ఆదివాసులు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు
భారతదేశ మూలనివాసులు ఆది వాసులు వారి అభివృద్ధి స్వాతంత్య్రానికి పూర్వ ము,తర్వాత కూడా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.ఈస్టు ఇండియా కంపనీ,బ్రిటీషు పాలకులు,నిజాంప్రభుత్వము,కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు ప్రవేశపెట్టిన చట్టాలు చేపట్టిన పథకాలతో వారు ఆశించినంత అభివృద్ధి జరుగలేదు. హైద రాబాదు రాష్ట్రంలో నిజాం ప్రభుత్వంపై జోడే ఘాట్ కేంద్రముగా 1940 సం॥లో కుమ్రంభీము నాయకత్వాన ప్రకృతి సంపదలైన (జల్,జంగల్, జమీన్)నీళ్లు,అడవి,భూమిపైహక్కులు, అధికారము కొరకై గోండుల తిరుగుబాటు జరిగింది.ఈ సం ఘటనలో నిజాం సర్కారుకు భీమ్ వర్గానికి మధ్య జోడేఘాట్‌లో భీకర పోరాటం జరిగింది. దీనిలో కుమ్రం భీమ్ మరణించాడు.
ఆదిలాబాద్ అడవులలో నివసిస్తున్న ఆదివాసుల అశాంతికిగల కారణాలను అధ్య యనము చేయటానికి నిజాం ప్రభుత్వము ప్రముఖ మానవ పరిణామశాస్త్రవేత్తను నియమిం చింది. ఆదివాసులు మరియు ఇతర వెనుక బడిన తరగతుల వారి అభివృద్ధి కొరకు సలహాదా రుగా మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఆంత్రోపా లజీ డిపార్టుమెంటుకు ఆచార్యులుగా కూడా నియమించింది. ప్రొ.హైమండార్ఫ్ తన భార్య బెట్టి ఎలిజబెత్‌తో కలసి క్షేత్రస్థాయిలో పర్యటిం చారు.మొదట నల్లమల అడవులలో నివ సిస్తున్న చెంచుల గురించి, భద్రాచలం ప్రాంతం లోని కోయలు,కొండరెడ్ల గురించి మరియు ఆదిలా బాదులోని గోండుల గురించి విస్తృతమైన పరిశో ధనలు చేసారు. అంతేకాకుండా ఈశాన్య భారత ప్రాంతములో నివసిస్తున్న కొనియాక్ నాగాలు, అపతానీల గురించి కూడా అనేక పరిశో ధనలు చేశాడు. ఆదివాసుల అశాంతికి గల కారణా లలో ముఖ్యముగా వారికి సాగుభూమిపై అటవీ సంపద మీద హక్కులు కోల్పోవడం, ఆదివాసేతర భూస్వా ములు క్రింది స్థాయి అధికారుల దోపిడి, దౌర్జా న్యాలు పెరిగిపోవడం వారి తిరుగుబాటుకు కార ణాలుగా గుర్తించాడు. నిజాం ప్రభుత్వము గోండుల ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగు పర్చటం ద్వారా వారిఅశాంతిని కొంతవరకు దూరం చెయ్యవచ్చని భావించింది. ప్రొ.హైమం డార్ఫ్ దంపతులు తమ కార్యక్షేత్రాన్ని ఆదివాసి గ్రామమైన మార్లవాయి కేంద్రముగా ఎంచుకు న్నారు. ప్రధా నంగా విద్య పరిపాలన పరమైన సూచనలతో నిజాం ప్రభుత్వానికి నాలుగు నివేది కలు సమర్పిం చాడు. గోండులు తమ ఆదిమ జీవనవిధా నం నుండి బయట పడటా నికే కాక భూదాహం గల ఆదిపత్య కులాలవారి నుండి తమనుతాము రక్షిం చుకోవడానికి మార్గా లను,అధికారులతో వ్యవహ రించడంలో తమ భూముల అక్రమ బదిలీలను అడ్డుకోలేక పోవడం వారినిరాశక్తతకు ప్రధాన కారణం వారి నిరక్షరా స్యతగా గుర్తించారు.వారికి ప్రభుత్వ చట్టా లు, నిబంధనలు తెలియకపోవడం వలన దురు ద్ధేశపూరితులైన ఆదివాసేతరులు, అవినీతిపరులైన క్రింది స్థాయి ప్రభుత్వ సిబ్బంది చేతిలో మోస పోవాల్సి ఉంటుంది. కాబట్టి గోం డుల పరిస్థితిలో మార్పుకు అక్షరాస్యతను పెంచు కోవడమే మొదటి మెట్టుగా భావించారు.
