ఆగని అన్నదాత పోరు
పంటలకు చట్టపరంగా కనీస మద్దతు ధరల హామీ,రైతు వ్యతిరేకకార్పోరేట్ అనుకూల మూడు సేధ్యపు బిల్లుల రద్దును కోరుతూ దేశ రాజధాని ఢల్లీి నగర శివార్లలో అన్నదాతలు పట్టుదలతో సాగిస్తున్న పోరాటం నానాటికీ ఉన్నతమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ రైతు వ్యతిరేక,ధనవంతులకు లక్షల కోట్లు లాభాలు కట్టబేట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పంటలకు కనీస మద్దతు కల్పిస్తూ చట్టపరంగా హామీ ఇవ్వాలని రైతాంగం కోర్కెలకు మద్దతుగా యువద్భారతం సెప్టెంబరు 27న బంద్ పాటించి సంఫీుభావం ప్రకటిచింది. గత పదినెలలుగా అన్నదాతలు ఆందోళన సాగిస్తున్నా మోదీ ప్రభుత్వం మొక్కుసూటిగా రైతు సంఘాలతో చర్చలు జరిపినా ఎలాంటి నిర్ధిష్ట హామీ ఇవ్వకపోవడంతో పోరు ముందుకు సాగుతోంది. కాలయాపన చేస్తే పట్టించుకోకపోతే రైతాంగ ఆందోళన అదంతకదే నీరుగారిపోయిందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ సెప్టెంబరు 5న జాట్ భూమిగా పిలిచే పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్‌లో జరిగిన బ్రహ్మండమైన బహిరంగ సభలో యూపీ,ఉత్తరాఖాండ్, హర్యానా,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి లక్షలాది మంది రైతులు పాల్గొని మోదీ ప్రభుత్వం మొండివైఖరిని నిరసిస్తూ వివాదస్పదమైన మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగించాలని ప్రతిబూనారు. సంయుక్త కొసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కిసాన్ మహా పంచాయిత్‌లో మూడువందలకు పైగా రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూపీ,పంజాబ్‌ఉత్తరాఖండ్,గోవా,మణిపూర్ శాసనసభలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నఇకలు జరగున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వఆనికి గుణపాఠం నేర్పేందుకు ముజఫర్‌నగర్‌లో ఈభారీ కిసాన్ బహిరంగ సభను నిర్వహించారు. యూపీ శాసనసభ 303స్థానాలకు,గోవా కనీసం125 అసెంబ్లీ స్థానాల ఫలితాలను రైతాంగ ప్రదర్శనధర్నాల ప్రభావితం చేయగలవని అంచనా. 2013లో ముజఫర్ నగరం ప్రాంతంలో జరిగిన హిందూముస్లిం ఘర్షణ వలల రైతాంగ వ్యతిరేకత నెరవేర్చనుంది. అన్నదాతల కనిపిస్తుంటే జాట్‌లో ముస్లింలు ఘర్షణ పదివేరై,జాట్లు బీజేపీకి మద్దతులు ఇవ్వగా 2014 మే ఎన్నికల్లో గెలిచి నరేంద్రమోడీ సారధ్యంలో కమలం పార్టఈ అధికారంలోకి రాగాలిగింది. 2017 యూపీశాసనసభ 2019లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తంతు కొనసాగింది. అధికారపార్టీకి రాజకీయ లబ్దిచేకూరింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో తెచ్చిన మూడు సేధ్యపు చట్టాలు కార్పొరేటు వర్గాలకు లక్షల కోట్లు కట్టబెట్టేవని రైతు నాయకులు రాకేష్ తికాయల్ విమర్శించారు. ఈ పోరాటం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదని జాతిని,రాజ్యాంగాన్ని రక్షించకోవడానికి జరుగుతున్న ఆందోళనలో 14కోట్ల భారత యువకలు క్రియాశీలపాత్ర వహించాలని తికాయల్ కోరారు. మోదీ ప్రభుత్వం భారత్‌ను అమ్ముకానికి