ఆదివాసులను విస్మరిస్తున్న నాగరికత
మానవ సమాజం 21వ శతాబ్దంలో ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించి పోతున్న ఆదివాసీ భాషలు, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధారపడిన ప్రస్తుత తరుణంలో వీరు ఇప్పటికీ సహజవనరులైన భూమి, నీరు, అడవులపై, సంప్రదాయ వ్యవసాయం, ఫలసాయం తదితరాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.చెట్టు,పుట,్టనీరు వంటివాటిని పూజిస్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నారు. స్థిర అభివృద్ధి అనేది వీరి జీవనశైలిలో భాగమైంది. ఇంత గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఆదివాసుల జనాభా, భాష క్రమంగా అంతరించిపోతుండటం ఎంతో బాధాకరం!
త్యాగాల చరిత్ర కనుమరుగు
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారు,పాల్గొ నని వారు కూడా వజ్రోత్సవాల పేరుతో ఎన్ని కల లబ్ధి ఎంత పొందవచ్చు అని మాత్రమే పోటి పడుతున్నారు.విచిత్రం ఏమిటంటే భారత దేశం మీద ఏ విదేశీయులు దాడి చేసినా మొట్టమొదట తిరుగుబాటు జెండా ఎగుర వేసింది స్వేచ్ఛా ప్రియులైన ఆదివాసులే . భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఆది వాసుల పోరాటాల చరిత్రను విస్మరించి నట్లుగనే ఇప్పుడు కూడా మొత్తం ఆదివాసులనే విస్మరిస్తున్నారు .
ఉత్సవాలను పట్టించుకోని పాలకులు
ఐక్య రాజ్య సమితి 1994 నుండి ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని,ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రకటించింది.1995 నుండి ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో ప్రపంచ ఆదీ వాసీ దినోత్సవాన్ని జరుపుకుంటు వస్తున్నారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా90దేశాలలో దాదాపు48కోట్ల మంది ఆదివాసులు ఉన్నారని అంచనా.వారు ప్రపంచ జనాభాలో 5శాతం కంటే తక్కువనే.కానీ పేదలలో 15శాతం ఉన్నా రు.మొత్తం ప్రపంచంలో ఉన్న 7000 భాష లలో ఎక్కువ భాషలు మాట్లాడుతారు.5000 విభిన్న సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇవన్నీ ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థలు మొత్తం ప్రపంచం గురించి ఇచ్చిన అంచనాలు మాత్రమే. పేదరికం ఇంకా ఎక్కువగనే ఉంటుంది. సాంప్రదయక జ్ఞానాన్ని రక్షించడంలోనూ ప్రసారం చేయడంలోనూ ఆదివాసీ మహిళల పాత్ర ఈసంవత్సర ఆదివాసీ దినం యొక్క విషయం. ప్రతి సంవత్సరం ఆదివాసులకు చెందిన ఏదో ఒక విషయాన్ని చర్చించడానికి ఎంచుకుని ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు. మరో వైపు ఆదివాసుల పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు దిగజారుతూనే ఉన్నది .
