ఎన్నికల మూడ్‌లో రాజకీయ పక్షాలు
త్వరలో జరగబోయే 2019 సార్వత్రిక ఎన్నికల కోసం అన్నీ రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. లోక్‌సభతోపాటు, రాష్ట్ర శాసనసభకూ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు రంగం సిద్దమవు తోంది ఫిబ్రవరి చివరి వారం లేదా ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీలో మొత్తం 25లోక్‌సభ స్థానాలతోపాటుగా 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రానికి సంబంధించి తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికా రులు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. రాజకీయ పొత్తులు, మద్దతుదారులను కూడగట్టుకోవడం, కార్యకర్తలను బుజ్జగింపులు వంటి సంఘటనలు జోరందుకున్నాయి. ఓటర్లును ఆకట్టుకునేందుకు ఇప్పటికే టీడీపీ సామాజిక పింఛన్లను రెట్టింపుతోపాటు, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా పేరిట వరాలను ప్రకటించింది. ప్రధానంగా సన్నకారు, కౌలు రైతులను లక్ష్యంగా చేసుకుని భారీ నగదు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకం ఉంటుందని తెలుస్తోంది. దీనిద్వారా రైతాంగాన్ని మచ్చిక చేసు కోవడంతోపాటు, ఎన్నికలలో గెలిచేందుకు సులువు అవుతుం దని టీడీపీ భావిస్తూ వ్యూహాలు చేస్తోంది. అదే విధంగా మరిన్ని పథకాలతో పాటు, రాయితీలు, వెసులబాట్లు అన్నీ కలిపి ఓటాను అకౌంట్ బడ్జెట్లో ప్రకటించాలని కూడా టీడీపీ ఆలోచిస్తోంది. బడుగు బలహీనవర్గాల కార్పొరేషన్లు ప్రభుత్వం ప్రకటించి ఆవర్గాల ప్రజలను ఆకట్టుకొంటోంది. ఈ విధంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోజుకో పథకాన్ని ప్రవేశపెడుతూ ఎన్నికల చోరులో ఉన్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు`కుంకమ పథకం పథకం కింద పదివేల రూపాయలు పంపిణీ వంటి పథకాలు ప్రవేశపట్టి ఆకట్టుకుంటున్నారు. అయితే ఇలా ఉండగా ఈ పథకాలన్నీ తమవే నని వైకాపా టీడీపీ పార్టీపై ఆరోపణలు చేయడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతోపాటు ప్రజల్లో కూడా ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీలకు పదును పెడుతోంది. ఫిబ్రవరి 19న బీసీ గర్జన పెట్టి బీసీ ఓట్లను రాబట్టేందుకు సన్నహాలు చేపట్టారు. ఈవిధంగా ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని ఆపార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇంకో వైపు జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా అభ్యర్థలు కసరత్తు చేస్తోంది. ఇప్పటి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కౌంట్ డౌన్ ప్రకటించాయి. 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా 400 లోకసభ స్థానాల్లో రెండువందల ర్యాలీలు నిర్వహించేందుకు ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించే పనిలో నిమగ్నమైంది.
ఇది ఇలాఉండగా ఈసారి లోక్‌సభ ఎన్నికలతో పాలుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల కూడా జరిపే అవకాశం ఉంటుదంటున్నారు. మరోపక్క తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీ ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్దం చేసేందుకు అన్నీ రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ప్రధాన హస్త్రంగా తీసుకోవడం ప్రధాన అంశం. ప్రజల్ని, కార్యకర్తలను ఎన్నికల మూడ్‌లోకి తీసుకు వచ్చేందు కు ప్రజల వద్ద ఉన్న స్మార్ఫోన్లు ప్రచార సాధనాలుగా వినియోగించడం విశేషం. ముఖ్యంగా వాటిని ఎన్నికల ప్రచార సాధనాలుగా వాట్సాప్.. ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ ప్రచార మాధ్యామాలను వినియోగిస్తూ ఆయా పార్టీల బలోపేతానికి రాజకీయ కార్యకర్తలను సిద్దంచేస్తున్నారు. అధికార పక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ పార్టీలు ఈనాలుగేళ్ల కాలంలో ఏం చేశారో ప్రజలకు చెప్పడానికి సిద్దపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని సాధ్యమైనంత మేర తిప్పికొట్టి, ప్రజలకు ఆలోచించు కోవడానికి సమయం దొరుకుతుందనే భావంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఉవ్వూళూరుతున్నారు. ఇక ప్రతిపక్షనేతలు అధికార పార్టీ నేతలు చేసిన అవినీతి, భూ కుంభకోణాలు వెలికితీసీ నాలుగేళ్లలో పాల్పుడిన అవినీతిని బట్టబయలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రజలు కూడా సార్వత్రిక ఎన్నికల మూడ్‌లోకి చేరిపోయారు. ఎన్నికలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈనేపధ్యంలో ఎన్నికల సంఘం కూడా సూచనప్రాయంగా లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో మరీంత ఊపుందుకుంది.
మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రకటన! :
లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం మార్చి మొదటి వారంలో ప్రకటిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్ మూడో తేదీన ముగియనుండడంతో ఆలోగానే ఎన్నికల నిర్వహణపై సన్నా హాలు ఆరంభమయ్యాయి. ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించాలి? ఏయే నెలల్లో జరపాలి? అన్నదానిపై ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. భద్రతా దళాల అందుబాటు, తదితర అంశాల ఆధారంగా ఎన్ని దశల్లో నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు. సంప్రదాయాన్ని అనుసరించి లోక్‌సభ ఎన్నికలతో పాటు కాలపరిమితి ముగియనున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికలు కూడా జరిపే అవకాశం ఉంది. రద్దయిన జమ్ము-కశ్మీర్ అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు నిర్వహించే అవకాశాలను పరిశీలించవచ్చు. సంక్ష్లిష్టమైన శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా అక్కడ కాస్త ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. అసెంబ్లీల కాల పరిమితి అయిదేళ్లు కాగా, జమ్ము-కశ్మీర్‌కు మాత్రం ఆరేళ్లు ఉంటుంది. వాస్తవానికి 2021 మార్చి16వరకు గడువు ఉన్నప్పటికీ 2018 నవంబరులోనే రద్దు చేశారు. ఆరునెలల్లోగా అంటే మే నెలలోగా దీనికిఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈవిషయాన్ని ఎన్నికల సంఘం అధికారప్రతినిధి వద్ద ప్రస్తావించగా, ఎన్నికల తేదీలను ఎప్పుడు వెల్లడిరచాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఇంతకుముందు ఇలా..
2014లో 9దశల్లో ఎన్నికలు జరిగాయి. మార్చి 5న ప్రకటన వెలువడిరది. తొలిదశ ఏప్రిల్ 7న, చివరి దశ పోలింగ్ మే 12న జరిగాయి. 2009లో 5 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 2న ప్రకటన రాగా, ఏప్రిల్ 16న తొలి దశ, మే 13న చివరిదశ ఎన్నికలను జరిపారు.
2004లో 4 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 29న ప్రకటన వెలువడగా, తొలి దశ ఏప్రిల్ 20న, ఆఖరి దశ మే 10న నిర్వహించారు. – గునపర్తి సైమన్