ఎస్టీ జాబితాలో బోయ,వాల్మీకులు
దళితులు క్త్రెస్తవ మతంలోకి మారినా వారికి ఎస్‌సి హోదా ఉండే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని,బోయ/వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని ప్రవేశపెట్టిన తీర్మానా లను శాసనసభ మార్చి 25న శుక్రవారం సభఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తీర్మానా లను ఆమోదించాలని కోరుతూ కేంద్ర ప్రభు త్వానికి పంపిస్తున్నట్లు సిఎం వైఎస్ జగన్‌మో హన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారినా ఎస్‌సి హోదా ఇవ్వాలను బిల్లును మంత్రి మేరుగ నాగార్జున ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డు కులాల వ్యక్తులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షను ఎదుర్కొంటున్నారని తెలి పారు. సిక్కు, భౌద్ద మతంలోకి మారిన వారితో సమానంగా పరిగణించేందుకు వారు అర్హులని చెప్పారు. హిందూ మతానికి చెందిన షెడ్యూ ల్డు కులాల వారు, క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డు కులాల వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని తెలిపారు. సమా జంలో అవమానాలు, వివక్షకు గురవుతున్నారని, ఒక వ్యక్తి మరొక మతంలోకి మారడం ద్వారా వీటిలో ఏదీ మారదని,ఒక వ్యక్తి ఏమతాన్ని ఆచరిం చాలనేది ఆ వ్యక్తి ఎంపిక అని,కుల నిర్ధారణపై ఎటువంటి ప్రభావం చూపకూడదని సిఎం పేర్కొన్నారు.
ఎస్‌టిల జాబితాలో బోయ,వాల్మీకులు
బోయ,వాల్మీకులను షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చేందుకు తాము వేసిన వన్ మ్యాన్ కమిషన్ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. అనం తపురం,కర్నూలు,వైఎస్‌ఆర్ కడప,చిత్తూరు జిల్లాల్లో నివసిస్తున్న బోయ,వాల్మీకి వర్గాలను దాని అన్ని పర్యాయపదాలతోపాటు (వాల్మీకి, చుండినవాకులు, దొంగబోయ,దొరలు,గెంటు,గురికార,కళావతి బో యలను షెడ్యూల్డ్‌తెగల జాబితాలోచేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని సభ తీర్మానిం చింది. ఈ బిల్లును బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టారు. విజయవాడలో రూ.268 కోట్ల వ్యయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125అడుగుల విగ్ర హాన్ని, ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తు నుందుకు సిఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపాదించిన తీర్మా నాన్ని శాస నసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై రాష్ట్రంలోని గిరిజన సంఘాలు వ్యతి రేకిస్తూ నిరసనలు,ఆందోళనలు చేపట్టాయి.
బోయ,వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీల్లో చేర్చవద్దు : గిరిజన సంఘం
(ఎన్‌టిఆర్‌జిల్లా) :బోయ,వాల్మీకి, బెంతు, ఒరి యాలను ఎస్టీలలో చేర్చకూడదని రెడ్డిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో గిరిజన సంఘం నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.గోపిరాజు మాట్లాడుతూ..బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీలలో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ కులాలను ఎస్టీలలో చేర్చెందుగాను రాష్ట్ర ప్రభుత్వం శ్యాముల్ ఏక సభ్య కమిషన్‌ని యమించిందని జీవో నెంబర్ 52ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 32లక్షల గిరిజ నులు నేటికీ నిరక్షరాస్యత, వెనుక బాటు తనం, నిరుద్యోగ సమస్య, అనారోగ్య సమస్యలతో ప్రతి నిత్యం సతమత అవుతుంటే ఓట్ల రాజకీయం కోసం గిరిజనులను మోసం చేయడం సరి కాదని కేంద్ర ప్రభుత్వం1965లో బిఎన్ లో కూర్ కమిటీ పేర్కొన్న ఏ5 ప్రమాణాలు వీరికి లేవని ఎస్టీ జాబితాలో చేర్చవద్దని డిమాండ్ చేశారు.రాష్ట్ర గిరిజన నాయకుడు బి రమేష్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శ్యాముల్ ఆనంద్ కుమార్ ఏకసభ్య కమిషనర్ని రద్దు చేయా లని లేని పక్షంలో రాష్ట్రంలోని గిరిజన సంఘాల విద్యార్థి సంఘాలు, గిరిజన ఉద్యోగుల సంఘాలు అన్నిటిని ఏకతాటిపై తెచ్చి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.రవి, అజ్మీర రాజు,బి.రాజా,బి.తావూరియా,బి.చిన్నబాల, బి. రంగా తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో..
బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్‌టి జాబి తాలో చేర్చొద్దని విశాఖలో జరిగిన గిరిజన సదస్సు డిమాండ్ చేసింది. బోయ వాల్మీకి సహ పలు సామాజిక తరగతులను ఎస్‌టి జాబితాలో చేర్చేం దుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ విశాఖ లోని ఎంవిపి కాలనీలోగల గిరిజనభవన్‌లో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ ర్యాన గిరిజన సదస్సు జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపి మిడియం బాబూ రావు మాట్లాడుతూ గిరిజనుల చట్టాలు, హక్కులు పటిష్టంగా అమలు కాకపోవడంతో ఇప్పటికీ ఆదివా సీలు కష్టాలు అనుభవిస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమంలోప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. తాజాగా ఎస్‌టి జాబితాలో ఇతర సామా జిక తరగతులను చేర్చేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఏసామాజిక తరగ తినైనా ఎస్‌టి జాబితాలో చేర్చాలంటే బిఎన్. లోకూర్ కమిటీ నిబంధనల ప్రకారమే జరగాలని తెలిపారు. ఆ తెగ జీవితం, ప్రత్యేక భాష, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాల పాటింపు, ఆర్థిక పరిస్థితి, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు మాత్రమే ఎస్‌టిగుర్తింపు ఇవ్వాల్సి ఉంటుం దన్నారు.కానీ, నేటి ప్రభుత్వం ఎస్‌టి జాబితా లో చేర్చాలనుకుంటున్న బోయ వాల్మీకులు అభివృద్ధి చెంది ఉన్నారని తెలిపారు. ఆదివాసీ తెగలతో వారికి ఎటువంటి సంబంధమూ, పోలికలూ లేవ న్నారు. వచ్చేఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఈ విధం గా చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా, సామాజికంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందిన సామా జిక తరగతులను ఎస్‌టి జాబితాలో చేర్చితే ఆది వాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతాయని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుందన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఇతర సామాజిక తరగతు లను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి గతంలో ప్రయ త్నించిన సందర్భంలో దీనిని వ్యతిరేకిస్తూ అప్పటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు తమ సంఘం వినతిపత్రం ఇచ్చిందని గుర్తు చేశారు. నేడు ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆదివాసీలకు ద్రోహం చేస్తూ బోయ వాల్మీకిలను, బెంతు ఒరియా లను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ జిఒ52ని జారీ చేసింద న్నారు. తక్షణమే ఆజిఒను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన వ్యతిరేక విధానాలను విడనాడాల న్నారు. నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని, జిఒ నెంబర్ 3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయా లని డిమాండ్ చేశారు.- జిఎన్‌వి సతీష్