కడలి కోత పెడుతోంది..!

‘‘బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖ సముద్రతీరం భయపెడుతోంది. రాకాసి అలలు తీరం వెంబడి అలజడి సృష్టిస్తున్నాయి.అలల ఉధృతికి తీరంలో కోత పెరిగిపోతుంది. ఇసుక తెన్నెలు కరిగిపోకుండా ఏర్పాటు చేసిన రాళ్లగోడలు సైతం జారుతున్నాయి. ఆర్కేబీచ్‌లో కోత నివారణ కోసం పెంచుతున్న కొబ్బరి వనాలు కోతకు కడలిలో కలసిపోతున్నాయి.కడలి హోరును ఆవేమీ తట్టుకోలేకపోతున్నాయి. ఫలితంగా కురుసురా సబ్‌మెరైన్ మ్యూజియం ప్రాంతంలో నానాటికీ తీర ప్రాంతం కడలిలో కలిసిపోతుంది.కొన్నాళ్లుగా శాంతించి గంగమ్మతల్లీ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది.. సముద్రం గత రెండు మూడు రోజుల నుంచి ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో కొన్నిచోట్ల భారీగా భూమి కోతకు గురవుతోంది.. ఆర్కేబీచ్‌లో విక్టరీ ఎట్ సీ ఎదురుగా ఉన్న బీచ్ సందర్శకులను భయపెడుతోంది.అక్కడ పర్యాటకులు, సందర్శకులు సేదతీరేందుకు ఏర్పాటుచేసిన కోకోనట్ ఎరినాకు కెరటాలు తాకుతున్నాయి. ఈ పరిణామాలు సందర్శకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.’’ – (జి.ఏ.సునీల్ కుమార్)
విశాఖలోని సాగరతీరం మళ్లీ కోతకు గురవు తోంది.తరచూ సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. గతంలో తుఫాన్లు,పెనుతుఫానుల సమయం లోనే ఇలాంటి పరిస్థితి తెలెత్తేంది.కానీ ఇప్పుడు స్వల్పంగా ప్రభావం చూపే అల్పపీడనాలు,ఆవర్తనాలు వంటివి ఏర్పడినప్పుడు కూడా కడలి కన్నెర్ర చేస్తోం ది.గతంలో 2014,2015,2016 సంవత్స రాల్లో విశాఖసాగరతీరం కోతకు గురైంది.2015లో మరిం త అధికంగా..కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. ఆర్కేబీచ్ సహా పలుచోట్ల బీచ్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.అప్పట్లో జీవీఎంసీ అధికారులు తీరంలో పెద్దపెద్ద బండరాళ్లను దింపి దడిలా ఏర్పాటు చేసి కోతను తాత్కాలికంగా కట్టడి చేశారు.
రక్షణ కోసం వేసిన ఐరన్ మెస్ ధ్వంసం చేసేలా..
ఇన్నాళ్లు ఎక్కడో చోట అప్పుడప్పుడు తీరం కోతకు గురయ్యేది.సబ్ మెరైన్ మ్యూజియం,నోవెటల్ ఎదు రుగా ఉన్నబీచ్,సాగర్‌నగర్ ఋషికొండ ప్రాంతా ల్లోనూ కోతకు గురయ్యేది.ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో తీవ్రత కాస్త తగినప్పటికీ..తాజాగా విక్టరీ ఎట్ సీ వద్ద సముద్రం భారీగా ముందుకు చొచ్చుకొస్తోంది. పౌర్ణమి నుంచి ఆటుపోట్ల తీవ్రత మరింత పెరిగింది. ఆర్కే బీచ్ ఏరియాలో సందర్శకులు సేద జరిగినం దుకు కొన్నిచోట్ల కోకోనట్ ఎరీనాలు ఏర్పాటు చేశారు అధికారులు.తీరం కోతకు గురై కొబ్బరి చెట్లు పడిపో కుండా..ఉండేందుకు ఇసుకతోపాటు పెద్ద పెద్ద రాళ్ల ను పేర్చి వాటికి ఐరన్ మెస్ ను రక్షణగా పెట్టారు. అయితే ప్రస్తుతం సముద్రపు కెరటాల ఉగ్రరూపంతో.. ఆ ఐరన్ మెస్‌ను తాకి..అక్కడ ఇసుకను తనలో కలిపేసుకోవడమే కాకుండా.. మెస్ లోపలికి కెరటాలు చొచ్చుకెళ్లి ఐరన్ మెస్‌ను ధ్వంసం చేసేలా ఉంది. దీంతో మెస్ లోపల కొబ్బరిచెట్ల రక్షణ కోసం ఏర్పాటు చేసిన బండ రాళ్లుసైతం బీచ్ కెరటాల వైపు కొట్టుకు వెళ్తున్నాయి.ఇది స్థానిక మత్స్యకారులను సైతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
యారాడ నుంచి భీమిలి వరకూ..
