ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసులు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ ప్రో ॥ కంచ ఐలయ్య షెఫర్డ్ ’ కలం నుంచి జాలువారిన ‘ ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసీలు’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
సంచల రచయిత కంచ ఐలయ్య గారి కలం నుంచి వెలువడిన పుస్తకం ‘ఉచిత ఉపాధ్యా యులు ఆదివాసీలు’ పేరుకు తగ్గట్టుగానే అందులోని అంశాలు కూడా ఆసక్తికరంగా ఉండి నూతన అంశాలను ఆవిష్కరించారు. పూర్వకాలం నుంచి లిపిలేని భాషలో సంభాషించుకుంటున్న అడవి బిడ్డలంతా ఆధునిక ఆంగ్ల భాష నేర్చుకుంటే అన్ని రంగాల్లో ఘనమైన అభివృద్ధి సాధించేవారు అన్నది రచయిత ప్రొఫెసర్ ఐలయ్య గారి భావన.పేర్లు సంస్కృతి,ఆదివాసి వ్యక్తిత్వం, ఆహార సంస్కృతి, శాఖాహార ఉద్దేశం, మద్యం ఆధ్యాత్మిక వాదం,పోడు ఉత్పత్తి ఆదివాసి సృజనాత్మకత,ఆదివాసి సాంకేతిక పరిజ్ఞానం, ఆదివాసి విత్తన వ్యవస్థలు, ఆదివాసి సజీవ నాయకత్వం,ఆధ్యాత్మికత,ప్రతికూల జాతీయ వాదం, సజీవ కథానాయకులు,స్వీయ ఆరాధన,స్త్రీ పురుష సంబంధాలు, ఆదివాసి వివాహం,అనే ఉప విభాగాలుగా సాగిన ఈ పుస్తక అక్షర ప్రయాణంలో ప్రతి అంశం ఒక కొత్త కోణంలో ఆవిష్కరించబడిరది. ఆదివాసీలు వ్యక్తిత్వం రీత్యా వారి జీవన విధానంద్వారా సమాజానికి ఎంతో కొంత నేర్పే వారే అన్న భావన అందించారు. మన సంస్కృతి నాగరికతలకు పునాదులు వేసింది ఆదివాసీలే అన్న విషయాన్ని ఇందులో రచయిత స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదివా సీలు తినే మాంసాహారంలోని ఆరోగ్య కారకాలు మనిషి మనుగడకు ఎలా దోహద పడుతున్నాయో వివరిస్తూనే వారు అలవాటు చేసిన మాంసాహారాన్ని నేటి ఆధునిక సమా జం అనుసరించి ఆధునికమైన కొత్త రుచు లతో ఆరగిస్తున్నారు అంటారు ఐలయ్య గారు. పోడు వ్యవసాయానికి చిరునా మాదారులైన గిరిజనులు వ్యవసాయ కార్యకలాపాల్లో తమదైన భుజశక్తికి ప్రాధాన్యత ఇస్తూ కర్ర ఇనుము కలగలిసిన వ్యవసాయ సాధనాలను కళాత్మకంగా ఉపయోగిస్తూ తమదైన సృజనాత్మకతతో పోడు వ్యవసాయం చేసుకోడాన్ని భిన్న కోణంలో ఆవిష్కరిస్తూ తద్వారా కూడా గిరిజనులు ఆధునిక సమాజానికి బోధకులు ఎలా అయ్యారో నిరూపించారు. ఆదివాసీలు త్రాగే ఆహార పానీయాల్లోని వినూత్న విషయం గురించి చెబుతూ చెట్లనుంచి కల్లు తీయడం వారికి మాత్రమే తెలిసిన గొప్ప ప్రక్రియగా అభివర్ణించారు. అంతేగాక అందులోని ఆరోగ్య కారకాలు శరీర ఆరోగ్యానికి ఎలా దోహద పడుతున్నాయో కూడా వివరించారు తాటిచెట్టు కల్లుతో పాటు ఈత,జీలుగ,వేప,చెట్ల నుంచి వారు తీసే కల్లు ఆరోగ్యానికి ఎలా సహకరిస్తుందో సవివరంగా సెలవిచ్చారు,అలాగే వారు ఆరాధించే దేవుడు సైతం ఈ మద్యాన్ని ఆరగిస్తారని మద్యానికి సైతం ఆధ్యాత్మిక వాదం అనుబంధం చేశారు రచయిత. నేటి మన ఆధునిక పద్ధతులకు ఆధారం ఆదివా సులు అవలంబించే పద్ధతులే కారకం అన్న రచయిత బలమైన వాదనఈ పుస్తకం లోని ప్రతిభాగంలో కనిపిస్తుంది.కొండారెడ్డి లంబాడాలు చెంచులు కోయలు ఉంటే సొంత సామాజిక పేర్లు కలిగి ఉన్న వీరిని ఆధిపత్య ధోరణిలో అందరిని ఒకే గాటిన కట్టేస్తూ గిరిజనులు, వనవాసులు,అని పిలవడం సరైన విధానం కాదు అన్నది రచయిత వాదనే కాదు,అలా పిలిపించు కోవడం వారికి ఇష్టం ఉండదు అని కూడా తేల్చి చెప్పారు దీనిలో వాస్తవికత లేకపోలేదు. ఇక ఆదివాసుల ఆహార నియమాల గురించిన వివరణ కూడా ఇస్తూ కొన్ని రకాల ఆహారం మాత్రమే పవిత్రమైనది మరికొన్ని రకాల ఆహారం అపవిత్రమైనది అనే భావన సరైనది కాదని అంటూనే పవిత్రంగా భావించే శాఖాహారం పట్ల ఆదివాసులు ఇష్టం చూపరు అని కాదు కానీ వారు ఇష్టంగా తినే మాంసా హారంలోని ఔషధ గుణాలను రచయిత కూలం కషంగా వివరించారు.