ఆదివాసీల భాషా మాటేమిటి ?
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం తెలుగుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. బహు భాషల్లో ఉన్న విద్యావిధానం క్రమంగా తెలుగు మయమ్కెంది. ఆదివాసీ పిల్లల మీద తెలుగు బలవంతంగా రుద్దబడిరది. దీనికి తోడు తెలుగు సినిమాలు, తదనంతరం వచ్చిన టి.వి. సంస్కృతి ఆదివాసీ భాషలను ధ్వంసం చేసింది. తెలుగు భాషాభిమానులు, పండి తులు తెలుగు భాష ఇంగ్లీష్ ప్రపంచంలో కొట్టుకుపోతుందని ఎక్కడలేని బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎవరి భాషను వారు అభిమానించటంలో, పరభాష నుంచి తమ భాషను రక్షించుకోవటంలో తప్పు ఏమీలేదు. నా బాధంతా తెలుగు ప్రపంచంలో ఆదివాసీ భాషలు ఏవిధంగా కొట్టుకుపోతున్నాయో ఈ పండితులు, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ సదస్సులో ఆదివాసులను తెలుగు ప్రజలుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆదివాసీ భాషల ఉనికినే తుడిచిపట్టే ప్రమాదం ఉంది.
మన రాష్ట్రంలో 33 ఆదివాసీ, సంచార తెగలున్నాయి. ప్రతి తెగ తన ప్రత్యేక భాషను కలిగి ఉన్నాయి. రెండు లక్షల పైన జనాభా కలిగిన తెగలు ఆరు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా తెగల జనాభా ఇలా ఉంది. లంబాడా 20,77,947, కోయ 5,68,019, యానాది 4,62,167, ఎరుకల 4,37,459, గోండు 2,52,038, కొండ దొర 2,06,381. లక్షలాది ప్రజలు ప్రత్యేక భాషలను కలిగిఉన్నా వీరి భాషలకు జాతీయస్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ ఎటువంటి గుర్తింపు లేదు.ఈ భాషల్లో కొన్ని ఇప్పటికే కనుమరుగుకాగా, మరికొన్ని ఆ ప్రమా దం అంచున ఉన్నాయి. ఈ భాషల మనుగడకు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఆదిమ జాతులు తమ మాతృభాషతో పాటు తెలుగును కూడా తప్పని సరిగా నేర్చుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. తెలుగు మెజార్టీ ప్రజల భాషగా, రాష్ట్ర భాషగా చలామణి కావటమే అందుకు కారణంగా చెప్పవచ్చు. చిన్న తెగల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఈ తెగలు తెలుగుతో పాటు వారి ప్రాంతంలోని మెజార్టీ తెగల భాషను కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రతి తెగ తెలుగుతో పాటు రెండు, మూడు ఇతర తెగల భాషలను మాట్లాడాల్సి వస్తుంది. మొత్తంగా ఆదివాసీ భాషలు ఒక దుర్భర పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాయి. ప్రభుత్వంగానీ, భాషా పండితులు గానీ ఈ భాషల పరిరక్షణకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఈ భాషలను అభివృద్ధి చేయకపోవటానికి వీరు చెప్పే ఒక ప్రధాన సాకు ఏమంటే ఈ భాషలకు ‘లిపి’ లేదని. విచిత్రం ఏమంటే, ప్రపంచ భాషగా చలామణి అవుతున్న ఇంగ్లీష్ భాషకు సొంత లిపి లేదు. జాతీయ భాషగా చలామణి అవుతున్న హిందీ భాషకు సొంత లిపి లేదు. మరి ఆదివాసీ భాషల అభివృద్ధికి లిపి ఎందుకు అడ్డంకిగా మారుతుందో అర్థంకాని ప్రశ్న. అసలు భాషకు, లిపికి ఎటువంటి సంబంధం లేదు. ఏ భాషన్కెనా, ఏ లిపిలో న్కెనా రాయవచ్చు. ఆ భాషని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చాలు. మన పాలకులకు ఆదివాసీ భాషల పట్ల నిజాం రాజులకు