ఏది భారత జాతీయత ?
దేశంలో గత కొంత కాలంగా జాతీ యత పేరు మీద కుహనా జాతీయవాదం వెర్రి తలలు వేస్తోంది. ప్రభుత్వ ప్రాయోజిత భావజా లాన్ని వ్యతిరేకించే వారు, ప్రశ్నించేవారు దేశ ద్రోహులుగా ముద్రించబడుతున్నారు.దేశ సామా జిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న అంశాలపట్ల ప్రభుత్వ ప్రాయోజిత నిపు ణులు,మేధావుల అభిప్రాయాలకు భిన్నంగా స్వ తంత్ర అభిప్రాయాలు కలిగి ఉండటం రాజద్రో హంగా మారిపోయింది. ఈ పరిణామాలన్నింటి వెనక దండలో దారంలాగా కొనసాగుతున్న అం శం జాతీయత గురించిన చర్చ. పాలక వర్గాల అభిప్రాయాలే సర్వసాధారణంగా ప్రజాభిప్రా యాలుగా చెలామణీ అవుతాయన్న మార్క్స్ సూత్రీ కరణ తాజా పరిణామాల నేపథ్యంలో మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రాయోజిత ప్రసార మాధ్యమాలు (ఎంబెడెడ్ జర్నలిజం) ఏకశిలా సదృశమైన ఉన్మత్త హిందూత్వమే నిజమైన జాతీ యత అని నమ్మించ చూస్తున్నాయి. సమ్మిళిత సాంస్కృతిక సామాజిక పునాదులు కలిగిన భారతీ యతకు ప్రత్యామ్నాయంగా ప్రచారంలో పెడుతు న్నాయి.
నిజానికి భారతీయ జాతీయత అంటే ఏమిటన్న విషయాన్ని నిర్ధారించే కోణంలో చారి త్రక పరిశోధనలు లేకపోవటంతో పాచిపళ్ల దాసుడు పాడిరదే పాటగా మారింది. ఈ కాలం లో ఉన్మత్త హిందూత్వ శక్తులు రాజ్యాంగ పునా దులుపై సాగిస్తున్న విధ్వంసక దాడికి మరింత పదును పెట్టిన సందర్భంగా తాజాగా భారత జాతీయ అన్న భావనపై సాగుతున్న దాడిని చెప్పుకోవచ్చు.ఈ నేపథ్యంలో భారతీయత గురిం చి ప్రజాతంత్ర రాజ్యాంగం అందించిన అవగా హనకు నియంతృత్వ ధోరణులకు నిలువెత్తు నిదర్శ నం అయిన ఆరెస్సెస్ ముందుకు తెస్తున్న అవగా హనకు మధ్య ఉన్న విభజన రేఖను అర్థం చేసుకో లేకపోతే మరో తరం మతోన్మాదులు ప్రేరేపించే భావోద్వేగాలకు బలికాక తప్పని పరిస్థితి కనిపి స్తుంది. చారిత్రక పరిశీలన కోణం నుండి చూసిన పుడు ఆధునిక ప్రపంచ చరిత్ర, ఆధునిక జాతీయ రాజ్యాలచరిత్ర,పెట్టుబడిదారీ వ్యవస్థదాని పరిణా మ చరిత్ర విడదీయ రానంతగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. చారిత్రక పరిణామ క్రమం లో దేశం ప్రాథమికంగా భౌగోళిక యూని ట్‌గా మొదలవుతుంది. వివిధ భౌగోళిక ప్రాంతాల మధ్య నిర్దిష్టంగా స్పష్టంగా గుర్తించ గలిగిన సంస్కృతి, ఆచారవ్యవహారాలూ భాషలూ ఇతర ప్రమా ణాలుగా ఉంటాయి. అందువల్లనే ఉన్నత పాఠశాల స్థాయిలో రాజ్యం గురించిన పరిచయ పాఠ్యాం శాల్లో రాజ్యానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. ప్రభుత్వం, భాష, ప్రజలు, నిర్దిష్టమైన సరిహద్దులు అని నిర్వచించారే తప్ప మరే ప్రమాణం గురించీ ప్రస్తావించలేదు. అదేవిధంగా సాంఘిక శాస్త్రాల అధ్యయనంలో ప్రభుత్వాలు (ప్రభుత్వానికి నాయ కత్వం వహిస్తున్న వారి)అనుసరించే విధి విధా నాలు పద్ధతులు ప్రాతిపదికన రాజ్యాలను నాల్గు తరగతులుగా విభజించారు. అవి కూడా నియం తృత్వ రాజ్య వ్యవస్థలు, పోలీసు రాజ్యం, సంక్షేమ రాజ్య, సోషలిస్టు రాజ్య వ్యవస్థలుగా చెప్పుకుం టున్నాము.