గోండు విద్యాప్రణాళిక రూపొం దించి 1943 వ సం॥లో మార్లవాయి,గిన్నెధారి కేంద్రాలుగా శిక్షణ పాఠశాలలను ప్రారంభిం చారు.ఈ ప్రణాళిక ప్రధాన ఉద్ధేశ్యం ఆదివాసు లకు చదువు నేర్పేందుకు ఆదివాసీ యువకులని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం.గోండు భాషలో వ్రాయడం,చదవడమేకాక రెవెన్యూ,అటవీ శాఖల నిబంధనల గురించి వాటి పనివిధానంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక స్కూళ్లను కూడా నెలకొల్పారు. ఈ విద్యా కార్యక్రమాలలో వృత్తి శిక్షణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన,రోజూవారి జీవితానికి అవసరమయ్యే ఇతర విషయాలను కూడా భోదించేవారు. ప్రొ.హైమండార్ఫ్ దంప తులు చేపట్టిన మరోముఖ్య కార్యక్రమం భూ పంపి ణీ,ఆదివాసుల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కు రెవెన్యూశాఖలోనే సాంఘిక సంక్షేమ సంస్థను నెలకొల్పి అక్కడి ఉద్యోగులకు స్వయంగా తానే ఉస్మానియా యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చేవారు. 1946 నాటికి ‘‘నోటిఫైట్’’ ఆదివాసీ ప్రాంతాలను సాధారణ పరిపాలనాశాఖ నుండి వేరుచేసి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఆయనే ‘‘మోజాం హుసేన్’’ ూజూవషఱaశ్రీ ుతీఱపవం ూటటఱషవతీ. భూపంపిణీ కార్యక్రమ పథకంలో కీలకపాత్ర పోషించారు.1948 నాటికి ఆదిలాబాద్ గోండు లు,కొలాంలకు ఒకలక్ష అరవైవేల (1.60 లక్షలు) ఎకరాల భూములకు ‘లావాణి’ పట్టాల రూపంలో పంచిపెట్టారు.వాటిని ఇప్పటికి ప్రొ. హైమండార్ఫ్ పట్టాలుగా పేర్కొంటారు. ఇంతేకాకుండా సం॥రా నికి ఒకసారి పుష్యమాసంలో ఆదివాసుల సంప్ర దాయబద్దముగా నిర్వహించే నాగోబా జాతరలో ఆదివాసుల సమస్యలను పరిష్కరించే వేదికగా జిల్లా అధికారుల సమక్షంలో ‘‘ప్రజాదర్బార్’’ ను కూడా ఏర్పాటుచేసాడు. నిజాంసర్కారుపై భారత ప్రభుత్వం తీసుకున్న పోలీసు చర్యఫలితముగా హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం సంస్థానం భారత దేశంలో విలీనం కావడం, కొన్నేళ్ల తర్వా త 1956లోతెలంగాణా ప్రాంతాన్ని మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ రాష్రంలో కల్పడంవలన నిజాం ప్రభు త్వానికి అంతవరకుప్రొ.హైమండార్ఫ్ రూపొం దిచిన ప్రణాళికలు ఆయన చేపట్టిన సామాజిక, ఆర్థిక అభివృద్ధి పథ కాలు అమలుకు నోచుకో కుండా అస్తవ్యస్తమై పోయినాయి.ఈ పరిణామాల కారణంగా తెలం గాణ,కోస్తాంధ్రలోని ఆదివాసీ ప్రాంతాల గిరిజ నులు విచ్చలవిడిగా దోపిడి పీడనలకు గురైనారు. సొంతగడ్డపై నిలువ నీడ లేకుండా అడవి లోతట్టు ప్రాంతానికి తరిమి వేయబడ్డారు. ఫలితముగా ఆదివాసీ ప్రాంత ప్రజలు కమ్యూనిస్టు పార్టీల నాయ కత్వంలో‘‘దున్నేవాడిదేభూమి’’నినాదంతో ప్రారం భమై సాయుధ పోరాటాలవైపుకు ఆకర్షితులైనారు.
ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు విస్తరించి ఉన్న (ఎజెన్సీ) మన్యప్రాంత గిరిపుత్రు లలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా వారి అభివృద్ధి ని ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వాలపై అసంతృప్తి పెరిగింది. శ్రీకాకుళంలోని మొండెంఖల్ నుండి ఆదిలాబాద్‌లోని ఇంద్రవెళ్ళివరకు నక్సల్బరి ఉద్యమాలు అడవిలో ఊపందుకున్నాయి. గోండు గూడాలలో వారి సంప్రదాయ వాయిద్యమైన ‘‘తుడుం’’ మోగింది. తమ హక్కుల సాధన కొరకు, దోపిడి పీడనల విముక్తి కొరకు ఆదివాసులు చైతన్య వంతులైనారు.పీపుల్స్‌వార్ గ్రూప్ అనుబంధ ‘‘గిరిజ న రైతు కూలి సంఘం’’ ఆధ్వర్యంలో 20ఏప్రిల్, 1981న ఇంద్రవెళ్ళి సంతలో సభ నిర్వహిస్తే ప్రభు త్వం దానిని అడ్డుకొని నిరాయుధులైన వందల మంది అమాయక గోండులపై కాల్పులు జరిపి మరో జలియన్ వాలా భాగ్‌ను సృష్ఠించింది. ఈ మారణకాండ దేశవ్యాప్తంగా ప్రకంపనలురేపింది.
భారతీయ ఆదివాసులు మాట్లాడే భాషలు, వారి సామాజిక వ్యవస్థ, సంస్కృతి, నివాస ప్రాంతాలు, జీవనశైలి, ఆదివాసేతర సమాజాల కంటే భిన్నముగా ఉండటం వలన వారు నివసించే ప్రాంతాల పరిపాలన కొరకు మానవ పరిణామ శాస్త్రవేత్తల పరిశోధన గ్రంథాలు, సూచనలు, నివేది కలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేకమైన పరిపాలన వ్యవస్థను తయారు చేయడం జరిగింది. బ్రిటీషు ప్రభుత్వము1917 సం॥లోనే ఆదివాసులు అధిక ముగా నివసించే ప్రాంతాలను నోటిఫైడ్ షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తించింది. వారి సామాజిక, సాం స్కృతిక,ఆర్థిక అభివృద్ధికై భారత ప్రభుత్వము ఈశా న్య భారత ప్రాంతములో నివసించే ఆదివాసుల కొరకు స్వయం ప్రతిపత్తిగల జిల్లా కౌన్సిల్‌లను ఏర్పా టు చేసింది.మధ్య భారతప్రాంత ఆదివాసుల కొరకు వారి భూముల రక్షణకై ప్రత్యేకించి భూ బదలాయిం పు నిరోధక చట్టం వడ్డీ వ్యాపారుల నిరోధక చట్టం ప్రవేశపెట్టింది.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ముందుచూపుతో భారతీయ ఆదివాసుల అభివృద్ధికై ప్రత్యేక పరిపాలన వ్యవస్థ కొరకు ఈశాన్య భారతప్రాంత రాష్ట్రాలకు ఆరవ (6)షెడ్యూలు మరియు మధ్య భారత ప్రాంత రాష్ట్రా ల్లా ఆదివాసులకు అయిదవ(5)షెడ్యూలును భారత రాజ్యాంగంలో పొందుపర్చారు. భారతదేశ మొదటి ప్రధాని శ్రీ పండిత్ జవహార్‌లాల్ నెహ్రూ కూడా ఈ ప్రాంతఆదివాసి ప్రజల అభివృద్ధి కొరకై ప్రత్యే కమైన‘‘పంచశీలసూత్రాలను’’ప్రవేశపెట్టారు.ఈశాన్య భారతములో కొంతవరకు ప్రగతి జరిగినప్పటికీ మధ్య భారత ప్రాంతములోని ఆదివాసులకు ఆశించి నంత ప్రగతి ఏమాత్రము కూడా జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలాకాలము వరకు గిరిజన అభి వృద్ధి కార్యక్రమాలు సాంఘిక సాంక్షేమశాఖలో భాగంగానే కొనసాగాయి. 1974 సం॥లో ఆదివా సులు అధికముగా ఉన్న తొమ్మిది (9) జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన కొరకు జి.ఓ.నెం.856సాంఘిక సాంక్షేమశాఖ తేది. 29. 