ఏపీ గిరిజన విశ్వవిద్యాలయ పనులు ప్రకటనలకే..

కేంద్ర ప్రభుత్వం 2014లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎ.ఐ.ఐ. ఎం.ఎస్‌), కేంద్రీ య గిరిజన విశ్వవిద్యాలయం అనే జాతీయ విద్యా సంస్థలను ఒకేసారి ఆంధ్ర ప్రదేశ్‌కు మంజూరు చేసింది. కానీ రూ.834 కోట్లు ఎస్టిమేషన్‌ కలిగిన గిరిజన విశ్వవిద్యా లయం ఎక్కడ నిర్మించాలి అన్న దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. యూనివర్సిటీకి నిధుల కేటాయింపులు కూడా ప్రతి ఏడాది తగ్గుతు న్నాయి.2015లో రూ.834కోట్లు కేటాయించి మొదటి విడత కింద రూ.420కోట్లు విడుదల చేసింది.2023 సంవత్సరంలో సవరించిన బడ్జెట్‌లో రూ.40.67కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు జరగలేదు.ఈ ఏడాది ఏకంగా బడ్జెట్‌లో యూనివర్సిటీకి ప్రత్యేకించి ఎటువంటి కేటాయిం పులు జరగలేదు.యుజిసి నిధుల నుండి కేటాయి స్తామని చెబుతుంది.పోనీ ఆ యుజిసి నిధులేమైనా పెంచారా అంటే అదీ లేదు.గతంలో యుజిసికి రూ.6409 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 60.99 శాతం కోత విధించి కేవలం రూ.2500 కోట్లు కేటాయించారు. ఇందులో గిరిజన విశ్వ విద్యాలయంకు ఎంత ఖర్చు చేస్తారో వేచి చూడాలి. భూములు సేకరించారు-బాధ్యత మరిచారు
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం విజయ నగరంలో కొత్తవలస సమీపంలోని రెల్లి గ్రామంలో నిర్మించాలని గతంలో టిడిపి ప్రభుత్వం నిర్ణయించింది.2015లో అక్కడ రైతుల నుండి 520 ఎకరాలు భూమిని సేకరించింది. కానీ దానికి రైతులకు ఎటు వంటి పరిహారం చెల్లించలేదు. కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన నిధులలో రూ.5కోట్లు ఖర్చు చేసి భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి చేతులు దులు పుకుంది. ‘రెల్లిలో సేకరించిన భూమిలో ఎక్కువ శాతం జిరాయితీ భూమి.పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వుంటుంది.అందుకనే రెల్లి నుండి యూనివర్శిటీని మెంటాడలోని కుంఠినివలస దగ్గరకు మార్చామ’ని 2019లో నూతనంగా వచ్చిన వై.ఎస్‌.ఆర్‌.సి.పి ప్రభుత్వం చెప్పింది. అక్కడ రైతుల దగ్గర నుండి 563ఎకరాలు భూమి సేకరించి నష్టపరిహారం కూడా 90 శాతం చెల్లించింది.4సంవత్సరాలు పాటు కాలయాపన చేసి ఎన్నికలు వస్తున్నాయనగా హడావుడిగా కేంద్రమంత్రి ధర్మేందర్‌ ప్రధాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.ఆతరువాత మళ్లీ ప్రభుత్వం మారింది.2024లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది.ఎస్‌.కోట ఎంఎల్‌ఏ కోళ్ల లలిత కుమారి యూనివర్సిటీ నిర్మాణం గతంలో అనుకున్న రెల్లిలోనే ఏర్పాటు చేస్తామని దానికి ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కూడా ఆమోదం తెలిపారని ప్రకటిం చారు.ఈమధ్య గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుంఠినివలసలో జరిగిన గ్రామ సభలో మాట్లాడుతూ యూనివర్సిటీ రెల్లిలో ఏర్పాటు చేస్తారని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని ఇక్కడే ఏర్పాటు చేస్తామని,అందులో ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.అంతకు ముందు రోజేజిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో యూనివర్శిటీ పనులు వేగ వంతం చేస్తామని తెలిపారు.నీటి సరఫరాకు 4కోట్లు,విద్యుత్‌ సరఫరాకు రూ.3.6 కోట్లు,రోడ్డుకు పరిహారం చెల్లించడానికి రూ.2.6కోట్లు అవసరమౌతాయని తెలిపారు. యూనివర్శిటీ మంజూరై నప్పటి నుండి ఇటు వంటి ప్రకటనలు అనేకం వస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పని మాత్రం ముందుకు కదలడం లేదు.
సదుపాయాలు లేవు
2019 నుండి యూనివర్సిటీ ఏ.యు భవనం లో తాత్కాలికంగా తరగతులు నడుస్తున్నాయి. సుమారు 250కుపైగా విద్యార్థులు చదువు తున్నారు. మన రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణా టక,ఒడిస్సా వంటి ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువు తున్నారు. వీరికి సరిపడా సదుపాయాలు లేవు. వసతి సదుపాయం లేక దగ్గరలో ఓప్రైవేట్‌ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నారు.అక్కడ రూ. 60,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతంత ఫీజులు కట్టుకోలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.చాలా మంది విద్యా ర్థులు వసతి లేకపోవడంతో బయట ప్రైవేట్‌ హాస్టళ్లు,అద్దె గదుల్లో ఉంటూ చదువుతున్నారు. తరగతి గదులు సరిపోక పోవడంతో ఉదయం కొన్ని కోర్సులు,మధ్యాహ్నం కొన్ని కోర్సులు నడుస్తున్నాయి.కంటైనర్లతో నిర్మాణం చేసిన గదుల్లో ల్యాబ్‌ ఏర్పాటు చేయాల్సిని దుస్థితి. యూనివర్సిటీల్లో చేరుతున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుంది.వారందరికీ ఈ అరకొర సదుపాయాలు సరిపోవడం లేదు.విభజన చట్టం ప్రకారం 2021నాటికి యూనివర్శిటీ నిర్మాణం పూర్తి కావాలి. ప్రభుత్వాలు మారు తున్నాయి తప్ప పనుల్లో మాత్రం ఎటువంటి మెరుగుదల లేదు.గిరిజన యూనివర్శిటీ నిర్మా ణం పూర్తయితే గిరిజన ప్రాంతంతోపాటు విజయనగరం జిల్లా కూడా అభివృద్ధి చెందు తుంది.ఆర్థికంగా వెనుకబడిన జిల్లాకు ఎంతో కొంత ఆర్థిక వనరులను సమకూర్చుకోగలదు. వేల మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగ పడుతుంది.చాలా మందికి ఈజిల్లాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఉత్తుత్తి ప్రకటనలు ఆపి నిర్మాణ పనిలో మెరుగుదల కనబరచాలి.
