ఓటువేద్దాం..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రా యుధం. ప్రజల భవితను నిర్ణయించే శక్తి దాని కుంది. ఓటుద్వారా పాలకులను ఎన్నుకునే అధికారం రాజ్యాంగం ఓటరుకు ఇచ్చింది.అలాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వి నియోగం చేసుకోవాలి. ప్రలోభాలకు లొంగి పోకుండా ప్రజాస్వామ్య వ్యవస్ధను పరిరక్షిం చాలి.అవినీతి అంతం..అభివృద్ధిని కోరుకుంటు న్నారా..అయితే ఓటు వేయండి..విలువైన ఓటు ను పచ్చని నోటుకు అమ్ముకోవదు. దేశభవిష్యత్తు నీ వేలు చివరే ఉంది.

ప్రజాస్వామ్యాన్ని మన ఓటే నడిపిస్తుంది.భవిష్యత్తుకు ఓటు అభివృద్ధి కోసం ఓటు.ప్రజాస్వామ్య విలువలకు జీవం పోయాలి.ప్రజాస్వామ్యంలోవిలువలను చాటి చెప్పాలన్నా,అక్రమార్కుల పాలనకు స్వస్తి పలకా లన్న నీఓటే కీలకం.ప్రజా సంక్షేమానికి పాటు పడేవారిని ఎన్నుకోవాలి.మే 13నజరగబోయే ఎన్ని కల్లో రోజున తప్పక ఓటు వేయండి.అవినీతి నాయ కులకు ఓటుతో సమాధానం చెప్పాలి. ప్రజాస్వా మాన్ని బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నడిపించదు. స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా ఓటు వేయడం మన బాద్యత.బాధ్యతతో ఓటేసి గొప్ప దేశాన్ని నిర్మించు కుందాం.మనం వేసే ఓటు నడిపిస్తుంది.మార్పు కోసమైనా ఓటు హక్కు వినియోగించండి.ఓటు వేసేందుకు బాధ్యతతో కదలండి.ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా విని యోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపే తమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది.అందుకే ఎలాం టి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వా మ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగిం చుకోవటం ప్రజల ప్రధాన కర్తవ్యం. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. నిజమైన ప్రజాస్వా మ్యానికి పునాది ఓటు.అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకో వద్దు.మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మా ణం సాధ్యమవుతున్నది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం.‘ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల కొరకు పనిచేస్తూ , ప్రజలే పాలకులుగా గల పాలన విధానమే ప్రజాస్వా మ్యం’.మనది సర్వస్వతంత్ర భారతదేశం. ‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక’ దేశమని మన రాజ్యాంగంలో మనమే చెప్పు కున్నాం.స్వేచ్ఛా సమానత్వం మన దేశ ఆద ర్శం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సమాజంలోని ప్రతిఒక్కరూ సమానమని, అం దరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కులు ఉండాలని రాజ్యాంగంలో రాసుకున్నాం.వ్యక్తులు లేనిదే సమాజంలేదు.సమాజంలో అంతర్భాగం కా కుండా ఏవ్యక్తీ విడిగా మనుగడ సాగించనూ లేడు. అందుకే‘అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి,ప్రజాస్వామ్య మనుగడను కాపాడుకోవాలంటే ఓటు హక్కు ఒక్కటే మార్గం.
దేశ చరిత్రను మార్చే శక్తి ఓటే!
ఓటుహక్కు దేశ చరిత్రనే మార్చే యగల ప్రజాస్వామ్య ఆయుధం. కుల, మత, ప్రాంత,లింగ,జాతి,భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18ఏండ్లు నిండిన పౌరులం దరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ప్రకా రం ఓటుహక్కు కల్పిస్తున్నది.తద్వారా సమర్థు లైన పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని కల్పిం చింది.అందుకే ఓటును దుర్వినియోగం చేయ కుండా దానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సరైన నాయకున్ని ఎన్నుకున్నప్పుడే దానికి సార్థకత. సమాజంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు వజ్రా యుధం లాంటిదే. ఎన్నికల్లో తమ కు నచ్చిన అవినీతి రహిత పాలన అందించే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఈ ఓటు ద్వారానే సాధ్యపడుతుంది. ప్రజాస్వా మ్య విలువలున్న సమాజమే ప్రజా సంక్షేమానికి నాంది పలుక గలదు. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక.