అలుపెరగని పోరాటాలు…
కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషలపై ప్రత్యేక కథనం… – గునపర్తి సైమన్
హక్కుల సాధనకు ఆగని ఉద్యమాలు. అనారోగ్య సమస్యలు దశాబ్దాలుగా అక్షరాలకు దూర మవుతున్న ఆదివాసీలు బిడ్డలు.భయం భయంగానే పోడు భూముల సాగు కొనసాగిస్తున్నా తప్పని వెతలు. అడవిలో విసిరి పారేసినట్లు కనిపించే ఆదివాసీ బిడ్డలు తమ అస్తిత్వం కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. తరతరాలుగా పేదరికంలోనే మగ్గుతున్న ఆదివాసీలు ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి పరిచయమవుతున్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు ఉన్న ప్రభు త్వాలు,పాలకులు సరిగా అమలు చేయక పోవడంతో హక్కుల కోసం నిరంతరం గళం విపుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీలను నిరక్ష రాస్యత,అనారోగ్య సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా జిల్లాలో గిరిజన చిన్నా రులను రక్తహీనత సమస్య పట్టి పీడిస్తూనే ఉంది. దీంతో ఏటాపదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలు స్తున్నాయి. ముఖ్యంగా నిరుపేద కుటుంబంలో పుట్టిన చిన్నారులకు పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మార డంతో వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. కొన్నేళ్లుగా ఆదివాసీ, లంబాడి తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎస్టీ జాబితా నుంచి లం బాడాలను తొలగించాలని ఆదివాసీలు నిరంతర ఉద్య మాలు చేస్తూనే వస్తున్నారు. విద్య, ఉద్యోగ అవ కాశాలన్నీ లంబాడాలకే దక్కడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆదివాసీలు ఆరోపిస్తు న్నా రు. ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయక పోవడంతోనే ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగు తుందంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. మూడేళ్ల క్రితం ఆదివాసీల ఉద్యమాన్ని రగి లించిన సోయం బాపూరావు, ఆత్రం సక్కులు ఇద్దరు గత ఎన్నికల్లో గెలుపొంది పదవులు చేపట్టడంతో ఆదివాసీల్లో మరింత ధీమా కనిపిస్తోంది. ఉద్యమాన్ని ముందుకు నడిపించే నాయ కత్వం పటిషం కావడంతో మరిన్ని పోరా టాలకు సిద్ధమవుతున్నారు. అడవులకే పరిమిత మయ్యే ఆదివాసీల జీవానాన్ని మరింత మెరు గు పరిచేందుకు 1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 9న నిర్వహించాలని పిలుపునివ్వడంతో అప్పటి నుంచి ఆదివా సీ దినోత్సవాన్ని గిరిజనులు ఘనంగా జరుపు కుంటున్నారు. దయనీయంగా ఆరోగ్య పరిస్థితులు..ఆదివాసీ బిడ్డలకు సరిపడా పౌష్టి కాహారం అందక పోవడంతో బక్క చిక్కి పోయి బలహీన పడుతు దయనీయంగా కనిపిస్తున్నారు. ఏటా ప్రభుత్వం పౌష్టికాహరం పేరి ట కోట్ల రూపాయలను ఖర్చు చేస్తు న్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపంచడం లేదు.అందని ద్రాక్షగానే అక్షరాలు..తరతరాలుగా వస్తున్న వెనుక బాటు తనాన్ని పోగోట్టే అక్షర ఆయు ధానికి అడవి బిడ్డలు దూరమవుతునే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా గిరిజనులకు మెరుగైన విద్య అందని ద్రాక్షగానే మారుతోంది. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యే కంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ను ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు కని పించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాస్తా నాలుగు జిల్లాలుగా విడిపోయిన ఐటీడీ ఏ పాలన మాత్రం యథావిధిగానే కొన సాగు తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచి ర్యాల, కొమరంభీం జిల్లాలోని గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ఆశ్రమ పాఠశాలలు 134,గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు 906 ఉన్నా యి. వీటి పరిధిలో మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55వేల 234 మందివిద్యార్థులు చదువుకుంటున్నారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా పేదరికం వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు అధికారుల అలసత్వం తో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతోంది. మూడేళ్లుగా జిల్లాలో కొనసాగుతున్న ఆదివాసీల ఉద్యమంతో పదుల సంఖ్యలోని పాఠశాలలు మూతపడే కనిపిస్తు న్నాయి. లంబాడా ఉపాధ్యాయులు మాకు వద్దంటూ ఆదివాసీలు అభ్యంతరాలు చెప్పడంతో చదువులు చెప్పించేందుకు ఐటీడీఏ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూపక పోవడంతో ఆదివాసీల బిడ్డలకు అక్షరాలు అందనంత దూరమవుతున్నాయి. కరువైన ఉద్యోగ భద్రత..అసలే అంతంత మాత్రంగా చదువుకుంటున్న ఆదివాసీలకు జీవో నెంబర్ 3ను రద్దు చేయడంతో ఉద్యోగ భద్రత కూడా కరువవుతోంది. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టుల్లో గిరిజనేతరులకు అవకా శాలు కల్పించాలంటూ గతేడు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇవ్వడంతో ఆదివాసీల ఆశలు మరింత సన్నగిల్లుతున్నాయి. ఆర్థిక స్థోమత లేక పోవడంతో ఉన్నత చదువులకు దూరమవుతున్న ఆదివాసీలకు కనీసం స్థాని కంగానైనా ఉద్యోగాలు దక్కే అవకాశాలు దూర మవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మారిన ఆదివాసీల బతుకులు
ఆదివాసీ, గిరిజనుల బతుకులు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. గిరిజనుల బతుకులను ప్రభుత్వం చిధ్రం చేసేలా వ్యవహరిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అటవీ ప్రాంతంలోని పోడు భూములపై హక్కులు కల్పించింది. హక్కులతో పాటు.. ఆయా భూములను రాజశేఖర్ రెడ్డి నేతృ త్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు పట్టాలు కూడా మంజూరు చేసింది. పట్టాలు ఇచ్చిన భూముల్లో ఆదివాసీలు, గిరిజనులు అప్పటినుంచి ఇప్పటివరకూ.. వ్యవసాయం చేసుకుంటూ..ఆర్థిక సాధికారత దిశగా కొద్దికొద్దిగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరువాత ఏర్పడ్డ స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీలకు అంతకు ముందుకన్నా..మేలు జరుగుతుందని ఆశిస్తే..ఫలితాలు మాత్రం భిన్నాంగా ఉన్నాయి. ఇందుకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూ ర్ కాగజ్ నగర్ ఉదంతమే సజీవ సాక్ష్యం. గిరిజనులకు వ్యవసాయం చేసుకునేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూమిలో.. తొలకరి వర్షాలు పడడంతో వారంతా ఆయా భూముల్లో విత్తనాలు జల్లి వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ లోపు.. ప్రభుత్వ అధికారులు హరితహారం కార్యక్రమం కోసం గిరిజన ఆదివాసీ భూములను చదును చేసేందుకు వచ్చారు. అధికారులను రెచ్చ గొట్టింది.ఆదివాసీ,గిరిజనులు తమకు గత ప్రభు త్వాలు కేటాయించిన అటవీ పోడుభూముల్లో కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక..గిరిజనులకు ప్రత్యే కంగా మరిన్ని సదుపాయలు కల్పిస్తారని ఆశిం చాం. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కేటాయించిన పోడు భూములపై గిరిజనులకు, ఆదివాసీలకు హక్కులను తొలగిస్తూ, పట్టాలను రద్దు చేస్తూ.. వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వారి జీవితాల్లో చీకట్లు నింపుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోడు భూముల సమస్యత రోజురోజుకూ తీవ్ర రూపంత దాలుస్తోంది. తొలకరి వర్షాలు పడ్డాక వారంతా విత్తనాలు జల్లుకుని.. పంటకు సిద్ధమయితే.. అధికారులు మాత్రం. ట్రాక్టర్లు, జేసీబీలో వాటిని ధ్వంసం చేస్తూ వస్తున్నారు. ఇది నాలుగేళ్లుగా జరుగు తోంది. తాజాగా జరిగిన ఘటన కూడా ఇందుకు మినహాయింపుకాదు. గిరిజన రైతులు విత్తనాలు జల్లుకున్నాక.. అటవీ ప్రాంతం అంటూ అధికారులు ట్రెంచ్ కొట్టడం,భూము లపై ట్రాక్టర్లతో చదునుచేయడం..