అసలేం జరిగింది?
సాలూరు నియోజకవర్గం దత్తి రాజేరు, మెంటాడ మండలాల్లోని 561.88ఎకరాల్లో రూ.834 కోట్లతో గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అందులో భాగంగా,మెంటాడ మండలం చిన మేడ పల్లిలో ఆగస్టు 25న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వర్సిటీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.విజయనగరం జిల్లాలోని సాలూరు ఎస్టీ రిజర్వ్‌ నియోజకవర్గం.రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పీడిక రాజన్నదొర ఈ నియోజకవర్గం నుంచే ప్రాతి నిధ్యం వహిస్తున్నారు.జిల్లాల పునర్విభజన సందర్భంగా రాష్ట్రంలో రెండు గిరిజన జిల్లాలు గా అల్లూరి సీతారామరాజు,పార్వతీపురం మన్యం జిల్లాలను ఏర్పాటు జరిగాయి. ఈ నేప థ్యంలో కేంద్రం మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఈరెండు జిల్లాల పరిధిలోనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చా యి.కానీ,గిరిజన యూనివర్సిటీకి శంకు స్థాపన జరిగిన ప్రాంతం మైదాన ప్రాంతమైన విజయ నగరం జిల్లా పరిధిలోకి వస్తోంది.
2017లో పరిస్థితేంటి…
విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది.తొలుత ఈయూనివర్సి టీని కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెంలో ఏర్పాటు చేయాల నుకున్నారు.అందుకోసం సర్వేనంబర్‌1/8లో 526.24ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది.యూనివర్సిటీ పనుల్లో భాగం గా స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కేంద్రం రూ.5కోట్లు కేటాయించింది.అప్పటి రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగరావు ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.ఆ పనులు పూర్తయ్యాయి. అప్పన్నదొర పాలెంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఆ ప్రాంతంలో అవసరమైన 200 ఎకరాల భూములు ఇచ్చిన 178కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నట్లు అధికారులు గుర్తించారు.వీరికి భూమికి భూమి అప్పగిం చేందుకు సమీపంలోనే భూసేకరణ కూడా చేశారు.
వైసీపీ వర్సెస్‌ టీడీపీ
గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన స్థలంలో కాకుండా గిరిజన యూనివర్సిటీని వైసీపీ మరో చోటుకు తరలించడంపై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాము అధికారం లోకి వస్తే గిరిజన యూనివర్సిటీని మరోచో టుకు మారుస్తామని అంటున్నారు.‘‘గిరిజనుల కోసం నిర్మించే యూనివర్సిటీ గిరిజన ప్రాం తంలో ఉండాలి. కానీ,టీడీపీ ప్రభుత్వం గిరిజ నులతో సంబంధం లేని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం బాగా సాగుతున్న రెల్లి రెవెన్యూ పరిధిలో దీనిని నిర్మించాలని భావించారు.ఎందుకంటే, ఈ ప్రాంతంలోనే టీడీపీ నాయకులు, మంత్రు లు, వాళ్ల బినామీలు భారీ ఎత్తున రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారం చేస్తున్నారు. వారి భూముల విలువ పెంచుకోవడం కోసం గిరిజన యూని వర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నిం చారు. వైసీపీ ప్రభుత్వం రావడంతో వారి ఆటలు సాగలేదు’’అని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర తెలిపారు.కొందరు టీడీపీ నాయకులు వారు అధికారంలోకి వస్తే గిరిజన వర్సిటీని వేరే ప్రాంతానికి మారుస్తామని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సొంత భవనాలు లేకపోవడంతో గిరిజన యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, ఇప్పుడు శంకుస్థాపన జరుపు కున్న గిరిజన యూనివర్సిటీ ఎప్పటికి పూర్తవు తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని గిరిజన సంఘం నాయకులు అంటున్నారు. ‘‘ఈ పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీ లేదా మరో రాజకీయపార్టీ ఒకరిపై ఒకరు పంతాలతో గిరిజన యూనివర్సిటీని పూర్తి కానివ్వకపోతే అది గిరిజనులకు తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది.గిరిజన యూనివర్సిటీని పార్టీలకు అతీతంగా పూర్తి చేయాలని, కేంద్రం కూడా వాటి నిర్మాణాలకు అనుగుణంగా నిధులను జాప్యం చేయకుండా కేటాయించాలి’’అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అయిదో షెడ్యూల్‌ సాధన సమితి గౌరవ అధ్యక్షులు కె.గోవిందరావు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం లోనైనా గిరిజన విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పరిచి గిరిజన విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన విద్యా ఫలాలు అందివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. – (డి.రాము/ఎల్‌.శ్రీనివాస్‌)