చేస్తే? అనుకోగానేశ్రీమతి ఃమంగతాయారుః జ్ఞాపకం వచ్చింది. అప్పిచ్చిన వాడితల, నా తల రోకలిబండతో ముక్కల పచ్చడిచేస్తుంది. డాక్టరూ వద్దు మందూ వద్దు. అప్పు అసలే వద్దు అనుకుంటు చిన్నపిల్లవాడిలా చేతులో వున్న చాక్పీసు అరగతీసి నెత్తురుపై నెత్తికిరాసుకున్నాడు.ఆ మంటకు ఏడుపు ఆపుకోలేకపోయాడు. కళ్ల వెంట నీరు ఏకధాటిగా కారుతోంది. అటుగా వెళుతున్న విద్యార్థిచూసి ఉఏమైందిఎవరన్నా పోయారండీ? అలా ఏడుస్తున్నా రెందుకండీ?్న అని సావ ధానంగా అడిగాడు. భరించలేని మంట, కోపం, ఏం చెప్పాలో తెలియక ముందు వెనక ఆలోచించకుండా ఠక్కున ఆ హెడ్మాస్టారు పోయాడు అన్నాడు బుడంకాయ. పాపం పిల్లవాడూ వెక్కి వెక్కి ఏడుపు ప్రారంభించాడు. ఒకరికియింకొకరు తోడైఅక్కడ ‘ఓఏడుపుల క్లబ్’ తయారైంది.
అటుగా వెళుతున్న లెక్కలసారును చూడగానే నోటికి తాళాలు పడ్డాయ్. పిల్లలందరూ మటుమాయమయ్యారు. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు బుడంకాయ. ఇప్పుడు ఇలా యింటికి వెళితే తల గాయం గూర్చి శ్రీమతి అడుగుతుంది. విషయం చెప్పీ చెప్ప కుండానే ఏడుపులు,పెడబొబ్బలు మొదలవుతాయి అనుకొని స్టాఫ్ రూంలోనే కూర్చున్నాడు. వచ్చేవారు వస్తున్నారు పోయేవారు పోతున్నారు. వారడిగే ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం చెప్పి వూరుకుంటున్నాడు బుడంకాయ. మనసు పరిపరివిధాలా వేధిస్తోంది.ఈ పేపర్లను ఏం చేయాలి? ఇంటికివెళ్లేలోపు ఏదో ఒకదారి దొరుకుతుందిలే అని చంకలో పేపర్లు పెట్టుకొని దర్జాగా బయలుదేరాడు.హఠాత్తుగా ఈదురుగాలి విజృంభించింది. దుమ్ము ధూళి పైకిలేచింది.పేపర్లగూర్చే ఆలోచించే ఆయన ఈ హఠాత్పరిణామాన్ని గమనించలేదు. కంట్లో దుమ్ము పడేసరికిచేతులెత్తి కళ్లుమూసు కున్నాడు. చంకలో కాగితాలు గాలిపటాల్లా సందు చివరిదాకా ఎగురుతు చెల్లాచెదురుగా భూమ్మీద కొన్ని, చెట్లకొమ్మల ఆకుల మధ్యలో కొన్ని, వీధిచివర్లో వున్న చెరువులోకి
కొన్ని కొట్టుకుపోయాయి.
