‘ఆహార భద్రతా వ్యవస్థ రక్షణ తక్షణావసరం’

మార్చి 1,2021 నాటికి భారతదేశంలో 9.2కోట్ల టన్ను ఆహార ధాన్యా న్విున్నాయి. ఇవి ఉండాల్సిన న్వి కంటే మూడు రెట్లెక్కువ. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2019-2020లో ఉండాల్సిన న్వి కంటే కొంచెం తగ్గినప్పుడు, ఆహార న్విను తీసుకొని రావడానికి 12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. ప్రపంచ ఆకలి సూచిక (Gశ్రీశీపaశ్రీ నబఅస్త్రవతీ Iఅసవఞ )లో,107 దేశాల్లో 92వ స్థానంలో ఉన్న దేశం, సరిపడా ఆహార ధాన్యా న్విు కలిగి ఉన్న పరిస్థితుల్లో, పోషకాహార లోపంతో ఉన్న ప్రజానీకానికందరికీ ఉపశమనం కలిగే విధంగా ప్రతి ఒక్కరికీ సరిపడా ఆహారధాన్యాను అందించడం ద్వారా ఒక నైతిక ఆహార భద్రతా విధానాన్ని కలిగి ఉండాలి. కానీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకమైన ప్రణాళికను రూపొందిస్తోంది.


గ్రామీణ జనాభాలో 75శాతం,పట్టణంలో జనాభాలో 50శాతం జనాభాకు తప్పకుండా ఆహార ధాన్యాను అందించాల్సి ఉండగా, గ్రామీణ జనాభాలో 60శాతం, పట్టణ జనాభాలో 40శాతానికి పరిమితం చేయడం ద్వారా ‘జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని’ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) బహీన పరిచేందుకు నిటిఆయోగ్‌ సిఫార్సు చేసిన ఫలితంగా 10కోట్ల మంది బ్ధిదారుకు కోత పడుతుంది. 2011-2021 మధ్య కాంలో పెరిగిన జనాభాకు కనీసం 9కోట్లకు పైగా బ్దిదారును చేర్చి ఉండాల్సిందన్న వాస్తవాన్ని నిటిఆయోగ్‌ కూడా అంగీకరించింది. కానీ ప్రభుత్వం మాత్రం 2011నాటి పాత సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటున్నది. ఇప్పుడు 2021 జనాభా వివరాు ఒక సంవత్సరంలో అందు బాటులోకి వస్తాయి కాబట్టి, ఇంకా పెరుగు దను నివారించలేము. ప్రభుత్వం చట్టాన్ని మార్చి, బ్దిదారు సంఖ్యను కుదించే ప్రయత్నం చేస్తుంది. 2014లో అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం, కొన్ని నెల్లోనే బీజేపీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి శాంతకుమార్‌ నేతత్వంలో భారత ఆహార సంస్థ పనితీరు (ఎఫ్‌సీఐ), దాని సమస్యకు సంబంధించి సిఫార్సు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఊహించిన విధంగానే ఆ కమిటీ ‘’జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పునస్సమీక్షించాని’’ సిఫార్సు చేసింది. అదేవిధంగా, బ్ధిదారు పరిధిని 67శాతం నుంచి 40శాతానికి తగ్గించాని, కేంద్ర పంపిణీ ధరను (జవఅ్‌తీaశ్రీ ఱంంబవ జూతీఱషవం) పెంచాని సిఫార్సు చేయడం ద్వారా చట్టాన్ని కనుమరుగు చేసింది. కేంద్ర పంపిణీ ధరను పెంచాని కోరుకున్న ‘ఎకనామిక్‌ సర్వే 2021’లో రెండవ సిఫార్సును ప్రతిధ్వ నించింది. ఒకవేళ బ్దిదారు సంఖ్య కుదిం చాన్న సిఫార్సు అము జరిగితే, ఆహార సబ్సిడీపై 49వే కోట్ల రూపాయ మేరకు కోత విధిస్తారని నిటిఆయోగ్‌ లెక్క లేసింది. ధరు పెంచాని ఎకనామిక్‌ సర్వే చేసిన సూచన సబ్సిడీని మరింత కుదిస్తుంది. కార్పొరేట్‌ కంపెనీకు సబ్సిడీను కొనసాగించడానికి, విస్తరించడానికి మోడీ ప్రభుత్వం ప్రజ సబ్సిడీను కత్తిరించేందుకు తీసుకున్న నిర్ణయం కన్నా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాు పొందుతున్న బ్ది దారు పరిధి, ధరల్లో ప్రతిబింబించే ప్రజ ఆహార భద్రత హక్కును బహీన పరిచే చర్యను భారతదేశం ఎదుర్కొంటుంది. భారత ఆహార భద్రతా చట్టంపై చేస్తున్న ఈ దాడి, అంతర్గతంగా ఆహార ధాన్యా ఉత్పత్తి, సేకరణ విధానానికి ముడిపడి ఉంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాకు తోడైన ఈ విధానం జాతీయ ఆహార భద్రతా చట్టంపై దాడిగా భావించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థలో సార్వత్రిక విధానానికి బదుగా ‘దారిద్య్ర రేఖకు ఎగువన’ (ఏపీఎల్‌),’ దారిద్య్ర రేఖకు దిగువన’ (బీపీఎల్‌) అనే వ్యవస్థను భిన్నమైన పేర్లతో కొనసాగించడంతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం లోనే కొన్ని ఘోరమైన లోపాున్నాయనేది నిజం. జాతీయ ఆహార భద్రతా చట్టం కంటే ముందు బీపీఎల్‌ కార్డున్న ప్రతీ ఒక్కరికీ కనీసం 35కిలోు కేటాయించాన్న నిబంధనను గుర్తించకుండా, ప్రతీ ఒక్కరికీ 5కిలోు కేటాయించానే పరిమితిని ఈ చట్టం విధించింది. 2013లో బ్దిపొందిన వారి సంఖ్య 81.35 కోట్లుంటే, ఇప్పుడు 79.26 కోట్లకు తగ్గింది. గతంలో బ్ది పొందిన జనాభాలోని ఒక భాగాన్ని (ఏపీఎల్‌) ఇప్పుడు ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి రాకుండా మినహాయించారు. భవిష్యత్తులో జాతీయ ఆహార భద్రతా చట్టం అములో లోపాు లేకుండా చేసి, దానిని రక్షించడం ద్వారా బలోపేతం చేయాన్న డిమాండ్‌ ముందుకు వస్తుంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం ఉ్లంఘన
ఇప్పటికే ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ ముఖ్య నిబంధను ఉ్లంఘించబడుతున్నాయి. సెక్షన్‌ 4ప్రకారం,‘’(ఏ) ప్రతీ గర్భిణీ స్త్రీ, పాలిచ్చే ప్రతీ తల్లికి (గర్భిణీగా ఉన్న సమయంలో, బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెల వరకు) ఉచిత ఆహారాన్ని అందించాలి (బీ) వారికి ఆరు వే రూపాయ నగదు సబ్సిడీని ఇవ్వాలి’’. 2017 వరకు నగదు సబ్సిడీ నిబంధన అము కాలేదు, ఆ తర్వాత ఏ సవరణు చేయకుండానే చట్టాన్ని కుదించారు. ఆ కుదింపు, ఐదువే రూపాయకు నగదు సబ్సిడీని కత్తిరించడమే కాక చట్ట విరుద్ధంగా విధించిన నియమ నిబంధను, 57శాతం గర్భిణీ స్త్రీు, పాలిచ్చే త్లు చట్టబద్ధంగా పొందే నగదు సహాయాన్ని పొందకుండా మినహాయిస్తుంది. ఇదికూడా మొదటి బిడ్డ ఉన్న వారికే పరిమితం చేశారు. ఇలాంటివి మొత్తం జననాలో, కేవం 43శాతం జననాకు సంబంధించిన వారు మాత్రమే ఉంటారు. ఈ చట్టం కింద అర్హులైన మెజారిటీ స్త్రీను, వారి హక్కును నిరాకరిస్తున్నారు. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లో చదువుతున్న ప్లికు వండిన పౌష్టికాహార మధ్యాహ్న భోజనాన్ని పొందే హక్కును కల్పిస్తుంది. కానీ ఆహార పదార్థా ధరు ఆకాశాన్నంటినప్పటికీ, మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌ కేటాయింపు తగ్గించారు. 2021-22 బడ్జెట్‌లో మధ్యాహ్న భోజన పథకానికి సవరించిన అంచనా 12,900కోట్ల నుంచి 11,500కోట్లకు తగ్గిస్తూ కేటాయింపు చేశారు. దీని వ్ల 12కోట్ల మంది బడి ప్లికు అందిస్తున్న పౌష్టికాహార నాణ్యత, పరిమాణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం నియమ నిబంధనకు తిలోదకాు ఇవ్వడమే. అదేవిధంగా ఆరు నెల నుంచి ఆరేండ్ల వయస్సు గ ప్లికు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ప్రకారం స్థానిక అంగన్వాడీ ద్వారా ఉచిత ఆహారాన్నం దించాలి, కానీ కేటాయింపు తగ్గడంతో ఆహార పథకం అము తీరుపై తీవ్ర ప్రభావం పడిరది. అందువ్ల జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా మాతత్వానికి సంబంధించిన నగదు ప్రయోజనాను మహిళకు అందించి, పాఠశా విద్యార్థుకు పౌష్టికాహార మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌ కేటాయింపు పెంచి ఆహార భద్రతా చట్టం నిబంధన అముకు తక్షణమే హామీ ఇవ్వాలి.
