ఆదివాసులకు తీరని ద్రోహం
టూరిజం అభివృద్ధి పేరుతో‘విజన్ 2047’లో భాగంగా 1/70 చట్ట సవరణకు రాష్ట్ర కుటమి ప్రభు త్వం రంగం సిద్ధం చేస్తున్నది.ఇటీవల జరిగిన టూరిజం ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లా డుతూ ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం హోటళ్లు,రెస్టారెంట్లు, పార్కులకు పెట్టు బడులు పెట్టాలంటే 1/70 చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వం,అధికార యంత్రాంగం లోతైన అధ్య యనం చేయాలని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర ద్రోహం చేయడమే. పైగా షెడ్యూల్ ఏరియా లో టూరిజం అభివృద్ధికి 1/70చట్టం అడ్డంగా ఉందని,చట్టం సవరించాలని కూడా అయ్యన్న పాత్రుడు పేర్కొనడం వ్యక్తిగత అభిప్రాయమో లేక కూటమి ప్రభుత్వ విధానమో స్పష్టం చేయడం అవసరం. 2000 సంవత్సరంలో నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాడేరు ఏజెన్సీలోని చింతపల్లి జర్రేలలో ఉన్న 515 మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలకు దుబారు కంపెనీతో ఒప్పందం చేసుకుని గిరిజన సలహా మండలిలో 1/70 చట్టం సవరించడానికి పూనుకున్నారు. అప్పటి సిపిఎం భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య మాత్రమే 1/70 చట్టం రక్షణకు నికరంగా నిలబడ్డారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నిలబడి అధికారం వచ్చిన వెంటనే 2006లో ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి రూ.8000 కోట్లతో రాస్ ఆల్ ఖైమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివాసి గిరిజన సంఘం, వివిధ ఆదివాసీ సంఘాలు,సిపిఎం,వామపక్ష పార్టీల అండతో చేసిన సుమారు 20ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలు రద్దు చేయడమైనది.1/70 చట్టం అమలులో ఉండగానే అరకు,పాడేరు,చింతపల్లి,రంపచోడవరం, జీలుగు మిల్లి,పార్వతీపురం,మన్యం జిల్లాలో,ఇతర ప్రాంతా లలో బినామీ పేర్లతో లాడ్జీలు,షాపింగ్ కాంప్లెక్సు లు,రిసార్టుల నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతు న్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లి,ఎర్రవరం, పెదకోట,మన్యం జిల్లా సాలూరు,అనకాపల్లి జిల్లా చింతలపూడి దగ్గర హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్,ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకాయవారిపాలెం దగ్గర ఆయుధ కర్మాగారం నిర్మాణానికి 1/70చట్టం ఉల్లంఘించి ఒప్పందం చేసుకుని వేల ఎకరాల భూములు,అడవులు ధారాదత్తం చేస్తున్నది.ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో 3000ఎకరాల పరిధిలోని అదాని ఆయుధ కర్మాగారం నిర్మాణానికి ఆదివాసీల హక్కులను ఉల్లంఘించి నిర్మాణం ముమ్మరం చేసింది.గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఆదివాసీల హక్కులను ధ్వంసం చేస్తున్నది. 1970లో ఆదివాసీల పోరాట ఫలితంగా ఆదివాసీ అభివృద్ధి కోసం 1/70చట్టాన్ని సాధించాం.నేడు పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం ఆ చట్టాన్ని సవరించేందుకు కుట్ర చేస్తున్నారు. షెడ్యూల్ ప్రాంత చట్టమైన 1/70లో కలుగచేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.షెడ్యూల్ ప్రాంతంలో చట్టాలు చెయ్యాలన్నా తొలగించా లన్నా రాష్ట్రపతికే అధికారం ఉన్నది.షెడ్యూల్ ప్రాంతంలో గ్రామసభ అధికారాలు,కేంద్ర అటవీ పర్యావరణ చట్టాన్ని సవరించి షెడ్యూల్ ప్రాంతంలో విస్తృతమైన అధికారాలు ఉన్న పీసా చట్టం అధికారాలు, 2006 వామపక్షాలు ఒత్తిడితో తెచ్చిన ఆటవీ హక్కుల చట్ట అధికారాలు ఇటీవలి కేంద్ర బిజెపి ప్రభుత్వం తొలగించింది.ఆ అంశా లనే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. కేంద్ర బిజెపి, రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను తొలగించేందుకు చేస్తున్న కుట్రలను ఆదివాసీలు తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
అరకు ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు జీవో నంబర్ 3చట్టబద్ధతకు హామీనిచ్చి ఏడు నెలలు గడిచినా అతీగతీ లేదు.ఎన్నికల హామీ ప్రకారం ఏజెన్సీ షెడ్యూల్ ఏరియాలో100శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక సాధనకు,ఏజెన్సీ స్పెషల్ డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదలకు పోరాటం చేస్తున్న ఆదివాసీల సమస్యలను పరిష్కరించనే లేదు.పైగా ఆదివాసీ భూములకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదివాసీలతో పాటు అందరం ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాల్సి వుంది.
