ఒలింపిక్స్‌లో ఆంధ్రా కాఫీ..
వేడివేడిగా పొగలు కక్కే కాఫీ తాగడమంటే చాలామందికి ఇష్టం. దాదాపు చాలా మందికి కాఫీ గుబాళింపుతోనే శుభోదయం మొదలవు తుందంటే అతిశయోక్తి కాదేమో.రాష్ట్రంలోని అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.తాజాగా అలాంటి అరకు కాఫీ ఒలింపిక్స్‌లో అతిథులను అలరంచింది
మన్యం పేరు చెప్పగానే మనకు రెండు విషయాలు స్పురణకు వస్తాయి. ఒకటి అరకు అందాలు, ఇరుకైన ప్రయాణ మార్గాలు. వెళ్లిన వారెవరైనా ఆ ప్రకృతికి ఫిదా అవ్వా ల్సిందే. ప్రతి మదిపులకరించాల్సిందే. అంతలా అక్కడి అందాలు కనువిందు చేస్తూ అందరినీ కట్టిపడే స్తాయి. మరొకటి కమ్మని అరకు కాఫీ. ఘుమ ఘుమలాడే దీని సువాసనకు మనసు మైమరచి పోతుంది.ఈ కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జా తీయ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ప్రేమ నగరిగా పేరొందిన పారిస్‌లో జూలై 26న నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ సంద ర్భంగా పారిస్‌కు వచ్చే క్రీడాకారులు,అతిథులు అరకు కాఫీని రుచి చూశారు. పారిస్‌లో 2017లో అరకు కాఫీ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మరో ఔట్‌లెట్‌ను తెరవాలనుకుంటున్నట్లు ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రకటించారు. 2018లో పారిస్‌లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూరస్- 2018 పోటీల్లో అరకు కాఫీకి బంగారు పతకం లభించింది. అదే రకంగా పారీస్
2024 క్రీడల్లో కూడా అరకు కాఫీకీ క్రీడాకారులు పీదాఅయ్యారు.అయితే అరకు కాఫీని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు బాగా ప్రమోట్ చేశారు. ఇటీవల మన్యం కాఫీ రుచిని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. గతంలో సీఎం చంద్రబాబుతో కలసి జీ-20 సదస్సులో ప్రధాని మోదీ అరకు కాఫీని రుచిచూశానని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన చంద్రబాబు వీలైతే మరోకప్పు మీతో కలసి కాఫీ తాగాలని ఉం దం సముద్ర మట్టానికి 3,600 ఎత్తులో గిరిజన కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో పండిస్తారు.ఈ కాఫీ గింజలను, ప్రైవేట్ వ్యాపా రులతో పాటు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సేకరిస్తుంది.అందులో కొంత మొత్తాన్ని ఈ వేలం ద్వారా అమ్మకాలు చేస్తుంది. మరి కొన్నింటిని అరకువ్యాలీ కాఫీ పేరుతో మార్కె టింగ్ చేస్తోంది.అరకు కాఫీ గొప్పతనం గుర్తు చేసుకుంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగుతున్న ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని ట్వీట్‌కు చంద్రబాబు రిప్లై ఇచ్చారు. మోదీతో మరోసారి అరకు కాఫీ తాగేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలకు సందేశం ఇవ్వడం తో పాటు వారితో మమేకం కావడానికి ప్రతి నెలా చివరి ఆదివారం ఏర్పాటు చేసే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునఃప్రారంభించారు.వరుసగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి రేడియో ప్రసంగం చేశారు. మరోసారి ఎన్డీయే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందనీ అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో పండే కాఫీ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో చెప్పారు. విశాఖపట్టణం వచ్చినప్పుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఆ కాఫీ తాగినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగుతున్న ఫొటోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు.అరకు కాఫీకి దిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్‌లోనూ ప్రశంసలు దక్కాయని చెప్పారు.