ఉసురి తీస్తున్న ఊపిరి
పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన అవసరం.కాలుష్య నివారణకై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణ యోగ్యంకాని విధా నాలు, ప్రయోగాలు చేస్తూ రోజురోజుకు సమస్యను జటిలం చేస్తున్నారు. ఫలితంగా పర్యావరణం విషతుల్యంగా మారుతున్నది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అనేక వ్యాధులకు గురవ్ఞతున్నారు. మరెం దరో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడి మంచానికే పరిమి తమై కృంగికృశించి అసువ్ఞలు బాస్తున్నారు. కాలుష్య మేఘాలు అంత కంతకు కమ్ముకోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా దేశంలోని అనేక నగరాల్లో పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతున్నది. ఒక్క వాయు కాలుష్యమేకాదు నీటి కాలుష్యం కూడా పరిస్థితిని పతా నంచునకు తీసుకు పోతున్నది. రోజురోజుకు గ్రామాల నుండి నగరాలకు వలస వచ్చేవారు ఎక్కువ కావడంతో పాటు సమస్య మరింతజటిలంగా మారు తున్నది. మురికి వాడల నిర్మూలనకు దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎక్కడికక్కడ ఎప్పటి కప్పుడు కొత్తవి పుట్టుకొస్తున్నాయి.
ప్రధానంగా పీల్చేగాలిలో ప్రమాదకరమైన దుమ్ముకణాలు పెచ్చరిల్లుతుండటంతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నది. భారతదేశానికి సంబంధించినంతవరకు దేశంలోని ఆరు మెట్రోనగరాలు ఢల్లీి, కోల్‌కతా, చెన్నై,ముంబాయి,బెంగళూరు, హైదరాబాద్ లో జరిపిన సర్వేల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఢల్లీి పరిస్థితి ఆందోళన కరంగా తయారైంది.ఢల్లీి పరిసరప్రాంతాల్లో ఉన్నకొందరు రైతులు తమ పంటవ్యర్థాలను దగ్ధం చేయడం పెనుశాపంగా పరిణ మిస్తున్నది. దీనిని అడ్డుకునేందుకు పాలకులు నిషేధం విధించి, భారీగా జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏమాత్రం తగ్గకపోగా ప్రస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనలో దీనిని తొలగించాలనే డిమాండ్ కూడా ఒకటిగా మా రింది. అనేక నగరాల్లో నీటి,గాలి నాణ్యత వాతావరణంలో మార్పులు, అటవీ విస్తీర్ణం, చెత్తనిర్వహణ తదితర అంశాలపై జరిపిన అధ్య యనంలో వాయుకాలుష్యం నగరజీవి ఊపిరితి త్తులకు తూట్లుపొడుస్తుందనే విషయం బయట పడిరది.హైదరాబాద్ నగరంలో నీటి,వాయు కాలుష్యంతోపాటు నిర్మాణ రంగంవల్ల పీల్చే గాలిలో ధూళికణాలు అధికంగా ఉన్నట్లు వెలుగుచూసింది.హైదరాబాద్నగర శివారుల్లో పరిశ్రమలు గాలిలో వదులుతున్న కాలుష్యానికి అడ్డూఅదుపులేకుండా పోతున్నది. అలాగే నీటి కాలుష్యం దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కరంగా తయారవుతున్నది. దేశంలో సగానికి పైగా చెరువ్ఞలు, జలాశయాల్లో ఉన్న నీరు తాగడానికి పనికిరాకుండాపోయాయి. ఒకనాడు తాగునీరు అందించిన కొన్ని నీటివనరులు ఇప్పుడు పూర్తిస్థాయిలో కాలుష్యకారకంగా మారి వెదజల్లుతున్న దుర్వాసనలు చుట్టుపక్కల ప్రాంతాల వారికి తీవ్రంగా ఇబ్బంది కలిగి స్తున్నాయి. నగరాల రోడ్లపై నడుస్తున్న వాహ నాలు