ఈ పాపం ఎవరిదీ..?
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానొకటి ఢీకొన్న ఘటన యావత్ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమా దాల్లో ఒకటిగా నిలిచిన ఈ దుర్ఘటన.!ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటి వరకు కచ్చితమైన కారణాలు తెలియ రాలేదు. అయితే సిగ్నల్ లోపం కారణంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మరో ట్రాక్‌లోకి ప్రవేశించడంవల్లే ఈపెను విషా దం సంభవించినట్లు రైల్వేశాఖ ప్రాధమిక దర్యాప్తు లో తేలింది.ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.ఈ ప్రమాదంలో 280కి పైగా ప్రయాణికులు మరణించగా మరో 1000 మంది వరకు గాపడ్డారు. రైలు ప్రమాదాలకు సంబంధించి దేశ చరిత్రలోనే భారీగా ప్రాణ నష్టాన్ని కలిగించిన ఈ ఘటనలో పలు అనుమానాలు తలెత్తున్నాయి.
ఒక్క ప్రమాదం..అనేకప్రశ్నలు.. మరె న్నో అనుమానాలు..ఒడిశాలో ఘోర రైళ్ల ప్రమా దం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మూ డు రైళ్లు ప్రమాదానికి గురికావడం, భారీగా ప్రాణ నష్టం సంభవించడం దేశ ప్రజలకు షాక్‌కి గురి చేసింది.అంతా నిమిషాల్లోనే ఘోరం జరిగి పో యింది.ఏం జరిగిందో తెలుసుకునేలోపే వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంతటి ఘోర రైలు ప్రమాదానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? తప్పు ఎవరిది?కవచ్ వ్యవస్థ ఉంటే ఇంతటి ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదా? రైల్వే శాఖ ఏమంటోంది..కవచ్ వ్యవస్థ ఉండి ఉంటే ఒడిశా రైలు ప్రమాదం జరిగేది కాదని ప్రతిపక్షాలు అంటుంటే,కవచ్ సిస్టమ్ ఉన్నా ఈ ప్రమాదాన్ని ఆపేది కాదని రైల్వేశాఖ అధికారులు అంటున్నారు. అసలు ఒడిశారైలు ప్రమాదానికి కారణాలు ఏంటి? ఒక్క ప్రమాదంలో మూడు రైళ్లు ఇన్వాల్స్ అయి ఉండటం ఏంటి?అన్న ప్రశ్నకు సమాధానం దొర కడం లేదు. అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్న ఇండియన్ రైల్వేస్ కూడా ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడం లేదు. సిగ్నలింగ్ ఫెయిల్యూల్ అని ఒకసారి,ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో మార్పువల్ల ప్రమాదం జరిగిందని మరోసారి చెబుతున్నారు.సిగ్నలింగ్ ఫెయిల్యూర్ అని ప్రాథమిక దర్యాఫ్తులో తేల్చారు. ఇంకా పూర్తి స్థాయి దర్యాఫ్తు కొనసాగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. ఇలా అనేక రకాల ఊహాగానాలు, ఎన్నో అంతు చిక్కని అనుమానాలకు కేరాఫ్ గా మారింది ఒడిశా రైలు ప్రమాదం.ఒడిశా ఘోరరైలు ప్రమాదం విష యంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. రైలు ప్రమాదాల నివారణ కోసం కవచ్ వ్యవస్థ తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకున్న కేంద్రం.. రైలు ప్రమాదాలు జరక్కుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నిస్తున్నారు. బాలాసోర్ ప్రాంతంలో కవచ్ సిస్టమ్ లేదని, ఒకవేళ కవచ్ ఉంటే ప్రమాదమే జరిగి ఉండేది కాదంటున్నారు. వందలమంది ప్రాణాలుకోల్పోయే పరిస్థితి ఉండేది కాదంటున్నారు ప్రతిపక్షాల నేతలు. అయితే, ఒడిశా రైలు ప్రమాదానికి,కవచ్ వ్యవస్థకు సంబంధమే లేదని కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్. కవచ్ ఉన్నా ఒడిశారైలు ప్రమాదం జరిగేది ఆయన తేల్చి చెప్పారు. సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ తో పాటు ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ కారణంగా ప్రమాదం జరిగిందంటున్నారు.ఈ రెండిరటికి కవచ్ వర్తించదని ఆయన స్పష్టం చేశారు.