10.1974ద్వార ‘‘సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ’’ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన సాంక్షేమశాఖకు ఆసిఫా బాద్ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నుకోబడిన గోండులలో ప్రథమ పట్టభదృడుశ్రీ కోట్నాక భీమ్రావు గిరిజన సాంక్షేమశాఖా మంత్రి గా నియమితులైనారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొమ్మిది (9) సమీకృత గిరిజనాభి వృద్ధి సంస్థలఏర్పాటు చేసింది. సమీకృత గిరిజనా భివృద్ధి సంస్థ లకు స్థాయి సీనియర్ IAS అధికారి నాయకత్వాన ఆ సంస్థ పరిదిలోని ప్రభుత్వ శాఖలన్నింటిని సమన్వయపరుస్తూ ఏకీ కృత పరిపాలన చెయ్యవలసి ఉంటుంది. సంబంధిత జిల్లా కలెక్టర్లు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలకు జష్ట్రaఱతీఎaఅ లుగా వ్యవహరిస్తారు. ప్రతిమూడు(3) నెలలకొకసారి ఈసంస్థలు అక్కడి ఆదివాసుల సామాజిక,ఆర్థిక అభివృద్ధి కొరకు చేపట్టిన పథకాల ప్రగతిని సమీక్షించుటకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టరు మరియు గిరిజన సాంక్షేమ శాఖామా త్యుల అధ్యక్షతన గవర్నింగ్ బాడీ సమావేశము నిర్వహించాలి. దురుదుష్టవశాత్తు చాలాకాలము వరకు ఈసంస్థల వ్యవస్థలంతాకూడా కొన్ని జిల్లా లలో జిల్లా కలెక్టర్ల కార్యాలయాలలో బంధీలై దీర్ఘానిద్రావస్థలో మునిగిపోయినది.
అంతేకాకుండ సాధారణముగా మైదాన ప్రాంతాలోల సరిగ్గా పనిచెయ్యని, అసమర్థులైన అధికారులను, సిబ్బందిని ఆదివాసీ ప్రాంతాలకు తరచుగా నియమిస్తారు. ఇందులో మొదటి రకం మొదటి నియామకం రెండోరకం పదోన్నతి, మూ డోరకం శిక్షించుటకు వీరు ఆదివాసుల సమస్యలను పట్టించుకోరు. అర్థం కూడా కావు. చుట్టపుచూపుగా వచ్చి విధులు నిర్వహిస్తారు. బదిలీల కొరకై రాజ కీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటారు. రవాణా సౌకర్యాలు, స్థానికంగా ఉండటానికి కనీస వసతి కూడాలేని ప్రాంతాలలో ఆదివాసుల భాష వారి జీవనశైలి తెలియని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ద్వారా ఆదివాసులకు ఒరిగేది ఏమి లేదు. పైగా వీళ్ళంతా వేతనంతో పాటు ఏజెన్సీ ప్రాంత అలవె న్సులు కూడ పొందుతుంటారు. 1981ఏప్రిల్ 20 సోమవారం ఇంద్రవెళ్లి సంతలో గోండులపై జరిగిన కాల్పుల సంఘటన తర్వాత భారతదేశానికి మళ్ళీ వచ్చిన ప్రొ॥హైమండార్ఫ్ దంపతులు ఆదివాసి గ్రామాలను విస్తృతంగా పర్యటించారు. ఇక్కడి ఆదివాసుల స్థితిగతులను పరిశీలించినప్పుడు తమకు1940 నాటి పరిణామాలే గుర్తుకు వస్తు న్నాయని ఆవేదన వ్యక్త పర్చారు. తాము నిజాం ప్రభుత్వ కాలములో ప్రవేషపెట్టిన పథకాలను ఆదివాసుల భూములను పరిరక్షించే చట్టాలను వారి కొరకు ప్రస్తుత ప్రభుత్వాలు చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయకపోవటమే ముఖ్యమైన కారణాలుగా పేర్కొన్నాడు. ఆదివాసుల అశాంతికి గల వివిధ కారణాలను తెల్పుతూ వారి అభివృద్ధి కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్ట వలసిన పథకాలపై పలు సూచనలు చేస్తూ ప్రభు త్వానికి తన నివేదిక సమర్పించాడు. ప్రొ॥ హైమం డార్ఫ్ దంపతుల సూచనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఆదివాసుల అభివృద్ధికై పలు సంస్కరణలు చేపట్టింది.ఆదివాసులు ఎదుర్కొం టున్న సమస్యలపై అవగాహన కల్గి వారిపై అపార మైన సానుభూతి,చిత్తశుద్ధి గల అధికారులను ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో నియ మించారు.1975 సం॥లోనే ఏర్పాటై ఉట్నూర్ కేంద్రంగా పని చేయవలసిన సంస్థ జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ కార్యాలయము నుండి పని చేస్తుం డటం కొత్తగా నియమించబడిన అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
1982 ఫిబ్రవరి నెలలో ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీఎమ్.వెంకటపూర్ణ చంద్రశేఖర శాస్త్రి, IAూ గారు,గోండు తెగనుండి మొదటిగ్రూప్`1అధికారిమడావి తుకారాంసహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) గారుఆదిలాబాద్ జిల్లా కేంద్రము నుండి పనిచేస్తున్న IుణA సంస్థ కార్యాలయాన్ని అరవై (60) కి.మీ. దూరములో గల గిరిజన బాలుర వసతి గృహము ఉట్నూరుకి మార్చేశారు. ఈ సంస్థలో పని చేయటానికి ఆశక్తి గల సిబ్బంది అందరూకూడా ఉట్నూరులోనే ఉండి పనిచేయవలసిందిగా ఆదేశాలుజారీ చేసారు. ఆది వాసులంటే అపారమైన ప్రేమాభిమానాలు, అంకితభావముగల అధికారి శాస్త్రీ గారు రాత్రిం బగళ్ళు గోండుగూడాలలో పర్యటించి వారి సాధక బాదకాలను అర్థం చేసుకుంటూ అనతి కాలంలోనే గోండు భాష నేర్చుకున్నారు. సహాయ ప్రాజెక్టు అధికారి శ్రీ మడావి తుకారాం గారి సహకారంతో IుణA లో చిత్తశుద్దిగల అధికారుల బృందాన్ని కూడ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వం పై ఆదివాసులకు గల అసంతృప్తిని తొలగించుటకు వారికి ప్రభు త్వంపై నమ్మకాన్ని కల్గించటానికి ఎనలేని కృషి చేసారు. మారుమూల ఆదివాసి గ్రామాల నుండి చదువుకున్న స్థానిక గోండు యువకులను ఎంపిక చేసి IుణA సంస్థకు ఆదివాసులకు మధ్య సంధాన కర్తలుగా పనిచేయటానికి ఇరవై (20)మందిని Gశీఅస పఱశ్రీశ్రీaస్త్రవ ఔవశ్రీటaతీవ ూటటఱషవతీం (Gపఔూ) లుగా నియమించారు. ఆదిమ గిరిజనాభివృద్ధి సలహా సంఘం Aపశీతీఱస్త్రఱఅaశ్రీ ుతీఱపవం ఔవశ్రీటaతీవ Aసఙఱంశీతీవ జశీఎఎఱ్‌్‌వవ (AుఔAజ) ఏర్పాటు చేసి దానికి మాజీ గిరిజన సంక్షేమ శాఖామాత్యులు శ్రీ కొట్నాక భీమ్‌రావ్‌ను జష్ట్రaఱతీఎaఅ గా నియ మించారు. ఆదివాసుల విప్లవ జ్యోతి అమరవీరుడు కుమ్రం భీమ్ వర్ధంతి సభను ఆయన వీరమరణం పొందిన జోడేఘాట్‌లో 1983 సం॥ నుండి ప్రతి సంవత్సరము ఆశ్వాయుజ మాసం పున్నమి రోజున ప్రభుత్వ పరంగా IుణA ఆధ్వర్యంలో సభ నిర్వహిం చడం మొదలైనది. గోండుల సామాజిక, సాంస్కృ తిక,సాంప్రదాయ సంస్థలైన‘‘రాయ్‌సెంటర్ల’’ వ్యవస్థ ను పునరుద్దరించే కార్యక్రమాలను చేపట్టారు. రాయ్ సెంటర్లసభలు,సమావేశాలు ఏర్పాటు చేసి పరి పాలనలో భాగస్వాములను చేస్తూ ఆదివాసీ గ్రామా ల అభివృద్ధికి ఎటువంటి పథకాలు అవస రమో వారి సలహాలు,సూచనలను పరిగణలోనికి తీసు కోవడం మొదలుపెట్టారు.