ప్రపంచ స్థితి, గతులను మార్చేశక్తి ఓటుకు ఉన్నది. ఒక వ్యవస్థకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో,ఆ ప్రజా ప్రతి నిధిని ఎన్నుకునేం దుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా,రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మనం బాగు పడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు ఓటూ ముఖ్య మే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా ఓటు వేయాలి. భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది.రాజ్యాం గ పరిషత్‌,ఎన్నికల సందర్భంగా28.5శాతం ప్రజ లకు దీన్ని విస్తరింపచేశారు.ప్రజాస్వామ్య విధా నానికి కట్టుబడి ఉండేలా రాజ్యాంగం భారత పౌరు లకు సార్వత్రిక వయోజనఓటు హక్కును కల్పిం చింది. ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రా న్ని అనుసరించి 325 అధికర ణం ప్రకారం ఒకవ్యక్తి కి ఒక ఓటు మాత్రమే ఉం టుంది.కుల, మత,వర్గ, వర్ణ,జాతి ,ప్రాంతం,లింగ భేదాలు వంటి తేడాలతో ఏఒక్క వ్యక్తికి ఓటు హక్కు నిరాకరించ కూడదం టూ నిబంధనలు జారీ చేసింది. 1988 లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓటు హక్కు వయో పరిమితిని 21ఏండ్ల నుంచి 18ఏండ్లకు తగ్గించి అత్యంత ప్రాధాన్యం కలిగిన హక్కుగా ప్రాముఖ్య తను చేకూర్చింది. ప్రస్తుతం దేశంలో ఓట్లు వేయ డం కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతు గా భావి స్తున్నారు. రాజకీయ నాయకులు నోటు అనే తాయిలాన్ని ప్రజలకు పంచి ఓటును బలహీన పరిచి గెలుపును పటి ష్టం చేసుకుంటున్నారు. మనమంతా నోటు తీసుకుని ఓటు వేస్తే నాయ కులను ప్రశ్నించే హక్కుని కోల్పోతాము. గెలిచిన నాయకుడు డబ్బుకు అమ్ముడుపోయి అవినీతి,కుళ్లు రాజకీ యాలతో ప్రజలను తప్పుడు దారిలోకి తీసుకొని పోతున్నాడు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలన్నా, సాంఘిక, ఆర్థిక, సమాన త్వాన్ని సాధిం చాలన్నా, మన జీవితాలు, తల రాతలు మారాలన్న అది పారదర్శకమైన ఎన్ని కలు, నిజాయితీపరులైన నాయకుల వల్లనే సాధ్యం. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. మనం వేసే ఓటే మన భవి ష్యత్తు,రాబోయే తరాల మనుగడను నిర్ణయిం చేది ఓటే.రాజకీయ నాయకుల తల రాతల్ని మార్చే ఆయుధం ఓటు. అందరూ ఓటు వేసిన పుడే,రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థకత లభిస్తుంది. దేశ దిశ,దశను ఓటు మారుస్తుంది. మనం ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదు. ఓటు వేద్దాం -మన ప్రాంత,పురోభివృద్ధికి మంచి నేతను ఎన్ను కొని బంగారు బాటలు వేద్దాం. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడను నిర్ణయించేది ఓటే.రాజకీయ నాయకుల తల రాతల్ని మార్చే ఆయుధం ఓటు. అందరూ ఓటు వేసినపుడే,రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థ కత లభిస్తుంది.దేశ దిశ,దశను ఓటు మారుస్తుంది. మనం ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదు.
ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు.
ఏ ప్రజాస్వామ్య సమాజంలోనైనా ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఇదిమన ప్రజాస్వా మ్యా నికి మూలస్తంభం,పౌరులు తమను ఎవరు పరి పాలించాలో,వారు ఎలా పరిపాలించబడ తారో చెప్పడానికి వీలు కల్పిస్తుంది.ఓటు వేయగల సామ ర్థ్యం అనేది ఒక హక్కు మాత్రమే కాదు, బాధ్యత, ఎందుకంటే ఇది పౌరులందరి వాణిని వినిపించేలా మరియు వారి ప్రయోజనాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించేలా చేస్తుంది.ఓటుహక్కు అనే ది ఒక ప్రత్యేక హక్కు మాత్రమే కాదు, మానవ ప్రాథమిక హక్కు. ఇది యూనివ ర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (1948)సివిల్‌ అండ్‌ పోపై అంతర్జాతీయ ఒడం బడిక ద్వారా రక్షించ బడిరది.
భారతదేశంలో ఓటు హక్కు
భారత రాజ్యాంగంలో ఓటుహక్కు ఆర్టికల్‌ 326 ప్రకారం హామీ ఇవ్వబడిరది. ఈ ఆర్టికల్‌ ప్రకారం‘‘ప్రతి రాష్ట్రంలోని ప్రజల సభకు,శాసన సభకు ఎన్నికలు వయోజన ఓటు హక్కు ఆధా రంగా ఉంటాయిబీ అంటే,భారత పౌరుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని ప్రతి వ్యక్తి తగిన శాసనసభద్వారా లేదా ఏదైనా చట్టం ద్వారా నిర్దేశించబడవచ్చు.ఈ రాజ్యాంగం లేదా ఏదైనా చట్టం ప్రకారం అనర్హులు కాదు. నివా సం ఉండకపోవడం, తెలివితక్కువతనం, నేరం లేదా అవినీతి లేదా చట్టవిరుద్ధమైన అభ్యాసాల కారణంగా తగిన శాసనసభ ద్వారా అటువంటి ఎన్నికలలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.’’
