ఆదివాసీ సుపరిపాలన గ్రామసభల ద్వారానే సాధ్యం!

ఆదివాసీలు అధికంగా జీవిస్తున్న చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రంలో పీసాచట్టం((పంచాయితీరాజ్‌షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం1996) పారదర్శకంగా అమలు పరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఆ ప్రభుత్వం అడుగులేస్తోంది. పీసాచట్టం రాజ్యాంగం అంతర్భాగంగా వచ్చిన ఈచట్టం ద్వారా గ్రామసభకు విశేషాధికారాలను కట్టబెట్టేందుకు కృతనిశ్చయంతో పరిపాలన సాగిస్తుండటం ప్రశంసనీయం. ఆదివాసుల ఆత్మబంధువులైన ఐఏఎస్‌ అధికారులు బీడీశర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా స్పూర్తితో ఆ రాష్ట్రప్రభుత్వం గ్రామసభ సంపూర్ణ అధికారాలను అందించి ప్రజలకు మంచిపాలన అందించడానికి కృషి చేస్తోంది. ‘‘ మావూళ్లో..మారాజ్యాం..,హైదరాబాద్‌..ఢల్లీిలో మన రాజ్యాం’’ అనే నినాదాన్ని తీసుకొచ్చిన ఆనాటి ఐఏఎస్‌ అధికారి బీడీ శర్మ ఆశయాన్ని నేడు రాష్ట్రంప్రభుత్వం గ్రామసభకు ప్రాముఖ్యత ఇస్తోంది.బీడీశర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో గ్రామస్వరాజ్యాన్ని స్థాపించి ఆదివాసుల సుపరిపాలన కోసం పాటు పడ్డారు. 75వ రాజ్యాంగ సవరణ ద్వారావచ్చిన పీసాచట్టాన్ని 25ఏళ్లక్రితం పార్లమెంటు ఆమోదించింది. పార్లమెంటు,రాజ్యసభ,అసెంబ్లీ,జిల్లా, బ్లాక్‌,పంచాయితీల స్థాయిలో గ్రామసభకు అధికారం ఇవ్వాలి.ఇది సమత జడ్జెమెంటు కూడా స్ఫస్టం చేసింది.
ఇటీవల కాలంలో ఛత్తీష్‌ఘఢ్‌ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన,సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్రబిదువుగా మార్చారు. స్టేట్‌ ప్లానింగ్‌ తరుపున వివిధ అంశాలపై టాస్క్‌పోర్సు నియమించింది. పీసా చట్టం,పరిపాలన విధానం,పునరావాసం,సాంకేతిక పరిజ్ఞానం ఆదివాసులకు అందించడానికి కమిటీని సిపార్సులు చేసింది. ఇక్కడ గిరిజన జనాభా ఎక్కువకావడం,అలాగే పరిపాలన అధికార యంత్రాంగం కూడా అధికశాతం గిరిజనతెగలకు చెందిన ఉద్యోగులు ఉండటంతో ఈరాష్ట్రంలో గ్రామసభకు ప్రాధాన్యత సంతరించుకుంది.వీరంతా కలసి సర్వ ఆదివాసీ సమాజ్‌ కింద ఒకసమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. దానిద్వారా వారి సంస్కృతి సంప్రదాయాలు,కట్టుబాట్లును పరిరక్షించుకుంటూ వస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారి ఆచార సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఉండాలంటే గ్రామసభ మూలాధారమని భావించారు. ఈ దశగా రెండేళ్ల నుంచి పీసా చట్టానికి అనుగుణంగా పాలన సాగాలని ఆకాంక్షస్తున్నారు. ఈనేపథ్యంలోనే ్ద రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ ద్వారా రాష్ట్ర,జిల్లా,బ్లాక్‌ల స్థాయిలో పీసా చట్టాన్ని సంపూర్ణంగా అమలు పరచి గ్రామసభకు విశిష్ట అధికారాలను కట్టబెట్టడానికి కృషిచేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా ఆదివాసీ సమూహానికి అనుగుణంగా గ్రామసభకు విలువనిస్తోంది.
పీసా చట్టం ప్రకారం గ్రామసభకు సామాజిక,ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలలో లబ్ధిదారులను గుర్తించే అధికారం ఉంది. పంచాయతీ పరిధిలోగల పాఠశాలలు,హెల్త్‌ సబ్‌ సెంటర్లు, మంచినీటి పథకాలు,ప్రభుత్వసంస్థల పనితీరును సమీక్షించి,తగు సూచనలు, సిఫారసులు చేసే అధికారం గ్రామసభలకు ఇచ్చింది. పీసా గ్రామసభలు చేసిన తీర్మానాలను ప్రభుత్వ అధికారులుగుర్తించి,తగిన చర్యలు తీసుకోవాల్సిఉంది. దాంట్లో భాగంగా గ్రామాల్లో మహిళా సార్ధకతకోసం మహిళలసభ, బాలల పరిరక్షణ కోసం బాలలసభ, గ్రామంలోఉన్న వనరుల పరిరక్షణ (అడవి,నీరు,భూమి) వంటి వాటిని పర్యవేక్షించే కమిటీలు,గ్రామాల్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా నియంత్రించేందుకు శాంతియుత`న్యాయ కమిటీలు,గ్రామానికి నిధులు సమీకరణ,సంస్కృతి,సంప్రాదాయాలు పరిరక్షించే పద్దతులపైగ్రామసభల ద్వారా కమిటీలను నియమించి పర్యవేక్షించడానికి తగు చర్యలు తీసుకుంటోంది. మొత్తానికి గ్రామంలో గ్రామసభకు పరిపాలనాధికారం,నియంత్రణపట్ల ఆజమాయిషీ అధికారం కలిగి ఉంటాయి.చిన్నచిన్నఖనిజాలపై గ్రామసభ పర్యవేక్షించే అధికారం కూడా ఉంటుంది.
ఇలాంటి శుభపరిణంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,పీసాచట్టం గ్రామసభ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడానికి ఆనాడు ఐఏఎస్‌ అధికారులు బీడీ శర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీఫ్‌సింగ్‌ భూరియా స్పూర్తి,వారి ఆశయాలు,లక్ష్యాలను నేడు ఛత్తీషఘఢ్‌ ప్రభుత్వం నెరవేర్చడానికి కృషి చేయడం అభినందనీయం. పీసాచట్టంగ్రామసభలకు విశేషాధికారాలు అప్పగించడం ద్వారానే ఆదివాసీలకు సుపరిపాలన అందివ్వగలమనే వారి ఆశయం నిజం కాబోతుంది. చత్తీష్‌ఘఢ్‌ ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన నిర్ణయాలతో క్షేత్రస్థాయి ఆదివాసీ సమాజంలో గ్రామస్వరాజ్యం సాధించబడుతుందడనడంలో ఎలాంటి సందేహం లేదు! – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