ఆదివాసీ దీనావస్థ
గిరిజన జీవితం అడవికే అంకితం. అడవిపైనే వారి బతుకు ఆధారపడి ఉంటుంది. అక్కడే భూములను సాగుచేసుకుంటారు. భూసారం క్షీణిస్తే మరోచోట అడవిని కొట్టి కొత్తగా భూములు సాగులోకి తెస్తారు. దీనినే పోడు వ్యవసాయం అంటారు. ప్రభుత్వం కొన్ని విధా నాలతో అటవీ శాఖ సిబ్బందిచే దాడులు చేయించడంతో దాదాపుగా పోడు వ్యవసాయం తగ్గిపోయింది. ఉన్న భూముల్లోనే సంప్రదాయ వ్యవసాయం సాగిం చడం పరిపాటిగా వస్తోంది. కానీ ఆవ్యవసాయం చేసుకోడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. వారు ఎక్కడ నివాసాలు ఏర్పరుచుకుని సాగు చేసుకొంటే అక్కడకు వెళ్లి వారి గూడే లను కూల్చివేసి పంటలను ధ్వంసం చేస్తుంటారు.
అటవీ సిబ్బంది ఆగ డాలకు అడ్డూఅదుపు ఉండదు. అడ్డు వచ్చిన వారిపై కేసులు పెడతారు. నిలదీసిన వారిని మహిళలు, పిల్లలు, వృద్ధులు అని చూడ కుండా లాఠీలతో దౌర్జన్యానికి దిగుతుం టారు. విశాఖ ఏజెన్సీలో అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు కూడా జరిగాయి. తెలం గాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల అటవీ ప్రాంతంలో అదే జరిగింది. అటవీశాఖ సిబ్బంది ట్రాక్టర్లు, బుల్డోజర్లు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. చట్టం తమ చేతిలో ఉన్నంత మాత్రాన ఈ విధంగా పశుబలం ప్రదర్శించడం మానవత్వమా?అదివాసీల హక్కులను ఉక్కుపాదంతో తొక్కివేసే హక్కు ఎవరిచ్చారు? తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలు తీరుతాయని, బంగారు తెలంగాణ సాక్షాత్కరి స్తుందని కలలు కన్న పీడిత తాడిత గిరిజనానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రతిఫలం ఇదేనా? గత పదేళ్లుగా పోడు వ్యవసాయం చేసుకొంటూ పోట్టపో షించుకొంటున్న గుత్తికోయల కుటుంబాలపై అటవీ శాఖ దాడులు జరిపివారి గుడెసెలను కూల్చివేయడం, గిరిజన మహిళలను చెట్టుకు కట్టివేయడం, అడ్డువచ్చిన వారిని లాఠీలతో చావమోదడం ఈబీభత్సకాండ దాదాపు రెండు గంటలపాటు సాగడం గిరిజన ప్రజల్లో నెత్తురును ఉడికిస్తోంది. అడవిని నమ్ముకునిజీవిస్తున్న అడవిపుత్రులపై దమనకాండ విభ్రాంతి గొల్పింది. లవ్వాల అటవీ ప్రాంతం శనివారం మధ్యాహ్నం గొత్తికోయలు, అటవీ సిబ్బంది మధ్య రణరంగంగా మారింది. ఆప్రాంతం ఖాళీ చేయాలని మరోచోట నివాసం కల్పిస్తా మని రెండు నెలలుగా చెబు తున్నా నోటీసులు జారీచేస్తున్నా మొండి కెత్తడంతో దాడులకు పూను కోవలసి వచ్చిందని అటవీశాఖ సమర్థించు కుంటోంది.అయినా ఇంత దారుణంగా మూకుమ్మడిగా దౌర్జన్యానికి పాల్పడడం వారిని నిరాశ్రయులు చేయడం,పంటలను ధ్వంసం చేయ డం కేవలం బలదర్పమే తప్ప గిరిజనులకు మేలు చేయడానికి కానే కాదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కొంతకాలంగా అడవ్ఞల్లోని గొత్తికోయ గూడేలను అటవీశాఖ బలవంతంగా ఖాళీచేయిస్తోంది.గత కొన్నాళ్లుగా గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం ప్రాంతా ల్లో ఈ విధంగా తరచుగా దాడులు జరుగుతున్నాయి. ఆదాడులన్ని టికన్నా ఈదాడి చాలా ఘోరం.