స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యాలపై నిరసన గళం..
ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించడాన్ని రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నిరసన సెగలు రేకెత్తించాయి.ఒక రాజ్యాంగ బద్దమైన పదవులో ఉండి గిరిజనులకు రాజ్యాం గం కల్పించిన రక్షణ చట్టాలను సవరించడం అనడంపై గిరిజనవర్గాలు భగ్గుమంటున్నాయి. అల్లూరి,పార్వతీపురం మన్యం జిల్లా ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తున్నాయి.
పార్వతీపురం: బెలగం కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణ మూర్తి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు పాలమిట్ట రాము మాట్లాడుతూ ఆదివాసీ భూము లకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్బం దీగా అమలు చేయాలని కోరారు. జనవరి 27వ తేదీన విశాఖ పట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ అల్లూరి సీతారామ రాజు,ఏలూరు,పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ రాజ్యాంగంలో 5వ షెడ్యూలు కిందకు వస్తుందని తెలిపారు.దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని,వీటిని వెంటనే అరికట్టాలని కోరారు. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నా రని విమర్శించారు.ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని, ఏజెన్సీలో లభించే సహజ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుండో పలు పథకాలు వేస్తోందని వివరించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు దీన్ని మరింత బలపరుస్తున్నాయని, 1/70 చట్టం 1970లో పెద్దఎత్తున జరిగిన ఆదివాసీ పోరాటాల ద్వారా సంపాదించుకున్నారని తెలిపారు. ఈ చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చిందని, 2006-07లో కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభు త్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చాయని వివరిం చారు. భూమిపై గిరిజనులకు హక్కులను ఈ చట్టం మరింత బలోపేతం చేసిందని, మోడీ ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించి గిరిజనుల నుండి భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. పంప్డ్ స్టోరేజీ హైడల్ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలను ఈ ప్రాంతంలో ఆదానీ పరం చేస్తున్నారు.
1/70 చట్టం జోలికొస్తే ఖబడ్దార్!
పాడేరు: ఏజెన్సీలో గిరిజన చట్టాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పదని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మండిపడ్డారు.1/ 70 చట్టం అమలులో సడలింపులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ పట్నంలో నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడి దారుల సదస్సులో అసెంబ్లీ స్పీకర్‌అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిరచించారు.రిజన ప్రాంతంలో 1/70చట్టం సవరణ ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయని స్పీకర్ వ్యాఖ్యలు చేయడం సరికాద న్నారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉండి, గిరిజనులకు హానికలింగేలా స్పీకర్ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. స్పీకర్ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిగానే ఆదివాసీ సమాజం భావిస్తున్న నేపథ్యంలో దీనిపై తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి పర్యాటక రంగం ద్వారానే ్షధ్యమనే తప్పుడు అభిప్రాయంలో కూటమి పాలకులు ఉన్నారని మండిపడ్డారు. ఏజెన్సీలోని సహజ వనరులు, సంపదను కార్పొరేట్ కంపెనీలో అప్పగించే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. 1/ 70 అమలులో నిర్లక్ష్యం వల్లే ఇప్పటికే వందలాది ఎకరాలను టూరిజం పేరిట ఆక్రమించారని, ఇపుడు చట్టాన్ని సడలిస్తే మన్యం మొత్తంగా ఆదివాసీలకు దూరమై కార్పొరేట్ల పరమౌతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ హక్కులను, ఆదివాసీచట్టాలను ధిక్కరించడమే అవుతుందన్నారు.ఏజెన్సీలో యువతకు ఉపాధి అవకాశాలు, చిన్నతరహా పరిశ్రమలను ఐటిడిఎ ద్వారా ఏర్పాటు చేయాలని కోరారు.మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అడ్డుగా ఉందని 1/70చట్టానికి సవరణలు చేయాలని నాటి టిడిపి ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అప్పట్లో ఉన్న ఒకేఒక సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా వ్యతిరేకించడంతో అడ్డుకట్ట పడిరదని గుర్తు చేశారు. మన్యవాసుల మనుగడకు నష్టం కలిగించే ఇటువంటి కుట్ర పూరిత విధానాలకు ప్రభుత్వాలు స్వసి చెప్పాలని హితవు పలికారు.పర్యాటకాభివృద్ధి ముసుగులో 1/70 చట్టం సవరణ తగదు.
