ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంస్కృతి పరివర్తన

అంకితభావంతో తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడమే కాక తను పని చేస్తున్న ప్రాంత సామాజిక స్పృహతో అక్కడి గిరిజనుల జీవన విశేషాలను భావితరాల కోసం అక్షరబద్దం చేసి పదుల సంఖ్యలో ప్రామాణిక పుస్తకాలు రాసిన గిరిజన సాహితీవేత్త డాక్టర్‌ విఎస్‌వికె శాస్త్రిగా సుపరిచితులైన వట్టిపల్లి నరసింహ వీరభద్ర కృష్ణశాస్త్రి. అత్యున్నతమైన అధికారిగా విధులు నిర్వహించి నిత్యం గిరిజన గ్రామాల్లో మమే కమై ఉండే వారు.అలా లభించిన క్షేత్ర పర్యట నల అనుభవాలతో అడవి బిడ్డలకు సంబంధిం చిన అనేక వివరాలు విశేషాలు చారిత్రక అంశాలు పరిశోధనాత్మకంగా ప్రామాణికంగా రచనలు వెలువరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గల ప్రధాన గిరిజన తెగలైన గోండు,చెంచు,కోయ,గిరిజనుల సంస్కృతిలో వస్తున్న మార్పుల గురించిన వివరాలు కూలంకషంగా సహేతుకంగా వివరిస్తూ జాగృతం చేశారు రచయిత డాక్టర్‌ శాస్త్రి.తన రచన ఆంధ్ర ప్రదేశ్‌ గిరిజన సంస్కృతి పరివర్తన అనే పుస్తకంలో..
ఆంధ్రప్రదేశ్‌ లో షెడ్యూల్డ్‌ తెగలు మొదలు గోదావరి ప్రాంతంలో కొండ రెడ్ల వరకు సాగిన 16 విభాగాల ఈ పుస్తకంలో ఆదివా సులకు సంబంధించిన అనేక అంశాలు గణాం కాలతో సచిత్ర సహితంగా అందించారు, ప్రతి విభాగంలో కూడా ఆయా ప్రాంత అడవి బిడ్డల గురించి అధ్యయన పూర్వక విశేషాలు రాస్తూ శాస్త్రీయ దృక్పథంతో చర్చించారు. ఆరంభ అధ్యాయం ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ తెగలలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్‌ ప్రకారం గిరిజ నుల కోసం పొందుపరిచిన ప్రత్యేక అంశాలు రిజర్వేషన్ల వివరాలు పొందుపరిచారు 1991, 2001,జనాభా లెక్కల ప్రకారం జిల్లాల వారీగా గిరిజన జనాభా ప్రాంతాలవారీగా నివసిస్తున్న వివిధ తెగల గిరిజన జనాభా వివరాలు ఆక్రమిత భూ విస్తరణం గిరిజన గ్రామాల సంఖ్య తదితరాలు పట్టికల రూపంలో అందించి భావి పరిశో ధనలకు విలువైన సమగ్ర సమాచారం భద్రపరిచారు.గిరిజనులు విశ్వాసానికి ప్రతీకలు, నమ్మకం అనే దానినే మతంగా రూపాంతరం చేసిన ఆధునిక మానవులు వివిధ పేర్లు పెట్టుకుని విశ్వాసానికి, హిందూ క్రైస్తవ ముస్లిం బౌద్ధం వంటి పేర్లు పెట్టి ఆధునిక మతాలకు అంకు రార్పణ చేశారు.కానీ మానవ జాతికి మూల మైన ఈ ఆదివాసుల సహజ ప్రకృతి విశ్వాసమే పురాతన మతం,కొండలు వాగులు చెట్లు రాళ్లు పొలిమేర దేవతలు వీరికి గౌరవ మత శక్తులు, వారికి మంచి జరిగితే ప్రకృతి శక్తులను పూజిస్తారు.చెడు చేసే శక్తులను శాంతింప చేస్తారు.కానీ మారుతున్న కాలంతో పాటు అడవి బిడ్డల ఆలోచనల్లో మార్పులు వచ్చి అన్య మతాల ప్రభావం పాలై వారి అస్తిత్వం కోల్పోతున్నారు అన్నది ఈ పుస్తక రచయిత ఆవేదన. ఎంతో మహోన్నత చరిత గల ఆదిలాబాద్‌ ప్రాంతపు గోండు గిరిజనుల గురించిన అనేక విశేషాలు వివరించారు. కోరు తూర్‌ అనే అడవి బిడ్డలను గోండులు అనే పెట్టుడు పేరు పెట్టా రని దానికి సరైన అర్థం ఎవరు చెప్పలే దని చెబుతూనే ద్రావిడ భాష కుటుంబానికి చెందిన కోయ భాషని గోండు భాషగా మాట్లాడుతారని అలాగే తెలుగు హిందీ ఇంగ్లీష్‌ మరాఠీ ఉర్దూ భాషల ప్రభావంతో ఆయా భాషలు కూడా నేర్చుకుంటున్నారు. అన్ని భాషలతో పాటే వివిధ సంస్కృతులు వీరి మీద బలమైన ప్రభావం చూపి భవిష్యత్తులో వారిదైన అసలు భాషా సంస్కృతులు మర్చి పోయే ప్రమాదం పొంచి ఉందని రచయిత తన ఆవేదన వ్యక్తపరుస్తారు.గోండుల ఆరాధ్య దైవం నాగోబా గురించిన అనేక చారిత్రక సత్యాలు విశేషాలు ఆసక్తిక రమైన విషయాలతో అందిం చారు. కేవలం వచన రూప వాక్యాలతోనే సరిపెట్టకుండా ఎన్నో అలనాటి అపురూప చిత్రాలు కూడా ముచ్చటగా పొందుపరిచారు. తద్వారా అదనపు విజ్ఞానం సొంతం చేసుకో వచ్చు.ఇక్కడి గోండులతో పాటు ఇతర గిరిజను లైన ప్రధానులు,కోలాములు,తోటి, నాయక పోడు,జనజాతుల సంస్కృతులు విశేషాలు కూడా అందించారు.