ఐదేఐదు నిముషాల్లో వాయుదేవుడు విజృంభించటం, శాంతించటం జరిగి పోయింది.దుమ్ము పడ్డముఖాన్ని చెరువు నీళ్లతో కడుక్కుందామని చెరువు గట్టు దగ్గరకు చేరిచెరువులోకి చూసి మూర్ఛ పేషంటులా వూగిపోతూ కిందపడిగుడ్లు తేలేశాడు. వెంటనేతనను తాను తమాయించుకుంటు చేతులు చాచి ‘మరణ మృదంగం మీద నృత్యం చేస్తున్న’ మీన సుందరినోట్లో కాగితం తీసిచూస్తేతన శిష్యులు వ్రాసిన పరీక్ష పేపరు
ముక్క మీద మీనము అన్నది చూచి ఆ కాగి తాన్ని జేబులో వుంచీ వుంచకుండానేకేరింతలు వేస్తూ చేతిలో వున్న మీన సుందరిమృత్యువుని జయించి ఈదుకుంటు లాహిరిలాహిరి లాహిరిలో జగమేవూగెను అన్నంత ఆనందంలో చెరువు మధ్యకు చేరింది. బుడంకాయ వెళ్లిన దారినే ‘బర్డ్ వాచర్స్ క్లబ్’ సెక్రటరీ ఖగపతి కూడా యింటికి బయలుదేరాడు. ఆయన ధోరణిలో ఆయన కొత్తపిట్టేమైనా వచ్చిందేమో అనుకుంటు ‘బైనాక్యులర్’ తీసి ఓచెట్టు కొమ్మలో యిరుక్కుని ‘కీకీ’ అంటున్న పక్షిని గమనించాడు. అదిచావుబతుకుల మధ్య కొట్టుకుంటోందని అర్థమైంది. నిశితంగా గమనిస్తేదాన్నోట్లో కాగితం ముక్క. గొంతు కడ్డు పడిరదనుకొని అటుగా వెళుతున్న ఓచెలాకీవిద్యార్థిని పిలిచి చెట్టుపైవున్న పిట్టను చూపించి దాన్ని జాగ్రత్తగా కిందకు పట్టుకు రమ్మన్నారు. విద్యార్థీశతమర్కట ఉపాధ్యాయుడిమాట పూర్తయీ కాకుండానేవాడు చెట్టు సగం ఎక్కేసిపిట్టని పట్టుకుని కిందకిదిగి గురువుగారిచేతిలో ఆయన కోరుకున్న పక్షీశ్వరు ణ్ణివుంచాడు.పిట్టనోట్లో కాగితం తీసిపిట్టని పిల్లవాడి చేతిలో వుంచాడు. పరలోకానికి వెళ్లాల్సిన పిట్టపిల్లవాడిచేతుల్లో నుండి తుర్రున ఎగిరిపోయింది.చెరువు దగ్గర నుండి బుడంకాయ వీళ్లను వింతగా చూస్తూ ఏమైందండీఅని అడిగాడు. ఖగపతిగారు చేతిలోని కాగితం ముక్కను బుడంకాయ చేతిలో పెట్టాడు. బుడంకాయ కాలరెగరేసాడు ఈ కలుపు మొక్కలు సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వారు నేర్పిన ఇంగ్లీషులో కూడా ఉన్నాయా అని అనుకున్నాడు.పక్కనేవున్న చెట్టెక్కి దిగిన విద్యార్థిఆ పేపరు నాదేనండి అదినేనే వ్రాశాను. నా ఇంగ్లీషు దస్తూ రినేను గుర్తుపట్టగలనండీ అన్నాడు. వాడి మాటలకు బుడంకాయ మళ్లీ బుర్రగీక్కున్నాడు. మిగిలివున్న మూడు ఎడారి మొక్కల్లో ఒకటి కిందకు పడిరది. నెత్తిన మిగిలి వున్న రెండు మొక్కలు ఈరోజుకు బతిక్రిపోయాం అనుకున్నాయి. పిల్లలు నాటిన యీ కలుపు మొక్కలు ఎప్పుడు వూడిపడతాయో! అనుకుంటు దిగాలుగా యిల్లు చేరాడు. చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారినట్లు పరీక్ష పేపర్లు కొరికిన ఎలుకల దగ్గర నుండి చావు బ్రతుకుల మధ్య నరకం అనుభవించి బయటపడ్డమీన సుందరి, పక్షీశ్వరుల కథలు, కథలు కథలుగా స్కూలు మొత్తానికి తెలిశాయి. ఆనోట ఆనోట హెడ్ మాస్టరు గజవా హనుడికీ తెలిసింది. గజవాహనుడు చండశాసనుడు. స్కూలు పిల్లల్ని గడగడ లాడిస్తాడేకాని ఆయన పిల్లల్ని చూస్తే ఆయన గడగడలాడుతాడు. స్టాఫ్ రూంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటు నవ్వులు విరగబూస్తున్న సమయంలో గజవాహనుడు వచ్చాడు. ఆయన్ను చూడగానేవాతావరణం మారిపోయింది. వాడిపోయిన కుసుమాల్లా ముఖాల్లో మార్పు వచ్చింది. ఇదంతా గమనించ లేనంత అసమర్ధుడు కాదు గజవాహ నుడు.అందర్ని చూస్తూ ఉనా రాక మీకేమైనా ఇబ్బందిగా వుందా అన్నారు.ఉచెట్టెక్కి కిందకు దింపిన పిల్లవాడి పిట్టకథ ప్రాణాపాయం నుండి బయటపడిన ఉమీన సుందరికథఉ తెలుసా? అని గద్దించాడు గజవాహనుడు. అందర్నీ ఉతికిఆరేద్దామని వచ్చి ఏదోమొదలు పెట్టబోయేలోపేబెల్ మోగింది. అక్కడున్నవారు అంతా ఎవరిమానాన వారు పుస్తకాలు,డస్టరు, చాక్పీసు తీసుకుని గజవాహనానికి నమస్కరిస్తూ బయటపడ్డారు. కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుకుంటు అక్కడేకూర్చున్న బుడంకాయను సావకాశంగా ఉఏం చేస్తున్నారండి? అని అడిగిఆయవ పక్కనేకూర్చున్నాడు గజవా హనుడు. దిద్దుతున్న పుస్తకాన్ని చూపిస్తూ తెలుగు కాంపోజిషన్ దిద్దుతున్నా సార్ అని పుస్తకం పెద్దాయనకు చూపించాడు. పుస్తకంలో ప్రతిపేజీ దిద్ది వ్రాసిన సరిjైున పదాలు, వ్యాసంపైవిద్యార్థికి చేసిన సూచనలు అన్నీ చూశాడు గజవాహనుడు సావకాశంగా. ఏంటిసార్ 10ష్ట్రలో యింత ఘోరమా? అన్న ఆయన ప్రశ్నకు ఇదిచూడండి అంటూ యింకో పుస్తకంలో ఓపేజీ చూపిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో కాళ్లు, చేతులు,తల కోల్పోయి మొండెం ఏనుగుల కాళ్ల కిందపడి రక్తసిక్తమైన కురుక్షేత్రసంగ్రామాన్ని తలపిస్తుందియీ ఎర్రసిరా గుర్తులు అంటు తన అశక్తను తెలియజేసాడు బుడంకాయ్. ఆ పుస్తకంలోని అన్ని పేజీలు తిప్పి అట్టమీద పేరు చూసిదిమ్మెర పోయారు గజవాహనుడు. అదెవరిదో కాదు అక్షరాల తన పుతర్రత్నానిదే. బుడంకాయ మీద కోపం చల్లారలేదు. ఎంత కోపం బాధగా వుంటే మాత్రం ‘హెడ్మాష్టరు చచ్చాడని’ పిల్లలకు చెపుతాడా? కోపాన్ని తమాయించుకుంటున్నాడు గజవాహనుడు. వారిద్దరిమధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో ప్యూన్ అప్పలస్వామి ఓ ఫైల్ చేతికిచ్చి నిలబడ్డాడు. ‘పద. వస్తున్నా నంటు’ లేచి రూంకి బయలు దేరాడు.ఓ వారం రోజుల తరువాత గజవాహనుడు తన పుత్ర రత్నానికితెలుగు చెప్పే బుడంకాయకి కబురు చేశారు.వీలైతేయీరోజు సాయంత్రం మాఇంటి కిటీకిరాగలరా? ఓ తప్పకుండ వస్తా అంటు తిరుగు సమాధానం కబురు తెచ్చిన వ్యక్తిచేతే కబురు పంపాడు.ఏం ఆలోచించ లేదు. సాయంత్రం గజవాహనుని ఇంటికి వెళ్లాడు బుడంకాయ్. సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకుని పోయి ఏవేవో పిచ్చాపాటి మాట్లాడి అసలు విషయానికివచ్చాడు.