యునైటెడ్‌ స్టేట్స్‌ రాజ్యాంగంలో ఓటు హక్కు
యునైటెడ్‌ స్టేట్స్‌ రాజ్యాంగంలో ఓటు హక్కు స్పష్టంగా పేర్కొనబడలేదు. ఏది ఏమైనప్పటికీ, ఫెడరల్‌ ప్రభుత్వం ఎన్నికల నిబంధన ద్వారా ఓటింగ్‌ ప్రక్రియను నియంత్రించే ఫ్రేమ్‌వర్క్‌ను రాజ్యాంగం అందిస్తుంది, ఇది సమాఖ్య ఎన్నిక లను నిర్వహించే ‘‘విధానానికి’’ సంబంధించిన చట్టాలను ‘‘తయారు లేదా మార్చే’’ అధికారాన్ని కాంగ్రెస్‌కు ఇస్తుంది. అదనంగా, అంతర్యుద్ధం (1861-1865) తర్వాత ఆమోదించబడిన రాజ్యాంగంలోని 14వ మరియు 15వ సవరణలు జాతి లేదా రంగు ఆధారంగా ఓటింగ్‌లో వివక్షను నిషేధించాయి.1920లో ఆమోదించబడిన 19వ సవరణ, లింగం ఆధారంగా ఓటింగ్‌లో వివక్షను నిషేధించింది.1971లో ఆమోదించబడిన 26వ సవరణ,18సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి వయస్సు ఆధారంగా ఓటు వేయడంలో వివక్షను నిషేధిస్తుంది.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలి`జిల్లా కలెక్టర్‌ డా.ఎ. మల్లిఖార్జున
పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు అతి శక్తి వంతమైనదని…ప్రజాస్వామ్య పరిరక్షణకు అదొక వజ్రాయుధం లాంటిదని దానిని సక్రమంగా వినియోగించుకోవటంద్వారా తమ ప్రథమ కర్త వ్యాన్ని నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ. మల్లి ఖార్జున పేర్కొన్నారు. మే13న జరిగే ఎన్నికల పండుగలో కుటుంబ సమేతంగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను,ఆవశ్యకతను తెలుసు కోవాలని.. వంద శాతం ఓటింగే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓటరు చైతన్యం, ఓటు ప్రాముఖ్యత,వినియోగం,హోం ఓటింగ్‌ విధానం,పోలింగ్‌ స్టేషన్ల వద్ద కల్పించిన వసతులు, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్టు తదితర అంశాలపై ఆల్‌ ఇండియా రేడియోద్వారా జిల్లా కలెక్టర్‌ ఓట ర్లకు సందేశం ఇచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌ లో నిర్వ హించిన టాక్‌ షోలో పాల్గొని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు.
తొలిసారి ఓటు పొందిన యువత ఉత్సాహం చూపాలి
‘‘జిల్లాలో తొలిసారిగా ఓటు పొందిన 18-19 సంవత్సరాల మధ్యగల యువత సుమారు 60వేల మంది ఉన్నారు. వారంతా తమ ఓటు హక్కు వినియోగంలో ఉత్సాహం కనబరచాలి. మే 13న జరిగే పోలింగ్‌ రోజున ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. యువశక్తిదే నిర్ణయాత్మకం. వారు తప్పకుండా ఉత్సాహం ప్రదర్శించి ఓటు హక్కును వినియోగించుకోవాలని… ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి’’ అని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.
విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక క్యూ లైన్లు
‘‘జిల్లాలోని 1991పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. అన్ని చోట్లా పటిష్ట ఏర్పాట్లు చేశాం. వయో వృద్ధు లకు,విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక వసతులు సమకూర్చాం. వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాం.విభిన్న ప్రతిభావంతులతో ఒకరు సహాయ కంగా రావొచ్చు. అయితే ఒకరితో వచ్చిన సహాయ కులు మరొకరితో ఇంకొసారి రావటానికి వీలు లేదు. ఓటరు ఓటు వేసేటప్పుడు సహాయకుడు దూరంగా ఉండాలి’’ అని కలెక్టర్‌ సూచించారు.