అసలు కవచ్ ఏంటి? కవచ్ సిస్టమ్ రైల్వే ప్రమాదా లను ఎలా అరికడుతుంది?
ఇప్పుడు ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ఈ కవచ్ సిస్టమ్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఉన్నప్పుడు అవి ఢీకొనకుండా ఆపేందుకు రైల్వే శాఖ కవచ్ టెక్నాలజీని 2022లో తీసుకొచ్చింది. కవచ్ టెక్నాలజీ ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్రం రూ.400కోట్లుఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని తీసుకొ చ్చింది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది.అలాగే రైళ్లను ఈ టెక్నాలజీ వెనక్కి నడిపి స్తుంది. అందువల్ల రైళ్లు ఢీకొనవు.రెడ్ సిగ్నల్ పడినా లోకోపైలెట్ పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళితే ఎదురుగా ఇంకో రైలు వచ్చినప్పుడు ఆటో మేటిక్‌గా రెండు రైళ్ల స్పీడ్‌ని తగ్గించి ప్రమాదం జరక్కుండా చూస్తుంది ఈకవచ్ సిస్టమ్.ట్రాక్ బాగో లేకపోయినా,టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నా ఆటో మేటిక్‌గా బ్రేకులేస్తుంది ఈకవచ్ సిస్టమ్.వంతెనలు,మలుపుల దగ్గర రైలు స్పీడ్‌ని తగ్గిస్తుంది.
కవచ్..ఓహై టెక్నాలజీ.అందులో డౌట్ లేదు. రైలు ప్రమాదాలను అరికడుతుందని చెప్పడంలో సందే హమే లేదు.అయితే,ఒడిశా రైలు ప్రమాదం మాత్రం ఈ కవచ్ సిస్టమ్ పరిధిలో జరగలేదని చెబుతోంది రైల్వేశాఖ. కవచ్ సిస్టమ్..ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు మాత్రమే పని చేస్తుందని వివరి స్తున్నారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు.. సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కారణంగా లూప్ లైన్ లోకి వెళ్లిందని..అప్పటికే లూప్ లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది.120కిలోమీటర్ల స్పీడ్‌తో ఉన్న కోరమాం డల్ ఎక్స్‌ప్రెస్..గూడ్స్ రైలుని ఢీకొట్టి పట్టాలు తప్పింది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు గాల్లోకి ఎగిరి అవతలి పట్టాలపై వస్తున్న బెంగళూ రు ఎక్స్‌ప్రెస్ బోగీలపై పడ్డాయి. దాంతో బెంగ ళూరు ఎక్స్ ప్రెస్ రైలులోని మూడు బోగీలో బోల్తా పడ్డాయి. ఆ ట్రైన్లో ఉన్న వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదం..కవచ్ సిస్టమ్ ఉన్నా జరిగేదని,కవచ్ సిస్టమ్ ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే పని చేస్తుందని రైల్వేశాఖ చెబుతోంది.
వ్యవస్థాగత లోపమే
దేశంలో రైలు ప్రమాదాలు జరిగిన ప్పుడల్లా అందుకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షిస్తామనిప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తుంటారు. ఒడిశా ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ కూడాఅదే ప్రకటన చేశారు. కానీ,‘పట్టాలు తప్పిన రైల్వే’ పేరుతో కాగ్ ప్రచురించిన నివేదికలో దేశంలోని 90శాతం ప్రమాదాలకు వ్యవస్థాగత వైఫల్యాలే కారణమని కుండబద్దలు కొట్టింది. రైల్వేల్లో కీలకమైన భద్రత విభాగంలో ఉద్యోగ ఖాళీల భర్తీని ప్రభుత్వం నిలిపేసిందని,ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తున్నదని కాగ్ తెలి పింది. ఉద్యోగుల సంఖ్య తగినంత లేకపోవటంతో భద్రత విషయంలో రైల్వేశాఖ నాణ్యమైన సేవలు అందించలేకపోతున్నదని విమర్శించింది.- (సైమన్/దవరసింగి రాంబాబు)