మీ గూర్చి నాకే అనుమానమూ లేదు. మీరు శక్తివంచన లేకుండా పిల్లల అభివృద్ధికికావలసిన చర్యలన్నీ తీసుకుంటు ఆహ్లాద వాతావరణంలో పాఠం బోర్ కొట్టకుండా చెపుతారనీ తెలుసు. పిల్లల అశద్ధ్రను ఏమాత్రం సహించరనీ తెలుసు. కానీ యీ కురుక్షేత్రసంగ్రామంలో రక్తం మరకల్లా యీ ఎర్రసిరా గుర్తులేంటిసార్? అన్నాడు. తెలుగు సాహితీ నందనవనంలో మొలకెత్తాల్సిన కల్పవృక్షం విద్యార్థుల చేతుల్లో పడి కలుపు మొక్కలుగా మొలిచిందండీ! కారణం ఎవరైనా కావచ్చు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమా జం, పాఠశాల యాజమాన్యం, ప్రభుత్వం తీరుతెన్ను-ఏదైనా కావచ్చు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపైన ఎంతమందికి ప్రేమా భిమానాలున్నాయి మాతృమూర్తి మీదేఅభిమానం చూపించలేని వీరు మాతృభాష మీదేం అభిమానం చూపిస్తారు? అంటేమనమేం చేయలేమా అన్న గజవాహనం మాటకికాంగ్రెస్ మొక్కలు అంటే పార్థీనియంని ఏ ఒక్కడో అంత మొందించలేడు. ఏ ఒక్క సంవత్సరంలోనో ఆ పని కాదు. రైతులందరూ సామూహికంగా కొన్ని సంవత్సరాలు అవి మొలకెత్తిన రోజుల్లోనే పీకేస్తే వాటి ఉత్పత్తి తగ్గి చివరికి అదృశ్యం కావచ్చు.తెల్లకాగితం లాంటివిద్యార్థుల మెదడులో అమోఘమైన జ్ఞాపకశక్తిఉంటుంది. అదిఆ వయసులో ఎట్లా చెపితే అట్లా వింటుంది ఆ సమయంలో సరిjైున ఉపాధ్యాయుని చేతులో విద్యార్థి పడితే సాహితీ నందన వనంలో కల్పవృక్షమే కాదు క్రియేటివిటీ అనే కామధేనువూ ఉదయిస్తుంది. దేశం మొత్తం -అన్ని శాఖల్లో – యీ కలుపుమొక్కలు ఒక్కొక్క చోట ఒక్కో పేరుతో పెరిగాయి. కలుపు మొక్కే గదా అని నాడు వదిలేశాం. అది నేడు మహా వృక్షంగా సిగ్గుసెరం లేకుండ తలెత్తుకుని భుజాలు ఎగరవేస్తోంది-ఇంతకంటే ఏం చెప్ప లేను సార్ అన్నాడు బుడంకాయ. గజవాహనం గారిభార్య దేవమ్మ తెచ్చిన టీతీసుకుంటు ఏమ్మా ఎలా వున్నావు? నీ రచనా వ్యాసంగం ఎలా వుంది? అని వాత్సల్యంగా అడిగారు బుడంకా య్. నేను మీ శిష్యురాలిని సార్. మీరు నా చిన్ననాడు నామీద ఉంచిన ఆశలు నిరాశలు చేయలేదు. మీ దయవల్ల నా రచనా వ్యాసంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వుందండీ అన్నదిఎంతో వినమ్రతతో. మంచి కబురు చెప్పావు. ఇదిగో యీ చాక్లెట్ తీసుకో అంటు చేతిలో చాక్లెట్ పెట్టి నేటిపిల్లలే రేపటిపౌరులు. వాళ్లను అన్ని విధాల తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడ వున్నదన్న సంగతి గుర్తుంచుకోవాలి అంటూ దంపతులిద్దరినుండి సెలవు తీసుకున్నాడు బుడంకాయ. ఇంటి బయటకొస్తోంటేగార్డెన్లో తోటమాలి ఏకాం బరం కలుపుమొక్కలు పీకు తున్నాడు. వాడు జీవితాంతం ప్రయత్నించినా యీ కలుపు తగ్గదనుకుంటు యింటికిచేరాడు బుడంకాయ్ –గోమఠం రంగా చార్యులు