వంటివి జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ పోడు భూముల వద్ద ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. రాష్ట్రంలో అనేక జిల్లాలలో వేలాది ఎకరాలు రైతులు సాగు చేసుకుంటుంటే రైతులకు ఉన్న పట్టా పసుపుస్తకాల సమస్య పరిష్కారం చేయ కుండా మరో దిక్కు భూములకు ట్రెంచి కొట్టుతూ,జాలి చుట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మరో దిక్కు పెట్టుబడి దారులకు మైనింగ్ కోసమని వేలాది ఎకరాలు అటవీ భూములను ధారాదత్తం చేస్తున్నప్పుడు ఎన్నో ఏళ్ల నుండి సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా, పట్టాలు ఉన్నవారిని కూడా సాగు చేయనియకుండా ఇబ్బందులకు ప్రభుత్వం గురి చేయడం హేయమైన చర్య. ఒకదిక్కు ప్రభుత్వ మే భూముల నుండి రైతులను వెల్ల గొట్టుతూ మరో దిక్కు అధికార పార్టీ వారే దాడులు చేస్తు న్నా విధానాన్ని ఇటు ప్రజలు అటు అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
గిరిజనుల హక్కులు అమలు కావట్లే
దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏండ్లు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా రాజ్యాంగంలో కల్పించిన ఆదివాసీ హక్కులు,రిజర్వేషన్లు, రక్షణ చట్టాలు సరిగ్గా అమలు కావట్లేదు. ఆర్యులకు ముందు మన దేశంలో వర్ణ, కుల వ్యవస్థలు లేవు. వీరు స్థిరపడిన తర్వాతే దేశంలో మూలజాతుల వారు అణచివేతకుగురయ్యారు.కులంపునాదులమీద ఒకజాతిని నిర్మించ లేమని,అన్నిరకాల అసమానతలను తుడిచివేయాలని డాక్టర్.బీఆర్.అంబేద్కర్ కోరుకున్నారు. దేశ జనాభాలో 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు చట్టసభల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న ముందుచూపుతో రిజర్వేషన్లు, రాజ్యాధికారం అనే సంకల్పాన్ని అంబేద్కర్? ప్రకటించారు. 1946లో రాజ్యాంగ నిర్మాణానికి అడుగులు మొదలు పెట్టినప్పుడు.. అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఆకళింపు చేసుకున్న అంబేద్కర్ బాహ్య సమాజానికి దూరంగా ఆటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ తెగల అభివృద్ధి గురించి ఆలోచన చేశారు. రాజ్యాంగంలోని 12షెడ్యూళ్లలో అంబేద్కర్ ప్రత్యేకించి రెండు షెడ్యూళ్ల(5,6)ను గిరిజనులకు కేటాయించడం గొప్ప విషయం. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏండ్లు దాటినా..దళిత, ఆదివాసీ గిరిజనులు ఇంకా వెనుకబడే ఉన్నారు. దీనికి గల కారణాలను ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్రాల్లోని పాలకులు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇంతకాలం నిరాదరణకు గురైన కుల, మత, ప్రాంత, జాతి తదితర వివిధ అస్థిత్వాల వారి వాస్తవ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికల్ని ప్రభుత్వాలు రూపొందించాలి. కానీ, అటవీ వనరులను దోచుకునేందుకు ఆదివాసీ ప్రాంతాలను బహుళజాతి కంపెనీలకు అనుకూలమైన అభివృద్ధి పంథాను అవి అనుసరిస్తున్నాయి. నేడు అస్థిత్వ పోరాటంలో ఎదురీదుతున్న ఆదివాసీలు, రిజర్వేషన్లలో అసమతుల్యత వల్ల దిక్కుతోచని స్థితిలో నిరాదరణకు గురవుతున్నారు. దీనికి రాజకీయ లబ్ది కోసం వివిధ పాలక వర్గాలు కొన్నేండ్లుగా అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలే కారణం. ఇవి అంబేద్కర్ ఆశయ సిద్ధిని ఆటంకపరుస్తున్నాయి. అణగారిన వర్గాల రిజర్వేషన్ల అమలుతోపాటు,ఆర్టికల్16(4) ప్రకారం ఎస్సీ,ఎస్టీల ఉద్యోగ పదోన్న తులను కొనసాగించాలి. రాజ్యాంగంప్రకారం ప్రభుత్వాలుపాలన సవ్యంగా సాగిస్తే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. — గుమ్మడి లక్ష్మీ నారాయణ,ఆదివాసీ రచయితల వేదిక,వ్యవస్థాపక కార్యదర్శి