Skip to content
ఆదరణ పథకం
- రూ.3 వేల కోట్లతో ఆదరణ కింద 6 లక్షల మందికి లబ్ధి
- మరో 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా జనవరిలో నాలుగో విడత ఆదరణ పథకం
- 2022 కల్లా ప్రతి ఒక్కరికి శాశ్వత గృహం
- 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు
- ప్రతి ఒక్కరికి సంత ృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు
- పరిశ్రమల స్థాపనకు 15 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు, 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- ప్రతి కుటుంబానికి కనీసం నెలకు రూ.10 వేల ఆదాయం సమ కూర్చాలి అన్నది తమప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈలక్ష్యం సాకారం అయ్యేం దుకే పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మన్నారు. డిసెంబరు 28న అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మెగా గ్రౌండిరగ్ మేళాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారు లకు పనిముట్లు ఆస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని లక్ష్యంతో గత నాలుగేళ్లలో పలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నా మన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆదరణ, ఎస్సీలకు ముందడుగు, ఎస్టీలకు చైతన్యం, వికలాంగులకు చేయూత, ముస్లింలకు రోషిని తదితర పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నా మన్నారు. ఆధునిక పనిముట్లు పంపిణీకి ఒకటి, రెండు విడతల ఆదరణ కార్యక్రమాలను విజయవాడ, తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించామని , ప్రస్తుతం అనకాపల్లిలో మూడు విడత ఆదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. ఈ మూడు విడతల్లో రూ.3 వేలకోట్లను వెచ్చిస్తూ 6 లక్షల మందికి లబ్ధిచేకూర్చడం జరుగుతున్నదన్నారు. మరో2లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా జనవరిలో నాలుగో విడత ఆదరణ కార్యక్రమం నిర్వహి స్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి శాశ్వత గృహ కల్పించేందుకు పెద్ద ఎత్తున గృహనిర్మాణ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. 2022కల్లా ప్రతి ఒక్కరికి శాశ్వత గృహ వసతి కల్పిస్తామని ఆయన తెలిపారు. జనవరిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో గృహాలు కావాల్సిన వారందరి నుండి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 2ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరికి సంత ృప్తికర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, గ ృహాలు మంజూరు చేస్తున్నామన్నారు. విద్యా వైద్య ఆరోగ్య పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. 24 రకాలవైద్య సేవలను అందు బాటులోకి తెచ్చి వైద్య ఖర్చులను చాలా వరకు తగ్గించా మన్నారు. పరిశ్రమల స్థాపనకు 15లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని, 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని ముఖ్య మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100, 200 ఎకరాల్లో ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీరి ఉత్పత్తులకు ప్యాకింగ్, మార్కెటింగ్, వేర్ హౌసింగ్ సౌకర్యాలను కల్పిస్తామని ఆయన తెలి పారు. కుల వృత్తుల ఉత్పత్తుల కూడా వీటి ద్వారా మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
- అనకాపల్లి నియోజకవర్గంపై వరాల జల్లు
- అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరియు శాసన సభ్యులు పీలా గోవిందసత్యనారాయణ చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందిస్తూ పలు వరాల జల్లు కురిపించారు. అనకాపల్లి శ్రీనూకంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి సిజిఎఫ్ కింద ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు కాపులకు కులదృవీకరణ పత్రాలను మంజూరు చేస్తా మన్నారు. కసింకోట మండలం వెదురుపర్తి రోడ్డు నిర్మా ణానికి 3 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ముస్లింల పాఠశాల మదర్సా నిర్మాణానికి ఒక ఎకరం భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటిం చారు. అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అభివ ృద్ధికి సహకరిస్తామన్నారు. రూ.24 కోట్లతో తుంపాల ఆనకట్ట నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఈ సంద ర్భంగా శంకుస్థాపన చేశారు. తుంపాల షుగర్‌ఫ్యాక్టరీని పునఃప్రారం భించారు. గత నాలుగేళ్ల కాలంలో ఒక్కఅనకాపల్లి నియోజ కవర్గం నియోజ కవర్గంలోనే 98 వేల 724 పనులకు రూ.1,985కోట్లు ఖర్చు చేస్తు న్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప,రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రావత్, సాంగే సంక్షేమ శాఖ కార్యదర్శి విజయ కుమార్, బీసీ కార్పొరేషన్ కమిషనర్ ఉదయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ, పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. – సతీష్ కుమార్
Related