వెదజల్లుతున్న కాలుష్యం గురించి ప్రత్యే కంగా చెప్పక్కర్లేదు. వాహన కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు చేస్తున్న ప్రయ త్నాలు అంతగా సఫలీకృతం కావడం లేదు.1989 నాటి మోటారు వాహనాల చట్టం రూల్‌నెం.5 ప్రకారంనిర్ధారిత ప్రమాణాలకు మించి పొగవదిలితే జరిమానా విధించాలి. అప్పటికీ అదుపుకాకపోతే ఏకంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలి. పర్యావరణాన్ని కాలు ష్యం చేస్తూ మోతాదు కుమించి పొగలు వదులు తున్న ఏ వాహనం అయినా ఈచట్ట పరిధిలోకి వస్తుంది. ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తూ ప్రస్తుతం తెలుగురాష్ట్రాల వరకు పరిశీలించినా సగానికిపైగా వాహనాలు రోడ్లపై తిరిగే అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1993లో మొదటి సారిగా వాహనకాలుష్య నియంత్రణ కోసం కాలుష్య నియంత్రణ మండలిని (పిసిబి)ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి అధికారుల మీద అధికారులను నియ మిస్తూ నిబంధనలను రూపొందిస్తూనే ఉన్నారు.మార్పులు చేర్పులు చేస్తూ నిబంధనలను అతిక్రమించిన వారిపై జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. అయినా ఎలాంటి ఫలితాలు రాలేదు.ఎన్ని చట్టాలు తెచ్చినాఅవన్నీ దాదాపు కాగితాలకే పరిమితమవ్ఞతు న్నాయి. ప్రయోగాలు విఫలమవుతున్నాయే తప్ప ఫలితాలు రావడం లేదు.ఫలితంగా వాతా వరణం కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, దుమ్ముధూళి పెరిగిపోతున్నది. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ పర్యావరణం అంతగా కలుషితమైపోతున్నది. పెట్రోలులో జరుగుతున్న కల్తీ సమస్యను మరింతగా పెంచుతుందనే చెప్పొచ్చు.గతంలో పర్యావరణ శాస్త్రజ్ఞులు చేసిన అధ్యయనంలో భారత్ దాదాపు వంద దేశాల కంటే అట్టడుగున ఉన్నట్లు బయట పడిరది.అంతేకాదు భారత్ వాతావరణంలో ధూళికణాలు ఉండాల్సిన స్థాయి కన్నా ఐదు రెట్లు అధికంగా ఉండి శ్వాసకోశ సమస్యల నుంచి కేన్సర్ దాకా అనేక వ్యాధులకు కారణమవ్ఞతున్నా యనే విషయం బయట పడిరది. ప్రత్యేకించి భావితరం బాలబాలికల బతుకుదీపాలను కాలుష్యం ఛిదిమేస్తుంద నేది ఆందోళన కలిగించే అంశం.ఐదేళ్లలోపు బాలబాలికల్లో దాదాపు పదిహేను శాతం శ్వాస సంబంధిత వ్యాధులతో చికిత్సపొందుతూ ఆస్పత్రుల్లోనే కన్నుమూస్తు న్నారు. వాయు కాలుష్యం నుంచి మంచి కొలె స్ట్రాల్ చెడు కొల టస్ట్రాల్‌గా మారడం గుండె జబ్బులకు, పక్షవాతానికి, ఊపిరి తిత్తుల కేన్సర్‌కు మూలం అవుతుందని వైద్యనిపుణులు అభిప్రాయపడు తున్నారు.ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు తున్న ఈ కాలుష్య తీవ్రతను పాలకులు ఇప్పటి కైనా గుర్తించి నివారణకు ఆచరణ యోగ్యమైన విధానాలను ప్రకటించి త్రికరణశుద్ధిగా అమలుకు ప్రయత్నం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా పర్యావరణం పట్ల సాధారణ ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్దఎత్తున కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముంచుకొస్తున్న కాలుష్య ముప్పు!