దాదాపు 125 కోట్ల జనాభా గల భారతదేశంలో గిరిజన, దళిత తెగలకుసంబంధించి రాజ్యాంగంలోని అయిదు, ఆరు షెడ్యూలు అంశాలను పొందుపరిచినా ఆదివాసీలకు తగిన న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు, డ్యామ్‌ల నిర్మాణం, గనుల తవ్వకం,నగరీకరణ కారణం గా గిరిజనులు నిరాశ్రయులవు తున్నారు. ఆదివాసీలకు స్వయంపాలన కల్పించాలని కొన్నేళ్లుగా కొన సాగుతున్న డిమాండ్ నెరవే రకపోగా లాఠీలనురaుళిపించి మహిళలను చెట్లకు కట్టివేసి గూండాగిరి సాగించడం ఎంతవరకున్యాయం? ఐక్యరాజ్యసమితి ఆదివాసీల వారసత్వపు హక్కులు, అటవీవనరులు, ఇతర సమస్యలపై 1982 ఆగస్టు9న జెనీవాలో సదస్సు నిర్వహిం చింది. ఆదివాసీల సమస్యలపై చర్చించింది. అంతేకాదు ఒక కమి టీని నియమించి1992 నుంచి పదేళ్లపాటు అధ్యయనం జరిపిం చింది. సమితి అంచనా ప్రకారం ప్రపంచంలో 100 దేశాల్లో ఐదువేల తెగలకు చెందిన 50కోట్ల ఆదివాసీలు ఉన్నారని, భారతదేశంలో 461 ఆదివాసీ తెగలున్నాయని తేల్చిచెప్పింది. ఈ తెగల్లో 92 శాతం మంది ఆదివాసీలున్నా సమితి తీర్మానించిన విధానాలకు విరుద్ధంగా అత్యంత అమానుష విధ్వంసకాండకొనసాగుతోంది.ఆదివాసీలకు స్వయంపాలన హక్కు, స్వేచ్ఛహక్కు, మానవహక్కుల సంరక్షణ, సంస్క ృతి సంప్రదాయాల జీవన విధాన సంరక్షణ హక్కు, విద్య,వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర హక్కులపై సమితి సదస్సులో తీర్మానించినా ఎంతవరకు ప్రభుత్వాలు వీటిని ఆచరణలోఉంచుతు న్నాయో చెప్ప లేని పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని యుగాల నుంచి సామ్రాజ్యవాదవిధానంపై బీర్సాముండా,గుండాదార్‌కాసు, సిద్ధు, కొమరం భీం,రాంజీనోండు తదితర విప్లవయోధుల పోరాట ఫలితం గానే రాజ్యాంగంలో 5,6వ షెడ్యూలుఏర్పాటయింది.