పెట్టందని, రైళ్ళు,రేవులు, జాతీయరహదారులు, విమానాశ్రయాలు,ఎల్ఐసీ,ఓన్జీసీ,బీపీసీఎల్, తదితర ప్రతిష్టాత్మక సంస్థలను అదాన్న అంబానీ వంటి బడా పెట్టుబడిదార్లకు కారుచౌకగా కట్టబెట్టి దానికి చేస్తున్న ప్రయత్నాలపై దేశ ప్రజల్లో ఆగ్రహాం రగులు తోంది. ఎన్నో పోరాటాల తర్వాత సాధించు కున్న ప్రతిష్టాత్మకమ విశాఖ ఉక్కు కర్మాగారాన్నఇ ప్రైవేటీకరించేందుకు నిర్ణయిం జరిగి పోయిందని కమలానాధుల చేసిన ప్రకటనలకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలు, కార్మికులు మహిళలు పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. పశ్చిమ యూపీలో రైతాంగం పండిరచే చెరకు క్వింటాల ధరకు రూ.450కి పెంచుతామని హామీ ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయు కూడా పెంచలేదు.పైగా చెరకు రైతుకు చక్కెర ప్యాక్టరీలు రూ.12వేలకోట్ల భారీ బకాయిలివ్వాలని రైతులు ఆందోళన చేస్తే అవి రాజకీయపరమైనవని,కమలానాధులు ప్రకటించడం సిగ్గు చేటు. యూపీలో మత విభజన వాణిని కొనసాగించి, హిందువుల ఓట్లును గంపగుత్తగా పొంది మళ్ళీ అధికారంలోకి రవాలన్నదే కమలనాధుల పన్నాగం. 2013 హిందూ ముస్లిం కల్లోలంలో 42మంది ముస్లింలు,20మంది హిందువులు మరణించారు. రైతుల ఆందోళనను ఆందోళనను పోలీసు తుఫాకుల్లో భాష్ప వాయువు గోళాలతో దమనకాండతో అణిచివేయాలని నరేంద్ర మోదీ యోగి ప్రభుత్వం ఎన్నో యత్నాలను లక్షలాది మంది రైతులు కదలి వచ్చి తిత్తాయల్ దీక్షకు మద్దతుగా నిలబడి వమ్మఉ చేశారు. మద్దతు ధరలు మూడు వందలకేనా? ఢలీి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాల వారే అధికంగా పాల్గొంటున్నా దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘనేతలు,మహిళలు,కార్యకర్తలు వెళ్లి దీక్షల్లో పాల్గొని సంఫీుభావం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు బీమా పేరిట ప్రభుత్వానికి రూ.2500 కోట్ల బీమా కంపెనీలకు లాభాలే చేకూరుతున్నాయి. రైతుల ఆందోళన వల్ల ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించేందుకు సుప్రీం కోర్టు రంగంలోకి దిగి తదుపరి ఉత్తర్వఉలు వచ్చేవరకు ఎలాంటి వివాదస్పద సేధ్యపు బిల్లులు అమలు చేయవద్దని ఆపేసింది. రైతుల సమస్యలను తెలుసుకున్న సుప్రీం కోర్టు విరమించినా కనీసం రైతులు ఎవ్వరూ పాల్గొనేదు. రైతుదినోత్సవం నాడు జనం,వ్యాపార ప్రొత్సహం,సహకార చట్టం2020,రైతుల సాధికారిత మరియు కనీస ధరల హామి ఒబ్బందం,రైతుల సేద్య చట్టం`2020,నిత్యఆవసర సరకులు(సవరణ) చట్టాలు పూర్తిగా రైతులను దోపిడికి గురిచేసి అదానీ తదితర కార్పొరేటు శక్తులకులాభాలు కట్టబెటేవని,వాటిని ఉపసంహరించుకోనేవరకు ఆందోళన వీడబోమని రైతు సంఘాల నేతలు స్పుష్ట్రం చేశారు. దీనికి తోడు గత ఏడాదిన్నరగా దేశంలో కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్లు విధించడం,రవాణా స్తంభించించడంవల్ల పండ్లు,కూరగాయలు,పూలు,పాలను ఎక్కడెక్కడ దొరక్కపోవడం వల్ల చాలా మంది రైతాంగం అప్పులు పాలైనారు. అందుకే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దత ధరలు కల్పించే ఇచ్చే చట్టాలను కావాలని రైతులు కోరుతున్నారు.
