అవగాహనతో క్యాన్సర్‌ను అధిగమిద్దాం

క్యాన్సర్‌ ఒకప్పుడు మహమ్మారి. అదేంటో కూడా తెలియని స్థితి. నేడు క్యాన్సర్‌ జయించే స్థితిలోకి వచ్చాం. ఇది ఒకరకంగా వైద్యరంగంలో పెద్ద విజయంగా పేర్కొన వచ్చు. అయితే ఈవ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదక రంగా ఉన్నదనేది అంతే వాస్తవం. అదే సందర్భంలో నేడు ఎక్కువమందిలో కనిపిస్తుండటం ఆందోళనకరం. మన దేశంలో క్యాన్సర్‌ ప్రమాదకరస్థాయిలో ఉందనేది గణాం కాలు చెప్తున్నాయి. ఇప్పుడు క్యాన్సర్‌ నియంత్రణలో అధు నాతన పద్ధతులు ఎన్నో వచ్చాయి. ఇంకా చాలా పరిశో ధనలు జరుగుతున్నాయి. రోబోటిక్స్‌ వంటి టెక్నాలజీతో కూడా నివారించే పద్ధతుల్లో అందుబాటులోకి రావడం ఆశాజనకం.ఇంకా వైద్యరంగంలో మరింత పురోగతి సాధించటానికి కృషి కొనసాగుతూనే ఉంది.
క్యాన్సర్‌ నానాటికీ వృద్ధి చెందుతుండటంతో మరణ మృదంగంలా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే గడిచిన రెండు దశాబ్ధాలలో క్యాన్సర్‌ మరణాలు పెరుగుతున్నాయి.2026 నాటికి మనదేశంలో ఏటా 20లక్షలమంది క్యాన్సర్‌తో మర ణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015 లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90.5మిలియన్ల మంది కి క్యాన్సర్‌ వచ్చింది. 2019లో 23.6 మిలి యన్లకు ఆ సంఖ్య మరింత పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే10మిలియన్ల మరణాలు సంభ వించాయి. ఇది గతదశాబ్ధంలో వరుసగా 26శాతం పెరుగుద లను సూచిస్తోంది. మొత్తంమీద చాపకింద నీరులా యావత్‌ ప్రపంచాన్నే చుట్టేస్తున్న క్యాన్సర్‌పై మాన వుడు నిత్యం పోరాడుతూనే ఉన్నాడు. మరో ఆందోళ నాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు సైతం లక్షల్లో క్యాన్సర్‌ భారినపడటం. ప్రపంచ వ్యాప్తంగా 2023లో సుమారు కోటి మంది వరకు క్యాన్సర్‌ బారిన పడి మరణించారు. 2024 లో ఆ సంఖ్య ఇంకా పెరిగింది. అంటే ప్రతిరోజూ సుమారు 26వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతు న్నారనేది ఒక అంచనా.మనదేశంలో తాజాగా కొత్తగా 20 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదువుతు న్నాయని అంచనా.నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రకారం 2022లో 14 లక్షల మంది బారినపడ్డారు. అంటే సరాసరిన ప్రతి తొమ్మిది మందిలో ఒక్కరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 2025 కల్లా మనకి ఈ క్యాన్సర్‌ అనేది సగటున 12శాతం పెరిగే అవకా శంకనబడుతోందని గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఎందుకొస్తుందంటే..
మనిషి శరీరం మొత్తం కణజాణంతో నిండి వుంటుంది. అయితే శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవటమే క్యాన్సర్‌. మామూలుగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ,చనిపోతూ ఉంటాయి. శరీరంలో ఇలాంటి ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చని పోకుండా అలాగే ఉండిపోతాయి.కణాల్లో ఉండే డీఎన్‌ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్‌ఎలవల్ల తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే పిల్లలకు కూడా వస్తాయనే విషయం తెలిసిందే.అలాగే క్యాన్స ర్‌ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆహా రపు అలవాట్లు, రేడియేషన్‌,పొగతాగటం,ఊబ కాయం తదితర కారణాలతో కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీనివల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి.ఫలితంగా శరీరానికి అవసర మైన కణాలు కంటే ఎక్కువవృద్ధి చెందుతాయి. అవన్నీ ట్యూమర్‌ (కణితి)గా ఏర్పడతాయి.దాన్నే క్యాన్సర్‌ అంటారు. పురుషుల్లో ముఖ్యంగా ఊపిరి తిత్తుల క్యాన్సరు, స్త్రీలలో ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సరు, చిన్న పిల్లల్లో బ్లడ్‌క్యాన్సర్‌ (లుకేమియా)అనే కారకాల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. క్యాన్సర్‌ అనేది ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తుం ది. పదేళ్ల కిందటి వరకు గుండె సంబంధిత మరణా లు ఎక్కువగా సంభవించేవి. కానీ ప్రస్తుతం క్యాన్సర్‌ వల్ల ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.
