కంటకాపల్లి రైల్వే ప్రమాదంలో మృత్యుఘటికలు
ఈ ఘోర ఘటన మరువ లేనిది. ఎన్ని రైల్వే ప్రమాదాలు జరిగినా సామాన్యుడు ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభు త్వాలకు పట్టడం లేదు. అందుకే పదే పదే ఒకే తరహా ప్రమాదాలు ప్రయాణీకులను బలితీసుకుంటున్నాయి. విజయనగరం జిల్లా కంటకాపల్లి దరిలో జరిగిన ఘటనే తార్కాణం. అక్టోబర్ 29న పొద్దు వాలు తున్న సమాయన సంభవించిన ఘోర రైలు ప్రమాదం పదమూడు మంది అమా యకుల ప్రాణాలను కబళించింది. వంద మంది వరకు క్షతగాత్రులను చేసింది. విశాఖ నుంచి పలాస వెళుతున్న ప్యాసిం జర్ రైలుకు సిగల్ అందక కంటకాపల్లి సమీపంలో ట్రాక్‌పై నిలిపిఉంచగా, వెనక నుంచి అదే పట్టాలపై విశాఖ నుంచి రాయగడ వెళ్లే ప్యాసింజర్ రైలు వేగంగా ఢకొట్టిెంది.ఆ ధాటికి రాయగడ రైలు కొన్ని బోగీలు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని పక్క ట్రాక్‌లోని గూడ్స్ రైలు మీదికి దూసుకెళ్లాయి. ఈ భీతావహంలో చని పోయిన వారిలో ఇద్దరు లోకో పైలెట్లు, గార్డు కూడా ఉండటం విషాదం. ముందుగా వెళ్లిన రైలుకు సిగల్ అందని పరిస్థితి ఉండగా వెనుక మరో రైలును అదే ట్రాక్‌పై పంపడం రైల్వే భద్రత డొల్లత నానికి నిదర్శనం. ఇదే రూట్‌లో ఒడిశా లోని బాలాసోర్ వద్ద జూన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 296 మంది మరణించగా 1,200 మంది గాయపడ్డారు. ఆ ఘోర కలిని మర్చిపోక ముందే అదే తరహాలో సిగల్ వైఫల్యం కారణంగా మూడు రైళ్లు గుద్దుకు న్నాయి.ఈ నెలలోనే బీహార్‌లో పట్టాలు ఊడి పోవడాన్ని గమనించిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెనుముప్పు తప్పింది. నాలుగు మరణాలు,70 మందికి గాయా లతో సరి పోయింది. వరుస రైలు ప్రమాదాలతో రైలు ప్రయాణ మంటేనే ప్రజలను భీతిల్లజేస్తోంది. దుర్ఘటన జరిగిన ప్రతిసారీ ప్రముఖుల సంతాపాలు, పరామర్శలు, తృణమో పణమో పరిహారాలు మినహా ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి,కారణాలు కనుగొని,పునరావృతం కాకుండాపటిష్ట చర్యలు చేపట్టే విషయంలోకేంద్ర ప్రభు త్వం బాధ్యత తప్పింది.ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజలను ఏమారు స్తోంది.రైల్వే భద్రత విషయంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని 2022లో విడుదల చేసిన కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది.దాదాపు రైలు ప్రమాదాలన్నీ పట్టాలు తప్పడం వల్లనే సంభవిస్తున్నాయని, పట్టాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాల్సి ఉండగా, 2017 లో ప్రత్యేకంగా నెలకొల్పిన రాష్ట్రీయ రైలు రక్షణ నిధి నిధులు తగ్గించిన వైనాన్ని కాగ్ ఎత్తి చూపింది. అలాగే రైల్వేలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ రిపోర్టు ప్రకారం రైలు ప్రమాదాలపై రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికలపై ఎలాంటి చర్యలూ లేవు. ఇదీ ప్రయాణీకుల ప్రాణాలకు మోడీ ప్రభుత్వం ఇచ్చే విలువ. బాలాసోర్ ఘటన విషయానికే వస్తే సిబిఐ దర్యాప్తు చేసి ముగ్గురు అధికా రులను అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్ వేసి మమ అనిపించింది. కానీ సిగలింగ్ వ్యవస్థ ఏమాత్రం మారలేదని విజయనగరం ఘటన వలన తేటతెల్లమవుతోంది.