సరికొత్త చరిత్రను సృష్టించిన భారత్ బంద్
ప్రభుత్వం రైతులపై రుద్దిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కె ఎం) పిలుపు మేరకు సెప్టెంబరు 27న నిర్వహించిన భారత్ బంద్ జయప్రదమైంది. రైతు,కౌల రైతు,వ్యవసాయకార్మిక,కార్మిక,ఉద్యోగ, మహిళా,విద్యార్థి,యువజన,ప్రజా సంఘాల భాగస్వామ్యాలతో బంద్ సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రజల నుండి ఎన్నడూ లేని విధంగా అపూర్వ స్పందన,మద్దతు, సంఫీు భావం బంద్‌కు లభించాయి. మోడీ ప్రభుత్వ విధానాలు,పెట్రోల్,డీజిల్,గ్యాస్,నిత్యావసరాల ధరలకు తాళలేకున్న ప్రజ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తమ నిరసనాగ్రహాన్ని తెలియజెప్పారు. బంద్‌కు కాంగ్రెస్,లెఫ్ట్ సహా 19బిజెపి యేతర రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మావోయిస్టు పార్టీ సైతం బంద్‌కు మద్దతుగా ప్రకటన చేసింది. కేరళ,పంజాబ్,రాజస్థాన్,తమిళనాడు, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అధికార ప్రభుత్వాలు మద్దతు తెలపడం బంద్ ఘనంగా విజయవంతం కావడానికి దోహదపడిరది. రాష్ట్రాల అధికారాలను,ఫెడరల్ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఉన్న మోడీ ప్రభుత్వ వైఖరి వలన ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సైతం బంద్ అనుకూల వైఖరి తీసుకున్నాయి. బిజెపి పాలిత గుజరాత్,ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్,కర్నాటక,ఉత్తరాఖండ్‌లలో బంద్‌ను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, ప్రజలు బారికేడ్లను చేధించుకొని మరీ వీధుల్లో కదం తొక్కడం విశేషం.ఈపరిణామం బిజెపి పట్ల ప్రజల్లో గూడు కట్టుకుంటున్న ఆక్రోశానికి అద్దం పడుతుంది. నిరుడు కరోనా విజృంభిస్తున్న వేళ ఇదే అదనుగా వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీలు ఎత్తివేసే,కాంట్రాక్టు సేద్యం మరింత పాదుకొనే, నిత్యావసరాల నిల్వలపై పరిమితులు ఎత్తేసే మూడు చట్టాలను మోడీ సర్కారు ఏకపక్షంగా చేసింది. తమ ఉనికికే ముప్పు కలిగించే వినాశకర నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గతేడాది నవంబర్ 26న రైతులు ఢల్లీి పీఠాన్ని కదిలించేందుకు పయనమయ్యారు. శివార్లలో నిలువరించగా అక్కడే బైఠాయింపు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. దాంతో తమ ఆందోళన మొదలై పది మాసాలు పూర్తి చేసుకున్న సందర్భాన, తామెందుకు ఎండ, వాన,చలి,కరోనాలను లెక్క చేయకుండా పోరాటం చేయాల్సి వచ్చిందో దేశానికి తెలియజెప్పేందుకు 27న భారత్ బంద్‌కు నడుం కట్టారు రైతులు. ఈ నెల5న బిజెపి పాలిత యు.పిలోగల ముజఫర్‌నగర్‌లో లక్ష లాది రైతులతో ‘మహా పంచాయతీ’ నిర్వహించి బంద్ బావుటా చేతబూనారు. బంద్ ఆవశ్యకత ను వివరిస్తూ ఊరూ వాడా సదస్సులు, సమా వేశాలు,ర్యాలీలు,కరపత్రాలు,పోస్టర్లతో విస్తృత ప్రచారం చేసి మోడీ పాలనలో కడగండ్ల పాలైన వారిని సమీకరించి సన్నద్ధం చేశారు. ఇంతటి అకుంఠిత దీక్ష,కఠోర కృషి ఉన్నందునే బంద్ ఘన విజయం సార్ధకమైంది. ఈభారత్ బంద్‌ది ప్రత్యేక నేపథ్యం, చరిత్రాత్మకం. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఐక్య పోరాటాలు మరింత బలపడటానికి బంద్ దిశా నిర్దేశం చేసింది. కార్మిక, కర్షక ఐక్యతను పటిష్టమొనర్చింది. కార్పొరేట్ల దోపిడీని ఐక్యంగా ప్రతిఘటించాలని మార్గ దర్శనం కావించింది. కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తున్న పార్టీలు, ప్రభు త్వాలకు గట్టి హెచ్చరిక అయింది. హిందూత్వ, కార్పొరేట్ దోపిడీకి ఊతం ఇచ్చే నయా-ఉదార వాద విధానాలను కలగలిపి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కుటిల పన్నాగాలను రైతు ఉద్య మం పటాపంచలు చేయనా రంభించింది. రైతు ల ఆందోళనలు కొన్ని రాష్ట్రాలకే, కొన్ని ప్రాంతా లలోనేనని తక్కువ చేసి చూస్తున్న బిజెపికి ఒకటి కాదు రెండు కాదు 540 సంఘాల మద్దతుతో ఆసేతు హిమాచలం జనాన్ని కదిలించిన భారత్ బంద్‌తోనైనా కనువిప్పు కలిగి ఉండాలి. ‘కార్పొ రేట్ల కబంధ హస్తాల నుండి వ్యవసాయ పరి రక్షణ, మోడీ గద్దె దిగాలి’ అనే నినాదం బంద్ లో దేశ వ్యాప్తంగా పెక్కటిల్లింది.జాతి వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక సాగు చట్టా లను రద్దు చేయకపోతే ప్రజలు ఆ కార్యాచరణ ను నిజం చేసే రోజు ఎంతో దూరం లేదు.