ఆదివాసీల పరిస్థితి అధ్వాన్నం
మన దేశ విషయానికి వస్తే ఆదీవాసుల పరిస్థితులు మరింత ఘోరంగా ఉన్నాయి . భారతదేశ జనాభాలో ఆదివాసులు దాదాపు 9 శాతం ఉంటే,అందులో 40శాతం పేదరి కంలోనే ఉన్నారని ఒక అంచనా.ఈ పరిస్థితిని సరిదిద్దాల్సింది పోయి ఇప్పుడు కేంద్రంలో అధికారం కలిగి ఉన్న పార్టీ,అసలు ఆది వాసులను,ఆదివాసులుగానే గుర్తించని ఆలో చనతో ఉన్నది.ఆదివాసులను,అడవులలో ఉంటున్న హిందువులే అని చెప్పుతూ వారిని వనవాసులు అని పిలుస్తున్నది. ఇప్పటికే జనభా లెక్కింపు సందర్భంగా చాలా రాష్ట్రాలలో తెలిసీ తెలవక, స్పష్టమైన కోడ్ లెకపోవడం వలన ఆదీవాసులను, హిందువులుగా లెక్కిస్తు న్నారు. దీనితో ఆదివాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతలు కూడా 5వషెడ్యూల్ లోకి రాకుండా పోతున్నాయి. ఆదివాసులకు దక్కాల్సిన అవకా శాలు,హక్కులు,రక్షణలు దక్కకుండా పోతు న్నాయి.1871నుండి1951వరకు జనభా లెక్కలలో స్పష్టంగా మతం కాలమ్లో ఆదివా సులగా గుర్తించే కోడ్ ఉండిరది.కానీ1951 తరువాత జనాభా లెక్కలలో మతం కాలమ్ కింద ఉన్న ఆదివాసుల ఆప్షన్ తీసివేసి, ‘‘ఇతరులు’’అని చేర్చడం జరిగింది.చివరికి 2011 వరకు ఉండిన ‘ఇతరులు’అనే ఆప్షన్ ను కూడా తీసివేశారు.మతం కాలమ్లో ఆరు మతాలనే ఉంచారు.1) హిందూ,2) ముస్లిం, 3)క్రిస్టియన్,4) బౌద్ధులు,5) జైనులు,6) సిక్కులు. జనాభా లెక్కింపులలో ఇలా చేస్తూ వచ్చిన మార్పులతోనే ఆదివాసీల జనాభా తక్కువగా లెక్కించబడుతూ వస్తున్నది. అంటే భారత దేశ ఆదివాసులు అందరూ 6 మతా లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలన్న మాట. విచిత్రం ఏమిటంటే బౌద్ధులు జైనులు కంటే మన దేశంలో ఆదివాసుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నది.కానీ ఆదివాసులకు జనాభా లెక్కలలో తమ మతం గురించి, తమ విశ్వాసాలను గురించి ప్రకటించుకునే, గుర్తించే అవకాశమే ఇవ్వలేదు.ఆదివాసులందరిని హిందువులుగా లెక్కించే కుట్రనే ఇది.అయితే 2019లో 19 రాష్ట్రాలకు చెందిన ఆదివాసులు వారి ప్రతి నిధులు,2021 జనాభా లెక్కింపులో మతం కాలమ్లో ఆదివాసులను గుర్తించే కోడ్ పెట్టాలని డిమాండు చేస్తూ డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేశారు.జార్ఖండ్ అసెంబ్లీ ఈ సందర్భంగానే, జనభా లెక్కింపులో ఆదివాసులను గుర్తించడానికి,ఆదివాసుల మతం అయిన సర్నాను మతం కాలమ్ లో పెట్టాలని తీర్మానం కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వ అంగీ కారం లేకుండా అది అమలు అయ్యే విషయం కాదు. కాని ఆదీవాసులను హిందువులగా మాత్రమే గుర్తించే ప్రభుత్వం వాళ్ళను పట్టించుకోనే లేదు. ఇతర పార్టీలన్ని గట్టిగా కళ్ళు మూసుకుని మౌన వ్రతం పాటించాయి.
