ఆంధ్ర అభివృద్ధికి అండగా`ప్రధాని నరేంద్ర మోడీ

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి పర్యటన సంద ర్భంగా,నరేంద్ర మోదీ విశాఖపట్నంలో రూ. 2.08లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో నేడు విశాఖ పట్నంలో రూ.2.08 లక్షలకోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ..ఆంధ్ర ప్రజల ప్రేమ,అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. చంద్రబాబు స్పీచ్‌తో సిక్సర్ కొట్టారని పేర్కొన్నారు.60 ఏళ్ల తర్వాత దేశంలో మూడో సారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మోదీ గుర్తు చేశారు.
అండగా ఉంటాం..
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని అన్నారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని మోదీ పేర్కొ న్నారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని వెల్లడిరచారు. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే మా లక్ష్యమని ప్రధాని తెలిపారు. నవయుగ పట్టణీకరణకు ఏపీ సాక్ష్యంగా మారబోతోందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ చాలా కాలంగా ఉందని, చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందన్నారు. రైల్వే జోన్ రాకతో వ్యవసా యంతోపాటు అనేక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఏపీ అభివృద్ధి మా విజన్ అని మరోసారి గుర్తు చేశారు ప్రధాని మోదీ.
చిరకాల వాంఛ నెరవేరుతుంది: ప్రధాని
‘దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే..అందులో ఒకటి విశాఖకు కేటాయిం చాం. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతోమం దికి ఉపాధి లభిస్తుంది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేశాం. 3 రాష్ట్రా ల్లోనే ఇలాంటి బల్క్ డ్రగ్ పార్కులు వస్తున్నాయి. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్ సిటీ భాగం అవుతుంది. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్ కీలకం కానుంది. రైల్వే జోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్ వల్ల వ్యవసాయ,పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి.’అని ప్రధాని మోదీ అన్నారు.
మేమంతా కష్టపడి పని చేస్తున్నాం`పవన్
‘అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్ నుంచి.. అభివృద్ధి పుష్కలమైన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్ద డానికి మేమంతా కష్టపడి పని చేస్తున్నాం. గత ఐదేళ్ల చీకటి రోజుల నుంచి,అరాచక పాలన నుంచి మళ్లీ వెలుగు రేఖలు రాష్ట్రంలో పూయిం చడానికి అడుగులు వేస్తున్నాం.దీనిలో భాగమే రాష్ట్రానికి ఒకేసారి రూ. 2.10లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలను గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సహకారంతో తీసుకువచ్చాం. ఈ నిరంతర అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి.ఎన్డీఏ కూటమిపై ప్రజలంతా ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటూ వారికి మరింత అండగా నిలుస్తామ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.గత ఐదేళ్ల అరాచక, అభివృద్ధిరహిత పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ మళ్లీ కొత్తగా తన ప్రయాణాన్ని అభివృద్ధి పథంలో మొదలుపెట్టబోతుందని చెప్పారు. జనవరి 8న విశాఖపట్నం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పలు జాతీయ రహదారులు, ప్రాజెక్టు లను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ‘‘సదుద్దేశం..సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినా అది నిరర్ధక నడకగా చరిత్రలో మిగిలిపోతుంది.
అభివృద్ధిలో అందరికీ సమాన వాటామోదీ సంకల్పం
అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రం విలవిల్లాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజున రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, రాజధాని అమరావతికి పెట్టుబడులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు,15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇచ్చారు.జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ 24గంటలు తాగునీరు ఇవ్వాలన్న తపన గౌరవ ప్రధాన మంత్రి గారిది. ప్రజలు మా మీద పెట్టిన భరోసా..నమ్మకం..ప్రధాన మంత్రి గారిపై చూపిన నమ్మకం నేడు రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చాయి.70 ఏళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆగ్రామాలకు ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం కింద ఈరోజున రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాని ముందుండి వెన్నుతట్టి నిధులు సమకూరుస్తుం డడమే కారణం. భారత దేశంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆయన ఆశయం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్,ఉత్తరాంధ్ర,రాయలసీమ, కోస్తాంధ్ర ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకూడదు. అభివృ ద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలన్న ఆయన సంకల్పమే ఈ రోజుఈ పెట్టుబడులు. వారి సంకల్పానికి, సహకారానికి ఆయన మార్గదర్శక త్వానికి మనస్ఫూర్తిగా కృతజ్నతలు.
రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం
ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయిన సమయంలో ఎన్డీఏ కూటమితో ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు మోదీ ఆశాజ్యోతిగా నిలిచారు.ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి అస్కారమే లేదు అనే పరిస్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకొనేలాచంద్ర బాబునాయుడు నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తున్నాం. వారి సూచనలు,సలహాలతో రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం.దేశ ప్రగతిలో భాగస్వా ములవుతాం. ప్రధాన మంత్రికి అండగా ఉంటాం. ప్రజలు నమ్మకం పెట్టారు.మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రూ.రెండు లక్షల పై చిలుకు పెట్టుబడులు తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి గారు, సమర్ధవంతులైన చంద్రబాబు గారు నాయకత్వంలో మా సహచర మంత్రులు, కార్యకర్తలు అభివృద్ధిలో భాగస్వాములవుతాము. ప్రజలంతా ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాను’’ అన్నారు.ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మారు.. వారి నమ్మకాన్ని నిలుపుకొన్నాము..
రాష్ట్రానికి ఆక్సిజన్ అందిస్తున్న ప్రధాని మోడీజీ!
గత ప్రభుత్వ అసమర్థత వలన వెంటిలేటర్ పైకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్ అందిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రతి నెలా రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఏపీ ప్రభుత్వం నడుస్తోంది. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందిస్తున్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 12157 కోట్ల కేంద్రం నుంచి సాయం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం అయ్యాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి మన విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్న గత ప్రభుత్వాన్ని చూసాం. కానీ చంద్రబాబు గారు ఒకే ఒక్క సంతకంతో వెయ్యి రూపాయల పెన్షన్ పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిచాం,దీపం పథకం ద్వారా ఉచి తంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు,త్వరలోనే మెగా డీఎస్సి, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వ బోతున్నారు…దటీజ్ సిబిఎన్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఈరోజు సువర్ణాధ్యాయం.
వికసిత్ భారత్ స్పూర్తితోనే స్వర్ణాంధ్ర 2047
బ్యూటీఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం తరపున గౌరవ ప్రధాని నరేంద్రమోడీజీకి స్వాగతం.ప్రతి భారతీయుడి గుండెల్లో నరేంద్ర మోదీ. డీజీ కారణంగా ఈరోజు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. నరేంద్రమోడీ పిఎం అనే పదానికి అర్థాన్ని మార్చేశారు, మామూలుగా పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్,నరేంద్ర మోడీజీ పీపుల్స్ మ్యాన్.నరేంద్ర మోదీ జీ విజన్ గ్లోబల్. అయినా అతని హృదయం మాత్రం పేద ప్రజలతోనే ఉంటుంది. నమో అంటే పేదవాడి నమ్మకం, పేదవాడి భరోసా,దేశానికి ధైర్యం. పేదల చిరునవ్వు, మహిళల ఆత్మగౌరవం, యువత భవిత, అన్నదాత కళ్ళలో ఆనందానికి ప్రతిరూపం మోడీజీ.వికసిత్ భారత్ 2047విజన్ డాక్యు మెంట్ రిలీజ్ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చెయ్యాలనే లక్ష్యంతో మోడీజీ పనిచేస్తున్నారు.2014నాటికి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ నేడు 5స్థానానికి వచ్చింది.వికసిత్ భారత్ -2047లక్ష్యంతో టాప్ 1లేదా 2ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారు. నరేంద్ర మోదీ వికసిత్ భారత్ స్ఫూర్తి తో మన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర -2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసారు.వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యువబుల్ ఎనర్జీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో నిర్ణీత లక్ష్యాలతో ముందుకు వెళ్లడమే స్వర్ణాంధ్ర 2047 ముఖ్యోద్దేశం.
ప్రజల నీరాజనాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో విశాఖవాసులు అడుగ డుగునా బ్రహ్మరథం పట్టారు.ఒకరోజు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం విశాఖపట్నం చేరుకున్న పీఎం ఐఎన్‌ఎస్ డేగా నుంచి సాయం త్రం స్థానిక వెంకటాద్రి వంటిల్లుకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు.ఈక్రమంలో ప్రధాని, ముఖ్య మంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజల నుంచి పూల వర్షంతో నీరాజనాలు అందుకున్నారు. సుమారు కిలో మీటరు మేర భారత ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ వాహనంపై నుంచి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు. రోడ్ షోలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కాగా మోదీ.. మోదీ..అనే నామస్మరణతో విశాఖ ప్రాంతం మారుమోగింది. మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో పట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.- జి.ఎన్.వి.సతీష్