కేవలం ప్రస్తుత పరిస్థితులతోనే సరిపెట్టుకో కుండా పూర్వ చరిత్రను కూడా ఉఠంకించారు సందర్భాను గుణంగా నల్లమల చెంచుల సంస్కృతి గురించి చెబుతూ చెంచు అనే పదం మనుస్మృతి పదవ భాగంలో ఆంధ్రులతో పాటు పేర్కొనబడిరదని ఆధారాలు చెబుతూ 17వ శతాబ్దంలో పరిష్ఠా వద్ద నుంచి చెంచుల వివరాలు ఉన్నట్టు పేర్కొన్నారు. కొన్ని స్థానిక జానపద గాధలు కూడా తెలిపి చెంచు జాతి పూర్వ వైభవం ఆవిష్కరించారు రచయిత శాస్త్రి.అడవిని తల్లిగా దైవంగా భావించే చెంచులు అడవిని జీవనాధారంగా ఎలా చేసుకున్నారో తొమ్మిదవ అధ్యాయంలో ఆకర్షణీయంగా చదవవచ్చును.అలాగే నల్లమల అడవి బిడ్డలైన చెంచు జాతి, క్రమేణ అంత రించిపోతున్న వైనం అందుకు గల కారణాలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కూలంకషం గా సహేతుకంగా వివరించారు.12వ విభాగం లో చెప్పిన గోదావరి ప్రాంతం లోని కోయలు సాంస్కృతి గురించి అందులోని వివిధ రకాల ఉప తెగ కోయ జాతులైన గుత్తి కోయ,రాస కోయ,లింగకోయ,డోలికోయ వంటి వారి ప్రస్థావన తీసుకువచ్చారు.ఒకప్పుడు పాలకు లుగా చిన్నచిన్న కోయ రాజ్యాలు ఏర్పాటు చేసుకొని పాలించిన వీరు కాలక్రమేణా పాలి తులుగా కష్టజీవులుగా మారిపోయిన, వారి కులాలలో రాచ,దొర,అనే పేర్లు ఉండిపో యాయి అని నిజనిర్ధారణ చేస్తూ నేటి గిరిజ నులు ఒకప్పటి రాజ్యాధినేతలు అనే చారిత్రక సత్యం చెప్పే ప్రయత్నాలు ఈ రచనలో అనేకం జరిగాయి.గిరిజనుల జీవనం చరిత్ర సంస్కృతు లకే పరి మితం కాకుండా వారు చేసిన పోరా టాలు ముఖ్యంగా బ్రిటిష్‌ కాలంలో తిరుగు బాట్లు అనంతరం జమీందారులతో గల సత్సం బంధాలు ఇందులో చదవవచ్చు.గోదావరి జిల్లాలలో నాటి జమీందారు ప్రాంతాలైన పోలవరం,జీలుగుమిల్లి,జంగారెడ్డిగూడెం, దేవీపట్నం,పెద్దాపురం,రంప,కోరుకొండ, భద్రా చలం లలో గిరిజనుల సహకారం వివరణ చేశారు.గిరిజనుల్లో గల మాతృభూమి మమ కారం స్వరాజ్యకాంక్ష బ్రిటీష్‌ వారిపై గల ద్వేషం, తదితర అంశాలు ఈ పుస్తకంలో పరిశోధక రచయిత శాస్త్రి గారు కూలం కషంగా వివరిం చారు.‘‘శంకరగిరి మాన్యాలు’’ అనే జాతీయం గురించి వివరణ, నిర్వాసితులు అవుతున్న అడవి బిడ్డల ఆవేదన, తదితర అంశాలు సవి వరంగా ఆసక్తిదాయకంగా అందించి భావి రచయితలకు పరిశోధక విద్యార్థులకు ప్రామాణిక విషయాలు అందిం చారు. కేవలం గిరిజనుల సంస్కృతి జీవనాలకే పరిమితం కాకుండా వారి భావి జీవితాలు అభివృద్ధి వికాసాల గురించిన స్పృహతో ఎంతో ముందు చూపుతో క్షేత్ర పర్యటనల అనుభవా లతో వ్రాయబడిన ఈ పుస్తకం గిరిజన జీవి తాల భద్రతకు ఒక హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు.బహుళ ప్రయోజన కార్య అయిన ఈ పుస్తకం అందరూ విధిగా చదువు‘‘కొని’’ దాచుకోదగ్గది.
డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)