అరకులోయ: ఆదివాసి ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందాలంటే హోటళ్ళు,రెస్టారెంట్లు, పార్కులు నిర్మాణం కోసం 1/70 చట్టానికి సడలింపులపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ ధర్మన్న పడాల్ పొద్దు బాలదేవ్ తీవ్రంగా ఖండిర చారు. అయ్యన్న ప్రకటన ఆదివాసి హక్కులు, చట్టాలకు తీవ్రమైన విఘాతం కలిగిం చేలా ఉం దని, ఆదివాసులకు ద్రోహం చేసే ఇటు వంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయ్యన్న వ్యాఖ్యలపె ్కఆదివాసీల ఆందోళన
హక్కుంపేట :టూరిజం అభివృద్ధి పేరుతో 1/70 చట్టం సవరణ చేయాలని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించడం ఆదివా సుల హక్కులు చట్టాలకు తీవ్ర విఘాతం కలిగిం చడమే కాకుండా మన్యవాసులకు ద్రోహం చేయడమేనని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండిపడ్డారు.. ఆదివాసీ అభివృద్ధి అంటే హోటళ్లు,రిసార్ట్స్ నిర్మాణం కాదని, కాపీ, చింతపండు, అడ్డాకులు వంటి గిరిజన అటవీ వాణిజ్య ఉత్పత్తులకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, జిఒ3 ప్రయోజ నాలను పునరుద్ధరించి, శతశాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో హక్కుంపేట,అరకులలోని శరభగుడలో నిరసన చేపట్టారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండల నాయకులు కిల్లో జగన్నాధం మాట్లాడుతూ, ఆదివాసులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టం సవరణ చేస్తే షెడ్యూల్ ప్రాంతంలోని అడవీసంపద, గనులు, ఖనిజాలు, ప్రకృతి అందాలన్నీ బడా పెట్టుబడి దారులు కార్పొరేట్ కంపెనీల పరమౌతాయని, ఆదివాసుల జీవన విధానం, మనుగడ ప్రశ్నార్థర మౌతుందని ఆవేదన వెలిబుచ్చారు ఆదివాసీల హక్కుల పరిరక్షణలో గుండెకాయలాంటి 1/70 చట్టంపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీలకు ఉపాధి కల్పించే టూరిజం కావాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు టూరిజం ప్రమోట్ చేసే భాగంగా దేశ, విదేశీ యాత్రికులను ఆకట్టు కునేందుకు టూరిజంశాఖ ఆధ్వర్యంలో చలి ఉత్సా వాలు నిర్వహిస్తున్నది. ఇందుకోసం కోట్ల రూపా యల ఖర్చుకు సిద్ధం అవుతున్నది.ఆదివా సులకు కావాల్సింది చలి ఉత్సవాలు కాదు.జీవో నెం.3కు చట్టబద్ధత కల్పిస్తూ ఏజెన్సీ స్పెషల్ డిఎస్‌సి నోటిఫ ికేషన్ విడుదల చేసి అరకు చలి ఉత్సవాలు నిర్వహించాలి. చలి ఉత్సవాల పేరుతో టూరిస్టు లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కన్నా చలి కాలంలో పాడేరు ఏజెన్సీలో సున్నా డిగ్రీల చలికి వణుకుతున్న 50 వేల మంది ఆదివాసీ హాస్టల్ విద్యార్థినీ విద్యార్థులకు చలి దుప్పట్లు పంపిణీ చేయాలి. ఆదివాసీలకు ఉపాధి కల్పించేలా టూరిజాన్ని అభివృద్ధి చెయ్యాల్సింది పోయి వారి సంస్కృతిని నాశనం చేసే విధంగా టూరిజాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. బినామీ పేర్లతో పెద్దపెద్ద లాడ్జీలు, రిసార్ట్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి వందలాది ఎకరాల ఆదివాసీల భూములను ధారాదత్తం చేస్తూ 1/70చట్టానికి తూట్లు పొడుస్తున్నది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా రోజురోజుకు అక్రమ కట్టడాలు పెరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదు. సోమవారం నాడు విశాఖలో జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్ సదస్సులో పెట్టుబడు లను ఆకర్షించేందుకు 1/70 చట్టాన్ని సవరించా లని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదించడం దారుణం.