ఆగని వలసలు..మారని బతుకులు

కార్మికులకు పరాయి పంచన తప్పని ఆగచాట్లు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న కార్మికులకు పరాయి పంచన ఆగచాట్లు తప్పడం లేదు.స్థానికంగా ఉపాధి లేమి,ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ వేతనం వంటి కారణాలు వీరిని వలస వెళ్లేందుకు అడుగులేయిస్తు న్నాయి.తీరా అక్కడికి వెళ్లి వేతనాలు దొరక్క కొందరు,చిత్రహింసలు భరించలేదక మరికొం దరు సొంత ఊళ్లకు తిరుగు పయనమ వుతు న్నారు. ఈక్రమంలో దూర ప్రాంతాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వచ్చేందుకు ప్రయాణ ఖర్చులు లేక ఎంతోమంది వందలాది కిలోమీటర్లు కాలి నడకన చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో అనారో గ్యాలకు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలొదులు తున్న వారు కోకొల్లలు.ఇటుక బట్టీలు,రొయ్యల,వస్త్ర పరిశ్రమలు తదితర రంగాల్లో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతూ నరకయాతన అనుభవి స్తున్నారు.పరిస్థితి ఇలా ఉన్న ఇటు కార్మికశాఖ అధికారులు,అటు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తుండటం వలన కార్మికులకు శాపంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెతుకు దొరకని వలస బతుకులు..
దేశ నిర్మాణంలో వలస కార్మికుల పాత్ర ఎంతో కీలకం. వలస వెళ్ళిన చోట సరిగ్గా పని దొరక్క, రేషన్‌ కార్డులు లేక వారికి ఆకలి కేకలు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరిం చేందుకు సరైన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ‘వైరస్‌ కన్నా ముందుగా ఆకలి భూతమే మా ప్రాణాలు మింగేసేలా ఉంది. కొవిడ్‌ కల్లోల సమయంలో కాలే కడుపులతో నిస్సహాయ స్థితిలో కాలినడకన సొంత ఊళ్ల బాటపట్టిన వలస కార్మికుల ఆవేదన ఇది.దేశీ యంగా ఆకాశహర్మ్యాలు,రోడ్డు,రైలు మార్గాలు, ఇతర ప్రాజెక్టులన్నీ వారి శ్రమతోనే రూపుదిద్దు కొంటున్నాయి. అయితే పట్టణాలు,నగరాల్లో నిత్యం పని దొరక్క వలస కార్మికులకు సరైన ఆదాయం లభించడం లేదు. చౌక ధరలకు ఆహార ధాన్యాలు అందుకొనేందుకు రేషన్‌ కార్డులూ లేక ఎంతోమంది వలస కార్మికులకు ఆకలి మంటలు తప్పడంలేదు. వీటిని నిలువ రించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సుప్రీంకోర్టు తాజాగా సూచిం చింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందేలా వలస కార్మికులందరూ ఈ-శ్రమ్‌ పోర్టల్లో పేరు నమోదు చేసుకునేలా చూడాలని నిర్దేశించింది.
దక్కని లబ్ధి..
తొలి విడత కొవిడ్‌ విజృంభణ సమయంలో వలస కార్మికుల ఆకలి బాధలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. దేశీయంగా ఎవరూ ఆకలితో అల్లాడిపోకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.అది సరిగ్గా అమలుకు నోచుకోకపోవడంతో వలస కార్మికుల సంక్షేమంపై పలువురు సామాజిక కార్యకర్తలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్ర యించారు.ఆ పిటిషన్లపై విచారణ సంద ర్భంగా..జాతీయ ఆహార భద్రతాచట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద జనాభా నిష్పత్తి లెక్కలు సక్రమంగా లేవనే కారణంతో వలస కార్మికు లకు రేషన్‌ కార్డులు నిరాకరించలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కొన్నిసార్లు దాహంతో ఉన్నవారి దగ్గరికే బావి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పింది.నిజానికి వలస కార్మికుల కోసం కేంద్రం 2019లో ఒకే దేశం,ఒకే రేషన్‌ కార్డు పథకాన్ని తెచ్చింది.2022 నుంచి అది దేశవ్యా ప్తంగా అమలులోకి వచ్చింది. దాని ప్రకారం ఒక చోట రేషన్‌ కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడి నుంచి అయినా చౌక ధరల దుకాణాల్లో ఆహార ధాన్యాలు తీసుకోవచ్చు. అందుకోసం రేషన్‌ కార్డులను బయోమెట్రిక్‌, ఆధార్లతో అనుసంధానించారు. నిరుడు జులై నాటికి దేశీయంగా ప్రతి నెలా మూడు కోట్ల మంది ఇలా ఇతర ప్రాంతాల్లో రేషన్‌ సరకులు అందుకుంటున్నారు. 2019 ఆగస్టు నుంచి చూస్తే ఈ సంఖ్య దాదాపు 78కోట్లు. అయితే, ఇండియాలో అర్హులైన లబ్ధిదారులు ఎంతో మందికి నేటికీ రేషన్‌ కార్డులు లేవన్న విమర్శ లు వినిపిస్తున్నాయి.