ఉన్న చిత్తశుద్ధి కూడా లేదు. ఆధునిక విద్యలో భాగంగా చివరి నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ ఆదివాసీ భాషల ప్రత్యేకతను గుర్తించి పాఠశాల పాఠ్యాంశా లను తెలుగు లిపిని ఉపయోగించి లంబాడా, గోండు,కోయ భాషల్లో రాయించారు. ఈ తెగల నుంచే టీచర్లను నియమించి వారి శిక్షణ కోసం ప్రత్యేక టీచర్ ట్రయినింగ్ సెంటర్లను స్థాపించారు. ఈ విధానం 1956లో హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమయ్యేంత వరకూ కొన సాగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం తెలుగుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. బహు భాషల్లో ఉన్న విద్యావిధానం క్రమంగా తెలుగు మయమ్కెంది. ఆదివాసీ పిల్లల మీద తెలుగు బలవంతంగా రుద్ద బడిరది. దీనికి తోడు తెలుగు సినిమాలు, తదనంతరం వచ్చిన టి.వి.సంస్కృతి ఆదివాసీ భాషలను ధ్వంసం చేసింది.ముఖ్యంగా మ్కెదాన ప్రాంత తెగల భాషల మీద ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఎరుకల,యానాది భాషలు దాదాపుగా కనుమరుగయ్యాయనే చెప్పాలి. ఈ తెగలు చారిత్రకంగా సంచార జాతులు. ఇవి గ్రామ సమాజంలో స్థిరపడ టంతో త్వరిత కాలంలోనే తెలుగు ప్రభావం లోకి వెళ్ళిపోయాయి. మరొక్క సంచార జాతి లంబాడాలు. వీరు వారి నివాసాలను గ్రామ సమాజానికి కాసింత దూరంలో ఏర్పరచు కోవటంతో వారి భాషను కొంత వరకు భద్రపరుచుకోగలుగుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వీరు జీవనోపాధి కోసం గ్రామ, పట్టణాలపై ఆధారపడటం ఎక్కువ కావటంతో వీరి భాష కూడా ప్రమాద ఘంటికలు మోగి స్తున్నది. ఆదివాసీ భాషల క్షీణత వారి సంస్కృతి మీద బలమ్కెన ప్రభావాన్నే చూపిస్తున్నాయి. భాషకు, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక విధంగా భాష ద్వారానే ఈ జాతులు ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నాయి. భాషలు నశిస్తే ఈ జాతుల ఉనికి కూడా నశించే ప్రమాదం ఉంది. పాలకవర్గాలు ఇదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఈ జాతులు తమ ప్రత్యేక ఉనికిని ఉద్యమ రూపాలుగా మార్చి పాలకవర్గాల ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంటాయి. అందుకే పాలకవర్గాలు జాతుల ప్రత్యేక ఉనికిని ప్రమాదంగా భావిస్తాయి. ఈ విభిన్న జాతుల ఉనికిని ధ్వంసం చేసి ఒకే సంస్కృతిని స్థాపించటానికి పాలకవర్గాలు నిరం తరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. అదే పాలకవర్గ సంస్కృతి. మన దేశంలోని పాలకవర్గాలు విభిన్న కులాల సమ్మేళమ్కెనప్పటికీ సాంస్కృతిక వ్కెరుధ్యాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఈ వర్గా లు ప్రాచీన కాలం నుంచి క్రమంగా తమకం టూ ఒక ప్రత్యేక సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సంస్కృతి బ్రాహ్మణ సంస్కృ తికి దగ్గరగా ఉంటుంది. పాలకుడు ఏ కులస్తుడ్కెనా ఈ సంస్కృతిని పెంచి పోషిం చటమో, బలోపేతం చేయటమో జరుగుతూ ఉంటుంది. తెలుగు భాష అభివృద్ధి కోసం కాకతీయుల కాలం నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వరకు జరుగుతున్న ప్రయ త్నాలన్నీ రాష్ట్రంలోని ఆదివాసీ భాషల మీద జరుగుతున్న దాడిగానే చూడాల్సి ఉంటుంది. తెలుగు