అయినా ఏంలాభం? ఈచట్టాలన్నీ చట్టుబండలవుతున్నా యి. అభివ ృద్ధి పథకాల పేరుతో ఆదివాసీలను అణచివేస్తున్నారు. సహజ వనరులు, ఖనిజ సంపద కార్పొరేట్ వర్గాల వరమవుతున్నాయి. స్వయం స్వాతంత్య్రంతో అడవ్ఞలే తమ ఆధారమని జీవిస్తున్న ఆది వాసీల ఉనికికే ముప్పు ఏర్పడుతోంది. ఆదివాసీలపై దౌర్జన్యాలు, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు సాగుతున్నా పాలకవర్గాలు మౌనం పాటిస్తున్నాయి. మావోయిస్టులకు అండదండలు అందిస్తు న్నారన్న నేరారోపణతో సాయుధ బలగాలు దారుణాలకుపాల్పడు తున్నాయి. ప్రభుత్వాలు మారినా ఆదివాసీలపై హింసలు ఆగడం లేదు. ఆంధ్రలోని విశాఖ మన్యంలో ఆదివాసీలపై మావోయిస్టుల ముద్రవేసిహింసించే సంఘటనలు ఎన్నోజరిగాయి.శ్రీకాకుళంలో కన్నె ధార కొండగ్రానైట్ మాఫియా చేతిలో ఆదివాసీలు బందీలైపోతున్న ఉదంతాలు ఎదురవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల మూడు లక్షలమంది ఆదివాసీలు అడ్రసు లేకుండా పోతున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కొత్త గూడెంలో విమానాశ్రయం నిర్మిస్తే 1600 ఎకరాల భూమి అవసర మని 1/70, పీసా చట్టాలకు వ్యతిరేకంగా బలవంతంగా భూమిని సేకరిస్తున్నారు. తెలంగాణలో హరితహారం పేరుతో అటవీభూము ల్లో అంగుళం భూమయినా ఆదివాసీలకు దక్కకుండా 2006 అటవీహక్కుల చట్టాన్ని అపహాస్యం చేస్తూ మొక్కలు నాటుతున్నారు. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు ఎదిరి స్తున్న వారికి సంకెళ్లు వేస్తున్నారు. సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల కారణంగా ఉత్తర తెలంగాణ లోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 124 గ్రామాలు కనుమరుగయ్యాయి. ఏజెన్సీలో స్వేచ్చగా పోడువ్యవసా యం, పండ్లతోటలు, కూరగాయలు,పండిరచుకుంటూ అభివృద్ధిచెం దుతున్న ఆదివాసీల జీవనం ఈఓపెన్ కాస్ట్ గనుల వల్ల చిన్నాభిన్న మయింది. ఈ విధంగా నిర్వాసితులైనవారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి అవన్నీ మొక్కుబడి వ్యవహారంగానే మిగిలిపోతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన మండలమైన తిర్యాణిలోని గోలేటి, కైరిగూర్, ఓపెన్ కాస్టు గనుల కింద నిర్వాసితులైన గిరిజనుల కోసం పునరావాస కాలనీ ఏర్పాటైనా అక్కడ నీరు,విద్యుత్, తదితర కనీస సదుపాయాలు లేవుసరికదా ఉపాధిలేక ఎవరూ అక్కడ ఉండడం లేదు. ఇక ఆదివాసీ ప్రాంతాల్లో మహిళల పరిస్థితి మరీ దారుణం. 2006 ఆగస్టు 20న విశాఖ జిల్లాలో కొండతెగకు చెందిన వారిని వాకపల్లిలో గ్రేహౌండ్స్ దళాలు అత్యాచారం చేస్తే ఇంతవరకు నింది తులకు శిక్షపడలేదు. వాకపల్లి ఆదివాసి అత్యాచార బాధితులు ఈ వ్యవస్థపై నమ్మకం పోయి నాగరిక సమాజానికి దూరంగా అడవిలోనే దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ మహి ళలపై ఎన్నో వేధింపులు, లైంగిక హింసలు సాగుతున్నా పాలక వర్గం పట్టించుకోవడం లేదు. తెలంగాణ జిల్లాల్లో ఇటుక బట్టీలు తయారు చేసే వారిలో 90శాతం ఆదివాసీ మహిళలే ఉన్నారు. చత్తీస్‌గఢ్,ఒడిశా,మహారాష్ట్రల నుండి వీరిని రప్పించి ఈపనులు చేయిస్తున్నారు. తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎదురు తిరిగితే ఇబ్బందులు సృష్టిస్తున్నారు. నిరక్షరాస్యులైన అమా యకపు ఆదివాసీలు తమ బాధలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. చెప్పినా న్యాయం జరగదన్న అభిప్రాయం వీరిలో బలంగా నాటుకు పోయింది.
సమాజంలో ఆదివాసీలవేతన అరణ్యరోదనగా మారింది. రాజ్యాంగంలో ని అయిదు, ఆరు షెడ్యూల్లోని నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేఆదివాసీల స్థితిగతులు, కొంతవరకయినా మెరుగుపడతాయి. షెడ్యూల్ ప్రాంత ఆదివాసీస్థితిని సమీక్షించి ప్రత్యే కించి చర్యలు చేపట్టే అధికారాలు గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఉన్నాయి.- పి.వెంకటేశం