కేంద్రంలో బిజెపి వచ్చాక రైల్వేల ప్రైవేటీకరణ దూకుడుగా జరుగుతోంది. వందల ప్రైవేటు రైళ్లొచ్చాయి. అదానీ వంటి కార్పొరేట్లకు రైల్వే ఆస్తులు ధారాదత్తమవుతున్నాయి. రైల్వే ప్రత్యేక బడ్జెట్ ఎత్తేశారు. ప్యాసింజర్ రైళ్లు రద్దవుతూ వందేభారత్, హైస్పీడ్ ట్రైన్లు ప్రవేశపెడు తున్నారు. 2022 చివరి నాటికి రైల్వేలలో మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయాన రైల్వేశాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడిరచారు. రైళ్లల్లో ప్రతి రోజూ రెండున్నర కోట్ల మంది గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఒక వైపు రైల్వేల ద్వారా ఏడాదికి రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని మోడీ ప్రభుత్వం ఆర్జిస్తూ మరో వైపు ప్రయాణీకుల భద్రతకు ఏడాదికి రూ.5 వేల కోట్లు కూడా కేటాయిం చడం లేదు. సిబ్బంది లేని వేలాది లెవెల్ క్రాసింగ్‌లు పెట్టుకొని బుల్లెట్ రైళ్లనడం మోడీ ప్రభుత్వానికే చెల్లుతుంది. రైలు ప్రమాదాలను మానవ తప్పిదంగానో,కుట్రగానో చిత్రించడం తప్పించుకొనే ఎత్తు. ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ రంగ రవాణా వ్యవస్థ మన రైల్వే. అత్యధిక ఉద్యోగులు పని చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా మన రైల్వేలకు పేరుంది. రైల్వేలపట్ల ప్రభుత్వ విధానాల్లో మార్పు రానంత వరకు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల చందమే. విజయ నగరం దుర్ఘటనతోనైనా కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మేల్కోవాలి.ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి.
సిగ్నలింగ్ వ్యవస్థ లోపాలు..
దేశ రైల్వేలో భద్రతా సిబ్బంది కొరత, సిగలింగ్ వ్యవస్థ ఆపరేషన్స్ నిర్వహణ విష యంలో కేంద్రంలోని మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో, గడిచిన ఆరేళ్లుగా తూర్పు కోస్తా రైల్వే పరిధి లోని వాల్తేరు డివిజన్‌లో ప్రమాదాలు క్రమేపీ పెరుగుతున్నాయి. భారీ ఘటనలు చోటుచేసు కున్నాయి. ఇక్కడ సుమారు రెండు వేల మంది ఇంజనీరింగ్ సిబ్బంది కొరత ఏళ్ల తరబడి వెంటాడుతోంది. 2013లో విజయ నగరం జిల్లా గొట్లాంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక బోగీలో పొగ వచ్చిందని, ఏదో ప్రమాదం జరగబోతుందనే కంగారులో రైలు గొలుసు లాగి పక్కనే మరో రైల్వే ట్రాక్‌లోకి ప్రయాణి కులు వెళ్తున్న క్రమంలో ఆ ట్రాక్‌పై వచ్చిన రైలు ఢకొనెడంతో మృతి చెందారు. 2016 లో కూనేరులో హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 41 మంది మరణించారు. దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశాలోని బాలాసూర్‌లో ఎదురెదురుగా వచ్చిన రైళ్లు ఢకొన్నె ఘటనలో 298 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. తాజాగా వాల్తేరు డివిజన్ పరిధిలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ వద్ద 2023 అక్టోబర్ 29 రాత్రి రాయగడ-విజ యవాడ ఎక్స్‌ప్రెస్ రైలు పలాస పాసింజరును ఢకొనెడంతో సుమారు 13మంది విగతజీవు లయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, మోడీ ప్రభుత్వం రైల్వేల భద్రతను పట్టించు కోకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు ప్రాథమిక విశ్లేషణ ఇలా ఉంది. వాల్తేరు డివిజన్‌లో ప్రధాన, నిత్యం బిజీగా ఉండే రైల్వే లైను ఇది.