అస్థిత్వం కోల్పోతున్న సబ్‌ప్లాన్ ఏజెన్సీ
‘‘ ప్రశాంతమైన మన్యసీమలో గిరిజనేతరలు, దోపిడీ దారులు పెరిగిపోయి ఆరాచకాలు సృష్టిస్తున్నారు. దళారీ వ్యవస్థ విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్ ఏరియాలో గిరిజనప్రజలు స్వేచ్ఛగా జీవించే విధానం కనుమరుగువుతోంది. వందల ఎకరాలున్న గిరిజన భూస్వాములు నేడు భూములు కోల్పోయి బికారులా వలస బాట పట్టే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోపిడికి గురవుతున్నాయి ’’- లోత సుబ్బారావు
ఉద్యమాల గెడ్డగా పేరుగాంచిన సబ్‌ప్లాన్ ఏజెన్సీ పెదమల్లాపురం ఏరియా గిరిజనులు అస్థిత్వం కోల్పోతున్నారు. తరాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1957 నుంచి చట్టసభలకు ఎన్నికవుతున్న శాసనసభ్యులకు తమ ఓట్లు వేసినా నేటికీ తమ బతుకులు మారడం లేదు. ఆదునిక సాంకేతిక యుగం వచ్చినప్పటికీ ఈ ప్రాంత గిరిజనుల జీవన సరళీలో మార్పు లేని దుస్థితి. స్వతంత్ర భారతంలో ఆదివా సీలకూ రాజ్యాంగ రక్షణలు, రాజ్యాంగ ఫలాలు అందని ద్రాక్షలుగానే మిగిలాయి. ప్రత్యేకమైన, విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగి, ఎంతో విలువైన సహజ వనరులు, ఖనిజసంపదలు ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులూ నేడు పరాయికరణకు గురవుతున్నారు. సబ్‌ప్లాన్ ఏజెన్సీ ప్రాంతాలు నేడు ఆదివాసులకు తీరని శాపంలా పరిణమించాయి.
తూర్పు గోదావరి జిల్లా సబ్‌ప్లాన్ ఏజెన్సీలో నివాసముంటున్న గిరిజనులు దుస్థతి అగమ్యగోచరంగా మారింది. వారి సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. జిల్లాలో ఐదు మైదాన ప్రాంతంలో ఉన్న శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండ ల్లాలో 59 గిరిజన గ్రామాలున్నాయి. సుమారుగా 1.18వేల మంది కొండకాపు, కొండరెడ్డి, కోయి, వాల్మికీ భగత వంటి గిరిజన తెగలు నివాసముంటున్నారు. గ్రామాల్లో అనేక సమస్యలతో గిరిజనులు సతమతమౌతున్నారు. ఎలాంటి పనులేక ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందక ప్రతి ఏడాది తీవ్రమైన కరువు ఏర్పడడంతో గిరిజనులు వలస బాట పడుతున్నారు. తరతరాలుగా వివిధ దురాక్రమణదారుల దోపిడికి గురవుతున్నారు. అలాంటి అణగారిన ప్రజలు నేడు తమ అస్థిత్వం, మనుగడ కోసం ఉద్యమిస్తున్నారు. రాజకీయ దళారీలు గిరిజన తండాలను ఆక్రమించి ఇక్కడ నివసించే గిరిజనుల జీవన విధానాలను నిర్వీర్యం చేస్తున్నారు. గిరిజన భూములు దురాక్రామణకు గురవుతూ రియల్ ఎస్టేట్‌గా మార్చేస్తున్నారు. స్థానిక గిరిజనులను అడ్డంపెట్టుకొని విలువైన వనరులు దోచుకొంటున్నారు. ప్రశాంతమైన మన్యసీమలో గిరిజనేతరలు, దోపిడీ దారులు పెరిగిపోయి ఆరాచకాలు సృష్టిస్తున్నారు. దళారీ వ్యవస్థ విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్ ఏరియాలో గిరిజనప్రజలు స్వేచ్ఛగా జీవించే విధానం కనుమరుగువుతోంది. వందల ఎకరాలున్న గిరిజన భూస్వాములు నేడు భూములు కోల్పోయి బికారులా వలస బాట పట్టే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోపిడికి గురవుతున్నాయి. కొండలపై ఉన్న ఆవేల్తి, అనుమర్తి, పెద్దూరు, కిత్తమూరిపేట, ధార మల్లా పురం, జల్దాం వంటి గిరిజన గ్రామాలకు ఇప్పటికీ సరిjైున మౌలిక సదుపాయాలు లేవు. ఆగ్రామాలకు నేటికీ సంపూర్ణమైన వైద్య సదుపాయాలు దక్కలేదు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత :
ఎంతో మంది గిరిజన చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార లోపంతోనే కొట్టిమిట్టులాడుతున్నారు. ఏజెన్సీలో రోడ్లు లేక, బస్సులు రాక గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. రేషన్ దుకాణాల్లో ఇచ్చేదే చాలీచాలని బియ్యం. ఆదుకాణాల్లో సబ్బులు కొనుక్కుంటేనే బియ్యం ఇస్తారట! ఇదెక్కడి న్యాయం? గిరిజన సహకార సంఘాల్లో పనిచేసే పౌష్టికాహారం లేకచిన్నపిల్లల్లో రక్తహీనత పెరిగిపోతోంది. పెదమల్లాపురం ఆసు పత్రిలో సరిjైున వైద్యం అందడం లేదు. ఆసుపత్రికి అంబులెన్స్ లేదు. అత్యవసరం అయితే డోలు మోసుకోవాల్సిన దుస్థితి. వందలామంది చిన్నారులు రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారు. రోగులు ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు ఉండడం లేదు. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు ఎలా బతుకుతారో ప్రభుత్వమే చెప్పాలి. లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టమే… ఐదు మండలంలో కొన్ని లోతట్టు గిరిజన గ్రామాలకు వెళ్లడానికి అసలు రహదారులు లేవు. పోలవరం నుంచి జల్ధాంకు ఏర్పాటు చేసిన రహదారి అస్తవ్యస్థంగా ఉంది. రాఘపట్నం నుంచి మండల కేంద్రమైన రౌతులపూడికి వెళ్లాలంటే రోడ్డుంతా గతుకుల మయంగా మారింది. పెదమల్లారం నుంచి శంఖవరం చేరాలంటే రోడ్డుంతా అస్తవ్యస్థంగా మారింది. దీంతో కనీసం బస్సు ఆర్టీసీ బస్సులు తిరగని పరిస్థితి. మాతయ్యపాలెం నుంచి రాఘపట్నం, సార్లంక చేరాలంటే కాలిమాటే గతి. కనీసం ద్విచక్ర వాహనాలు ఈ దారిలో వెళ్లే పరిస్థితి కన్పించట్లేదు. ఈ గ్రామాలకు రహదారి నిర్మించాలని దశాబ్దలుగా కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గిరిజన ప్రాంతా లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుంది. ఏళ్లు గడుస్తున్న గిరిజన ప్రాంతాల రహదారుల నిర్మాణాలు మాత్రం కలగానే మిగిలింది. ఎన్నోసార్లు రహదారుల కోసం దరఖాస్తులు చేసుకున్నా అవి బుట్ట దాఖలయ్యాయి. గతంలో తమ గ్రామాలు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలు బహిష్కరించడం కూడా జరిగింది. ఐదు మండలాలలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు ఇంత వరకు పాలకులుగాని, ప్రభుత్వ అధికారులు గాని పట్టించుకోక పోవడంపై ఈ ప్రాంత వాసులు సందిగ్ధ పరిస్థితుల్లో నాయకులను ప్రశ్నంచలేక ఎవరికి ఓటువేయాల లేదా ఓటును బహిష్కరించాల అనే మీమాసంలో ప్రజలల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు తమ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు ఇవి :
ె పెదమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక గిరిజన మండలం ఏర్పాటు చేయాలి
ె ఉపప్రణాళిక ప్రాంతంలో ఉన్న 59 గిరిజనగ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి
ె జీవో నెంబరు 3ని సవరించి సబ్‌ప్లాన్ గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు న్యాయం చేయాలి.
ె అన్నీ రకాల ఉద్యోగాలు సబ్‌ప్లాన్ ప్రాంతంలో స్థానిక గిరిజన విద్యార్థులకు మంజూరు చేయాలి
ె నాన్ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న 59 గిరిజన గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలి. ఐటీడీఏ ద్వారా మంజూరయ్యే సంక్షేమ పథకాలను సబ్‌ప్లాన్ ఏరియా ప్రజలకు వర్తింప చేయాలి
ె ఎస్.టీ గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు ఆటంకం లేకుండా ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలి
ె గిరిజన గ్రామాలలో రవాణా సౌకర్యం మెరుగు పరిచి, మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ె నైపుణ్యమైన విద్యను అందించడానికి జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలి.
ె ప్రతి గిరిజన గ్రామంలోనూ సురక్షతమైన రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మించాలి.
ె ఫారెస్టు పోడు భూములకు అర్హులైన గిరిజనులకు పట్టాలిచ్చి హక్కును కల్పించాలి.
ె పెదమల్లాపురం వేళంగి, రాఘపట్నం, బురదకోట, జల్దాం గ్రామ పంచాయితీలో కమ్యూనికేషన్ కోసం సెల్‌టవర్లు నిర్మించాలి.