సముద్రం నుంచి అలలు ఎగసిపడుతూ దూకుడుగా ముందుకు రావడంవల్ల తీరంలో ఇసుక పెద్ద మొత్తం లో సముద్రంలోకి కొట్టుకుపోతోంది. సాధార ణంగా ఏటా నైరుతి రుతుపవనాల సీజనులో అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతోంది. కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ ఇక్కడి తీరంకోత సమస్య ఎదుర్కొంటోంది.ముఖ్యంగా యారాడ నుంచి భీమిలి వరకు దాదాపు 35 కిలోమీ టర్ల దూరంలో కొన్నిచోట్ల సముద్రతీరం తరచూ కోతకు గురవుతున్నట్లు నిపుణులు ఇప్పటికే గుర్తిం చారు.ఇందులో యారాడబీచ్,కోస్టల్‌బ్యాటరీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం,చిల్డ్రన్స్ పార్క్, జోడుగుళ్లపాలెం,రుషికొండ,భీమిలి తదితర ప్రాంతా లున్నాయి.ఈ పరిస్థితిని నివారించడానికి విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ)డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్ చేయిస్తుం టుంది.ఏటా ఏఫ్రిల్,మే నెలల్లో డ్రెడ్జింగ్ ద్వారా కోతకు గురైన ప్రాంతాళ్లో ఇసుకను పంపింగ్ చేస్తుంది.దీంతో తీరం కోతకు ఒకింత అడ్డుకట్ట పడుతోంది.
తాజాగా దూకుడు..
విశాఖలో తీరం కోతకు సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి.సముద్రంలో మార్పులకు తోడు వాతావరణ పరిస్థితులు..భౌగోళిక పరిస్థితుల్లో కూడా తోడవుతున్నాయి అన్నది నిపుణుల అంచనా.. వాస్తవానికి,పౌర్ణమి అమావాస్యలకు కెరటాల ఆటు పోట్లు సహజం..కానీ,సాధారణ రోజుల్లో కూడా ఆటు పోట్లు పెరుగుతుండటం,అలలు చొచ్చుకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా విశాఖ తీరం మరోసారి కోతకు గురవుతోంది.దాదాపు మూడు రోజుల నుంచి ఈపరిస్థితి ఉంది.కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు ఉన్న మధ్య ప్రాంతంతోపాటు మరికొన్నిచోట్ల కోత ప్రభావం కనిపి స్తోంది.విశాఖ బీచ్‌లో నాలుగైదు చోట్ల పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓరిసార్ట్సు సంస్థ కొన్నేళ్ల క్రితం సుమారు 600కొబ్బరి చెట్లను నాటింది.ఆ చెట్లును బీచ్ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సముద్రతీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు,బీచ్‌లో వివిధ ఆకృతులతో జీవీ ఎంసీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కూలుతు న్నాయి.
కోత నివారణకు విశాఖ పోర్టు సంరక్షణ చర్యలు..
విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతంలో బీచ్ నిర్వహ ణ,విశాఖ పోర్టు అథారిటీ సామాజిక బాధ్యతలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం అవుటర్ హార్బర్లో పేరుకున్న ఇసుకను సముద్రతీర ప్రాంత పరిసరాలలో నింపుతూ విశాఖలో బీచ్‌కోత నివారణకు పోర్టు సంరక్షణ చర్యలు తీసుకుంటుంది.విశాఖ నగరంలోని బీచ్లను పరిరక్షిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తుంది.బీచ్‌కోత నివారణ కోసం డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న అత్యాధునిక డ్రెజ్జర్లను వినియోగించి,డిసిఐ డ్రెడ్జ్ 21పరికరంతో పోర్టులోపల పేరుకుపోయిన ఇసు కను తవ్వి ఆర్కే బీచ్ పరిసరాలలో 0.5కిలమీటర్ల పొడవైన పెపులైన్లు, రెయిన్ బోయింగ్ ద్వారా నింపు తారు.ఇలా ప్రతి ఏటా పోర్ట్ అధికారులు, రాష్ట్ర ప్రభు త్వం డ్రెడ్జింగ్ పనులు చేపడితేనే బీచ్ కోతకు గురవ కుండా ఉంటుంది.గత సంవత్సరం కొంతమేర పను లు చేసినప్పటికీ ఈ సంవత్సరం మరల కోతకు గురవు తుంది. ఇప్పటికైనా పోర్ట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని బీచ్ కోతకు గురవకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు.
కోత నివారణకు ప్రతిపాదనలు..
