ఇండియా మళ్లీ విశ్వగురువు కావాలి

రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత దౌపది ముర్ము డిసెంబర్ 4వ తేదీన తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. తెలుగునేలపై మొట్టమొదటి సారి అడుగుపెట్టిన రాష్ట్రపతికి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. విజయవాడలో పౌరసన్మానం నిర్వహించింది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళలందరికీ రాష్ట్రపతి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతి దేశమంతా వ్యాపించిందన్నారు. మహాకవి గురజాడను, ఆయన రచించిన కన్యాశుల్కాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, దుర్గా బాయి దేశ్‌ముఖ్ తదితరుల బాటలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం విజయవాడ నుండి విశాఖకు వెళ్లారు. నౌకదళ దినోత్సవం సందర్భంగా ఆర్కేబీచ్లో నౌకదళా విన్యాసాలకు ముఖ్యఅతిధిగా హాజరై వీక్షించారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ సింధు వీర్ జలాం తర్గామి ద్వారా రాష్ట్రపతికి నౌకదళం త్రివర్ణ బాంబర్లతో స్వాగతం పలికింది. ప్రముఖ గాయకుడు శంకర్ మహా దేవన్ ఆలపించిన నౌకాదళ గీతం ఆలాపించారు. నౌకదళ విన్యాసాలను తిలకించడానికి భారీ సంఖ్యలో ప్రజానీకం తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి తిరుపతికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రంచంలోనే ఎంతో ప్రతిష్టతగల నేల భారతదేశం. వేద కాలంలో వసుధైక కుటుంబ భావనను ప్రపంచానికి అందిం చింది. మన దేశంలోని వైవిధ్యాన్ని చూసి ప్రపంచ విజ్ఞులు దీన్నొక ఉపఖండమని ఎప్పటి నుంచో కీర్తించారని అన్నారు. ఇంకా ఏమన్నారంటే…! రానున్న 25 ఏళ్లలో భారతదేశం.. విశ్వ గురువుగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి భారతీయుడు నరనరాల్లో సంస్కృతి, సంప్రదా యాలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్స రాలు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. వంద సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాలు చేసుకునే సమయంలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో నావికాదళం కీలక పాత్ర పోషిస్తోంది.భారత్ రక్షణలో మహిళల పాత్ర ఎంతో ఉంది. భారత నావికాదళంలో వివిధ హోదాల్లో మహిళలు కూడా దేశ రక్షణ లో పాలుపంచుకుంటున్నారు. 1971లో పాకి స్తాన్‌పై జరిగిన యుద్దంలో విజ యానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే వేడుక లను జరుపుకుంటున్నాం.ఈ యుద్దంలో అసువు లు బాసిన యుద్ద వీరులను మరో సారి గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. వారి త్యాగాలు కీర్తిస్తూ..ప్రతి తరానికి గుర్తు చేయడం మన బాధ్యత.మూడువైపుల సముద్రంం,ఒకవైపు పర్వాతాలు కలిగిన మన దేశం. మొదటి నుంచీ సముద్ర తీర దేశంగా ఉంది. సహజసిద్దంగా ఉన్న ఈ సముద్ర తీరం దేశాభివృద్ధికి ఎంతో కీలకం.తీరరక్షణలో భారత నేవీఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. భారత నావికాదళం ఎంతో శక్తివంతమైనదే కాకుండా ఎటువంటి పరిస్థితు లనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పఉడూ సన్నద్దం గా ఉంటోంది. భారత నూతన అభివృద్ధిలో నావికాదళం పాత్ర కీలకమైనది..త్రివిధ దళాధి పతిగా నాకు ఎంతో నమ్మకం ఉంది. రాష్ట్రం లో ప్రారంభిస్తున్న వివిధ ప్రాజెక్టులు దేశాభి వృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. దేశ ప్రజలం దరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ ప్రాజెక్టులు ఉపయుక్తంగా ఉంటాయి.
