ఆర్ధిక ఇబ్బంద్లో రైతు భరోసా
రైతు భరోసా పథకం అనేది డైనమిక్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన రైతు మద్దతు,సాధికారత కార్యక్రమం.ఈసమగ్ర పథకం రైతులకు ఆర్థిక సహాయం మరియు ఇతర ప్రయోజనాలను అందించడం, వారి సామాజిక-ఆర్థిక శ్రేయస్సు మరియు అభ్యున్నతికి భరోసా కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
వైఎస్సార్ రైతు భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వంరూ.7500,కేంద్ర ప్రభుత్వం రూ.6000 విరాళంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి సంవత్సరానికి 13,500 రూపా యల మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేయ డం ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయం చేయ డానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం.ఇప్పటి వరకు ఐదువిడతలుగా రైతులకు రైతుభరోసా నిధులు అందజేశారు. వైఎ స్సార్ రైతు భరోసా-ప్రధానమంత్రి కిసాన్ పథ కం కింద రైతులకు సంవత్సరానికి రూ.13, 500 ఆర్థికసహాయం అందుతుంది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500,భారత ప్రభుత్వం రూ.6,000 భరిస్తుంది.కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడుతారు. అన్న దాతలు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సంప్రదిస్తే వైఎస్సార్ రైతు భరోసా పథకంలోకి చేర్చుకుం టారు. రైతులు పొలం పట్టా,ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉం టుంది. అర్హులకు వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ కింద ఏపీ ప్రభుత్వం ప్రతిఏటా13,500 రూపా యలను మూడు విడతలుగా వారి బ్యాంక్ ఖాతా ల్లోకి నేరుగా జమ చేస్తుంది.
రైతుల్లో సంతోషం..
ఆంధ్రప్రదేశ్ లోని 38లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడానికి రూ.3785కోట్లను విడుదల చేస్తూ 2019అక్టోబర్ 15న రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ రైతు భరోసాను ప్రారంభించారు.మొక్కలు,ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు రైతుభరోసా కేంద్రా లను2020 మే30న ప్రారంభించారు. హార్టికల్చర్, ఆక్వాకల్చర్ మరియు వ్యవసాయ రంగాలకు 2019-20ఆర్ధిక సంవత్సరానికి మొత్తం రూ.6, 173 కోట్లు, 2020-21కి గాను రూ.6,928 కోట్లు ఖర్చు చేయబడిరది.%ళి6రి% రైతులకి ఆర్ధిక సహాయం కొనసాగించడానికి 2020-21ఆర్ధిక సంవత్సరానికిగాను హార్టికల్చర్, ఆక్వా కల్చర్ మరియు వ్యవసాయ రంగాలకు ఖర్చు చేసే రూ 6,928 కొట్లలో వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకానికె సగానికి పైగా అంటే రూ 3,615.60 కోట్లు కేటాయించడం జరిగింది
అంతర్జాతీయ గుర్తింపు
విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలందిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రా లకు (ఆర్బీకే) ఇప్పుడు అంతర్జాతీయంగా అరుదైన ఖ్యాతిని గడిరచనున్నాయి. ఐక్యరాజ్య సమితి అను బంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో) అందించే ప్రతిష్టాత్మక ‘ఛాంపియన్’ పురష్కారానికి ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం 2022 మే నెలలో నామినేట్ చేసింది.
అర్హత ప్రమాణం:..
రైతు భరోసా పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు, రైతులు కొన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలి. వీటితొ పాటు రైతు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.రైతుకు సాగు భూమిని కలిగి ఉండాలి.రైతుకు చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి.
వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం ప్రయోజనాలు:..
రైతు భరోసా పథకం రైతులకు అనేక ప్రయోజ నాలను అందిస్తుంది, వీటిలో ఇవి ఉన్నాయి ఆర్థిక సహాయం ఒక్కో రైతుకు ఏడాదికి 13,500/-రూ.నీటిపారుదల సౌకర్యాన్ని అందించడానికి ఉచిత బోర్‌వెల్ డ్రిల్లింగ్.నష్టాలను తగ్గించడానికి పంట బీమా కవరేజీ.వ్యవసాయ కార్యకలా పాలకు మద్దతుగా వడ్డీలేని రుణాలు.కోత అనం తర నష్టాలను నివారించడానికి కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాలు. మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ద్వారా మహిళా రైతులకు మద్దతు. నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉంచడం. హార్టికల్చర్ మరియు అనుబంధ కార్యకలాపాలకు పెట్టుబడి మద్దతు.