హోం ఓటింగ్‌ సదుపాయం వారికి ప్రత్యేకం…
‘‘ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం 85 ఏళ్లు దాటిన వృద్ధులకు,40 శాతం వైకల్యం దాటిన వారికి ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకొనే వెసులు బాటు కల్పించాం. ఇప్పటి వరకు సుమారు 1500 పై చిలుకు దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీ లించి తదుపరి చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు అన్ని రకాల అధికారులు ఇంటికి వచ్చి.. రహస్య పద్ధతిలో ఓటింగ్‌ జరిపిస్తారు. తొలి విడత మే 7,8వ తేదీల్లో జరుగుతుంది. ఒక వేళ ఎవరైనా మిగిలిపోతే మే 9వ తేదీన మరొక సారి అవకాశం కల్పిస్తాం.హోంఓటింగ్‌ అనేది ఐశ్ఛికం మాత్రమే. ఒకవేళ ఎవరైనా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు’’అని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు.
వేసవి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
‘‘వేసవిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని 1991 పోలింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు, తాగునీరు ఏర్పాటు చేస్తాం. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో సాధారణ పౌరుల అవసరాలను గుర్తించి చలివేంద్రాలు ఏర్పాటు చేశాం’’ అని జిల్లా కలెక్టర్‌ వివరించారు.
ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నాం
‘‘జిల్లాలో కోడ్‌ అమల్లోకి వచ్చిన రోజు నుంచీ అప్రమత్తంగా ఉంటున్నాం. పటిష్ట చర్యలు చేపట్టాం. ఇప్పటికే 58 ఘటనల్లో ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదు చేశాం. 68 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నాం. కోడ్‌ అమలుకు 110 రకాల బృందా లను నియమించాం. వస్తు, ధన రూపంలో ఇప్పటి వరకు రూ.5.03కోట్లను జప్తు చేశాం.కేంద్ర ఎన్ని కల సంఘం జారీ చేసిన నిబంధనలను తు.చ. పాటిస్తున్నాం. ఓటరు చైతన్యం కల్పించేం దుకు వీలుగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తాం. మేధా వులతో చర్చలు ఏర్పాటు చేస్తాం’’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు.
పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి ప్రత్యేక కేంద్రాలు
ఎన్నికలవిధుల్లో భాగస్వామ్యం అయ్యేవారి కోసం.. అత్యవసర సేవల్లో నిమగ్నమయ్యే వారి కోసం.. ప్రత్యేక చర్యలు చేపట్టాం. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశాం. ఫాం 12డిని సేకరిస్తున్నాం.మే 5,6,7,8వ తేదీల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో స్థానిక ఉద్యోగులు, బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సేవలందిస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని’’ కలెక్టర్‌ సూచించారు.
ఎపిక్‌ కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చు..
ఓటరు జాబితాలో పేరుండి..అర్హులైన వారు ఎపిక్‌ కార్డు లేకపోయినా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ చెప్పారు. కేంద్రం ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల కార్డులు, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు పాసు పుస్తకం ఇర ఆధారాలు చూపించి ఓటు వేయొచ్చని స్పష్టం చేశారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగా ప్రతి ఓటరుకు ఓటరు ఇన్ఫర్మేషన్‌ స్లిప్పులు అందజే స్తామని తెలిపారు.ఎలాంటి ప్రలోభాలకు గురికా కుండా ఓటర్లు చైతన్యవంతంగా ఉంటూ ఓటును వేయాలని సూచించారు.
వంద శాతం ఓటింగ్‌ కు అందరూ సహకరించాలి
మే13న అందరూ పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని..తద్వారా వందశాతం ఓటింగ్‌కు అధికారులు, ఓటర్లు పూర్తి స్థాయిలో సహకరించా లని కలెక్టర్‌ ఆల్‌ ఇండియా రేడియో ద్వారా ఇచ్చిన సందేశంలో పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 67 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని..ఈ సారి 80 శాతం దాటేలా అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 7.00 గంటలకే పోలింగ్‌ ప్రారంభమవుతుందని..సాయంత్ర 6.00 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.6.00 గంటలకే లైన్లలోకి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారందరికీ ప్రత్యేక స్లిప్పులు జారీ చేసి వారంతా ఓటు వేసే వరకు పోలింగ్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మా ఒక్కరి ఓటు వల్ల ఏం జరుగు తుందిలే అనే నిరూత్సాహ భావం వద్దని.. అంద రూ ముందుకు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలి కారు. రాజ్యాంగ వ్యవస్థలు.. న్యాయ వ్యవస్థ… మీడియా వ్యవస్థ మాదిరిగా పౌరులు ఓటు హక్కును వినియోగించుకోవటం ద్వారా ప్రజాస్వా మ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా రేడియో టాక్‌ షోలో డీఐపీఆర్వో ఎస్‌.వి. రమణ, డివిజనల్‌ పీఆర్వో డి.నారాయణ రావు,ఆల్‌ ఇండియా రేడియో ప్రోగ్రాం హెడ్‌ పీవీ రామ్‌ గోపాల్‌, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌. సుధా కర్‌ రెడ్డి, డ్యూటీ అధికారి సాంబశివరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.- (గునపర్తి సైమన్‌)