గిరిజన విద్యకు దోహదం
దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఏకలవ్య పాఠశాలలు గిరిజనుల్లో విద్యావకాశాలు పెంపొందేందుకు ఎంతగానో ఉపయోగపడు తాయి. రాష్ట్రంలో బుట్టాయగూడెం, చింతూరు, రాజబొమ్మంగి,గుమ్మలక్ష్మీపురంలో ప్రారంబి óస్తున్న ఏకలవ్య పాఠశాలల వల్ల గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధితోపాటు గిరిజన ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని భావి స్తున్నా..! దేశంలో ఎవరైనా,వారి ప్రాంతం, కులం,మతంతో సంబంధం లేకుండా విద్య అందించేందుకు మనం కృషి చేయాలి. విద్యను అందరికీ అందుబాటులో ఉంచేం దుకు అన్ని చర్యలూ తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్పు ప్రసంగించారు. తర్వాత భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్ద విన్యాసాల్ని రాష్ట్రపతి ముర్ము తిలకించారు.రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టు లను వర్చువల్ విధానంలో నౌకాదళానికి చెందిన అనంతగిరి కేంద్రానికి చేరుకొని నేవీ డే రిసెప్షన్‌కు హజరయ్యారు.
రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఏపీలో ద్రౌపతి ముర్ము పర్యటన.. ఘనంగా పౌరసన్మానం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషన్, సీఎం జగన్,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,ఏపీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,పలువురు మంత్రులు,ఎంపీలు, ఎమ్మె ల్యేలు,ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ద్రౌపతి ముర్ము పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తిరుపతి బయలుదేరి అక్కడ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తూర్పు నౌకా దళం ప్రత్యేకత అంశాలివీ
పాకిస్తాన్..దాయాది దేశం పేరు వింటనే పౌరుషం పొంగుకొస్తుంది. అలాంటి శత్రు దేశంతో యుద్ధం జరిగితే..ఆయుద్ధంలో మన త్రివర్ణపతాకం రెపరెపలాడితే..ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖే వేదికైతే.. ఇంకెంత గర్వంగా ఉంటుందో కదా. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. జాతి గర్వించదగిన గెలుపు నకు గుర్తుగా బీచ్‌రోడ్‌లో ‘విక్టరీ ఆఫ్ సీ’ స్థూపం నిర్మించారు. భారత నౌకాదళం ప్రపంచంలోనే అతి పెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం అభివృద్ధి చెందింది. నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నం కావడం మరో విశేషం. దేశానికి తూర్పు తీరం వ్యూహాత్మక రక్షణ ప్రాంతం.సహజ సిద్ధమైన భౌగో ళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూరంగా ఉం డటం తూర్పు నౌకా దళం ప్రత్యేకత. అందుకే రక్షణ అవసరాల దృష్ట్యా బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని కీలకంగా భావించారు. ఇందులో భాగంగానే తూర్పు నావికా దళం ఏర్పా టైంది.1923 డిసెంబర్లో విశాఖను తూర్పు తీరంలో వ్యూహాత్మక కేంద్రంగా గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలమైన 1942-45 మధ్య కాలంలో విశాఖ తీరాన్ని ప్రధానంగా వినియో గించుకున్నారు. ఇక్కడి నుంచే బర్మాకు ఆయుధా లను రవాణా చేశారు. స్వాతంత్య్రా నంతరం 1954లో విశాఖ నేవీ పోస్ట్‌ను కమాండర్ హోదాకు పెంచుతూ, బేస్ రిపేర్ ఆర్గనైజేషన్ కార్యక లాపాలను ప్రారంభిం చారు.1962లో ఇండి యన్ నేవీ హాస్పిటల్ సర్వీసెస్ (ఐఎన్ హెచ్ ఎస్) కల్యాణి ప్రారంభ మైంది. అనంత రం1967 జూలై 24న కమాండర్ హోదాను రియర్ అడ్మిరల్ హోదాకు అప్‌గ్రేడ్ చేయ డంతో పాటు తూర్పు తీరంలో ఫ్లాగ్ ఆఫీసర్స్ పోస్టులను కూడా మంజూరు చేశారు. చివరిగా 1968 మార్చి1నవిశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం( ఈఎన్సీ) కార్యకలాపాలు ప్రారంభమై చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1971మార్చి1న ఈఎన్సీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్సీ విస్తరించింది.1971 నవంబర్ 1 నుంచి ఈఎన్సీ ఫ్లీట్ కార్య కలాపాలు ప్రారంభ మయ్యాయి. తొలి ఈఎన్సీ చీఫ్‌గా రియర్ అడ్మిరల్ కేఆర్ నాయర్ నియమితులయ్యారు. ప్రస్తుతం29వ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.
