ఆర్ధిక నిఘా దాడులు అమానుషం

నా చిన్నప్పుడు, అంటే గత 50సంవత్సరాల క్రితం పలురకాల సామాజిక సమస్యలపై ప్రజాఉద్యమాలు నడిచేవి.తాగు,సాగునీరు,ప్రజల జీవనోపాధి,ప్రజావసరాలు,మౌళిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రజలు ధర్నాలు,ర్యాలీలు,నిరసనప్రదర్శనలు చేసేవారు. ఇలా సమాజంలో ప్రజాజీవన విధానాలపైనే సామాజిక పోరాటాలు సాగేవి.సరళీకరణ,మిశ్రమ ఆర్ధిక విధానాలు పుణ్యమా అని ప్రస్తుతం ఆ ఉద్యమాలు దారిమళ్ళాయి. దళిత,గిరిజనుల భూములు కోల్పోవడం,స్థానిక వనరులు దోపిడి,పర్యావరణసమతుల్యం దెబ్బతినడం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా చేపడుతున్న పోరాటాలను నిత్యం ప్రచార మాధ్యమాలు ద్వారా తెలుస్తున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ,గిరిజన తెగలు నివాసించే అటవీప్రాంతాల్లో పెద్దపెద్ద పరిశ్రమలు,ప్రాజెక్టులు స్థాపన కోసం స్థానిక గిరిజనుల భూములు, వనరులు దోపిడికి గురికావడం వంటి తీవ్రమైనఅంశాల ఉద్యమాలు జరుగుతున్నాయి.నూతనఆర్ధిక విధానాలు తర్వాత ప్రైవేటీకీకరణ పెత్తనం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటినుంచి ప్రజల సామాజిక ఉద్యమాలు కాస్త పక్కదారి పట్టాయి.ప్రపంచీకరణనేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా చేపట్టినప్రాజెక్టులు,పరిశ్రమలవల్ల నిర్వాసితులైనప్రజలు,దెబ్బతింటున్న పర్యావరణసమతుల్యతపై పోరాటాలు నడుస్తున్నాయి.మిగతా ప్రజామౌళికావసరాలపై చేపట్టే సామాజికఉద్యమాలు తగ్గుతూ వస్తున్నాయి.
దేశంలో1991వరకు సామ్యవాద తరహా అక్కడ అక్కడా పరిశ్రమలు నెలకొల్పారు. కానీ ప్రైవేటీకరణ పెరగడంవల్ల వనరులు,పర్యావరణ సమస్యలతో ప్రజల పడుతున్న వెతలు వర్ణీతీతంగా మారాయి.మిశ్రమఆర్ధిక విధానం,సంక్షేమ రాజ్యం అనే భావనలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ ఆర్ధిక విధానాలు వచ్చాయి. బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కోసం చేసే కేటాయింపులు తగ్గించడంవల్ల పేద,మధ్య తరగతి ప్రజలకు నష్టం వాటిల్లింది. ఫలితంగా ఆర్ధిక సంక్షోభంలో పడిన ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం లేదా పూర్తిగా మూసేవేయడం వంటి విధానాలవల్ల ఆ సంస్థల్లో పనిచేసే శ్రామికులురోడ్డున పడుతున్నారు. దీనికి తోడుగా గత రెండేళ్ళక్రితం ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్‌`19 ఆంక్షలు స్థానిక ప్రభుత్వాలకు జతకట్టాయి.దీని ఆసరాగా తీసుకొని స్థానిక వనరులు,పర్యావరణ సమతుల్యతలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. పెట్టుబడులు ఉపసంహరణవల్ల నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థల(స్టీల్‌ ప్లాంట్‌ వంటి కంపెనీలు) పనితీరు మెరుగైన లాభాల బాట పట్టినప్పటికీ,శ్రామికులకు ఏమాత్రం మేలు చేకూరలేదు.ఫలితంగా బాధితుల ఒత్తిడి మేరకు సామాజిక, పర్యావరణవేత్తలు ఉద్యమాలు చేయాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది.
ఈనేపథ్యంలో ఈఅంశాలపై పోరాటంచేసే వారిపై స్థానిక ప్రభుత్వాలు ఉక్కుపాదం ప్రయోగిస్తోంది. వారి నిరసన గళాన్ని అణిచివేసేందుకు కొత్త ఎత్తుగడ వేశాయి. వారిపై ఆర్ధిక నేర ఆరోపణ నెపంతో ఆర్ధిక నిఘా విభాగాలను ప్రయోగిస్తూ సరికొత్త తరహాలో దాడులు ప్రారంభించాయి. ఇలా ఇప్పటి వరకు దేశంలో సుమారుగా 300 మంది సామాజిక,పర్యావరణవేత్తలు,స్వచ్చంధ సంస్థలపై సోదాలు పేరుతో దాడులు చేపట్టాయి. టెర్రరిస్టులు తరహాలో వారిపై దాడులు చేసి భయాంబ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్దకాలంలో సామాజిక,పర్యావరణ పరిరక్షణ,మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలైన 1700మందిని హత్యలకు గురి చేసినట్లు నివేదకలు చెబుతున్నాయి.
ఇదింతా బడాపారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సామాజిక ఉద్యమ కార్యకర్త లను భయాందోళనలకు గురిచేసి అడ్డుతొలగించుకోవడానికి స్థానికప్రభుత్వాలు వ్యవహరిస్తున్న పెద్ద కుట్రలోని ఒక భాగమేనని ప్రజలు,పర్యావరణ,సామాజిక వేత్తలు భావిస్తున్నారు.-రెబ్బాప్రగడ రవి,ఎడిటర్