అందులోని ఆదివాసుల పరిజ్ఞానాన్ని సహేతుకంగా చెప్పడంలో రచయిత పరిశీలన శక్తి అర్థమవుతుంది. ఆదివాసీలలో గల సాంకేతిక పరిజ్ఞానం గురించి చెబితే నేటి ఆధునికులకు నమ్మబుద్ధి కాకపోవచ్చు!! కానీ దీనిని సామరస్యంగా తెలుసుకుంటే అడవి బిడ్డల్లో దాగి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అర్థం అవుతుంది. ఇక్కడ మరో విషయం గమనించాలి వీరి సాంకేతిక పరిజ్ఞానం అంతా సహజసిద్ధంగా వారి శారీరక శ్రమనుంచే ఆవిర్బవిస్తుంది తప్ప కృత్రిమంగా యాంత్రిక శక్తుల సాయంతో మాత్రం కాదు. ఈ విషయంలో కూడా ఆధునికులమైన మనం వారి నుంచి నేర్చు కోవలసినది చాలా ఉంది అన్నది రచయిత వాదన ఆవేదన.విత్తనాల వ్యవస్థకు ఆదివా సీలకు గల సంబంధం గురించి చెబుతూ అటవీ ప్రాంతానికి, మైదాన ప్రాంతానికి గల వ్యత్యాసం ఇందులో వివరిస్తూ అటవీ ప్రాంతానికి చెందిన విధానాలు మైదాన ప్రాంతం వారివిగా అన్వయించుకొని అటవీ ప్రాంతం వారికి ఎలాంటి నైపుణ్యాలు తెలియవు అనే ముద్ర వేసిన తీరును కూడా ఇందులో వివరించారు.అగ్రవర్ణాల వారి ఆధిపత్య ధోరణుల వల్ల ఆదివాసీలకు జరిగిన అన్యాయాలు నష్టాలు గురించి సహేతుకంగా ఆలోచింపజేసే విధంగా వివరించారు.రాజ్యం అనే ప్రభుత్వాల వలే, పౌర సమాజం కూడా ఆదివాసీల్లోని సామాజిక శక్తుల సాంకేతికతల నైపుణ్యాలు ఎప్పుడు గుర్తించలేదు, మౌర్యుల కాలంలో చంద్రగుప్తునికి ఆదివాసీల పట్ల సరైన అభిప్రాయం లేకపోవడం కౌటిల్యునికి ఆది వాసీలపట్ల గల తీవ్ర వ్యతిరేకత కారణం గానే తన మంత్రి పదవిని వదిలి రాజ్యతంత్ర గ్రంథమైన ‘అర్థశాస్త్రం’ రచించాడు అనే చారిత్రక వాదన వినిపించారు రచయిత ఐలయ్య.
హిందూ సమాజంలో గల కుల వ్యవస్థ కారణంగా ఆదివాసీలు అందులో ఎమడలేక తమకు సమన్నత స్థానం దక్కక తమకు సము చిత స్థానం కలిగిస్తున్న ఇతర మతాలలోకి వలసలు పోతున్న వైనాన్ని కూడా ఇందులో కూలంకషంగా చెప్పుకు వచ్చారు రచయిత. భారత జాతీయ ఉద్యమంలో ఆదివాసులు చేసిన వీరోచిత పోరాటాలను సైతం జాతీయ వాద వర్గం గుర్తించిన పాపాలపోలేదు అసలు మన దేశంలో బ్రిటిష్ పాలకులపై తొలి తిరుగు బాటు ఎజెండా ఎగరవేసింది ఎన్నో ప్రాణ త్యాగాలు చేసింది ఆదివాసి వీర యోధులే కానీ చరిత్రలో ఎక్కడ వారి వివరాలు కనిపించ కుండా జాగ్రత్త పడిరది, అగ్రవర్ణాల వారైన ఆధునిక చరిత్ర రచయితలే!! అన్న విషయం ఈ పుస్తక రచయిత కులంకషంగా వివరిం చారు. ఇలా అనేక విధాలుగా అనేక రంగాల్లో అగ్ర భాగాల నిలిచిన ఈ ఆదివాసి అడవి బిడ్డల ప్రతి పని మనకు ఆదర్శనీయమైన బోధన అంశమే అలా అన్ని విషయాలు మనకు బోధించిన ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసి బిడ్డలే అన్న చారిత్రక సత్యాన్ని ముందు తరాలకు అందించిన ఈ పుస్తకం అందరు చదవదగ్గది.
పుస్తకం పేరు : ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసీలు
రచయిత :ప్రొఫెసర్ కంచ ఐలయ్య, పేజీలు :30, ధర 30/- రూ, ప్రతులకు :ప్రజాశక్తి బ్రాంచీలు
సెల్ :94900 99057, సమీక్షకుడు :డా:అమ్మిన శ్రీనివాసరాజు