క్యాన్సర్‌ రహిత కణితితో ప్రమాదం లేదు..
కణితులు రెండు రకాలుగా ఏర్పడతాయి.క్యాన్సర్‌ రహిత కణితి వల్ల ప్రమాదం ఉండదు. ఇది శరీరం ఒక చోట మాత్రమే పెరుగుతుంది.తొలగించిన తర్వాత మళ్లీ రాదు. అయితే క్యాన్సర్‌ కణితి మాత్రం రక్తం ద్వారా ఇతర కణాలకు సైతం వ్యాప్తి చెందు తుంది. దీంతో శరీరంలోని ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్‌ కణితులు ఏర్పడతాయి.అలసట,శ్వాస తీసు కోవటంలో సమస్యలు,చర్మంలోగడ్డలు ఏర్పడటం, శరీరంబరువులోమార్పులు,చర్మంరంగు మారడం, దీర్ఘకాలికంగా దగ్గు వేధించటం వంటి సమస్య లను క్యాన్సర్‌ లక్షణాలుగా గుర్తించొచ్చు. అయితే శరీరం లో ఏర్పడే వివిధ రకాల క్యాన్సర్లకు వివిధ లక్షణాలు కన్పిస్తుంటాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, స్కిన్‌ క్యాన్సర్‌,లంగ్‌ క్యాన్సర్‌,ప్రొస్టేట్‌క్యాన్సర్‌,కొలోన్‌ లేదా రెక్టం క్యాన్స ర్‌,బ్లడ్‌క్యాన్సర్‌,కిడ్నీ క్యాన్సర్‌ వంటి క్యాన్సర్లు వస్తుం టాయి. నిపుణులైన డాక్టర్లను సంప్రదించటం ద్వారా వారిచ్చే వైద్యసేవలతో క్యాన్సర్లను నియంత్రించొచ్చు.
అధునాతన వైద్యంతో నియంత్రణ
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే క్యాన్సర్‌ నియంత్రణ పద్ధతుల్లో అధునాతనమైనవి అందుబాటులో ఉన్నా యి. ప్రస్తుతం రోబోటిక్‌ పద్ధతిలో కూడా క్యాన్సర్‌ కారకాలను గుర్తించి,నియంత్రణ చేస్తున్నారు. ప్రపం చ ఆరోగ్యసంస్థ(డబ్ల్యుహెచ్‌ఒ)పిలుపునిచ్చిన విధంగా 2024లో‘క్యాన్సర్‌నియంత్రణలోఆటంకాలను అధిగ మిద్దాం’(క్లోజ్‌ ది కేర్‌ గ్యాప్‌) థీమ్‌ మేరకు ప్రపంచ వ్యాప్తంగా కృషి జరుగుతోంది. మనదేశంలో క్యాన్స ర్‌ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఒక ఎత్తయితే వీటిలో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌,తల,మెడక్యాన్సర్‌,గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్లు ఉన్నాయి. పొగాకు ఉత్పత్తుల వాడకం, ఒబేసిటీ (స్థూలకాయం),కుటుంబ చరిత్ర, క్రమం తప్పిన జీవనశైలి అనేవి చాలా రకాల క్యాన్సర్లకు సాధారణ కారణాలుగా పరిగణించబడుతున్నాయి. రసాయన చికిత్స (కీమోథెరపీ) క్యాన్సర్‌ చికిత్సలో కీలక భాగంగా ఉన్నప్పటికీ, లక్ష్యిత చికిత్స, ఇమ్యూ నోథెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు, క్యాన్సర్‌ సంరక్షణలో సర్వైవల్‌ రేటును మెరుగుపరచడం ద్వారా అత్యంత ప్రభావవంతమయ్యాయి.
మెరుగైన జీవనశైలితో మార్పులు
ఎంత ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నా ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్ర త్తలు తీసుకోవాల్సిందే.అనారోగ్యంభారినపడ కుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఉండాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. ఏదీ అతిగా చేయకూడదు.. తినకూడదు.. తాగకూడదు.మనలో చాలామంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవటానికి ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తుంటారు.అందులోనూ కనబడిన స్నాక్స్‌ను లాగించేస్తుంటాం.మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్‌ చేసి న ఆహారాన్ని, వేపుళ్లను (ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, నూడిల్స్‌) లాంటివి తినేస్తుంటాం.బయట దొరికే ఇలాంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర వాడుతుం టారు.అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇబ్బం దులు ఏర్పడతాయి. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు వంటివి ప్రత్యామ్నాయంగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొగాకు ఉత్పత్తులను వాడకూడదు. ప్రతిరోజూ క్రమపద్ధతిలో వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.-డాక్టర్‌ సాయికృష్ణ కొల్లూరు