ఒక సంవత్సర కాలంలోనే ప్రాజెక్టు అధికారి శాస్త్రిగారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం, గిరిజన సహకార సంస్థ ూబప-జశీశ్రీశ్రీవష్‌శీతీ, ూజూవషఱaశ్రీ ణవజూబ్‌వ జశీశ్రీశ్రీవష్‌శీతీ కార్యాలయాలతో పాటు అక్కడ పనిచేసే అధికారు లకు,ఇతర సిబ్బందికి కూడా నివాస గృహాల నిర్మా ణము పూర్తి చేసారు.ఫారెస్టు, పోలీసు, ఇతర అన్నీ ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఉట్నూర్‌లో వెలి సాయి. కుమ్రం భీమ్ కాంప్లెక్సు నిర్మాణం పూర్తి కావడంతో ఉట్నూర్ పట్టణం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయినవి.ఉట్నూరు నుండి ఇందన్ పల్లి వరకు జన్నారంను కలుపుతూ రోడ్డు మార్గం ఏర్పాటు అయినది. ప్రాజెక్టు అధికారి శాస్త్రి గారు పరిపాలన సౌలభ్యం కొరకు తాలుకా వారిగా సెక్టోరల్ అధికారుల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రతి సెక్టారుకు IుణA పరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులను నియమించారు. వారిద్వారా ఆది వాసులు ఎదుర్కొంటున్న తాత్కాలిక,దీర్ఘకాలిక సమస్యలను విశ్లేషిస్తూ ఐటిడిఏ చేపట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరుస్తూ, వాటి వర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించారు. శాస్త్రిగారిఐటిడిఏ దళంలోని ముఖ్యమైన సభ్యులు. మూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేశారు. ఆదివాసులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ద టానికి గిరి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టారు. ఇరవై (20) మంది బడి ఈడు పిల్లలున్న ఆదివాసి గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పా టు చేసారు. మాద్యమిక, ఉన్నత పాఠశాల విద్యకై నూట ముప్పై మూడు (133) ఆశ్రమ పాఠశాలలు, ఏడు (7)వసతిగృహాలు, బాలికల కొరకై ప్రత్యేకించి నలభై ఎనిమిది (48) ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసారు.ఈ పాఠశాలల పర్యవేక్షణ కొరకు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి,సహాయ గిరిజనాభివృద్ధి అధి కారులు,ప్రత్యేక విద్యాశాఖాధికారి కూడా నియమించబడ్డారు. చాలా వెనుకబడిన కొలాం తెగవారి కొరకు నియమించి ఆసిఫాబాదు కేంద్రంగా ప్రత్యేక పాఠశాలను పది (10) శాటిలైట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసారు. ఆదివాసుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఆదివాసి గ్రామంలో స్థానిక ఆదివాసి మహిళను ఎంపిక చేసి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గానియమించారు. వారికి ఆరోగ్య సూత్రాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం, సీజనల్ వ్యాధుల నియంత్రణకుఐటిడిఏ పరిదిలోని ముప్పై ఒకటి (31)ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు,నూట ఎనభై ఆరు (186) ఆరోగ్య ఉపకేంద్రాలు, ఆరు (6) సామాజిక ఆసుపత్రులను పర్యవేక్షణ కొరకు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా మలేరియా నియంత్రణ ఆధికారిని కూడా నియమించారు. ఆదివాసుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చటానికై