విధానం మారాలి…
దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం- అంతర్గత వలస కార్మికులు 45 కోట్లు.నాటి జనాభాకు అనుగుణంగానే ఇప్పటికీ రేషన్‌ కార్డులు అందిస్తున్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం భారత్లో 67శాతం జనాభాకు రేషన్‌ కార్డులు దక్కాలి. ప్రస్తుతం అరవై శాతానికే అవి అందినట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. 2011 జనగణన ప్రకారం ఇండియా జనాభా 121కోట్లు.ఇటీవల భారత్‌ చైనాను అధిగ మించి ప్రపంచంలోనే అత్య జనసంఖ్య ఉన్న దేశంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఇండియా జనాభా 142 కోట్ల పైమాటే. 2011 జనగణ నను అనుసరించే రేషన్‌ కార్డులు జారీ చేస్తు న్నందువల్ల పది కోట్ల మంది అర్హులు నష్టపోతు న్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం సమగ్ర జనగణన జరిపి రేషన్‌ కార్డులు దక్కాల్సినవారి అసలైన సంఖ్యను నిర్ణయిం చాలి. దేశంలో ఎవరూ ఆకలితో అల్లాడకుండా పటిష్ఠ చర్యలు సంక్షేమ ప్రభుత్వ విధ్యుక్త ధర్మం! తీసుకోవడం సంక్షేమ ప్రభుత్వ విధ్యుక్త ధర్మం.
వలసలను నియంత్రించేదెప్పుడు?
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడాన్ని వలసలు అంటారు. ఇవి విభిన్న రకాలుగా ఉంటాయి, ఒక ఊరి నుండి మరొక ఊరికి, పల్లె నుండి పట్నానికి, పట్నం నుండి పల్లెకు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక ఖండం నుండి మరొక ఖండానికి వలసలు వెళ్తుంటారు. వలసలు వెళ్ళడానికి సైతం విభిన్న పరిస్థితులతో కూడుకొని ఉంటాయి. పెళ్లిళ్ల రీత్యా, చదువుల నిమిత్తం ఒక్కెత్తెట్కతే బ్రతుకుదెరువుకై కొందరు, వ్యాపార నిమిత్తం మరికొందరు వలసలు వెళ్ళడం ఇంకొకెత్తు.
తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాల నుండి వలస కూలీలు మహారాష్ట్ర, హైదరాబాద్‌, కువైట్‌, దుబాయ్‌.. వంటి ఇతర ప్రాంతాలకు బ్రతుకుదెరువుకై వలసలు వెళ్ళిన సందర్భాలెన్నో చూశాము. వివిధ దినపత్రికలు, టీవీలలో, మాస పత్రికలలో వెలువడిన వ్యాసాలు, పరిశోధన పత్రాల ద్వారా దీనిని విపులంగా వివరించిన మాట వాస్తవం. ప్రభుత్వం సైతం వాటిని నియంత్రించడానికి పలు పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ అనుకు న్నంత ప్రగతి సాధించలేదన్నది నిజం. ఏదో ‘గుడ్డికంటే మెల్ల నయ్యం’ అన్నట్లుగా ఉన్నదన్నది నగ్న సత్యం.మన తెలంగాణ రాష్ట్ర వలస బ్రతుకులు అందరికీ తెలిసినవే. కానీ మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి వలసలు వచ్చిన వారి బ్రతుకులను ఒక్కసారి పరిశీలిస్తే…ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లలో చేపట్టే అభివృద్ధి పథకాలను కాంట్రాక్టర్లకు అప్పగిం చడం ఆనవాయితీ.ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌,ఉత్తర ప్రదేశ్‌,బిహార్‌,ఒడిషా,తెలంగాణ ప్రజలు భాగ్యనగరంలో చేసే పనులను చూస్తే… ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో పనిచేసే పనివారి గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుమనక మానదు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పట్నాలకు వలసలు వెళ్ళే కార్మికులు భవనాల నిర్మాణంలో ఎక్కువగా పనిచేస్తూ, మిగతా చిన్న, చితక పనులు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. వారి సంపాదన తక్కువగా వుండి ఖర్చులు అధికంగా ఉండటం మూలంగా నగరాలలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ కాలం గడుపు తుంటారు.బిహార్‌ రాష్ట్రం నుంచి వచ్చే వలస కార్మికులు కొంత మంది తెలంగాణలోని జాతీయ రహదారులకు ఇరువైపుల ధనవం తులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ వివిధపండ్ల తోటల పెంపకం చేపడుతూ,అందులో పనిచేయడానికిఈ రాష్ట్రం నుండి వచ్చిన వ్యక్తులను నియమించుకోవడం జరుగుతోంది.అలాగే బడా కాంట్రాక్టర్లు వివిధ రహదారుల ఏర్పాటు నిమిత్తం రకరకాల బ్రిడ్జీలు,వంతెనలు,ప్రాజెక్టులు,డ్యాముల నిర్మా ణంలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఈ ప్రాం తానికి చెందిన వారుంటారు.బోర్‌వెల్స్‌లో పని చేసే కార్మికులలో అత్యధిక మంది ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఆదివాసులే వుంటారు. కుటుంబానికి దూరంగా ఉంటూ,ఎలాంటి లాభార్జన లేకుండా ఏదో మోటు కష్టానికే పరిమితమై పనిచేస్తూ, ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియకుండా పనిచేస్తూ కాలం గడుపు తుంటారు. భాగ్యనగ రంలో ఇటుకల తయారీలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రానికి చెందిన వారుంటారు.వారు నామ మాత్రపు డబ్బులు తీసుకొని యజమానుల క్రింద పనిచేస్తుంటారు.పేదరికంతో ముందు గానే వారివద్ద డబ్బులు తీసుకొని, అప్పు తీర్చు టకు నెలలకొద్దీ పనిచేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌ నుండి తెలంగాణకు వలసల వచ్చి పండ్ల తోటలలో పనిచేస్తున్నవారు కొందరు. జార్ఖండ్‌ నుండి ఇక్కడకు పనిచేయుటకు వచ్చి ఆకలితో చనిపోవడం లాంటి వార్తలను వివిధ దిన పత్రికల్లో చూస్తున్నాము.హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ సమీపంలోకి వెళ్ళి చూస్తే ప్రత్యక్షంగా వలస కూలీల బ్రతుకులను దగ్గరగా చూడవచ్చు. వారితో సంభాషిస్తే వారి బాధలను కథలుగా వినవచ్చు. ఏదో బ్రతుకు దెరువుకై వచ్చి నాలుగు డబ్బులు సంపాదించు కొని సంతోషంగా గడుపుతున్నారంటే అదీ లేదు, ఉద్యోగ భద్రత లేకుండా, యజమానుల క్రింద వెట్టిచాకిరీ చేస్తున్న…యజమానులకు కాసుల పంట పండుతుంది కానీ,వీరికి మాత్రం దినదినం గండంగానే ఉంటుంద నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో కష్టాలు, మరెన్నో చీదరింపులు, వేధింపుల మధ్య పనిచేస్తూ పొట్టకూటి కోసం పనిచేస్తున్న వలస కూలీల బ్రతుకులను మార్చేదెవరు? అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టినా ఆ ఫలాలు ఎవరికెళ్తున్నాయో అర్థంగాని పరిస్థితి.