కాలుష్య నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణయోగ్యం కాని విధానాలతో ప్రయో గాలతో సమస్యను రోజురోజుకు జఠిలం చేసు ్తన్నాయి. ఫలితంగా పర్యావరణ విషతుల్యంగా మారుతున్నది. కోట్లాది మంది ప్రజలు అనేక వ్యాధులకు లోనవ్ఞతున్నారు. మరెందరో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మంచానికి పరిమితమై అసువ్ఞలు బాస్తున్నారు. కాలుష్య మేఘాలు అంతకంతకు కమ్ముకోవడం ఆందో ళన కలిగించే అంశం. నగరాల పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా తయాంవు తున్నది. నీటి కాలుష్యం నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీనికితోడు రోజురోజు గ్రామాల నుండి నగరాలకు వసల వచ్చేవారు ఎక్కువ కావడం సమస్య మరింత ప్రమాదకరంగా మారుతున్నది మురికివాడల నిర్మూలనకు ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా పాలకులు ఎంత ప్రయత్నం చేస్తున్నా మరొకపక్క కొత్తకొత్తవి పుట్టుకు వస్తున్నాయి. గ్రామాల్లో ఉన్న పరిస్థితుల వల్ల వలసలు పెరిగిపోతున్నాయి. అందుకే నగరాలు ఊహించని రీతిలో పెరుగుతుండటంతో సమస్యలు అంతకు రెట్టింపుస్థాయిలో తయాంవు తున్నాయి. భారతదేశంలో ఆరు మెట్రో నగరాల్లో ఢల్లీి, చెన్నై,ముంబాయి,కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో గతంలో జరిపిన సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగు లోకి వచ్చాయి. పర్యావరణం,నీరు,గాలి నాణ్యత,వాతావరణంలో మార్పులు, అటవీ విస్తీర్ణం, చెత్తనిర్వహణ తదితర అంశాల్లో జరిపిన సర్వేల్లో వాయుకాలుష్యం నగర జీవి ఊపిరితిత్తులకు తూట్లుపొడుస్తుందనే విషయం వెలుగు చూసింది. కొన్ని నగరాల్లో వాయు కాలుష్యం అంచనాలకు మించి పెరిగినట్లు బయటపడిరది.హైదరాబాద్‌తోపాటు మరికొన్ని నగరాల్లో పారిశ్రామిక కాలుష్యం అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ నీటి,వాయుకాలుష్యంతో పాటు నిర్మాణ రంగం వల్ల వీచే గాలులు ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు బయటపడిరది. నగరశివారులోని పరిశ్రమలు, గాలిలో వదులుతున్న కాలుష్యానికి అదుపులేకుండా పోతుంది. మరొకపక్క దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికీ ఈ పరిశ్రమలు మూసీలో వదులుతున్న వ్యర్థాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఒకనాడు మంచినీరు అందించిన అనేక నీటి వనరులు ఇప్పుడు పూర్తిస్థాయిలో కాలుష్యకాసారాలుగా మారి వెదజల్లుతున్న దుర్వాసనను చుట్టుపక్క ప్రాంతాల వారికి ఇప్పటికీ ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. ఇక నగర రోడ్లపై నడుస్తున్న వాహనాల కాలుష్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాహన కాలుష్యాన్ని నివారిం చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. 1889 నాటి మోటార్ వాహనాల చట్టంలోని రూల్‌నెం.115 ప్రకారం నిర్ధారిత ప్రమాణాలకు మించి పొగ వదిలే వాహనాలపై జరిమానా విధించాలి. అప్పటికీ అదుపుకాకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలి. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ మోతాదుకు మించి పొగలు వదులుతున్న ఏవాహనమైనా ఈ చట్టపరిధిలోకి వస్తుంది. ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే అటు రోడ్డు రవాణా సంస్థలోకానీ, ఇటు ప్రభుత్వ వాహనాలు రోడ్లపై తిరిగే అవకాశం లేదు. 1993లో మొదటిసారిగా వాహన కాలుష్య నియంత్రణ కోసం కాలుష్యనియంత్రణ మండలినిఏర్పాటు చేశారు. అప్పటి నుండి అధికారుల మీద అధికారులను నియమిస్తు న్నారు. నిబంధనలను రూపొందిస్తున్నారు. మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అయినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఎయిర్ యాక్ట్ 1887సెక్షన్ 31ఎ కింద హైదరాబాద్ లోని పెట్రోల్ పంపుల్లో దాదాపు ఇరవైకిపైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిబంధన లను అతిక్రమించిన వారికి జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు. జంటనగరా ల్లో తిరిగే ప్రతి వాహనం విధిగా పరీక్షించుకోవాలని నిబంధనలు కూడా విధించారు. నాలుగేళ్ల తర్వాత కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కొత్త ప్రతిపాదనలు ముందుకు తీసుకువచ్చారు. కాలుష్యసర్టిఫ్టికేట్ (పీయూసీ) ఉన్న వాహనాలకే ఇంధనం పోయాలని కొత్త నిబంధనలు విధించారు.ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రయోగాలు విఫలమవ్ఞతున్నాయి తప్ప ఫలితాలు రావడం లేదు. ఫలితంగా వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆసిడ్, దుమ్ముధూళి పెరుగుతున్నది. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ వాతావరణం అంతా కాలుష్యం అవ్ఞతున్నది. పెట్రోల్ జరుగుతున్న కల్తీ కూడా ఈ కాలు ష్యాన్ని పెంచుతున్నది. ఈ కల్తీని నిరోధిం చేందుకు అధికార గణం తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. మొత్తం మీద తీవ్ర స్థాయిలో వెలువడతున్న విషవాయువ్ఞలవల్ల పర్యావరణం విషతుల్యమై ప్రజలు అనేక వ్యాధులకు గురవ్ఞతున్నారు. భారత్‌లో వాతావరణంలో ధూళికణాలు ఉండాల్సిన స్థాయి కన్నా ఐదురెట్లు అధికంగా ఉండి శ్వాస కోశ వ్యాధుల నుంచి క్యాన్సర్ దాకా అనేక రోగాలకు కారణమవ్ఞతున్నాయని పరిశోధనల్లో ఎన్నోసార్లు వెల్లడైంది. ప్రత్యేకించి భావితరం బాలబాలికల బతుకు దీపాలను కాలుష్యం చిధిమేస్తున్నట్లు అయింది. ఐదేళ్లలోపు బాలబాలికలు 14శాతం శ్వాససంబంధిత వ్యాధులతో చికిత్సపొందుతూ ఆస్పత్రుల్లోనే కన్నుమూస్తున్న విషయం ఆందోళన కలిగి స్తున్నది. వాయుకాలుష్యం మంచి కొలెస్ట్రాల్‌ను చెడు కొలెస్ట్రాల్‌గా మారుస్తూ గుండెజబ్బులకు పక్షవాతానికి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు మూలం అవ్ఞతున్నాయని వైద్యనిపుణులే చెప్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కాలుష్యభూతాన్ని నియంత్రించాల్సిన అవస రం ఎంతైనా ఉంది. సమస్యతీవ్రతను అర్థం చేసుకొని నివారణకు ఆచరణయోగ్యమైన విధానాలను ప్రకటించి అమలుకు త్రికరణశుద్ధిగా కృషి చేయాలి.