వ్యవసాయం, పాడి పరిశ్రమ,పట్టు పరిశ్రమ,పండ్లతోటల పెంప కం కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. చెన్నూర్, భీమారం,బెల్లంపల్లి,జంబుగామ్,బెజ్జూరు, ఆసిఫాబాద్, ఇచ్చోడ మరియు ఉట్నూరులో స్థానిక ఆదివాసి యువతీ యువకులను ప్రోత్సహించి, మామిడి మొక్కల నర్సరీల పెంపకంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసారు. ప్రతిశాఖ నుండి అధికారులను నియమించి వాటిని పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టారు. ఒక సంవత్సర కాలంలోనే ప్రాజెక్టు అధికారి శాస్త్రిగారి ఆధ్వర్యంలో ఐటిడిఏ ప్రధాన కార్యాలయం,గిరిజన సహకార సంస్థ కార్యాలయాలతోపాటు అక్కడ పనిచేసే అధికా రులకు, ఇతర సిబ్బందికి కూడా నివాస గృహాల నిర్మాణము పూర్తి చేసారు. ఫారెస్టు, పోలీసు, ఇతర అన్నీ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉట్నూర్‌లో వెలిసాయి. కుమ్రం భీమ్‌కాంప్లెక్సు నిర్మాణం పూర్తి కావడంతో ఉట్నూర్ పట్టణం రూపు ంఖలు పూర్తిగా మారిపోయినవి. ఉట్నూరు నుండి ఇందన్పల్లి వరకు జన్నారంను కలుపుతూ రోడ్డు మార్గం ఏర్పాటు అయినది.ప్రాజెక్టు అధికారి శాస్త్రి గారు పరిపాలన సౌలభ్యం కొరకు తాలుకా వారిగా సెక్టోరల్ అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సెక్టారుకు ఐటిడిఏపరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులను నియమించారు. వారి ద్వారా ఆదివాసులు ఎదుర్కొంటున్న తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలను విశ్లేషిస్తూ ఐటిడిఏచేపట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరుస్తూ, వాటి వర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించారు.
ఆదివాసులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దటానికి గిరి విద్యా వ్యవస్థలో అనేక సంస్కర ణలు చేపట్టారు. ఇరవై (20) మంది బడి ఈడు పిల్లలున్న ఆదివాసిగ్రామాలలో ప్రాథమిక పాఠ శాలలు ఏర్పాటు చేసారు.మాద్యమిక,ఉన్నత పాఠశాల విద్యకై నూట ముప్పై మూడు (133) ఆశ్రమ పాఠశాలలు,ఏడు (7) వసతి గృహాలు, బాలికల కొరకై ప్రత్యేకించి నలభై ఎనిమిది (48) ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసారు. నియ మించబడ్డారు. చాలా వెనుకబడిన కొలాం తెగ వారి కొరకు నియమించి ఆసిఫాబాదు కేంద్రం గా ప్రత్యేక పాఠశాలను పది (10)శాటిలైట్ సెంట ర్లను కూడా ఏర్పాటు చేసారు. ఆదివాసుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలలోభాగంగా ప్రతి ఆది వాసి గ్రామంలో స్థానికఆదివాసి మహిళను ఎంపిక చేసి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గా నియమించారు. వారికి ఆరోగ్య సూత్రాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం, సీజనల్ వ్యాధుల నియం త్రణకు ఐటిడిఏ పరిదిలోని ముప్పై ఒకటి (31) ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు,నూట ఎనభై ఆరు (186) ఆరోగ్య ఉపకేంద్రాలు,ఆరు(6) సామాజిక ఆసుపత్రులను పర్యవేక్షణ కొరకు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జిల్లా