అమలు ప్రక్రియ..
రైతు భరోసా పథకం విజయవంతంగా అమలు కావడానికి ఈ క్రింది దశలను కలిగి ఉన్న క్రమ బద్ధమైన విధానాన్ని అనుసరించడం అవసరం: గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన రైతుల గుర్తింపు మరియు ధృవీకరణ. అవసరమైన వివ రాలు మరియు పత్రాలను సేకరించడం ద్వారా పథకంలో రైతుల నమోదు.రైతుల బ్యాంకు ఖాతా ల్లోకి నేరుగా ఆర్థిక సహాయం పంపిణీ. పారద ర్శకత మరియు ప్రభావాన్ని నిర్ధారించడానికి నిరంతర పర్యవేక్షణ మరియు మూల్యాంకనం.
ఆర్థిక సహాయం అందించబడిరది
వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 13,500/-రూ.ఆర్థిక సహాయం మూడు విడతలుగా అందజేయగా, మొదటి విడతగా 7,500/-రూ. మరియు రెండవ విడత మొత్తం 4,000/-రూ. మరియు ఖరీఫ్,రబీ,యాసంగి సీజన్లలో వరుసగా 2,000/-రూ. రైతుల తక్షణ అవసరాలను తీర్చ డం మరియు వారి వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ఆర్థిక సహాయం లక్ష్యం.
టైమ్‌లైన్‌లు మరియు షెడ్యూల్
రైతు భరోసా పథకం రైతులకు సకాలంలో ప్రయో జనాలను అందజేయడానికి చక్కగా నిర్వచించ బడిన కాలక్రమం మరియు షెడ్యూల్‌ను అనుసరి స్తుంది. ఆర్థిక సహాయం మరియు ఇతర సహాయ సేవల పంపిణీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడుతుంది, ఇది అధికారిక వెబ్‌సైట్‌లు,నోటిఫికేషన్‌లు మరియు స్థానిక పరి పాలనతో సహా వివిధ మార్గాల ద్వారా రైతులకు తెలియజేయబడుతుంది.
రైతులపై ప్రభావం..
వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం ఆంధ్రప్రదేశ్‌లోని రైతులపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపింది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం రైతులకు సాధికారత కల్పించడం ద్వారా సామా జిక-ఆర్థిక పరివర్తనను తీసుకువచ్చింది.ఈ పథకం రైతుల జీవనోపాధిని మెరుగుపరిచింది, గ్రామీణ ప్రాంతాల్లో కష్టాలను తగ్గించింది మరి యు మొత్తం గ్రామీణ అభివృద్ధికి దోహదపడిరది.
టెక్నాలజీ పాత్ర..
వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని విజయవంతం గా అమలు చేయడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పథకం యొక్క సమర్థవంతమైన నిర్వహణ మరియు పర్యవేక్షణను సులభతరం చేస్తుంది,పారదర్శకత మరియు జవాబుదారీ తనాన్ని నిర్ధారిస్తుంది. ఆన్‌లైన్ పోర్టల్‌లు మరియు మొబైల్ అప్లికేషన్‌ల వంటి డిజిటల్ ప్లాట్‌ఫార మ్‌ల ఉపయోగం అతుకులు లేని నమోదు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ మరియు పురోగతిని నిజ-సమయ ట్రాకింగ్‌ని అనుమతిస్తుంది, ఈ పథకాన్ని మరింత ప్రాప్యత మరియు రైతు-స్నేహపూర్వ కంగా చేస్తుంది.
విజయ గాథలు..
రైతు భరోసా పథకం అనేక విజయగాథలను చూసింది, రైతులకు సాధికారత కల్పించడంలో దాని ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. అనేక మంది లబ్ధిదారులు తమ వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోగలిగారు,వారి ఆదాయ వనరు లను విస్తరింపజేసుకున్నారు మరియు మెరుగైన జీవన ప్రమాణాలను కలిగి ఉన్నారు. ఈ విజయ గాథలు ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తాయి మరియు గ్రామీణ వర్గాలపై పథకం యొక్క పరివర్తన ప్రభావాన్ని హైలైట్ చేస్తాయి.