ఇటీవల సముద్రం కోతకు గురైన సంద ర్భాల్లో భారీగా సముద్రంలో ఉన్న ఇసుకను తీరంపై వేసేవారు.వైజాగ్ పోర్ట్ ప్రత్యేకంగా దీనికోసం ఆర్థిక భారాన్ని భరించి ఇసుకను డ్రెడ్జింగ్ చేసేది.హుదూద్ సమయంలో కెరటాలు ఆర్కే బీచ్ రోడ్డుపైకి వచ్చాయి.. ఆ సమయంలో భారీగా తీరం కోతకు గురవడంతో నివారణ చర్యలు తీసుకున్నారు.అయినప్పటికీ సము ద్రుడి ఉగ్రరూపం ముందు ఆచర్యలన్ని తాత్కాలి కంగానే మిగిలిపోయాయి.అయితే గతంలో చేసిన డ్రెడ్జింగ్ ద్వారా ఆర్టిఫిషియల్‌గా వేసిన ఇసుక మళ్ళీ సముద్రం తన సహజసిద్ధంగా సముద్రంలోనికి కలిపే సుకుంటుందని మరి కొంతమంది నిపుణులు అంటు న్నారు. అయితే..తీరం కొత్తశాశ్వత నివారణకు వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికను సిద్ధం చేసింది.తాజాగా జరిగిన సమావేశంలో పలు కీలక పనులకు,ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేస్తూ.. కోస్టల్ ఎరోసన్ ప్రాజెక్టుకూ ప్రతిపాదన కేంద్రానికి పంపింది. 200కోట్ల వ్యయంతో కేంద్రప్రభుత్వం, వీఎంఆర్‌డీఏ 90:10నిష్పత్తిలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా ప్రణాళికలో సిద్ధం చేశారు.
భయపడెతున్న సాగరతీరం..
ఒకప్పుడు బీచ్‌కు వెళ్తే చాలా దూరం ఇసు కలో నడుస్తూ కెరటాల ముందు వరకూ వెళ్లే వాతా వరణం ఉండేదని,ఇప్పుడు తీరం భారీ కోతలమూ లంగా ఎక్కడ కూర్చోవాలో తెలియనంతగా ఇరుకుగా మారింది.అధికారులు,పర్యావరణవేత్తలుఈ విష యంలో తగిన పరిష్కారం చూపాలి.అందమైన విశాఖ బీచ్ అలాగే ఉండాలంటే విశాలమైన ఇసుక తిన్నెలు ఉండాల్సిందేనని బీచ్‌ప్రేమికులు అంటున్నారు. విశాఖ సాగరంలో 2012లోఏర్పడిన సునామీ సమ యంలో కూడా హద్దులు దాటి పెద్దగా ముందుకు రాలేదని గుర్తు చేస్తున్నారు.కానీ ఇప్పుడు చూస్తే పరిస్థి తులు కాస్త ప్రతికూలంగా మారుతున్నాయని ప్రజలు కలవరపడుతున్నారు.ఈనేపథ్యంలో సముద్రం నెమ్మ దిగా ముందుకు దూసుకుని వస్తే ఎలా అన్నచర్చ పర్యాటకులు,సందర్శకుల్లో మొదలైంది.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..
విశాఖపట్నం అనగానే సుందర సాగరతీరం అందరికీ గుర్తొస్తుంది. వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరు బీచ్ ని సందర్శించే వెళ్తారు. నిత్యం పర్యాటకులు, నగరవాసులతో బీజ్ అంతా సందడిగా కనిపిస్తుం టుంది. అయితే అలాంటి సాగరతీరం కోతకు గురవు తోంది. అలలు తాకిడికి తీరం కోతకు గురవుతోంది.. దీంతో చెట్లు, పార్కులు, రోడ్లు ధంసం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో పోర్ట్ అధికారులు, జీవీఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. సముద్ర శాస్త్ర రిట్కెర్డ్ ప్రొఫెసర్ బీఆర్ రెడ్డి అంటు న్నారు.ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీరం పక్కన ఉన్న రోడ్లు, భవనాలు మునిగిపోయే ప్రమాదం ఉదని ఆయన తెలిపారు. గతంలో సము ద్రం లోపల నుండి ఇసుక తీసుకువచ్చి డ్రెజ్జింగ్ పనులు చేసేవావారని..ఇలా చేస్తే తీరం కోతకు గురవ కుండా ఉంటుందని తెలిపారు. అయితే ఇటీవల డ్రెజ్జింగ్ పనులు చేయకపోవడం..అధిక శాతం ఇసుక అలల తాకిడికి కోతకు గురికావడంతో తీర ప్రాంతం దెబ్బతింటోందని ఆయన తెలిపారు.