ఎన్నికల కోలాహలం నిఘా పటిష్టం
ఏఫ్రిల్ 11న జరిగే పోలింగ్ సమయం మరింత దగ్గర పడుతుండటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును సిద్ధంచేశారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చుపై నిఘా బృందాలు నిఘా ఉంచాయి. అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లకు తాయిలాలు అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంపై నిఘా బృందాలు కన్నెసి ఉంచాయి. ఎన్నికల ప్రచార ఘట్టం దగ్గర పడుతంఉడటంతో గ్రామాలు, పట్టణాల్లో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తిస్తున్నారా, సమావేశానికి ఎంత వెచ్చిస్తున్నారు అనే విషయాలను లెక్క తేల్చడానికి తనిఖీ బృందాలు వెంటాడుతున్నాయి. తాయి లాలపై ప్రత్యేక దృష్టి ఆయా పార్టీల అభ్య ర్థులు ఓటర్లకు తాయిలాల పంపిణీపై నిఘా బృందాలు ప్రత్యేకదృష్టి సారిం చాయి. డబ్బు, మద్యం పంపిణీపై ఓవైపు సివిల్ పోలీసులు, మరోవైపు ఎక్సైజ్‌శాఖ సిబ్బంది విస్త ృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో వివిధ విభాగాలకు చెందిన 15వేల మంది పోలీసులు ఉండగా, మరో 10,000 మంది సెంట్రల్, స్టేట్ పారామిలటరీ బలగాలు రానున్నాయి. ఆరు ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు పనిచేస్తుండగా, అనుమా నస్పదమైన ప్రతి చోట పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని ఆపి విస్తృతంగా తనిఖీచేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రూ.కోట్లాది రూపాయల నగదును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు.
సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన రాష్ట్రంలో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ఆయా జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు, ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువత గొడవలకు వెళ్లకుండా వారిని చైతన్యం చేస్తున్నారు. ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచిస్తున్నారు. అభ్యర్థుల సమావేశం, ప్రచారాలపై ఎస్పీ ఎప్పటికప్పుడు కిందస్థాయి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆయా జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాలువద్ద కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఎస్పీ నేతృ త్వంలో పలు గ్రామాల్లో కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై నజర్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకుల్లో వివిధ లావాదేవీలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్ల పర్వం ముగి యడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేం దుకు రాజకీయ పార్టీల నాయకులు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు ఆరంభించారు. అభ్యర్థుల ఎత్తుగడలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఖాతాల్లో ఒకేసారి నగదు జమకావడం, ఎక్కువ లావాదేవీలు నిర్వహించడం తదితర వాటిపై నిఘా ఉంచారు. రూ.50వేలు దాటితే పాన్‌కార్డు నంబర్ తప్పనిసరి అడుగుతున్నారు. ముఖ్యంగా రూ.లక్షలకు మించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు డబ్బు సంచిలు కదలాడుతున్నాయి. ఎన్నికల బూత్ స్థాయి కన్వీనర్లకు చేరుతున్నాయి. నిఘా యంత్రాంగం దీనిపై దృష్టి కేంద్రీక రించారు. నిఘా కెమెరాలతో ఎప్పట్టికప్పుడు చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, రాజమండ్రి, కడప, కాకినాడ, కర్నూల్, గుంటూరు, విజయవాడ, మంగళగిరి వంటి ప్రాంతాల్లో క్షుణ్ణంగా తణిఖీలు చేస్తున్నఆరు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లను చైతన్యవం తులను చేయడానికి సామాజిక సేవా బృందాలు పనిచేస్తున్నాయి. అలాగే సమస్యాత్మకమైన పోలింగ్ బూత్‌ల వద్ద ఘట్టి నిఘా ఏర్పాటు చేయడానికి ప్రణాళి కలు రూపొందించారు. యువత భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు జిల్లాలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పించాం. ఓటర్లు ప్రలోభా లకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒకరి సమావేశాలు జరిగే సమయంలో మరొకరు అక్కడి వెళ్లి గొడవలు చేస్తే చర్యలు తప్పవు. ముఖ్యం గా యువత గొడవలకు దిగి వారి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని పోలీసులు పేర్కోన్నారు.