రక్షణలో వెన్నెముక
మయన్మార్‌లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహా సముద్రం వరకూ ఈస్ట్రన్ నేవల్ కమాండ్ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్బన్ నుంచి దక్షిణాన గల్ఫ్ఆఫ్ మన్నార్ వరకూ విస్తరించి ఉంది.2,600కి.మీ నిడివి కలిగిన తూర్పు తీరంలో 30శాతం అంటే 6లక్షలచ.కిమీ పరిధిలో ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ విస్తరించి ఉంది.ఈ తీరంలో 13మేజర్ పోర్టులున్నాయి.భారత సర్కారు లుక్ ఈస్ట్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తి స్తోంది. దీంతో పాటు డీఆర్డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. పలు క్షిపణులు తయారు చేసే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీస్ (ఎన్ఎస్ టీఎల్) కూడా విశాఖలోనే ఏర్పాటైంది.
డిసెంబర్ 4 విజయానికి నాంది
ఘాజీ కాలగర్భంలో కలిసిపోవడంతో బంగాళ ఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్ నేవీ.. తన ఆధీనంలోకి తెచ్చుకుంది. భారత్ ముప్పేట దాడితో పాకిస్తాన్ తలవంచక తప్పలేదు. డిసెం బర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటిం చడంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటిం చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే. ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించింది.డిసెంబర్ 16న యుద్ధం ముగిసినా దానికి కారణం డిసెంబర్ 4న అతిపెద్ద పాకి స్తానీ నౌకాశ్రయం కరాచీపై చేసిన మెరుపుదా డేనని చెప్పుకోవచ్చు. అందుకే 1971 యుద్ధం లో మన నౌకాదళం ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభాపాటవాలు,వ్యూహాలు, ధైర్య సాహసా లకు గుర్తుగా డిసెంబర్ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.తీర ప్రాంత రక్షణలో వెన్నెముకగా ఉన్న ఈఎన్సీ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతోపాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకల తో ఇండియన్ నేవీ ఎప్పటికప్పుడు నౌకా సంప త్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారు తోంది.తూర్పు నౌకాదళం పరిధిలో 52 వరకు యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, హెలి కాఫ్టర్లు, యుద్ధ విమానాలున్నాయి.యుద్ధ నౌకల పనితీరు, పరిజ్ఞానం బట్టి వాటిని వివిధ తరగ తులుగా విభజించారు.అదే విధంగా సబ్ మెరైన్లను కూడా వాటి సామర్థ్యం,పనితీరు బట్టి వివిధ తరగతులుగా విభజించారు.భారత నౌకా దళంలో ఉన్న షిప్స్ పేర్లన్నీ ఐఎన్‌ఎస్‌తో మొద లవుతాయి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్.యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ ఢల్లీి క్లాస్, రాజ్ పుత్,గోదావరి,తల్వార్,కోల్‌కతా,శివాలిక్, బ్రహ్మ పుత్ర,ఆస్టిన్,శార్దూల్,దీపక్, మగర్, కుంభీర్, కమోర్తా,కోరా,ఖుక్రీ,అభ్య,వీర్, పాండి చ్ఛేరి, అస్త్రధరణి,సరయు,సుకన్య, కార్ నికోబార్, బం గారం,త్రికర్ట్..ఇలా విభిన్న తరగతుల యుద్ధ నౌకలున్నాయి. సబ్మెరైన్ల విషయాని కొస్తే.. న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్లను అరిహంత్, చక్ర(అకుళ-2)క్లాస్‌లుగా,కన్వెన్షనల్లీ పవర్డ్ సబ్ మెరైన్లను సింధుఘోష్,శిశుమార్ క్లాస్ సబ్మె రైన్లుగావిభజించారు.ఇటీవల ఐఎన్ ఎస్ విశాఖ పట్నం యుద్ధ నౌకతోపాటు పలు హెలికాఫ్టర్లు, అడ్వాన్స్డ్ యుద్ధ విమానాల రాకతో ఈఎన్సీ బలం మరింత పెరిగింది.