మతముద్రకు కుతంత్రాలు
ఇక జరిగేదెమిటంటే,ఆదివాసులు అందరూ హిందువులే కావున వారి ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలు ప్రత్యేక రక్షణలు, హక్కులు అవసరం లేదంటారు. ఇటువంటి రక్షణ చట్టాల వల్లనే ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందడం లేదని ఇప్పటికే కొందరు వాదిస్తున్నారు. అందుకే తెలంగాణా ఆంధ్రాలో1/70చట్టాన్ని ఎత్తి వేయా లని చర్చలు,వాదనలు కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందరం హిందువులమే పేరు మీద ఇటువంటి చట్టలన్నింటిని తుంగలో తొక్కవచ్చు. అంబానీ అదానీలకు ఆదివాసి ప్రాంతాలలోని ఖనిజాలను,ఇతర సంపదలను ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా తరలించుకు పోవడానికి అవకాశం ఏర్పడు తుంది. ఆదివా సులను వారి ప్రాంతాలనుండి తరిమి వేయ వచ్చు. ఇప్పటికే మన దేశంలో కట్టిన పెద్ద ప్రాజెక్టుల వలన గనుల వలన నిర్వాసితులు అయ్యింది 70శాతం మంది ఆదివాసులే. యురేనియం లాంటి గనుల వలన అకాల మరణాలకు గురవుతున్నదీ,అంతుపట్టని రోగా లకు బలి అవుతున్నది ఆదివాసులే. ఒక ప్రణా ళిక లేకుండా ఎటువంటి పర్యావరణ జాగ్రత్తలు తీసుకోకుండా చిత్తం వచ్చినట్లు గనుల తవ్వకా లు చేపడుతూ ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నారు. రోగాలపాలు చేస్తున్నారు. పర్యా వరణ సమస్యలను సృష్టిస్తు న్నారు. అటవీచట్టా లలో పారిశ్రామిక అధిప తులకు అనుకూలంగా సవరణలు చేసి వేల ఎకరాల అడవులను నరికి వేయడానికి అను మతులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి చట్టాలు ఇంకా కొత్తవి చేయడానికి ప్రభుత్వం పూనుకుంటున్నది. ఇవన్నీ ఆదివాసుల అస్తి త్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తుండగా,అన్ని ఇబ్బం దులను ఎదుర్కొంటూ ఆదివాసులు తమ అస్తిత్వం కొరకు రాజీలేని పోరాటం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వారి అస్తిత్వ పోరాటాలకు పునాదే లేకుండా చేయడం కొరకు,జనాభా లెక్కలలో ఆదివాసుల గుర్తింపు నే మాయం చేస్తున్నారు. ఇది వారి మొదటి అడుగు మాత్రమే .
సంఘటితమే హక్కుల రక్షణకు మార్గం
ఆదివాసుల హక్కులను రక్షించడం,విద్య వైద్య సంస్కృతులను అభివృద్ధి చేయడం కొరకే ప్రపంచ ఆదివాసి దినోత్సవాలను జరుపు కుంటున్నట్లుగా ఐక్యరాజ్యసమితి చెప్పు కుంటున్నది.కానీ ముందే చెప్పినట్లు ఆదివాసులు నిర్వాసితులు అవుతుండగా వారి సంస్కృతిపై అన్ని దిక్కుల నుండి దాడి జరుగుతున్నది. ఆది వాసుల భాషల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఆదివా సులలో చాలామందికి వారి మాతృభాష రాకుండా పోయింది.ఏ రాష్ట్రంలో ఏభాష అధికార భాషగా ఉంటే ఆ భాషను ఆ రాష్ట్రం లోని ఆదివాసుల పైన రుద్ద పడుతున్నది. చత్తీస్గఢ్,మధ్యప్రదేశ్లో ఆదివాసీలపై హిందీ రుద్ద పడుతున్నది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు రుద్ద పడుతున్నది.ఒరిస్సాలో, ఒడియా రుద్ద పడుతున్నది.భారతదేశం అంతటా పరిస్థితి ఇదే విధంగా ఉన్నది.కనీసం1980 వరకు మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోనూ కొన్ని ఇతర రాష్ట్రాల లోనూ హిందీ లిపిలోనే అయినా,ఆదివాసులకు ప్రాథమిక విద్య వారి మాతృభాషలోనే బోధించ బడిరది.