ఉసురు తీస్తున్న ఫార్మా కంపెనీలు
విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో ఇటీవల పేలుడు సంభవించి 17మంది మృతిచెందిన నేపథ్యంలో రాష్ట్రం లోని అత్యధిక ఫార్మా పరిశ్రమలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఉమ్మడిజిల్లాలోని చౌటుప్పల్,బీబీనగర్, భువనగిరి,బొమ్మల రామారం,భూదాన్ పోచంపల్లి, త్రిపురారం,మిర్యాలగూడ మండలాల్లో సుమారు 100వరకు ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి.10వరకు భారీ కంపెనీలు ఉండగా..వీటిల్లోనే సుమారు 30వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.మిగిలిని వాటిలో సుమారు 20వేల వరకు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వేల మందికి ఉపాధి ఇచ్చే కంపెనీల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది.నైపుణ్యం గల కార్మికులు పనిచేయాల్సి ఉండగా..ఉత్తర్‌ప్రదేశ్,బీహర్, జార్ఖండ్ లాంటి తదితర రాష్ట్రాల నుంచి తక్కువ వేతనంతో పనిచేసే వారిని కార్మికు లుగా నియమించుకుంటున్నారు. కంపెనీల్లో పిర్యాదుల చెద్దామంటే స్థానికులకు సంబం ధిత ఫ్యాక్టరీస్,పీసీబీ అధికారులు అందు బాటులో ఉండటం లేదు. ఏకంగా జిల్లా ఉన్నతాధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ వీరు పాల్గోనడం లేదు.
ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలే ఉసురు తీస్తు న్నాయి. ఫార్మా కంపెనీల్లోకార్మికులకు రక్షణ కరువు అవుతోంది. యాజమాన్యాలు కార్మికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.దీంతో ఏటా కార్మికులు మృత్యువాత పడుతున్నారు.ఫార్మా కంపెనీల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉండాలి.ఎక్కడా ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు.తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడిరచాలనే దురాలో చనతో సబ్ కాంట్రాక్టర్లకు పరిశ్రమల నిర్వ హణ అప్పగిస్తున్నారు. సబ్ కాంట్రాక్టర్లు నైపుణ్యం లేని వారిని తక్కువ వేతనాలతో నియమించడంతో తరుచు ప్రమాదాలు సంభవి స్తున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. భద్రత గురించి ప్రశ్నించే కార్మికుల్ని యాజమా న్యాలు నిర్ధాక్ష్యణ్యంగా విధుల నుంచి తొలిగి స్తున్నాయి. దీంతో కార్మికులు భయపడి బిక్కుబిక్కుమంటు ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై చూపడంలేదనేది బహిరంగ రహస్యం. కార్మికులకు భద్రతా పరికరాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్లు, కార్మిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాల్సి ఉన్నప్ప టికీ ఫార్మా కంపెనీల్లో ఇదంతా మొక్కుబడి తంతుగా మారుతోంది.
కంట్రోల్ కాని రియాక్టర్లు
ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో హై టెం పరేచ్‌లో ద్రవకాలను మరిగించాల్సి ఉం టుంది. నిపుణులైన ఉద్యోగులు లేకపోవడం వల్ల తరుచు ప్రమాదాలు సంభవిస్తున్నాయనే ఆరోణపణలు ఉన్నాయి. రియాక్టర్లు పేలిన ప్పుడు కంట్రోల్ చేయాలంటే నిపుణులు ఉం డాలి అత్యధిక శాతం కంపెనీల్లో అరకొర నాలెడ్జి ఉన్న వారే ఉండటంతో ప్రమాద సమయాల్లో రియాక్టర్లను కంట్రోల్ చేయడం కష్టంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.పైప్‌లైన్ లీకేజీ కార ణంగా పలు సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యర్థ రసాయనాలు వెళ్ళే పైల్‌లైన్ సక్రమంగా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యాలతో పాటు అధికారులు పర్యవేక్షించాలి. వ్యర్థ రసాయనాలను శుద్ధి చ?టటసి పైల్‌లైన్ గుండా బయటకు పంపాల్సి ఉన్నప్పటికీ పలు కంపెనీలు ఈదిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది.అనకాపల్లి జిల్లా అచ్యుతా పురం సెజ్ లోని సాహితీ ల్యాబ్ లో రియా క్టర్ భారీ పేలుడు కారణంగా ఇద్దరు కార్మి కులు అక్కడికక్కడే మృత్యువాత పడగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.ల్యాబ్ లో కెమికల్స్ మరిగించే క్రమంలో వ్యాపిం చిన మంటలే ప్రమాదానికి కారణంగా -గునపర్తి సైమన్