సాయుధ సంపత్తికి కీలకం.. రజాలీ
ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌కు అత్యంత వ్యూహాత్మక, కీలకమైన ఎయిర్‌స్టేషన్ రజాలీ. ఇది తమిళ నాడులోని అరక్కోణం జిల్లాలో ఉంది. ఇది ఈఎన్సీకే కాదు..భారత నౌకాదళానికీ కీలక మైన ఎయిర్‌స్టేషన్. 2,320 ఎకరాల విస్తీర్ణంలో అతి పొడవైన, వెడల్పైన రన్‌వే కలిగిన రజాలీ.. ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్‌స్టేషన్‌గా గుర్తిం పు పొందింది. తూర్పు,దక్షిణ తీరాల మధ్యలో భూఉపరితల,సముద్ర మార్గాల ద్వారా దాడి చేసేందుకు వచ్చే శత్రు దేశాల తుదిముట్టేంచేం దుకు కావల్సిన ఆయుధ సంపత్తి అంతా రజాలీ లోనే నిక్షిప్తమై ఉంది.1985లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలోకి ఈ ఎయిర్‌స్టేషన్ వచ్చింది. ఆతర్వాత భారత నౌకాదళం రజాలీని వ్యూహాత్మక ఎయిర్ స్టేషన్‌గా తీర్చిదిద్దింది.1992 మార్చి 11న అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్ ఈఎయిర్ స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు.ఈఎన్సీకి చెందిన స్థావరాలు మొత్తం 15ఉండగా..ఇందులో ఏడు నేవల్ బేస్‌లు విశాఖలోనే ఉన్నాయి. నేవల్ బేస్ ఐఎన్ఎస్ వర్ష రాంబిల్లిలో నిర్మితమవుతోంది.
నౌకాదళానికి, ప్రజలకు వారధి.. నేవీడే
తూర్పు నౌకాదళం అత్యంత ప్రధానమైన కమాం డ్. దేశ రక్షణలో అశువులు బాసిన నావికులు చేసిన సేవలు శ్లాఘనీయం.లుక్ ఈస్ట్, టేక్ ఈస్ట్ విధానాలతో తూర్పు నౌకా దళానికి ప్రాధాన్యం పెరిగింది. మిషన్ డిప్లా య్స్ ఆపరేషన్స్ అనే విధానాన్ని ప్రస్తుతం నేవీ అనుసరిస్తోంది.ఈవి ధానంవల్ల అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశంలో అందు బాటులో సిబ్బంది ఉండ గలుగుతున్నారు.హెలి కాఫ్టర్లు,యుద్ధ నౌకల ద్వారా దాయాదిదేశాలకు చెందిన వాటిని గుర్తించి ఎదుర్కొనేందుకు నిత్యం పహారా కాస్తు న్నాం.ఒకవేళ అలాంటివి ఎదురైనా..వాటిని తిప్పికొట్టేందుకు సమర్థంగా ఉన్నాం.- వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా, తూర్పు నౌకా దళాధిపతి
ఐఎన్ఎస్ విశాఖపట్నం..ఆ పేరెందుకు పెట్టారంటే..
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్ -15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మ్కిసైల్ డిస్ట్రా యర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశం లోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం,మోర్ముగావ్,ఇంఫాల్, సూరత్ పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు.