అంత్యోదయ అన్నా కార్డు
ఒక అంత్యోదయ అన్నా యోజన (ఏఏవై) కార్డు ఉన్న వ్యక్తికి, కేంద్ర పంపిణీ ధర ప్రకారం (కేజీ గోధుము రూ.2, కేజీ బియ్యం రూ.3 చొప్పున) 35కిలో ఆహార ధాన్యాు పొంద డానికి అర్హత ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం సెక్షన్‌ 3(1) ప్రకారం, ఏఏవై కార్డు కలిగి ఉండే కుటుంబా సంఖ్యను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏఏవై కార్డు పొందడానికి అర్హులైన వారిని గుర్తించడానికి ఏఏవై కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాను ఇచ్చింది. అర్హులైన వారిలో బహీన గిరిజన సమూహాు, భూమి లేని వ్యవసాయ కార్మికు, దినసరి వేతన కార్మికు, కుటుంబ భారం మోస్తున్న వితంతువు, ఒంటరి మహిళు, వికలాంగు ఉన్నారు. ఆఖరికి, ఆ ప్రయోజ నాను పొందడానికి అర్హులైన సామాజిక వర్గా సంఖ్య పెరిగే నాటికి, ఏఏవై కార్డున్న కుటుంబా సంఖ్య 2005 నుంచి 2.5 కోట్ల కుటుంబా వద్ద నిలిచిపోయింది. మార్చి 2015లో, మొత్తం జాతీయ ఆహార భద్రతా చట్టం ఉ్లంఘనలో భాగంగా మోడీ ప్రభుత్వం ‘’వసు, సామాజిక, ఆర్థిక స్థితిలో మెరుగు ద, మరణా కారణంగా ఏఏవై కార్డు ఉన్న కుటుంబాకు అర్హత లేకుంటే, అటువంటి కుటుంబాను ఆ మేరకు తగ్గించాని’’ ఒక సర్క్యుర్‌ను విడుద చేసింది. కానీ ఒకవేళ సామాజిక, ఆర్థిక స్థితి ఘోరంగా ఉండి, వారి స్థితిలో మెరుగుద లేకుంటే ఏంటి పరిస్థితి? అంటే ‘’రాష్ట్రాల్లో అంత్యోదయ కార్డున్న కుటుంబాను గుర్తించకూడదు’’ అనేది సర్క్యుర్‌ ఉద్దేశ్యం. దీంతో 2.5కోట్ల ఏఏవై కార్డున్న కుటుంబా సంఖ్య కరోనా వ్యాప్తి కాంలో 2.35కోట్లకు తగ్గింది. నిరాశా నిస్పృహు ఆవహించిన 2020లో 3.79 క్ష అంత్యోదయ కార్డును తొగించింది. అంతేకాక వరుసగా మూడు నెల పాటు రేషన్‌ తీసుకోపోలేక పోయిన 71,982 మందిని, ‘’నిశ్శబ్ద రేషన్‌ కార్డు హ్డౌర్‌ు’’ అని, బోగస్‌ కార్డున్న వారిగా గుర్తించి, కరోనా మహమ్మారి వ్యాప్తి కాంలో 90వే ఏఏవై బ్దిదారును తొగించారు.
వస కార్మికుకు ఉచితంగా ఆహార ధాన్యాను అందిస్తున్నామని గొప్పు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం, ఆచరణలో ఏఏవై పథకం కింద 35కిలో ఆహార ధాన్యాను పొందే అర్హత ఉన్న వారి సంఖ్యను గణనీయంగా తగ్గించింది.
జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఉ్లంఘిస్తున్న మార్చి 2015 ఆర్డర్‌ను రద్దుచేసి, ఏఏవై మార్గదర్శకా పరిధిలోకి వచ్చే అన్ని వర్గా ప్రజను చేర్చాలి. ‘’ప్రాధాన్యత’’ కలిగిన కుటుంబాకు సంబంధించి, కరోనా వ్యాప్తి కాంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 8కోట్ల మంది వస కార్మికుకు రేషన్‌ కార్డు, ఉచిత ఆహార ధాన్యాను సమకూరుస్తామని ప్రకటించింది. కానీ ప్రాధాన్యతా జాబితాలో కేవం 1.49కోట్ల మంది బ్ధిదారునే చేర్చారు. అవాక్కయ్యే విషయమేమంటే బ్దిదారు జాబితాలో 51క్ష మందిని అదే కాంలో తొగించడంతో మొత్తంగా ప్రయోజనం పొందిన వారు కోటి మంది కన్నా తక్కువే ఉన్నారు.