దేశంలో సైతం వృద్ధిరేటు పెరుగుతుందని ఏవో సర్వేలు చేసి ఘనంగా చెప్పుకుంటారు తప్ప, ఎక్కడున్నది అభివృద్ధి? వీరి బ్రతుకులు మారేదెప్పుడు? మార్చేదెవరు? వీరి భద్రతకు ఎవరు భరోసానిస్తారు? అర్థంగాకుండా వున్నదనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. వలసలు పోవడంలో తప్పలేదు గానీ, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, రక్షణగావిస్తూ, నాలుగు డబ్బులు సంపాదించుకొని కుటుం బంతో సంతోషంగా గడిపే విధంగా యజమా నులు వుండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.దేశంలో రోజురోజుకు నిరుద్యోగత పెరిగిపోతున్నది, ఎలాంటి ఉన్నతమైన చదువులు చదివినా నేటికీ తల్లిదండ్రులపై ఆధారపడి జీవించే పరిస్థితులు నెలకొన్నాయి. పేదవారి పరిస్థితులను తెలపా లంటే వ్రాస్తే రామాయణమంతా, చెబితే మహాభారతమంతా ఉంటుందనడంలో నిజం లేకపోలేదు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ప్రభుత్వాలు పునఃపరి శీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉన్నది. నేటి ఈ ప్రజాస్వా మ్య వ్యవస్థలో పాలనాధికారులు ఇచ్చే ఉపన్యా సాలు అంతా ఇంతా గాదు, కానీ ఆచరణలో మాత్రం అనుకున్నంత మేరలో ఉండదు. ఎవ్వరైనా అవే విషయాలను ప్రస్తావిస్తే మేమన లేదని,అవి సాధ్యపడవని మాటలు మార్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి.ఏ ప్రభు త్వం వచ్చినా పేద, నిమ్న వర్గాలకు చెందిన ప్రజల బ్రతుకులకు భరోసా లేనప్పుడు ఈ ప్రభుత్వా లెందుకో అర్థంగాని పరిస్థితి.దేశం లో ఏ రాష్ట్రంలోనైనా పరిపాలన యంత్రాంగం మాటలు ఆపి ఆచరణలో సాధ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.ఏవో పథకాలను చేపట్టి, డబ్బులు లెక్కలు చూపించి, పేపర్లకు పరిమితంగాకుండా క్షేత్ర స్థాయిలో ఎలాంటి అభివృద్ధికి నోచుకుందో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.సొంతూరిలో ఓ గూడు కట్టుకోవాలన్నది వారి ఆలోచన.ఈ దంపతులకు నాలుగేళ్లు, అయిదేళ్లు, ఎనిమి దేళ్లు,11ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. నలు గురు చిన్నారులూ తమ సొంతూరిలోనే 54 ఏళ్ల నానమ్మ దగ్గరే ఉంటు న్నారు.ఈ ఒక్క కుటుంబమే కాదు. కర్గిస్థాన్‌లో ఇలాంటి వలస లు సర్వసాధారణం.ఈ దేశం లోని ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఉపాధి కోసం పరా యి దేశాలకు వలసవెళ్లినవారే. అంతర్జా తీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారం, ఇలాంటి వలస కార్మికులు తమ స్వదేశాలకు పంపే డబ్బు విలువ మధ్య ఆసియా దేశాల జీడీపీలో మూడో వంతుకు పైనే ఉంటుంది.అలా పంపే డబ్బు విలువ 2018లో 528 బిలియన్‌ డాలర్లకు చేరిందని అంచనా.దిగువ, మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల పురోగతికి ఆడబ్బు ఎంతో దోహదపడుతోంది.కానీ, ఆకార్మికుల పిల్లలు తమ జీవితంలో ఎంతో కోల్పోవాల్సి వస్తోంది. పసి పిల్లలను సొంతూళ్ల లో వదిలేసి తల్లిదం డ్రులు కనిపించకుండా వలసెళ్లిపో తున్నారు.దాంతో ఎంతోమంది చిన్నారులకు అమ్మానాన్నల ఆప్యాయత కరువవుతోంది.ఒక తరం పిల్లలంతా తమ బంధువుల సంరక్షణలోనే ఉండాల్సి వస్తోంది. నిరాదరణకు,వేధింపులకు కూడా గురవుతు న్నారు.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలపట్ల,శ్రామిక వర్గాలపట్ల అండగా వుంటూ,రక్షణనిస్తూ,ఉద్యోగ భద్రతను కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా ప్రత్యక్ష చర్యలు తీసుకునే విధంగాచట్టాలను గావించా ల్సిన ఆవశ్యకత ఎంతైనా అవసరం.ఆదిశగా ఆలోచిస్తూ వలసల నియంత్రణగావిస్తూ, వారికి ఆర్థికపరమైన భరోసానివ్వాలని ఆశిద్దాం.- సైమన్