ఈ విషయ మై అధికారులు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని కూడా చెప్పారు. అంటే 1/70ని మార్చి వేయాలన్నదే వారి నిశ్చితాభిప్రాయంలా వుంది. గిరిజనుల మనుగడకు ప్రమాదకరమైన ఈ ప్రయ త్నాలను గట్టిగా వ్యతిరేకించాలి.టూరిజంలో వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులను స్థానిక ఆది వాసీ అభివృద్ధికి ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది. అయినప్పటికీ బేఖాతరు చేస్తూ చలి ఉత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఏజన్సీ ప్రాంతంలో రోడ్లు, వంతెనలు లేనందున గర్భిణీలు,రోగులను హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్సులు రావడంలేదు.డోలీ మోతలతో మార్గ మధ్యలోనే మరణిస్తున్నారు. మరోవైపు సరైన పౌష్టికాహారం లేక రక్తహీనత, సికిల్ సెల్ ఎనీమియా,టైఫాయిడ్,మలేరియా తదితర వ్యాధు లతో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. వారి కోసం సరైన సదుపాయాలు కల్పించకపోగా ఆదివాసుల ప్రకృతి అందాలు చూపించి కోట్ల రూపాయల ఆదాయాలు పోగేసుకుంటూ దేశ, విదేశీ టూరిస్టులకు కోట్లు ఖర్చు పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఆదివాసీ యువతకు వంద శాతం ఉద్యోగావకాశాలు కల్పించే జీవో నెం 3 రద్దవడంతో గంజాయి సాగు మాయలో పడి జైలు పాలౌతున్నారు. ఏజన్సీలో ఉపాధి అవకాశాలు లేక మైదాన ప్రాంతాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లి ఇటుక బట్టీల్లో, చేపలు, రొయ్యల చెరువుల్లో పనికి కుదిరి వంద లాది మంది మోసపోతున్నారు.ఆదివాసీల కళలు, సంస్కృతి రక్షణకు ఉత్సవాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడంలేదు.పైగా వారి సంస్కృతి నాశనమయ్యే విష సంస్కృతిని ప్రమోట్ చెయ్యడంతో భవిష్యత్‌లో ఆదివాసీల హక్కులకు, వారి అస్తిత్వానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. ఆదివాసీ సమాజం, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడ్డానికి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.పాడేరు ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రా, ట్రైబల్ మ్యూజియం, పద్మపురం గార్డెన్, చాపరా యి, కొత్తపల్లి జలపాతం నుండి ఏడాదికి సుమారుగా రూ.20కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం నిధులు స్థానిక ఆదివాసుల అభివృద్ధికి, విద్యా వైద్యం మౌలిక వసతులపై ఖర్చు పెట్టడం లేదు. మరోవైపు టూరిస్టులకు కోట్లు ఖర్చు చెయ్యడం ఆదివాసులకు తీవ్ర అన్యాయం చెయ్యడమే అవుతుంది. ఆదివాసీల సంస్కృతి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాల పరిరక్ష ణకు,టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం స్థానిక ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయించడం కోసం,జీవో నెం.3చట్టబద్ధత కోసం,ఏజెన్సీ స్పెషల్ డిఎస్‌సి నోటిఫికేషన్ సాధించుకునేందుకోసం ఆదివాసీలు ముందుకు రావాలి.- కిలో సురేంద్ర