సామాన్య ప్రజల వ్యవహారిక భాషే అయినప్పటికీ ఈ భాషకు లిఖిత రూపం వచ్చిన అనంతరం ప్రజల భాష కాకుండా పోయింది. తెలుగు లిఖిత భాషగా రూపాంతరం చెందే క్రమంలో పూర్తిగా బ్రాహ్మణ్కెజ్ అయింది. ఈ రోజు మనం మాట్లాడే, రాసే తెలుగులో అరవ్కె శాతం సంస్కృత పదాలున్నాయంటే బ్రాహ్మ ణిజం ప్రభావం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాఠ్యపుస్తకాలలోని తెలుగుకి, అణగారిన కులాలు, జాతులు మాట్లాడే తెలుగుకి పొంతనే లేదు. విశ్వవిద్యాలయాల్లోని తెలుగు డిపార్ట్మెంట్లు హైందవ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ కారణంగానే ఈ రోజు అణగారిన జాతులు, కులాలు తెలుగును వ్యతిరేకిస్తున్నాయి. పాలకవర్గాలు ఒక్క విషయం గుర్తించాలి. ఆదివాసుల భాషను రక్షించకపోతే అపారమ్కెన ఈ దేశ చరిత్ర, సంస్కృతి కను మరుగయ్యే ప్రమాదముంది. భాష కేవలం కమ్యూనికేషన్ మీడియం కాదు. భాష ప్రజల చరిత్రను,సంస్కృతిని,భావాలను ప్రతిబిం బిస్తుంది. ఆదివాసుల విషయంలో ఇది మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆదివాసుల భాషల్లో అద్భుతమ్కెన మౌఖిక చరిత్ర పాటల, కథల రూపంలో దాగి ఉంది. ఈ చరిత్ర వారి జాతుల పుట్టుపూర్వోత్తరాలను, సమాజ మార్పులను, రాజ్యంతో వారు చేసిన పోరా టాలతో పాటు వారి ఆర్థిక, సాంఘిక, రాజకీయ, మత భావాలను తెలియజేస్తాయి. ఈ చరిత్ర పాలకవర్గ చరిత్రకు భిన్నంగా ఉంటుంది. ఇది ఒక ప్రత్యామ్నాయ చరిత్ర. సమాజం మరో కోణాన్ని చూపించే చరిత్ర. ఆదివాసుల సంప్రదాయాల్ని, భావాల్ని వారి భాషలోనే అర్థం చేసుకోగలం.గుత్తికోయలు తయారుచేసే ‘చిగురు’ సారను వివరించటానికి తెలుగులో కానీ, ఇంగ్లీషులో కానీ పదాలు లేవు. దీన్ని కేవలం గుత్తి కోయల భాషలోనే వివరించగలం. గుత్తికోయల భాష కను మరుగ్కెతే ‘చిగురు’ సారను ఏమని పిలవాల న్నది మన ముందు ఉన్న సమస్య. ఇలా చెప్పు కుంటూపోతే ఆదివాసీ యేతర భాషలకు అందకుండా ఉండే అనేక విషయాలు ఆదివాసీ భాషల్లో ఉన్నాయి.గ్లోబల్కెజేషన్లో భాగంగా దేశంలో వస్తున్న మార్పులు ఆదివాసీ సమాజంపై విపరీతమ్కెన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆదివాసీ సాంస్కృతిక రూపాలు క్రమంగా నశించిపోతున్నాయి. భాష ఒక్కటే వారి సంస్కృతి ఆనవాళ్లుగా మిగిలే పరిస్థితి ఉంది. నశించిపోతున్న ఆదివాసీ ప్రజల భాషలను చిగురింప చేయాలంటే పాలకులు, భాషా పండితులు నా ఈ ప్రశ్నలకు సమా ధానాలు వెతకాలి. తెలుగు, ఉర్దూ యూనివర్సిటీ తరహాలో ఆదివాసీ భాషలకు ఎందుకు ఒక యూనివర్సిటీని స్థాపించకూడదు? పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఆదివాసులు తమ భాషను చదువుకునే పరిస్థితి ఎందుకు ఉండకూడదు? ఆదివాసులు తమ భాషను తాము చదువుకునే హక్కు ఎందుకు ఉండకూడదు? రాష్ట్రంలోని 33 ఆదివాసీ భాష లు ఈ రాష్ట్రానికే ప్రత్యేకం. మరి ఎందుకు ఈ భాషలను ఈ రాష్ట్ర భాషలుగా గుర్తించ కూడదు. ఆదివాసులు తెలుగును కాకుండా తమ సొంత భాషను సగర్వంగా మాతృభాషగా రాసుకునే రోజు వస్తుందా! ఆ రోజు వచ్చిన నాడు ఆదివాసులు కూడా సగర్వంగా తమ భాష మహాసభలు జరుపుకునే రోజు వస్తుంది.
- వ్యాసకర్త : (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఆచార్యులు)
- (ప్రొ.భంగ్యా భూ)