ఈ కాఫీ సాగుతో గిరిజన సాధికారతకు ముడిపడి ఉందని గుర్తిచేశారు. అదేవిధంగా మీరు ప్రపంచంలో ఏప్రాంతం లోనైనా కాఫీ ప్రియులైతే,ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి వచ్చే కాఫీని రుచి చూడాలని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పెట్టిన పోస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిప్లై ఇచ్చారు. మోదీతో మరోసారి అరకు కాఫీ తాగేందుకు ఎదురుచూస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ,భక్తితో పండిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అపరిమితమైన సామ ర్థ్యానికి ఇది ప్రతి బింబమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేడ్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తిగా అరకు కాఫీని మోదించిన మోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్రా ఊటీగా పేరొందిన ఊటీలో కాఫీకి ప్రత్యేకత ఉంది. చల్లని వేళల్లో వేడి వేడి కాఫీని గొంతులోకి పోస్తుంటే వచ్చే మజా మాటల్లో చెప్పలేనిది. ప్రతి గుటకలోనూ సరికొత్త రుచి పరిచయ మవుతుంది. పొగలు కక్కే కాఫీ ఘుమ ఘుమలకు చలి పులి పరార్ కావాల్సిందే.అరకు మార్గంలో కనిపించే గిరిజన కాఫీ దుకాణాలు ఎంతో ఆకర్షణీ యంగా ఉంటాయి. సంప్రదా య పద్ధతిలో ఈ మన్యం కాఫీ స్టాల్స్ కట్టెల పొయ్యిపై వేడి వేడి కాఫీ తయారు చేస్తూ ఆంధ్రా ఊటీకి స్వాగతం పలుకుతాయి. గిరిజనులు తయారు చేసే ఈ కాఫీ రుచి చూద్దామని…ఆగే ప్రతి ఒక్కరికీ కాసేపు ప్రకృతితో చేరువగా గడిపే అవకాశం దక్కుతుంది. కాఫీ దుకాణాలకు వెనకవైపు ఎత్తైన సిల్వర్ ఓక్ చెట్ల మధ్య ఉండే కాఫీ తోటలు చూడొచ్చు. ప్రకృతి రమణీయత మధ్య ఫొటోలు దిగుతూ మురిసిపోవచ్చు.అరకు అందానికి…ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని సందర్శకులు చెబుతున్నారు. కాలమేదైనా అరకు పర్యటకులతో సందడిగా కనిపిస్తోంది. పచ్చని చెట్లు, కొండల మధ్య అరకు అందాలు అడుగడుగునా స్వాగతం పలుకుతుంటాయి.
సాగరతీరంలో.. అరకు కాఫీ అదరహో!
ఆంధ్రా ఊటీ అరకులో పండిన కాఫీ గింజలు…సాగర తీరంలో ఘుమఘుమలు పంచుతున్నాయి. కాఫీ ప్రియులను మైమ రపించే ఫ్లేవర్లతో…అరకు కాఫీ ‘వప్‌ా వా’ అనిపిస్తోంది. గిరిజన ఉత్పత్తులకు ప్రపంచశ్రేణి బ్రాండిరగ్ కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్న గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్… అరకు కాఫీకి కార్పొరేట్ స్టైల్ జోడిస్తూ.. విశాఖలో కాఫీ షాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.కాఫీ రుచుల్లో సరికొత్త బ్రాండ్ క్రియేట్ చేసుకుంటోంది అరకు కాఫీ. సాగరనగరి విశాఖలో కాఫీ ప్రియుల మనసు దోచుకుం టోంది.‘హట్ అరబికా’ పేరుతో..గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ కేంద్రం.. కాఫీ రుచుల్ని సరికొత్తగా అంది స్తోంది. ఇంతకాలం ఫిల్టర్ రుచులకే పరిమి తమైన అరకు వ్యాలీ కాఫీ..ఇప్పుడు 40 రుచు లతో రారమ్మని ఆహ్వానిస్తోంది.గిరిజన ఉత్ప త్తులకు బ్రాండిరగ్ తెచ్చే దిశగా జీసీసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే విశాఖ వాసులకు బీచ్ రోడ్డులోని జీసీసీ కార్యాలయం వద్ద అందు బాటులోకి వచ్చిన హట్ అరబికా…అనూహ్య ఆదరణ పొందుతోంది.
అరకు కాఫీగింజలతో చేసే హాట్…కోల్డ్ కాఫీలు..హట్ అరబికాలో చాలా స్పెషల్. ఘుమఘుమలతో ఆకర్షించడమే కాదు.. మంచి రుచితో ఆహ్లాదాన్ని కల్పించడం వీటి ప్రత్యేకత. ఈ కారణంతోనే… నగరవాసులకు హట్ అరబికా ఎంతో చేరువ అవుతోంది. అంతేకాదు తొలిసారిగా కాఫీ చాక్లెట్లనూ ఈ స్టాల్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఇంకేముంది…. పెద్దలను కాఫీ రుచి మైమరపిస్తే…పిల్లలను చాక్లెట్లు నోరూరిస్తున్నాయి. కాఫీ రుచులతో ఆకర్షిస్తూనే…వివిధ గిరిజన ప్రాంత ఉత్పత్తు లను ప్రజలకు చేరువ చేసేందుకు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ ప్రయత్నిస్తోంది. హట్ అరబికా కాఫీషాప్ విస్తరణకు సిద్ధమవుతోంది. నేచర్స్ బెస్ట్ పేరుతో రానున్న మరో కేంద్రం లో.. గిరిజన ఉత్పత్తులకు మరింత విలువ జోడిరపు చేస్తూ ఆకర్షణీయంగా అందించ బోతున్నారు.హట్ అరబికా విజయవంత మైనట్టే.. నేచర్స్ బెస్ట్‌నూ జనానికి చేరువ చేసి సక్సెస్ చేసే ప్రయత్నాల్లో ఉంది కార్పొరేషన్.-గునపర్తి సైమన్