మలేరియా నియంత్రణ ఆధికారిని కూడా నియమించారు. ఆదివాసుల ఆర్థిక పరిస్థితులను మెరు గుపర్చటానికై వ్యవసాయం, పాడి పరిశ్రమ,పట్టుపరిశ్రమ,పండ్లతోటల పెం పకం కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. చెన్నూ ర్,భీమారం,బెల్లంపల్లి,జంబుగామ్, బెజ్జూరు, ఆసిఫాబాద్,ఇచ్చోడ మరియు ఉట్నూరు లో స్థానిక ఆదివాసి యువతీ యువకులను ప్రోత్సహించి, మామిడి మొక్కల నర్సరీల పెంపకంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసారు.ప్రతిశాఖ నుండి అధికారులను నియమించి వాటిని పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సమగ్రగిరిజనాభివృద్ధి (ఐటిడిఏ) సంస్థ లు ఆదివాసుల అభివృద్ధి కొరకు చేపట్టిన పథకాలు కొంతమేర పురోగతి సాధించాయని చెప్పవచ్చును. అల్లంపల్లి ఎదురు కాల్పుల సంఘటన తర్వాత ఉట్నూరు ఐటిడిఏసంస్థ గిరిజనుల కొరకు గిరి జనులే ఉపాధ్యా యులుగా నెలకు వెయ్యి (1000/-) రూపాయల గౌరవవేతనంతో ఒక వెయ్యి (1000) మంది స్థానిక యువతీ యువకులను ఎంపిక చేసి గిరిజన విద్యావికాస కేంద్రాలను 1987సం.లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయ నైపుణ్యా లతో సంబంధము లేకుండా కనీస విద్యాఅర్హత పదవ తరగతి చదివితే చాలు, ఈ యువత విద్యతోపాటు ఆయా గ్రామాల అభి వృద్ధికి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంధాన కర్తలుగా పాటుపడ్తారనే సదాశయముతో ప్రభుత్వం వీరిని నియమిం చింది.గిరిజన యువతకు ఉపాధి కల్పిం చటం, వారిని నక్సలైట్ల కార్యక్రమాల నుండి దూరం చేసి ప్రభుత్వంపై నమ్మకము కల్పిం చటం ప్రభుత్వం యొక్క ప్రధాన ఆశయం. గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగముగా ముఖ్య మంత్రి చీ.ు.రామారావుగారు ప్రతిఇంటికి నాల్గు వేలు చొప్పున పదివేల (10, 000) సెమిపర్మనెంట్ ఇండ్లు మంజూరు చేసారు. మారుమూల కొండప్రాంత గిరిజనులకు ఇంటికి వెయ్యి (1000)చొప్పున బెంగళూరు గూన ఐటిడిఏ సెక్టొరల్ అధికారులద్వార పంపిణి చేసారు. ఈఇండ్ల నిర్మాణములో చాలాచోట్ల గిరిజ నులకు, ఫారెస్టు అధికారులకు మధ్య తగాదాలు, ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.
గిరిజనులు భూమి సాగు చేసుకోవ డానికి ఎడ్ల జతల పంపిణీ కార్యక్రమం, వ్యవసా య బావుల నిర్మాణకార్యక్రమాలు కూడా ముమ్మరంగా చేపట్టారు. ఈ అబి óవృద్ధి కార్యక్రమా లన్ని ఒక దశాబ్దకాలము పాటు నిర్విరామంగా కొనసాగాయి.ఇందులో ఎక్కువశాతం ప్రక్క రాష్ట్ర మైన మహారాష్ట్రలో దీ.జ.లుగా ఉన్న లంబా డాలు వలసవచ్చి ఇక్కడి స్థానిక గిరిజ నులు పొందవలసిన ప్రభుత్వ పథకాలను వీరు పొందు తున్నారు.విద్యా, వైద్యము, ఉపాది నియ మకాలను వీరే దక్కించుకుంటున్నారు. స్థానిక ఆది వాసుల భూములను కూడా కాజేయటంతో వలస లంబా డీలకు,స్థానిక గోండులకు మధ్య తీవ్ర ఘర్ష ణలు మొదలై పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా మారాయి. వ్యాసకర్త : డాక్టర్. తొడసం చందూ,విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
సెల్ : 9440902142,