కానీ తరువాత అది కూడా ఎత్తి వేశారు.ఇప్పటికే భారతదేశంలో ఎన్నో ఆది వాసుల భాషలు అంతరించి పోయాయి. మిగిలిన ఆదివాసి భాషలు కూడా అంతరించి పోయే పరిస్థితిలో ఉన్నాయి.విద్య,ఆరోగ్యం విష యంలో ఈ రోజుకు కూడా ఆదివాసీ ప్రాంతా లు వెనకపడే ఉన్నాయి. సులువుగా తగ్గించ గలిగే మలేరియా వైద్యాన్ని కూడా సరిగా అందించపోవడం వలన ప్రతి యేడు ఆది వాసులు చనిపోతునే ఉన్నారు. ఇక, ఒక ప్రాం తంలో ఒకప్పుడు ఆదివాసులు ఉండే వారని గుర్తించడానికి కూడా వీలు లేకుండా వారి గుర్తులు అన్నింటినీ కూడా తుడిచివేయ చూస్తున్నారు. ప్రాంతాల పేర్లను గ్రామాల పేర్ల ను మనుషుల పేర్లను నదుల పేర్లను చివరికి కొండల పేర్లను అన్నింటినీ అన్నింటిని మార్చి వేస్తున్నారు. మరో వైపు ఆదివాసుల మతం మార్చడానికి వివిధ మత సంస్థలు, ముఖ్యంగా క్రైస్తవ,హిందూ సంస్థలు పోటీ పడి పని చేస్తు న్నాయి. చివరికి ఈ మత సంస్థలు ఆదివాసులను కులాలుగా చీల్చుతున్నాయి. ఏ కులంలోకి మతంలోకి వెల్లని ఆదివాసులను అంటరానివారుగా చూస్తున్నారు,మారుస్తు న్నారు.మొత్తంగా ఆదివాసీ సమాజాన్ని ధ్వసం చేయడానికి కార్పోరేట్ వర్గాలు,పాలకవర్గాలు, పార్టీలకు అతీతంగా ఒక్కటై పని చేస్తున్నాయి. ఆదీవాసి సమాజం కూడా పార్టీలకు,మతాలకు అతీతంగా ఐక్యం అయ్యి తమ అస్తిత్వం కొరకు ఒక్కటిగా పోరాడాల్సి ఉంది.అప్పుడే ఆదివాసి సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకో గలుగు తుంది.
కొండెక్కుతున్న గిరిజన సంస్కృతులు
మానవ సమాజం 21వ శతాబ్దంలో ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించి పోతున్న ఆదివాసీ భాషలు, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధార పడిన ప్రస్తుత తరుణంలో వీరు ఇప్పటికీ సహజవనరులైన భూమి, నీరు, అడవులపై, సంప్రదాయ వ్యవసాయం, ఫలసాయం తదిత రాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.చెట్టు,పుట,్టనీరు వంటివాటిని పూజి స్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్ప రచుకున్నారు. స్థిర అభివృద్ధి అనేది వీరి జీవన శైలిలో భాగమైంది. ఇంత గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఆదివాసుల జనాభా, భాష క్రమంగా అంతరించిపోతుండటం ఎంతో బాధాకరం!
ఐక్యరాజ్య సమితి చొరవ
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచంలో 47.60కోట్ల ఆదివాసులు సుమారు 20 దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచంలో వీరి జనాభా సుమారు ఆరు శాతం. ఏడు వేలకు పైగా భాషలు, అయిదు వేలకు పైగా సంస్కృతులు వీరి సొంతం. యునెస్కో అంచనాల ప్రకారం ఈ శతాబ్దం చివరకు సుమారుగా మూడు వేలకు పైగా అంటే నలభై భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇంతటి అసాధారణ చరిత్ర, సంస్కృతి, భాషలు కలిగిఉన్న ఆదివాసులను కాపాడుకునేందుకు ప్రజల్లో చైతన్యం పెంచేం దుకు ఐక్యరాజ్య సమితి ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినంగా నిర్వహిస్తోంది.2019ను అంతర్జాతీయ ఆదివాసీ భాష సంవత్సరంగా,2022-2032 కాలాన్ని అంతర్జాతీయ ఆదిమ భాషల దశాబ్దంగా ప్రకటించడం ద్వారా వీరి సంస్కృతులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ప్రపంచానికి చాటింది. ఆదివాసుల భాష, వారి సంస్కృతి సంప్రదా యాలను భావితరాలకు అందజేయాల్సిన అవసరం ఈ తరంపై ఉంది. ఈ భాషలకు లిపి లేదు.