వీటిలో ఎక్కడా రాజ్య వ్యవస్థలను మతా ల ప్రాతిపదికన,సంకుచిత లక్ష్యాల కోసం రూ పొందించిన నిర్వచనాల ప్రాతిపదికన నిర్వచిం చలేదు.19వ శతాబ్దం ముగింపు నాటికి లౌకిక నిర్వచనం ప్రకారమే జాతీయతను నిర్దారించటం ప్రమాణంగా ఉంది. పాశ్చాత్య దేశాలన్నీ పైన చెప్పిన నాలుగు లక్షణాల ప్రాతిపదికనే సరిహద్దు లు విభజితం అయినట్టు యూరోపియన్ దేశాల చరిత్ర మనకు విదితం చేస్తుంది. యూరోపియన్ జాతీయవాదం పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణతో పాటు సంఘటితం అవుతూ వచ్చింది. దేశంలో ఉన్న అంతర్గత శతృవును గుర్తించి వారిని అస్థిత్వ పరంగా రాజకీయంగా సైద్ధాంతికంగా ఒంటరి పాటు చేసే క్రమంలో యూరోపియన్ జాతీయత క్రోడీకరించబడిరది. ఈ క్రమంలోనే పెట్టుబడి దారీ దేశాలు తమ మార్కెట్ అవసరాలు తీర్చు కునే నేపథ్యంలో వలసవాదాన్ని ఆశ్రయించటం తో జాతీయతకు సరికొత్త వ్యాఖ్యానం తెరమీదకు వచ్చింది. వర్ధమాన దేశాల్లో తెరమీదకు వచ్చిన జాతీయభావాలు బాహ్య శతృవుకు వ్యతిరేకంగా అంతర్గతంగా వైవిధ్య భరితమైన ప్రజా సమూ హాలను ఏకం చేసే క్రమంలో ముందుకొచ్చిన జాతీయత. ఈ విధంగా చూసినపుడు యూరోపి యన్ జాతీయ నిర్దిష్ట వర్గాలను, సామాజిక తరగ తులను,మత విశ్వాసాలను వెలివేసింది (ఎక్స్‌క్లూ జివ్) జాతీయత కాగా వర్ధమాన దేశాల జాతీ యత సకల సామాజిక తరగతులు, మత విశ్వాసాలు,వర్గాలను సంలీనం చేసుకునే (ఇన్ క్లూజివ్) జాతీయత అన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. యూరోపియన్ దేశాల్లో పెల్లుబుకిన జాతీయత ఆయా దేశాలను పదేపదే విచ్ఛిన్నం చేస్తూ పునరేకీకరణ గావిస్తూ షుమారు రెండు వందల ఏండ్ల రక్తసిక్త యూరప్‌కు తెరతీ సింది. దీనికి భిన్నంగా వర్ధమాన దేశాల్లో సంఘటి తమైన జాతీయత సుమారు వందేండ్ల వర్తమాన చరిత్రలో శాంతియుత సహజీవనానికి పునాదులు వేసింది.ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇంత దీర్ఘకా లం వర్థమాన దేశాల్లో అంతర్గత శాంతియుత పరిస్థితులు కొనసాగటం ఇదే ప్రథమమం అని చెప్పటం అతిశయోక్తి కాదు.
భారత రాజ్యాంగం, భారత జాతీయత రెండూ స్వాతంత్య్రోద్యమ పోరాట నేపథ్యంలో రాటుదేలిన వైవిధ్య భరితమైన రాజకీయ సామాజిక మేధోమధనం ఫలితం. యూరోపియన్ జాతీయత సంఘటితమయ్యే క్రమంలో పాలకవర్గాలు,మార్కెట్ కీలక పాత్ర పోషిస్తే భారత జాతీయ సంఘటితం కావటంలో ప్రజలు, ప్రజా పోరాటాలు, ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్థ అంశంగా మారిన వలసవా దానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజా పోరాటాలు కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రజా పోరాటాలు దేశ రాజకీయ వ్యవస్థ ముందు ఉంచిన ఆశలు, ఆశయాలు, లక్ష్యాల సాధనతో పాటు యూరోపి యన్ తరహా జాతీయతకు భిన్నంగా విలక్షణమైన సమ్మిళితమైన భారత జాతీయతను పాలకవర్గాలు అంగీకరించాల్సిన పరిస్థితి కల్పించింది. భారత రాజ్యాంగం కొన్ని మౌలిక విషయాలను ప్రత్యేకించి నిర్వచించకుండా వదిలేసింది.జాతీయత అంటే ఏమిటి?ఇండియా దట్ ఈజ్ భారత్ అన్న పదబం ధం అటువంటి మౌలిక విషయాల్లో ఒకటి. అంత మాత్రాన రాజ్యాంగ పరిషత్ ఈఅంశాలను తడమ లేదు అనుకుంటే పొరపాటు. అప్పటికే సర్వాంగీకృత అభిప్రాయాలను వ్యక్తీకరించేవిగా ఈ పదబంధాలు ఉన్నందున వాటి గురించి ప్రత్యేకంగా చర్చించ లేదు. కానీ వాటిని విపులీకరిస్తూ వివిధ అధికరణా ల్లో ప్రస్తావనలు వదిలారు.