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తు న్నట్లు చెప్పారు. సముద్రాన్ని కాపాడుకు నేందుకు, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పార్లే ఓషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జీవరాశులను హరించివేస్తు న్నాయి. రాష్ట్ర పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. విశాఖ బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో తీరం వెంట ఉన్న ప్లాస్టిక్‌ను తొలగించారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమంలో దాదాపు 20 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ‘పార్లే ఫర్ ది ఓషన్’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, బీచ్ పరి రక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శించారు. అనం తరం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే…: ఈ రోజు గుర్తుండిపోయే రోజు. నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్, లీడర్షిప్ కౌన్సిల్ జీఏఎస్‌పీ, రాజీవ్ కుమార్, సెక్రటరీ జనరల్, గ్లోబల్ అలయెన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ సత్య ఎస్ త్రిపాఠి, సీఈఓ పార్లే ఫర్ ది ఓషన్స్ సిరిల్ గచ్చ్‌తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు.
ప్రపంచంలోనే అతి పెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. ఈ ఉదయం పెద్ద సంఖ్యలో హాజరై భారీ ఎత్తున బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. దాదాపు 22 వేల మంది ప్రజలు,40 ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 28 కిలోమీటర్లు మేర గోకుల్ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు శుద్ధి చేశారు. 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్య క్రమం ఇది. ఈ సామాజిక స్ఫూర్తి చాలా అద్భుతమైనది, అదే వైజాగ్‌ను ప్రత్యేక నగరంగా నిలబెట్టింది.
పర్యావరణ పరిరక్షణ దిశగా…
పర్యావరణం, ఎకానమీ రెండూ కూడా నాణేనికి రెండు కోణాలు. పర్యావరణాన్ని పరిరక్షించక పోతే.. మనకు మనుగడ ఉండదు. సుస్ధిరత, సమగ్రత అన్నవి మన ప్రధాన లక్ష్యాలు. మనం స్వల్పకాలిక లక్ష్యాల కోసం రాజీపడితే.. దీర్ఘకా లికంగా మనుగడ సాగించలేం. అందుకే మన ప్రభుత్వం మానవ, ఆర్దిక వనరులతో ఈ దిశ లోనే సుస్ధిర ప్రగతి కోసం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా పరిరక్షిస్తోంది. దాన్ని రాబోయే తరాల ఉత్తమ భవిష్యత్తుకు కూడా అందించాలి.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం…
ఆ దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నాం, దీన్ని ఎలా సాధించాలన్నదే ముఖ్యమైన అంశం. మన ముందు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి. గత కొన్ని నెలలుగా చూస్తే… ప్రభుత్వం క్లాప్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. అక్టోబరు 2, 2021న క్లాప్ ప్రొగ్రాం ప్రారంభించింది. 4097 చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిం చింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా ఈకార్యక్రమాలను ప్రారంభించాం. దీనివల్ల గ్రామాల్లో చెత్త సేకరణ 22 శాతం నుంచి 62 శాతం పెరిగింది. 100 శాతం సేకరణ లక్ష్యం గా అడుగులు వేస్తున్నాం. అయితే కొన్ని వాస్తవాలను కూడా మనం తెలుసుకోవాలి. భూమి మీద మనకు లభించే ఆక్సిజన్‌లో 70 శాతం మెరైన్ ప్లాంట్స్ నుంచే వస్తోంది. అంటే మన రెయిన్ ఫారెస్ట్స్ నుంచి కేవలం 28 శాతం ఆక్సిజన్ మాత్రమే లభిస్తోంది. అంటే ఫైటో ప్లాంక్టన్, కెల్ఫ్, ఆల్గల్ ప్లాంక్టన్ వంటి ప్లాంట్స్ కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఫైటో ప్లాంక్టన్‌లో ముఖ్యమైనది ప్లో క్లోరో కాకస్. వాతావరణంలోకి అత్యధిక ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ ఇది. చాలా కొద్ది మందికి మాత్రమే అవగానహన ఉన్న వాస్తవాలు ఇవి. – జిఎన్‌వి సతీష్