ఎన్నికల శాసనుడు..శేష జీవితంలో సేవకుడు

ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ సులువుగా జరుగుతున్నదంటే మాజీ భారతఎన్నికల అధికారి టి.ఎన్.శేషన్ చలువే అని ఒప్పుకోక తప్పదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లోని ఎన్నికల వ్యవస్థలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి ఆయన. దేశం లో10వ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా, గొప్ప పరిపాలనాధ్యక్షుడిగా టి.ఎన్.శేషన్ పేరు గడిర చారు. కేరళలో పుట్టిన శేషన్ ఐఏఎస్ హోదాతో వివిధశాఖల్లో పదవులు నిర్వహించారు. తమిళ నాడులోనే ఎక్కువగా ప్రజాసేవలందించిన శేషన్ అక్కడే స్థిర పడ్డారు. భారత ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న సందర్భంలో ఓటు హక్కు కలిగిన భారతీయులందరూ చైతన్యం తో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందుకోసం భారత ప్రభుత్వం ఓటర్లను చైతన్య పరచాలనే 2016 నుంచి ‘జనవరి 25’ను జాతీయ ఓటర్ల దినోత్సవం’గా నిర్వహిస్తోంది. శేషన్ చేసిన ఎన్నికల సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం పదోతరగతి సాంఫీుక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠంలో చేర్చారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ జిల్లా తిరునెల్లు గ్రామంలో జన్మించిన తిరునెల్లు నారాయణ అయ్యర్ శేషన్ ఐఏఎస్ సర్వీసులో తమిళనాడులోని కోయంబత్తూరు, దిండి గల్ జిల్లాల్లో సహాయ కలెక్టర్‌గా, మధురై కలెక్టర్‌గా, రవాణా శాఖ డైరెక్టర్‌గా, వ్యవసాయ, కార్మికశాఖల కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. 10వ ఎన్ని కల ప్రధానాధికారిగా 1990 నుంచి 1996 వరకు పని చేశారు. దక్షిణ భారతదేశం నుంచి ఆర్థిక సంస్కరణలతో ప్రధానమంత్రి పి.వి. నరసిం హారావు పేరు ప్రఖ్యాతలు గడిరచగా, మరో ప్రక్క ఎన్నికల సంస్కరణలతో తనదైన శైలిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వ్యక్తి శేషన్. శేషన్ తన విధులలో ముఖ్యంగా ఎన్నికల సంఘం నిర్ణయాలలో నిక్కచ్చి గా వ్యవహిరిస్తూ, మీడియాను సైతం దూరంలో ఉంచేవారు. శేషన్ ప్రవేశపెట్టిన సంస్కరణలతోనే ఎన్నికల వ్యవస్థలో పలుమార్పులు చోటు చేసుకు న్నాయి. 1991 మధ్య జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ‘ఓటరు గుర్తింపు కార్డు’ ప్రవేశ పెట్టారు. ఓటరు కనీస అర్హత వయస్సు 21 సంవ త్సరాల నుంచి 18 సంవత్సరాలకు కుదించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చును పరిమితం చేశారు. ఒక అభ్యర్థి రెండు నియోజక వర్గాల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయరాదు. కులం పేరుతో ఓట్లను అభ్యర్థించడం నిషేధం. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లను తరలిం చడం, ప్రభుత్వ యంత్రాంగం సాయం పొందటం చట్ట విరుద్ధం. పోలింగ్ సమయంలో ఇతరులు పోలింగ్ బూతుకు 200 మీటర్ల దూరంలో ఉండాలి. గుమిగూడి ఉండటం నేరం. పోలీసులు 144 సెక్షన్ విధించాలి. ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం 2 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తే ఆరు సంవత్సరాల పాటు పోటీకి అనర్హులు.
పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా వేయాలి. కాని రద్దు చేయకూడదు. ప్రచా రం పూర్తి అయిన తర్వాత 48గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలి.ఎన్నికల సంఘం చరిత్రలో శేషన్ హయాం ఓస్వర్ణయుగం. ఎన్నికల్లో పారదర్శకత కోసం చేసిన క ృషికిగానూ, 1996లో ఆయన ‘రామన్‌మెగ్‌సేసే’ అవార్డు అందుకున్నారు. సీఈసీగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన వార్తల్లో కనిపించని అజ్ఞాత వ్యక్తిగా మిగిలారు. శేషన్ పుట్ట పర్తి సాయిబాబాకు వీరభక్తుడు. సాయిబాబా శివై క్యం పొందినప్పటి నుండి తీవ్ర విచారానికి గుర య్యారు తన స్వగ్రామంలో సొంత ఇల్లు ఉన్నప్ప టికీ తమను సంరక్షించే వారసులు (పిల్లలు) లేక పోవడంతో తన ఆలోచనా ద ృక్పధం సేవా గుణంపై కదిలింది. తన శేషజీవితంలోనూ పేదల, అనాధల, వృద్ధుల బాధలు తిలకిస్తూ, వారికి తోచిన సహాయం చేస్తున్నారు. అందుకోసం సహచరిణి జయలక్ష్మీశేషన్‌తో కలిసి చెన్నైలోని ‘గురుకులం’ అనే వ ృద్ధాశ్రమంలో గడుపుతున్నారు. అసాధారణ ప్రతిభ కలిగిన శేషన్ సామాన్య వ్యక్తిగా ఆశ్రమం లోని తోటివారి కష్టాలను వింటూ, వారికి చేతనైన సాయం అందిస్తున్నారు, ఆదుకుంటున్నారు. శేషన్ తన పింఛను డబ్బుల్లో కొంత ఇతర సామాజిక సేవలకు వెచ్చించడం విశేషం.
7989134271