భారత భూభాగంపై జన్మించి నివశి స్తున్న పౌరులందరు భారతీయులే అని పౌరసత్వాన్ని ధృవీకరించింది.తద్వారా భారత జాతీయత భారత దేశంలో నివశించే వారందరి ఉమ్మడి జాతీయత పర్యవసానం అని చెప్పకనే చెప్పింది. అంతేకాదు. దేశంలో నివసిస్తున్న వైవిధ్యభరితమైన సామాజిక ఆర్థిక తరగతులు,మతవిశ్వాసాలకు చెందిన వారిని గుర్తించటమే కాక వారి అస్థిత్వాన్ని రాజ్యాం గం అంగీకరించింది. అందువల్లనే అటువంటి బలహీను లైన తరగతులందరికీ అవసరమైన రక్షణలు కూడా కల్పించాలని,స్వాతంత్య్రోద్యమ పర్యవసానంగా సంఘటితమైన భారత జాతీయతను కాపాడుకోవా లంటే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న అన్ని తరగ తుల ప్రజల మనోభావాలు,ఆశలు,ఆశయాలు నెరవేర్చుకునేందుకు రాజ్యాంగం ద్వారా కనీస హామీ ఇవ్వాలని రాజ్యాంగ పరిషత్ నిర్ణయించింది. అందువల్ల భారత రాజ్యాంగంలో ప్రస్తావన లేని కోణాలు భారత జాతీయతలోనూ లేవు. స్వతంత్ర భారతదేశంఎన్నో వేర్పాటువాద ఉద్యమాలను తట్టు కుని అధిగమించి జాతీయ సమైక్యతా సమగ్రతలను కాపాడుకుంటూ తన ఉనికిని కొనసాగించుకుంటూ వచ్చింది.రాజ్యాంగం ఆరెస్సెస్ కోరుకుంటున్న మను వాద వ్యవస్థ, కుల వ్యవస్థను తిరుగులేని విధంగా దెబ్బ తీసింది.కుల వ్యత్యాసాలు,మత విశ్వాసాలతో నిమిత్తంలేకుండా రాజ్యంగం భారతదేశంలో జన్మిం చిన వారందరికీ సమాన హక్కులు,అవకా శాలు, ఓటింగ్ హక్కులు ప్రసాదించింది.ఇటు వంటి పరిమిత ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ స్థానంలో సార్వ త్రిక ఓటుహక్కును మొదటిగా అందరికీ అందిం చింది ఫ్రెంచి విప్లవం.ఈ విప్లవం స్ఫూర్తిగా నాటి వలస దేశాలన్నింటిలోనూ ఈ నినాదం పోరాట నినాదంగా మారింది.ఫ్రాన్స్,అమెరికా వంటి దేశా ల్లో సార్వత్రిక ఓటు హక్కు 1960 దశకం నాటికి గానీ చట్టబద్ధం కాని పరిస్థితుల్లో భారత రాజ్యాం గం 1947నాటికే సార్వత్రిక ఓటుహక్కును రాజ్యాం గ బద్ధం చేసింది.ఈ విధంగా సార్వత్రిక ఓటు హక్కు ఇవ్వటాన్ని నాడే ఆరెస్సెస్ వ్యతిరేకించింది. కుల మత ప్రాంత విద్వేషాలతో దేశాన్ని రక్తసిక్తం చేసే మనువాద సంస్కృతినే జాతీయతగా దేశం మీద రుద్దేందుకు శతాబ్ద కాలం నుంచీ ప్రయత్ని స్తూనే ఉంది.అటువంటి సంఘపరివారం స్వదేశీ ముసుగులో భారతదేశాన్ని యూరోపియన్ దేశాల తరహాలో ఉన్మాదపూరిత జాతీయతవైపు నెడుతున్న వాస్తవాన్ని గత ఐదేండ్లలో జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దేశీయంగా రూపొందిన జాతీ యత పునాదులు సంఘపరివారానికి అక్కర్లేదు. విదేశీ నమూనాలో ఉన్న ఉన్మాద భరిత జాతీయతే దానికి ముద్దు. అందుకే సమీకృత, ప్రజాతంత్ర భారత జాతీయతను కాపాడేందుకు కంకణ బద్ధులైన వారంతా ఈ ఎన్నికల్లో ఉన్మాద జాతీయ వాదానికి ప్రతినిధులుగా ఉన్న బీజేపీ, దాని మిత్రు లను ఓడిరచటం జాతీయ కర్తవ్యంగా ఎంచు కోవాలి. వ్యాసకర్త : విశ్లేషకులు,సీనియర్ పాత్రికేయులు) – (కొండూరు వీరయ్య)