ఎదుర్కొన్న సవాళ్లు..
విజయాలు సాధించినప్పటికీ,వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రధాన సవాళ్లలో ఇవి ఉన్నాయి..
నిజమైన లబ్ధిదారుల గుర్తింపు మరియు ధృవీకరణ.అర్హులైన రైతులందరికీ సమానమైన ప్రయోజనాల పంపిణీని నిర్ధారించడం. మారుమూల మరియు ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ప్రభావవంతమైన అమలు. దుర్వినియోగం లేదా అవినీతిని నిరోధించడానికి నిరంతర పర్యవేక్షణ మరియు మూల్యాంకనం.
భవిష్యత్తు పరిధి మరియు మెరుగుదలలు..
రైతు భరోసా పథకం భవిష్యత్తులో మెరుగుదలలు మరియు విస్తరణకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందు పరచడం,సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్స హించడం మరియు రైతులకు ఆదాయ వనరు లను వైవిధ్యపరచడం ద్వారా పథకాన్ని బలో పేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. ఈ పథకం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రా మ్‌లను ప్రవేశపెట్టడంతోపాటు అనుబంధ రంగా ల్లో ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని యోచిస్తోంది.
ప్రభుత్వ కార్యక్రమాలు..
వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని పూర్తి చేసేం దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్ర మాలను చేపట్టింది.
నిధులను విడుదల..
రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందనేది ప్రతి రైతన్నా ఆలోచించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైయస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కింద వరుసగా ఐదో ఏడాది 2వ విడత పెట్టు బడి సాయాన్ని అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రారం భించారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహి రంగ సభలో సీఎం జగన్ రైమాట్లాడుతూ… రాష్ట్రంలోని 53.53లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా దాదాపు రూ.2,200 కోట్లు జమ చేసే మంచి కార్యక్ర మానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం పేర్కొ న్నారు. ఈరోజు రేపటి లోపు మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రూ.1,200 కోట్లు నేరుగా ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు. ఇక పీఎం కిసాన్ కింద రావాల్సిన రూ.1,000 కోట్లు వాళ్లు ఇచ్చిన వెంటనే ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు.
రైతు ప్రభుత్వం మనది..
ఈ 53 నెలల్లోనే రైతుకు, రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతిచ్చిందో అందరికీ తెలిసిందేనని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్ర బాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్ చేసిన పనులను చేయలేక పోయాడో ఆలోచన చేయాలన్నారు.ఈ 53 నెలల కాలంలో 53 లక్షల పైచిలుకు రైతన్నలకు మంచి జరిగిస్తూ, ప్రతి రైతన్నకు నేరుగా బటన్ నొక్కి ఖాతాల్లోకి జమచేయడంవల్ల ఒక్కొక్కరికి దాదాపు రూ.65,500 ఇవ్వడం జరిగిందన్నారు. అయిదో విడత కింద రూ. 4వేలను ఒక్కో రైతు ఖాతాల్లో జమచేసేందుకు రూ.2,200 కోట్లు ఇచ్చే కార్యక్ర మానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కేంద్రంతో సంప్రదించి రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరతానని సీఎం జగన్ తెలిపారు. కేవలం రైతు భరోసా పథకం ద్వారానే దాదాపు 53లక్షల పైచిలుకు రైతులకు రూ.33,209 కోట్లు ఆఅయిదేళ్లలోవారి ఖాతాల్లోకి నేరుగా పంప గలిగామన్నారు.
నిరుపేదలకు మంచి చేశాం కాబట్టే ..ప్రజలు వారి గుండెల్లో పెట్టుకున్నారు..
గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు స్పందన బాగుందని సీఎం జగన్ తెలి పారు. రైతులుగానీ, అవ్వాతాతలుగానీ, అక్కచెల్లె మ్మలుగానీ,చదువుకొనే పిల్లలుగానీ నా ఎస్సీ,నా ఎస్టీ,నా బీసీ,నా మైనార్టీ నా నిరుపేద వర్గాలు గానీ,ఈ వర్గాలకు మంచి చేస్తే,ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకుంటే వారెంతగా తమ గుండెల్లో స్థానం ఇస్తారని చెప్పడానికి ఒకవైయస్సార్ గారిని చూసినా ఒక జగన్ ను చూసినా అర్థం అవుతుం దన్నారు. ఇదే విషయం సామాజిక సాధికార యాత్రలను చూసినా కనిపిస్తోందన్నారు.నా ఎస్సీలను,నాఎస్టీలను,నా బీసీలను, నా మైనార్టీలను నాయకత్వ రోల్‌లోకి తీసుకొచ్చి వాళ్ల చేత మీటిం గులు పెట్టిస్తున్నా తండోపతండాలుగా జనాలు కదిలి వస్తున్నారంటే ఎంతగా ప్రతి పేద వాడి గుండెల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానం ఉందో నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. మీ బిడ్డ జగన్ కు ఎంత స్థానం ఉందో చెప్పడానికి ఈ మీటింగులే నిదర్శనమని, ప్రతి అడుగూ రైతన్నకు మంచి జరగాలి, పేద వాడికి మంచి జరగాలి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీ,లు, నా మైనా ర్టీలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, గొప్పగా చదవాలి, ఎదగా లని ఎంతో తపిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనదని సీఎం స్పష్టం చేశారు.
చంద్రబాబుకు మంచి చేయాలనే ఆలోచనలు ఎందుకు రాలేదు?..
గతంలో ఎప్పుడూ జరగని విధంగా, వైయస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా53లక్షల మంది పైచిలుకు రైతులకు,వారితోపాటు నాఎస్సీ,నా ఎస్టీ, నాబీసీ,నామైనార్టీ రైతులకు,ఆర్వోఎఫ్ ఆర్ రైతు లకు రూ.13500 చొప్పు న ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా?14సంవత్స రాలు సీఎంగా ఉండి,మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీ లో కూర్చుని కూడా రైతులకు మంచి చేయా లనే ఆలోచన చంద్రబాబుబుర్రలో ఎందుకు రాలే దని సీఎం జగన్ ప్రశ్నించారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నది మన ప్రభు త్వం మాత్రమేనని,గతంలో పగలూ,రాత్రి రెండు సమయాల్లో కలిపినా కూడా కనీసం 7 గంటలు కూడా వ్యవసాయానికి ఎందుకు కరెంటు ఇవ్వ లేదని సీఎం జగన్ ప్రశ్నించారు.వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు 1700కోట్లు ఖర్చు చేశా మన్నారు. పంటల బీమాగా రైతన్న ఒక్క రూపా యి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంను కూడా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తూ,రైతన్నకు తోడుగా నిలబడుతున్న పరిస్థి తులు చూస్తున్నామని సీఎం తెలిపారు. 53 నెలల కాలంలో దేవుడి దయతో నాలుగేళ్లలో ఎక్కడా కరువు లేదన్నారు.చంద్రబాబు హయాంలో వరుసగా 5సంవత్సరాలు కరువే కరువు అని ఎద్దేవా చేశారు.
ప్రజలు ఆలోచించాలి.. అబ్దాలను నమ్మవద్దు
స్కిల్ డెవపల్ మెంట్ ఒకస్కామ్,ఫైబర్ గ్రిడ్, మద్యం,ఇసుక ఇంకో స్కామ్. రాజధాని భూములు ఇంకో స్కాం ఇలా చంద్రబాబు పేరు చెబతే స్కామ్‌లే గుర్తుకు వస్తాయని, స్కీములు గుర్తుకు రావని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతన్నకు తోడుగా నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్న కు చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు అధికా రంలోకి రావడానికి రూ.87,612 కోట్ల వ్యవ సాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆ మాటలు నమ్మి రైతులు ఓటేస్తే అధికారంలోకి వచ్చాడు. రైతులను మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసేట్టుగా చేశాడు. రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. అప్పటిదాకా ఇస్తున్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరుగార్చాడు. ముస్టి వేసినట్లు రూ.15 వేల కోట్లు విదిల్చిన పరిస్థితులు. ఈరోజు మీ బిడ్డ హయాంలో నాలుగు సంవత్సరాల కాలం 53నెలల పాలనలో ఎక్కడాకరువు మండ లంగా డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి రాలేదు. రాష్ట్రం లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి.చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలన్నది ఆలోచన చేయాలి. ప్రజలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వా తాతలకు, చదువుకుంటున్న పిల్లలకు, నిరుద్యో గులకు మంచి చేయడం కోసం కాదు. -జిఎన్‌వి సతీష్