మూడు రైల్వే లైన్లు ఇక్కడ ఉన్నాయి. మధ్య లైనులో ఈ తాజా ఘటన జరిగింది. హౌరా-చెన్నరు వెళ్లే రైళ్లు,కోరమండల్,కోణార్క్ ఎక్స్‌ప్రెస్, మెయిల్,సరుకు రవాణా గూడ్స్ రైళ్లు ఈ లైన్లోనే వెళతాయి.వాల్తేరు రైల్వేలో కీలకమైన మూడు లైన్లు ఇవే అయినప్పటికీ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం ఘటనపై రైల్వే ప్రాథమిక అంచనాలు ఇలా ఉన్నాయి. స్నిగల్ వ్యవస్థల్లో రెడ్ (ఎరుపు)-1,గ్రీన్ (ఆకుపచ్చ)-2 సిగల్ లైట్లు ఉంటాయి. పూర్తిగా రెడ్ ఉంటే ఆగడం,గ్రీన్ ఉంటే వెళ్లడం చేయాలి.పసుపు లైట్లు రెండు ఉం టాయి. అవి రెండూ వెలిగితే ప్రొసీడ్ (2 సెక్షన్లు) లైన్లు క్లియర్‌గా ఉన్నాయని అర్థం. కానీ,ఒక పసుపు లైటు వెలిగి ఉంటే ఒక సెక్షన్ క్లియర్ అని, ఆగిఆగి వెళ్లాలని సంకే తం.తాజాగా జరిగిన ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్ కాస్త వేగంగా ప్రొసీడ్ అయ్యారని అంచనా వేస్తున్నారు.దీన్నే సిగల్ ఓవర్ సీగా రైల్వే పరిభాషలో పేర్కొం టున్నారు.
సిఆర్‌ఎస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం
కంటకాపల్లి ఘటనపై ఇన్వెస్టిగేషన్‌కు కమిషనర్ రైల్వే స్టేఫ్టీ (సిఆర్‌ఎస్)ను కేంద్రం సోమవారం నియమించింది. ప్రత్యేక సాంకే తిక నిపుణుల బృందం వాల్తేరు డివిజన్‌లో ఈ మేరకు పరిశీలన చేయనుంది. మూడు రోజుల తర్వాత పేపర్ నోటిఫికేషన్ కూడా ఆనవాయితీ ప్రకారం విడుదల చేసి ప్రత్యక్షం గా, పరోక్షంగా ఎవరైనా ఈ ఘటనపై వివరాలు అందజేసేవారుంటే ఫలానా చోట కలవాలని ఈ కమిటీ తెలియపరచనుంది. ప్రజలు,రైల్వే సిబ్బంది, ప్రయాణికులందరినీ ఇలా విచారణ చేశాక పదిరోజుల తర్వాత ఈ ప్రమాద కారణాన్ని వెల్లడిరచనున్నారు. నానాటికీ తీసికట్టుగా భద్రత
ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వేల్లో లోకో పైలట్లకు అధిక పని ఒత్తిడి ఉందని కోర మండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి ముందే కేంద్రానికి రైల్వే బోర్డు నివేదించింది.ఈస్ట్ కోస్ట్ పరిధిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ట్రాక్‌లకు ఇరువైపులా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని బోర్డు చెప్పినా రైల్వే శాఖకు పట్టలేదు. లోకో పైలట్ల పని 12 గంటలకు మించకుండా ఉండాలని సూచిం చింది.కానీ,12గంటలపైనే వీరితో పని చేయించుకుంటోంది.సదరన్ రైల్వే పరిధిలో 392 లోకో పైలట్ల పోస్టులు ఖాళీలు ఉన్నా యి.2017 నుంచి 2021 కాలానికి కేంద్ర ప్రభుత్వం భద్రతా నిధి కింద రూ.20వేల కోట్లు ఏర్పాటు చేయాలి. కానీ,రూ.4వేల కోట్ల మేరే జమ చేసింది. ఈ విషయంలో కేంద్ర వైఫల్యంపై కాగ్ 2021లో తప్పు పట్టింది.అదే విధంగా రైల్వే లైన్ల మరమ్మ తుల నుంచి సిబ్బంది సంఖ్యను పెంచే అంశం వరకూ వివిధ అంశాలపై వివిధ కమిటీలు, రైల్వే ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాలు ఇచ్చిన సిఫార్సులు ప్రభుత్వం ముందు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వర్షాకాలంలో వానలు పడటం,వరదలు రావడం కొత్తేమీ కాదు.అతి తక్కువ రోజుల్లో అత్యధిక వర్ష పాతం నమోదు కావడమూ,ఫలితంగా అనూహ్య వరదలు సంభవించడమూ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నదే!ఆ విష యం పక్కన పెట్టినప్పటికీ లైన్లను నిరంతరం కాపలా కాస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యల కోసం హెచ్చరికలు చేసే గ్యాంగ్‌మెన్ల వ్యవస్థ రైల్వేశాఖకు ప్రత్యేకం. కీలకమైన ఈ వ్యవస్థలో నియమకాలు కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి.ఉన్న వారిని కూడా ఏదో రకంగా వదిలించుకోవడానికే రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. సమాచార సాంకేతిక విప్లవానికి ఆకాశమే హద్దుగా మారిన ప్రస్తుత రోజుల్లోనూ తాతల కాలం నాటి బూజు పట్టిన విధానాలనే రైల్వేశాఖ అమలు చేస్తోంది.ఫలితంగా రైలు పట్టాల వెంట నిరం తరం పహరా కాయాల్సిన గ్యాంగ్‌మెన్లపై పని భారం విపరీతంగా పెరుగుతోంది. ఒక్క గ్యాంగ్‌మెన్ల విషయంలోనే కాదు, ప్రయాణీ కుల భద్రతతో ముడిబడిన డ్రైవర్లు, గార్డులు, సిగలింగ్ సిబ్బంది, తదితర ఉద్యోగాల భర్తీ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానిది ఇదే వైఖరి. ప్రయాణీకుల భద్రతపై ఏ మాత్రం ఆలోచించే ప్రభుత్వమైనా మొట్టమొదట ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయమై విమర్శల వర్షం కురిపించిన బిజెపి నేతలు అధికారం లోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వానికన్నా అధికంగా ప్రైవేటీకరణ రాగాన్ని ఆలపిస్తు న్నారు. ఉట్టికెగిరే సత్తా లేకపోయినా ఆకాశాని కెగిరేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మోడీ ప్రభుత్వం ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో అట్టహాసంగా ఆవిష్కరించిన బుల్లెట్ ట్రైన్ విన్యాసమూ ఆ కోవలోనిదే. దేశవ్యాప్తంగా అత్యధిక రైలు ప్రమాదాలు పట్టాలు తప్పడం కారణంగానే జరుగుతున్నాయి. నిర్వహణ, నాణ్యత లోపాలే దీనికి కారణమని వివిధ కమిటీల నివేదికలు ఇప్పటికే నిగ్గు తేల్చాయి. గడిచిన దశాబ్ద కాలంలో సగటున ఏడాదికి 150కి పైగా ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండవ స్థానంలో లెవెల్ క్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాలు నిలి చాయి. వీటిలో అత్యధిక భాగం ప్రమాదాలకు సిబ్బందినే కారణంగా చూపుతున్న రైల్వేశాఖ వారికి అవసరమైన ఆధునిక సదుపాయాలను, తగిన సంఖ్యలో మానవ వనరులను కల్పిం చడంపై మాత్రం దృష్టి సారించ డంలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అత్యాధునిక ప్రమాద హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైల్వేమంత్రి ఊరించినప్పటికీ ఆదిశలో ఇప్పటి వరకు అడుగులు పడలేదు. ఆధునిక ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామని, వెల్డింగ్‌లో నూతన విధానాలను అనుసరించి రైళ్లు పట్టాలు తప్పడాన్ని నిరోధిస్తామని చెప్పిన మాటలకూ ఇంతవరకు అతీగతీ లేకపోవడం విచారకరం. రైల్వే మంత్రిత్వ శాఖే నియమించిన డాక్టర్ అనిల్ కకోడ్కర్ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ ఐదు సంవత్సరాల కాలంలో భద్రతా ప్రమాణాల పెంపు కోసం లక్ష కోట్ల రూపా యలను ఖర్చు చేయాలని రెండు సంవత్సరాల క్రితం సూచించింది. ఇప్పటి వరకు ఆ దిశలో కేటాయింపులు నామమాత్రమే! భద్రతకు సంబంధించిన మౌలిక వనరుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని, అడ్వాన్స్‌డ్ సిగలింగ్ వ్యవస్థ కోసం మరో రూ.20 వేల కోట్లు కేటాయించాలన్న ఆ కమిటీ సిఫార్సులు కాగితాలకే పరిమితమ య్యాయి. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన సిఫార్సులను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశలో చేసిన సూచనల అమలుకు మాత్రం తహతహ లాడుతోంది. – గునపర్తి సైమన్