ఏపీకి పెట్టుడుల వెల్లువ

ఏపీకి భారీగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 63వేల 411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా 1లక్ష 82వేల 162 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. సచివాలయంలో జరిగిన ఎస్‌ఐ పీబీ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఎస్‌ఐ పీబీ సమావేశంలో చర్చించారు.ఇక దరఖాస్తు చేసు కున్న ప్రాజెక్టుల్లో 9కీలకప్రాజెక్టుల స్థాపనకు ముఖ్య మంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.ఈ 9ప్రాజెక్టులద్వారా రాష్ట్రానికి లక్ష 82వేల 162కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే దాదాపు 2లక్షల 63వేల411కుపైగా ఉద్యోగఅవకాశాలు లభిస్తాయని అధికారులు సీఎంచంద్రబాబుకు వివరిం చారు. ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్‌..6 వేలఎకరాల విస్తీర్ణంలో 96వేల 862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీనిద్వారా 2వేల 400 మంది ఉపాధి లభించబోతోంది.అలాగే విశాఖ మిలీనియం టవర్స్‌లో 80కోట్ల రూపాయల పెట్టుబడితో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు టీసీఎస్‌ ముందుకొచ్చింది.దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు.దీని ద్వారా దాదాపు 2వేల మంది ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. పెట్టు బడిదారులంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినెల ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ మీటింగ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రాయితీలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక పాలసీ దేశాన్ని కూడా ఆకర్షిస్తోందని చెప్పొచ్చు.ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్‌..ఏపీలో భారీఎత్తున రిఫైనరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.రామాయపట్నం పోర్టు దగ్గర వారికి 6వేల ఎకరాల ల్యాండ్‌ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.గుజరాత్‌ తర్వాత రెండో అతి పెద్ద రిఫైనరీ ఏపీలో ఏర్పాటు కానుందని చెప్పొచ్చు.టాటా,రిలయన్స్‌ లాంటి దిగ్గజ సంస్థలు క్లీన్‌ ఎనర్జీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకు న్నాయి.దీనిద్వారా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు లభి స్తాయి.నిన్న ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాలతో దాదాపు 2లక్షల 84వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించొచ్చు. ఎప్పటిలోగా ప్రాజెక్టులు పూర్తి చేస్తారు అనే వివరాలు కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్న సంస్థలకు భూకేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదేవిధంగా ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్త య్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అధికా రులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. సచివాలయంలో జరి గిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేయదలిచిన ప్రాజెక్టులకు ముఖ్య మంత్రి ఆమోదం తెలిపారు.
బీపీసీఎల్‌తో సహా ప్రతిష్టాత్మక సంస్థల రాక..
భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పా టు చేయనుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.దీంతో2,400మందికి ఉపాధి కలుగ నుం దని చెప్పారు.మొత్తం 9మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సామర్ధ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్‌,లెర్నింగ్‌ సెంటర్‌,రిఫైనరీ,పెట్రోకెమికల్స్‌ యూనిట్స్‌,క్రూడ్‌ ఆయిల్‌ టెర్మినల్‌,గ్రీన్‌ హెచ్‌2, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులు నిర్మిస్తారని అధికా రులు ముఖ్య మంత్రికి వివరించారు. వచ్చే 20ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికిరూ.88,747కోట్ల ఆదాయం రానుందని తెలిపారు.అయితే 2029 లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.
టీసీఎస్‌..
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగులవిస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.80కోట్ల పెట్టుబడి పెట్ట నుంది.దీంతో 2వేల మందికి ఉద్యోగాలు రాను న్నాయి.
ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ :
శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యేలాఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్‌ప్రాజెక్టు ఏర్పాటు చేయ నుంది.ఇందుకోసంఈ సంస్థ రూ.1,046కోట్ల పెట్టు బడిపెట్టనుంది.2,381మందికి ఉపాధి కలుగుతుంది.
బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ :
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని106ఎకరాల్లో రూ.1,174కోట్లతో 1,500మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీఎఫ్‌/పర్టికల్‌ బోర్డు ప్లాంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పనుంది.
క్లిక్‌ అయిన క్లీన్‌ ఎనర్జీ పాలసీ :
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్‌ ఎనర్జీ పాలసీతో పలు సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రా నికి వస్తున్నాయి.కొత్తగా ఐదు సంస్థలు రూ.83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పా టు చేయనున్నాయి.దీంతో కేవలం క్లీన్‌ ఎనర్జీ రంగం లోనే రెండున్నల లక్షల మందికి ఉద్యోగఉపాధి అవ కాశాలు కలుగుతున్నాయి.
ఏఎం గ్రీన్‌ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ..
ఏఎంగ్రీన్‌ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాకినాడలో 592ఎకరాల్లో 1మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత అమ్మోనియా మాన్యుఫాక్చరింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తోంది.రూ.12,000 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉపాధి కలుగుతుంది.
జాన్‌ కోకిరిల్‌ గ్రీన్‌కో హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
జాన్‌ కోకిరిల్‌ గ్రీన్‌కో హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాకినాడలో 40ఎకరాల్లో 2గిగావాట్ల సామ ర్ధ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూని ట్‌ను రూ.2,000 వేల కోట్లతో స్థాపించనుంది. దీంతో 500 మందికి ఉపాధి కలుగుతుంది.
టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ..
400 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కర్నూలు జిల్లాలోని హోసూరు,పెద్ద హుల్తిలో 1,800 ఎకరా ల్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.1,380 మందికి ఉపాధి కలుగుతుంది.
క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
వైఎస్సాఆర్‌ జిల్లాలోని మైలవరం, కొండాపురం అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో 119 మెగావాట్ల విండ్‌పవర్‌, 130 మెగా వాట్ల సోలార్‌ హైబ్రీడ్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2,000కోట్ల పెట్టుబడులు పెడు తోంది.650 మందికి ఉద్యోగ ఉపాధి అవకా శాలు రానున్నాయి.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో తాజాగా 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో రెండున్నర లక్షల మందికి ఉపాధి కలిగేలా 11 వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయ నుంది.ఈప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తి కానుంది. దీని ద్వారా రాష్ట్రానికి రూ. 4,095 కోట్ల ఆదాయం రానుంది. నవంబర్‌ 19న జరిగిన ఎస్‌ఐ పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.-జిఎన్‌వి సతీష్‌