మరో తరానికి అవి మౌఖికంగానే బదిలీ అవుతున్నాయి. ప్రపంచీ కరణ యుగంలో వచ్చిన సాంకేతిక విప్లవం, ఆధునికత,సైనిక ఆక్రమణలుబీ సామాజిక, ఆర్థిక,రాజకీయ,మతపరమైన అణచివేతలుబీ ఇతర బాహ్య కారణాలు,ఆత్మన్యూనత వంటి అంతర కారణాలవల్ల ఈ భాషలు క్రమక్ర మంగా అంతరిస్తున్నాయి. వీటి ప్రభావం వారి అస్తిత్వంపై ప్రభావం చూపడమే కాకుండా, దీంతో ముడివడిన ఆచారాలు, కట్టుబాట్లు, ఆహారపుటలవాట్లు,సంప్రదాయాలు మొదలైనవీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. యునెస్కో- ప్రపంచంలోని 6,912 భాషల్లో 2473 భాష లు వివిధ రూపాల్లో కనుమరుగు అవుతున్నా యని అంచనా వేసింది.భారత్లో10.45కోట్ల ఆదివాసులు(130 కోట్ల దేశజనాభాలో 7.5 శాతం)ఉన్నారు.700కు పైగా విభిన్న జాతు లున్నాయి. యునెస్కోకు చెందిన ‘అట్లాస్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజెస్’ ప్రకారం ఇండియా 197 భాషలతో మొదటిస్థానంలో ఉంది.అమెరికా 192 భాషలతో, ఇండొనేసియా147భాషలతో తరవాతి స్థానాలను ఆక్రమించాయి. ఇటీవలి కాలంలో అండమాన్ ద్వీపంలో నివసించే ‘గ్రేట్ అండమానీస్’ ప్రధాన భాష అక-జెరు-తం బొల అనే వ్యక్తి మృతితో అంతరించిపోవడం బాధాకరం.జరావా,సెంటీనేలే,షోపెన్,ఓనగీ, బిరహోర్,గదబా,పహరియా,బొండోలు మాట్లా డే భాషలూ అంతరించే దశలో ఉండటం ఆందోళనకరం.
యుద్ధప్రాతిపదికన చర్యలు
ఆదివాసుల సంరక్షణ, అభివృద్ది కోసం రాజ్యాంగంలోఆర్టికల్ 16(4),46,275,330, 332,243డి,5,6షెడ్యూళ్ల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉండే గవర్నర్లకు విచక్షణ అధికా రాలను కల్పించారు. వీటిని ఉపయోగించి జాతీయ, రాష్ట్ర చట్టాలను క్షుణ్నంగా పరిశీలించి, వాటివల్ల ఆదివాసుల సంస్కృతికి ఏమన్నా ముప్పు సంభవిస్తే, వాటిని ఆపే హక్కు ఉంది. అయితే గిరిజనేతరుల ఆశయాలమేర చట్టాలు అమలు పరుస్తుండటం దురదృష్టకరం. వివిధ రాష్ట్రాల్లోని గిరిజన మంత్రిత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వంటివి నిరంతరం పనిచేస్తున్నప్పటికీ- వారి భాషను, సంస్కృతులను కాపాడలేకపోతున్నాయనడానికి అంతరిస్తున్న భాషలే నిదర్శనం. వీటి సంరక్షణ కోసం మానవ వనరుల శాఖ 2013లో అంతరించే భాషల సంరక్షణ, పరిరక్షణ పథకాన్ని భారతీయ భాషల సంస్థ, విశ్వవిద్యాలయాలు, భాష పరిశోధన సంస్థల సమన్వయంతో ప్రారంభించింది. ప్రమాదపుటంచున ఉన్న భాషలను గుర్తించి వాటిని సేకరించి భద్రపరచడం (డాక్యుమెంట్) ఈ పథకం ప్రధాన ఉద్దేశం. గిరిజనుల భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం దేశంలో గిరిజన విశ్వవిద్యా లయాలను, సాంస్కృతిక కేంద్రాలను యుద్ధప్రాతి పదికన ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు, భారత్ కూడా ఆదిమ భాషలను కాపాడుకోవడం కోసం మాతృభాషను తప్పనిసరి చేస్తూ 2020 నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. గిరిజన భాషల లిపి తయారు చేయడం,వాటిని భారత రాజ్యాం గంలో పొందుపరచడం వంటి చర్యల ద్వారానే ఆదివాసీ సంస్కృతి, భాషలను కాపాడగలు గుతాం.తద్వారా భారత జాతి గొప్పతనాన్ని భావితరాలవారికి అందించాలి!-(లంకా పాపిరెడ్డి/డాక్టర్ డి.వి.ప్రసాద్)