ముంబైలో తయారీ
2011 జనవరి 28న ఈ ప్రాజెక్ట్ ఒప్పందం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్, ఇండియన్ నేవీకి చెందిన అంతర్గత డిజైన్ సంస్థలు షిప్ డిజైన్లని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్‌లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్ తయారీకి వై-12704 పేరుతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్) శ్రీకారం చుట్టింది.2015 నాటికి హల్‌తో పాటు ఇతర కీలక భాగాలు పూర్తి చేసింది. తయారు చేసే సమయంలో పలుమార్లు ప్రమాదాలు కూడా సంభవించాయి. 2019 జూన్‌లో షిప్‌లోని ఏసీ గదిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించాడు. అయితే..షిప్ తయారీలో మాత్రం ఎక్కువ నష్టం వాటిల్లలేదు. 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను అక్టోబర్ 28న అప్పగించారు. డిసెంబర్లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు.
శత్రువుల పాలిట సింహస్వప్నమే
ఇది సముద్ర ఉపరితలంపైనే ఉన్నా..ఎక్కడ శత్రువుకు సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖను శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు.
ఆయుధాలు :
32 బరాక్ ఎయిర్ క్షిపణులు,16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు,76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే-630 తుపాకులు,533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాం తర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు.
నౌకాదళ సేవలు.. తీర ప్రాంతాల సరిహద్దులను రక్షించడం, అంతర్జాతీయ సంబంధాలను విస్తరింపజేయడం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ, ప్రక్రుతి వైపరీ త్యాలు, ఇతర ప్రమాదకర పరిస్థితులను మన నౌకాదళ సేవలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేవీ డే విజయానికి గుర్తుగా నేవీ బ్యాండ్ గ్రూప్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. నేవీ డే సందర్భంగా విశాఖ పట్నంలోని ఆర్కే బీచ్ లో ప్రతి ఏటా ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తుంటారు. విశాఖతో పాటు ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద బీటింగ్ రిట్రీట్ వేడుకలను నిర్వహిస్తారు.
రానున్న 25 ఏళ్లలో భారతదేశం.. విశ్వ గురువుగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి భారతీయుడు నరనరాల్లో సంస్కృతి, సంప్రదా యాలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్స రాలు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. వంద సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాలు చేసుకునే సమయంలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో నావికాదళం కీలక పాత్ర పోషిస్తోంది.భారత్ రక్షణలో మహిళల పాత్ర ఎంతో ఉంది. భారత నావికాదళంలో వివిధ హోదాల్లో మహిళలు కూడా దేశ రక్షణ లో పాలుపంచుకుంటున్నారు. 1971లో పాకి స్తాన్‌పై జరిగిన యుద్దంలో విజ యానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే వేడుక లను జరుపుకుంటున్నాం.ఈ యుద్దంలో అసువు లు బాసిన యుద్ద వీరులను మరో సారి గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. వారి త్యాగాలు కీర్తిస్తూ..ప్రతి తరానికి గుర్తు చేయడం మన బాధ్యత.మూడువైపుల సముద్రంం,ఒకవైపు పర్వాతాలు కలిగిన మన దేశం. మొదటి నుంచీ సముద్ర తీర దేశంగా ఉంది. సహజసిద్దంగా ఉన్న ఈ సముద్ర తీరం దేశాభివృద్ధికి ఎంతో కీలకం.తీరరక్షణలో భారత నేవీఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. భారత నావికాదళం ఎంతో శక్తివంతమైనదే కాకుండా ఎటువంటి పరిస్థితు లనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పఉడూ సన్నద్దం గా ఉంటోంది. భారత నూతన అభివృద్ధిలో నావికాదళం పాత్ర కీలకమైనది..త్రివిధ దళాధి పతిగా నాకు ఎంతో నమ్మకం ఉంది. రాష్ట్రం లో ప్రారంభిస్తున్న వివిధ ప్రాజెక్టులు దేశాభి వృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. దేశ ప్రజలం దరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ ప్రాజెక్టులు ఉపయుక్తంగా ఉంటాయి.
రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఏపీలో ద్రౌపతి ముర్ము పర్యటన.. ఘనంగా పౌరసన్మానం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషన్, సీఎం జగన్,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,ఏపీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,పలువురు మంత్రులు,ఎంపీలు, ఎమ్మె ల్యేలు,ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ద్రౌపతి ముర్ము పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తిరుపతి బయలుదేరి అక్కడ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.- ` సైమన్ గునపర్తి