రేషన్‌ కార్డు రద్దు నియమాు
మూడు కోట్ల రేషన్‌ కార్డు రద్దుకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనా వ్యాజ్యం వాదను విన్న సుప్రీంకోర్టు ‘’ఇది చాలా తీవ్రమైన విషయం’’గా పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం అందజేసిన రద్దైన రేషన్‌ కార్డు సంఖ్యలో వైరుధ్యం ఉంది. ఫిబ్రవరి 2017లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆధార్‌ను రేషన్‌ కార్డుతో అనుసంధానం చేయడం వ్ల 3.95కోట్ల రేషన్‌ కార్డు రద్దయ్యాయని ప్రధానమంత్రి లోక్‌సభలో చెప్పారు. కానీ అటువంటి సమాచారం ఏదీ రాష్ట్రా నుంచి అందుకో లేదని తెలిసినట్టు సమాచార హక్కు పత్రా దాఖు ద్వారా తొసుకున్న హిందుస్థాన్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది.
మొత్తం 2.75కోట్ల బోగస్‌, అర్హతలేని రేషన్‌ కార్డును 2013-2017లో తొగించినట్టు, అంటే రూ.17,500కోట్లు ‘పొదుపు’ చేసినట్టు, పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంగా తెలిపారు. డిసెంబర్‌ 2019లో ఆహార మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ రెండవ నివేదిక, 2016-2019 మధ్య కాంలో 1.49రేషన్‌ కార్డు రద్దయ్యాయని తెలిపింది. అంటే మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014 నుంచి కేంద్రంలో, అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నాుగు కోట్లకుపైగా రేషన్‌ కార్డును భౌతిక పరిశీన చేయకుండా రద్దు చేశారు.
ఈ రేషన్‌ కార్డు రద్దు, అసలైన బ్దిదారు ఆహార భద్రతా హక్కుపై దాడికి దారి తీసింది. ఒకవైపు ప్రభుత్వం కొత్త బ్దిదారును జాబితాలో చేర్చుకునేందుకు తిరస్కరించింది, మరొకవైపు కార్డును రద్దు చేసేందుకు ప్రభుత్వం అవంబించే విధానం పూర్తిగా ఏకపక్షంగా ఉంది. రేషన్‌కార్డు రద్దుకు కేంద్ర ప్రభుత్వం అవంబించే విధానాను తక్షణమే నిలిపివేయాలి, భౌతిక పరిశీన చేయకుండా ఏ ఒక్క కార్డూ రద్దు చేయకూడదు. భౌతిక పరిశీనలో స్థానిక పంచాయతీ సంస్థ భాగస్వామ్యం ఉండాలి.
వివిధ ప్రభుత్వ పథకా ప్రయోజనాను పొందడానికి బ్దిదాయి ఆధార్‌ కార్డును ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. ‘’ప్రభుత్వం, రేషన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును అనుసంధానం చేసేందుకు సెప్టెంబర్‌ 2020 వరకు గడువును పొడిగించింది కాబట్టి ఏఒక్కరికీ ఆహార ధాన్యా కోటాను నిరాకరించకూడదని’’, మే 2020 లో కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యుర్‌ను జారీ చేసింది. ఇంకో మాటలో చెప్పాంటే, రేషన్‌ పొందడానికి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అనే విషయాన్ని ఇది నిర్ధారిస్తుంది. మార్చి 2021 నాటికి 79.28కోట్ల మంది బ్ధిదారుకుగాను ఇంకా 8.8కోట్ల మంది ఆధార్‌ కార్డును అనుసంధానం చేయాల్సి ఉంది. బయోమెట్రిక్‌ పద్ధతిలోని అసమత్యుత, లోపభూయిష్టమైన యంత్రా వన గణనీయమైన సంఖ్యలో బ్దిదాయి రేషన్‌ పొందే హక్కును కోల్పోతున్నారు.జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సామాజిక భద్రతకు హామీ ఇవ్వాంటే, కుటుంబానికి కనీసం 35కిలో (ప్రస్తుత కేంద్ర పంపిణీ ధర ప్రకారం గోధుము కేజీ రూ.2, బియ్యం కేజీ రూ.3 చొప్పున) ఆహార ధాన్యాను పొందే హక్కుపై ఆధారపడే ఆహార భద్రతా వ్యవస్థ భారతదేశానికి అవసరం. ఇతర నిత్యావసర ఆహార వస్తువును కూడా సబ్సిడీ ధరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలి. దాడికి గురవుతున్న రైతు హక్కుతో ముడిపడిన ఆహార ధాన్యా ఉత్పత్తి, సేకరణ విధానా నేపథ్యంలో ఆహార భద్రత కోసం పోరాటం జరుగుతోంది.

  • పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో అనువాదం : బోడపట్ల రవీందర్‌(నవ తెంగాణ)
    -బృందా కరత్